నిర్మల్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు.. అన్నదాతలకు తప్పని కష్టాలు అన్నట్లుగా తయారైంది ఏటా రైతుల పరిస్థితి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందం గా పంటలు చేతికొస్తున్న క్రమంలో.. తోటలు ఆశాజనకంగా ఉన్న సమయంలో కురిసిన అకాల వర్షం వారిని నట్టేట ముంచింది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వరుణుడు కరుణించడంతో జలాశయాలు నిండి రైతులు సంబరపడ్డారు. తర్వాత కురిసిన ఎడతెరపి లేని వర్షాలతో పంటల కు తెగుళ్లు సోకి అవస్థలు పడ్డారు. అయితే.. ప్రస్తుతం మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా కళ్లాల్లో ఉన్న పసుపు, మిర్చి పంటలు తడిసి నాణ్యత దెబ్బతిన్నాయి. ఎదుగుదలకు వచ్చిన మొక్కజొన్న, గోధుమ, శనగ, పెసరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రకోపంతో రైతన్న నష్టాలు, కష్టాల ఊబిలో పడిపోయాడు.
అకాల వర్షం.. రైతన్నకు నష్టం..
జిల్లాలో గురు, శుక్ర, శనివారాల్లో వర్షం కురిసింది. సగటున 1.97 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కాగా అత్యధికంగా తలమడుగు మండలంలో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 5,600 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఇప్పుడిప్పుడే ఎదుగుదలకు చేరుకొని మరో పక్షం, నెలరోజుల వ్యవధిలో చేతికొస్తుందనుకుంటున్న మొక్కజొన్న పంట దాదాపు 2 వేల ఎకరాల్లో, గోధుమ, శనగ తదితర పంట లు దాదాపు 1,500 ఎకరాల్లో, పసుపు, మిర్చి తదితర పం టలు 2,100 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దీంతో రైతన్న తీవ్ర స్థాయిలో నష్టాల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పసుపు, మిర్చి ధర ప్రభావం...
జిల్లాలో ఈసారి దాదాపు 13 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. దాదాపు ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా రు. అధిక వర్షాలతో దుంపకుళ్లు తెగుళ్లు సోకాయి. అదనం గా ఎకరానికి మరో రూ.10 వేల చొప్పున భారం మోశారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో కళ్లాల్లో ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపు పూర్తిగా నాశనమైంది. దీంతో పంట రం గు మారి ధరపై పెను ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఈసారి జిల్లాలో సుమారు 6,500 ఎకరాల్లో మిర్చి సాగైంది. ఎకరానికి రూ.60వేల నుం చి రూ.70 వేల వరకు ఖర్చు పెట్టారు. అకాల వర్షాలతో కళ్లాల్లో ఎండబెట్టిన మిర్చి పంట పూర్తిగా తడిసింది. దీంతో రంగు మారి ధర పడిపోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రకృతి ప్రకోపం..
Published Mon, Mar 3 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement