న్యూఢిల్లీ : 2016లో ప్రచురితమైన ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ‘ట్రబులెంట్ ఇయర్స్ 1980-1996’ పుస్తకంలోనీ కొంత భాగం హిందువులు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఆ భాగాలను తొలగించవలసిందిగా ప్రణబ్‌ను కోరిన విషయం తెలిసిందే. ఆయన ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో కింది కోర్టు ఆదేశాల మేరకు ఈ అంశం గురించి నవంబర్ 30, 2016న హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనికి మీ గత సమాధానం ఏంటో తెలపండని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టీస్ ప్రతిభా ఎం సింగ్ శుక్రవారం భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నోటీసులు జారీ చేశారు. ఈ విషయం పై తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.
అసలేం జరిగింది...
2016, సెప్టెంబర్ 5న ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ‘ట్రబులెంట్ ఇయర్స్ 1980-1996’ విడుదలయ్యింది. అయితే దీనిలో 1992 అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యం గురించి రాసిన వాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆ వాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని యూ సీ పాండే అనే సామాజిక కార్యకర్త...మరికొందరు న్యాయవాదులతో కలిసి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి తరుపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఇది ఆమోదయోగ్యమైన అంశం కాదని ట్రయల్ కోర్టు ముందు వాదించారు. ట్రయల్ కోర్టు కూడా దీనిలో చర్య తీసుకోవాల్సిన విషయం ఏమి లేదంటూ కేసును కొట్టివేసింది.
అందువల్లే...
కానీ రాష్ట్రపతి తన పదవి కాలంలో అధికారాన్ని అడ్డుబెట్టుకుని చేసే ఏ విషయం మీద అయినా సివిల్ సూట్ ఫైల్ చేయవచ్చు. దాంతో కింది కోర్టులో ఫిర్యాదు చేశారు. కింది కోర్టు రెండు నెలల్లో అభ్యంతరకరంగా ఉన్న వాఖ్యలను తొలగించాల్సిందిగా తీర్పు చేప్పింది. కానీ గడువు ముగిసినా ఎటువంటి చర్య తీసుకోలేదు. అందువల్లే ఈ విషయం గురించి మేము హై కోర్టులో ఫిర్యాదు చేశామని ఫిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టు ముందు వాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment