ఇదే నా చివరి పర్యటన: రాష్ట్రపతి | this is my last tour by president | Sakshi
Sakshi News home page

ఇదే నా చివరి పర్యటన: రాష్ట్రపతి

Published Thu, Jun 29 2017 5:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

ఇదే నా చివరి పర్యటన: రాష్ట్రపతి

ఇదే నా చివరి పర్యటన: రాష్ట్రపతి

కోల్‌కతా(పశ్చిమబెంగాల్‌): అధికార హోదాలో ఇదే తన చివరి పర్యటన కావచ్చని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గురువారం ఆయన కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన పీసీ మహలనోబిస్‌ 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ కాలం ముగిసే సమయంలోనే మరోసారి ఇక్కడి పరిశోధకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించటం చాలా ఆనందంగా ఉందన్నారు.

సమాజం ఎదుర్కొనే సవాళ్లను, సమస్యలను స్వీకరించి వాటికి పరిష్కారాలను కనుగొనాలని కోరారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని,  కొన్ని సంస్కరణల ఫలాలు ఇప్పటికే అందుతున్నాయని చెప్పారు. వచ్చే నెలలో ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement