షావోమి ఇండియా ప్రెసిడెంట్.. బీ మురళీకృష్ణన్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆరు సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్తున్న కారణంగా షావోమికి రాజీనామా చేసినట్లు సమాచారం.
షియోమీ ఇండియా అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. స్వతంత్ర వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. 2018లో షావోమి ఇండియాలో అడుగుపెట్టిన మురళీకృష్ణన్ 2022లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ఈయన సంస్థలో కీలక పదవులను చేపట్టారు.
ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇటీవలే పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని షావోమి ఇండియా పూర్తి చేసుకుంది. 2023లో మను కుమార్ జైన్ కంపెనీని వీడిన తరువాత.. సంస్థ నుంచి వెళ్తున్న వారిలో మురళీకృష్ణన్ రెండో వ్యక్తి. అయితే మురళీకృష్ణన్ స్థానంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ సీఓఓగా సుధీన్ మాథుర్, సీఎఫ్ఓగా సమీర్ రావు, సీపీఓగా వరుణ్ మదన్, సీఎమ్ఓగా అనుజ్ శర్మ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment