Jayshree Ullal: ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి, ఆయన నికర ఆస్తులను గురించి గతంలోనే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు సత్య నాదెళ్ల ఆస్తి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఆస్తులు కలిగిన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ సంతతికి చెందిన 'జయశ్రీ ఉల్లాల్' యూకేలో జన్మించినా ఢిల్లోలో పెరిగింది. కావున ఈమె ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత, ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళింది. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తరువాత శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది.
చదువు పూర్తయిన తరువాత ఆమె అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్‌లో ఉద్యోగ జీవితం ప్రారంభించి ఉంగర్‌మాన్ బాస్‌లో నాలుగు సంవత్సరాలు గడిపింది. ఆ తరువాత కొన్ని రోజులకే క్రెసెండో కమ్యూనికేషన్స్‌లో చేరింది. చివరికి సిస్కో ఉద్యోగిగా మారింది. 15 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో సిస్కో కంపెనీలో ఉన్నతమైన స్థానాన్ని పొందింది.
(ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!)
జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి అరిస్టా నెట్‌వర్క్స్‌కు ప్రెసిడెంట్‌గా మాత్రమే కాకుండా సీఈఓగా కూడా పనిచేశారు. వ్యక్తిగత సంపద విషయంలో ఈమె భారతదేశంలో అత్యంత ధనికురాలు. సంపద విషయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల కంటే ముందు ఉండటం గమనార్హం.
జయశ్రీ ఉల్లాల్ సిబెడ్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన 'విజయ్ ఉల్లాల్'ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో తమ ఇద్దరి కుమార్తెలతో ఉన్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 3.4 లక్షల కోట్లు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నికర విలువ రూ.6200 కోట్లు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment