వైట్ హెయిర్ రావడానికి అనేక కారణాలు. అయితే ఈ సమస్యను నేచురల్ పద్ధతిలో శాశ్వతంగా నివారించుకోవచ్చట. అది కూడా మన వంటగదిలో చౌకగా లభించే వస్తువులతోనే. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయితే సరి...
గోధుమలు: తెల్లజుట్టును నివారించడంలో గోధుమలు బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె కలిపి తలకు పట్టించాలి. ఒక వారంలో మార్పును గమనించండి.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పని చేసి తెల్ల జుట్టును నివారిస్తుంది.
ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.
మెంతులు: తెల్లజుట్టును నివారించే మరో సహజమైన ఇంటి చిట్కా – మెంతులు. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి.
Comments
Please login to add a commentAdd a comment