నాగపూర్: ఈ ఏడాది 263.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని భారత్ సాధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే అధికమని అన్నారు. నగరంలో కృషి వసంత్-2014 జాతీయ వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే ఈసారి నాలుగు మిలియన్ టన్నులు అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు వల్ల గతేడాది 255.36 మిలియన్ టన్నులకు మాత్రమే ఆహార ధాన్య ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈసారి ఆశించినమేర కన్నా అధికంగ వర్షాలు కురవడంతో పాటు ఖరీఫ్, రబీ పంట సేద్యం పెరిగిందని పవార్ అన్నారు. దీనివల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశముందని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ తొలిస్థానంలో ఉంద ని, గోధుమ, పత్తిలో రెండో స్థానంలో ఉందని ఆయన వివరించారు. పాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తిలోనూ భారత్ అగ్రస్థానంలో ఉందని తెలి పారు. 92 మంది విజయవంతమైన రైతులు ప్రదర్శనను మెచ్చిన పవార్, వీరితో మిగతా రైతు లు కూడా పంటల ఉత్పత్తిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్‌వో) ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ముందస్తు అంచనాల ప్క్రారం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో 4.6 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది.
ఐదు రోజుల పాటు ప్రదర్శన
పారిశ్రామిక విభాగం సీఐఐ సహకారంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కృషి వసంత్ జాతీయ వ్యవసాయ ప్రదర్శనను ఆదివారం నుంచి ఐదు రోజులు పాటు నిర్వహిస్తోంది. గత వందేళ్లలో ఐసీఏఆర్ సాధించిన విజయాలతో పాటు వ్యవసాయ పరిశోధన చరిత్ర ను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనకు సుమారు ఐదు లక్షల మంది రైతులు సందర్శించే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అగ్రి వెబ్ ద్వారా ప్రసారం చేస్తోందని తెలిపారు. శిక్షణకు రాని రైతు లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈసారి రికార్డే
Published Sun, Feb 9 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement