untimely rains
-
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
హైదరాబాద్‌లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
మండుటెండలతో అల్లాడిన హైదరాబాద్‌కు మరో చిక్కొచ్చి పడింది. వేడి చల్లారుతుందనుకుంటే.. వరుణదేవుడు అంతకు మించిన ప్రతాపం చూపించాడు. సాయంత్రం 5.30గంటల నుంచి మొదలైన వర్షం ఒక్కసారిగా ఉదృతంగా మారింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుడప్పుడే ఆఫీసుల నుంచి బయటకు వస్తోన్న ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. టూవీలర్లు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.హైదరాబాద్‌కు వార్నింగ్అయితే రాబోయే సమయంలో హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్ హైదరాబాద్ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. వాతావరణాన్ని అంచనా వేసే వెబ్సైట్లు అక్యువెదర్ ప్రకారం ఈ సాయంత్రమంతా హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతం, ఉత్తర తెలంగాణకు తీవ్ర వర్షం పొంచి ఉన్నట్టు తెలిపింది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఏపీలో వర్షాలు పడతాయని, సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు పడతాయని అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే భారీగా వర్షాలు కురుస్తున్నాయిహైదరాబాద్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉందని.. రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. కూకట్పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లితో పాటు మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.Heavy rains in #hyderabad #HyderabadRains pic.twitter.com/RD2sRYF8yS— Aditya ✪ (@Glorious_Aditya) May 7, 2024 సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. నేటి వరకు ఎండలతో బెంలేతెత్తిన జనానికి.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా ఈదురుగాలులు భయపెట్టించాయి. The First respite for this Blazing Summer 🌞 #Hyderabad #thunderstorms #Rains pic.twitter.com/aHQENktyuA— Vikrant 🇮🇳🇮🇳 (@KauVikk) May 7, 2024 -
గుజరాత్లో అకాల వర్షాలు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. దహోడ్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్‌మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్‌భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
మండే ఎండల్లోనూ నిండుగా నీళ్లు
కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఒక క్రస్టు గేటును పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. జూన్ మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారని చెపుతున్నారు. గత ఏడాది జూన్ 27న గేట్లు ఎత్తారు. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాజెక్టు వేసవిలోనే నిండుకుండలా మారింది. నెల రోజుల నుంచి మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయానికి నీటిమట్టం 644.60 అడుగులకు (4.36 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో డ్యామ్ అధికారులు మూడో నంబర్ క్రస్ట్ గేటును అర అడుగు మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 644.5 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్‌గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
అన్నదాతల్లో ‘ధర’హాసం
గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి వరదా ఎస్వీ కృష్ణకిరణ్ : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువలా కొనసా గుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని.. కోసినట్టుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన, నూక ధాన్యాన్ని సైతం (బ్రోకెన్ రైస్) ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారిగా జయ రకం (బొండా లు) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్ మార్కెట్లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. బుధవారం సాయంత్రానికి రూ. 2,541.51 కోట్ల విలువైన 12.45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చే సింది. ఇందులో ధాన్యం విక్రయించిన 1.38 లక్షల మంది రైతులకు గాను 96 వేల మందికి రూ.1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది. బాయిల్డ్ మిల్లులకు తరలింపు వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కు రవడం.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సా కుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ కోనసీ మ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున.. ఏలూరు, కాకినా డ, తూర్పు గోదావరి జిల్లా ల్లో బ్రోకెన్స్ అధికంగా వ స్తు న్న ప్రాంతాల్లో మొబైల్ మి ల్లులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. రైతులు ముందుగా నే శాంపిళ్లను మొబైల్ మి ల్లు ల్లో మరాడించి.. అక్కడ ఇచ్చే రశీదు ఆధారంగా ధా న్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగు డు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం (బొండాలు) ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతంలో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా (75 కేజీలు) రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువ పండించిన ప్రాంతాల్లో అయితే.. బస్తాకు రూ. 1,600–రూ.1,700 కూడా చెల్లిస్తున్నారు. రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి పరిధిలోని 5 జిల్లాలకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్ల కార్పస్ ఫండ్‌ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏ ర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదీ.. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ్ చెప్పారు. ♦ తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బొండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్లోనే ఎక్కువగా విక్రయిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి కుమార్ తెలిపారు. ♦ కాకినాడ జిల్లాలో 10 శాతం విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం పుష్పమణి చెప్పారు. ♦ ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం భార్గవి చెప్పారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం సాగర్ తెలిపారు. మొత్తంగా అన్నిచోట్లా జూన్ రెండో వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు వర్షాల్లోనూ కొన్నారు ఇటీవల కురిసిన వర్షాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తీరు రైతుల్లో భరోసా నింపింది. అంత యుద్ధప్రాతిపదికన ఎక్కడి ధాన్యాన్ని అక్కడే ఆఫ్‌లైన్‌లో కొనేసి వెంటనే మిల్లులకు తరలించారు. నేను కూడా ఆ సమయంలో కొంత, వారం కిందట 582 బస్తాల (ఒక్కో బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని విక్రయించాను. డబ్బులు కూడా చాలా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. – సూర్య నారాయణరాజు, లొల్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంతైనా కొంటాం అకాల వర్షాల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా కోతలు చేయాల్సి ఉంది. రైతులు తెచి్చన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు నష్టపోకుండా చర్యలు ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఫీడ్‌బ్యాక్ కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవాబుదారీ పెంచడం, రైతులు నష్టపోకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా మిల్లులను కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తున్నాం. జేసీలకు చెప్పి ఆ మొత్తాన్ని రైతులకు వెనక్కి ఇప్పిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
మళ్లీ అకాల వర్ష బీభత్సం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన
వరంగల్/ జగిత్యాల/ మోత్కూరు/ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు ప్రభావం చూపించాయి. శనివారం వివిధ జిల్లాల పరిధిలో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షం తక్కువే కురిసినా.. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్‌లో అతలాకుతలం.. శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఓ జిన్నింగ్ మిల్లు రేకులు లేచిపోయాయి. హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేటలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి, లెంకాలపల్లి, నందిగామ, రేలకుంట, రు ద్రగూడెం, శనిగరం గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. జగిత్యాల, యాదాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో.. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. మినీస్టేడియం గోడ కూలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు. పిడుగుపాటుకు ఇద్దరు మృతి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భోజ్యనాయక్తండాకు చెందిన బానోతు సుమన్ పిడుగుపాటుతో మృతిచెందగా.. బానోతు భద్రు, బానోతు రమ, అజ్మీరా శశిరేఖలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేటలో మేకల కాప రి క్యాతం రాజయ్య (65) పిడుగుపాటుకు మృతిచెందాడు. బుగ్గారం మండలం సిరికొండలో పిడుగుపడి మరో మేకలకాపరి మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. -
కొర్రీలు పెట్టొద్దు.. ఉదారంగా ఉండండి
సాక్షి, అమరావతి: అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్న సన్న, చిన్నకారు రైతులను ఆదుకునే విషయంలో ఉదారంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తయారుచేయడంలోగానీ, పరిహారం అందించడంలోగానీ ఎలాంటి కొర్రీలు వేయకుండా ఆదుకోవాలన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో గురువారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే, రబీ పంటలు చేతికొచ్చే వేళ ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని, ఇలాంటి సందర్భంలో వారికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా చూడాలన్నారు. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం సేకరణలో కూడా రైతులకు అండగా నిలవాలని కాకాణి అన్నారు. పక్కాగా ఖరీఫ్ కార్యాచరణ.. ఇక పంట నష్టం అంచనా కోసం ఏర్పాటుచేసిన ఎన్యూమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చెయ్యాలన్నారు. ఖరీఫ్ సీజన్లో 6.18 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ కోసం తయారుచేసిన యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలని మంత్రి సూచించారు. డిమాండ్ మేరకు ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సిద్ధంచేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్æ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర
తణుకు టౌన్: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల కోసమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టింది రైతు పోరుబాట కాదని.. అది రైతు పాడు యాత్రగా మిగిలిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం రాత్రి రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసినట్టు తెలిపారు. దీనివల్ల జిల్లాలో సాగు చేసిన బొండాలు రకం ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసి రైతులకు లాభం కలిగిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు ఐరన్ లెగ్ నాయకుడని, ఆయన వెళ్లిన ప్రతిచోట వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు మరింత నష్టపోతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామంలోకి చేరగానే భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు 10 విద్యుత్ స్తంభాలు కూలిపోయి, రైతులకు మరింత నష్టం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిణామాలతో చంద్రబాబు చేపట్టిన యాత్ర రైతు పాడు యాత్రగా మారి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సంచుల కొరత లేదు ధాన్యం కొనుగోలుకు గోనె సంచుల కొరత లేదని, బియ్యానికి ఉపయోగించే సంచులను కూడా ధాన్యం రైతులకు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించిన 36 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని, 46 మంది అధికారులపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. ధాన్యం రైతులకు బుధవారం ఒక్కరోజే రూ.470 కోట్ల మొత్తం ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్టు చెప్పారు. రైతులు కాపకాయల అయ్యప్పస్వామి, కడియం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతం కంటే ఈ సంవత్సరం ధాన్యం సొమ్ము నాలుగు రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో పడినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రం సేవలు చాలా బాగున్నాయని, ఎప్పటికప్పుడు ధాన్యానికి సంబంధించిన వివరాలు, సమాచారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులను మంత్రి కారుమూరి సత్కరించారు. -
కాపు కాసే ‘మ్యాపింగ్’! రాష్ట్రంలో వడగళ్లు పడే అవకాశమున్నది ఇక్కడే!
అకాల వర్షాలు, వడగళ్లు రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించి, కోతకు వచ్చిన పంటంతా ఒక్క వానకు దెబ్బతిన్నది. ఇప్పుడేకాదు గత రెండేళ్లలోనూ పలు ప్రాంతాల్లో వడగళ్లకు పంటలు నాశనమయ్యాయి. ఈ క్రమంలో పంట నష్టం నివారణపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేసింది. క్షేత్రస్థాయి సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో.. రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు, తీవ్ర ఈదురుగాలులకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో పంట సీజన్‌ను ముందుకు జరపడం, వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే రకాల వరిని వేయడం వంటివి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగళ్లు, తీవ్రస్థాయిలో ఈదురుగాలుల ప్రభావం ఉండే ప్రాంతాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం మ్యాపింగ్ చేసింది. జిల్లాలు, వాటిలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ వడగళ్ల వాన, ఈదురుగాలులకు ఎక్కువ అవకాశం ఉందో గుర్తించింది. ఈ వివరాలతోపాటు ఆయా చోట్ల చేపట్టాల్సిన చ ర్యలను సూచిస్తూ.. తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. వడగళ్లు, ఈదురుగాలుల వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 12 లక్షల ఎకరాలకుపైగా పంటలకు నష్టం జరిగినట్టు అంచనా. ఇందులోనూ వరి భారీగా దెబ్బతిన్నది. మొక్కలు నేలకొరగడంతోపాటు గింజలు రాలిపోయాయి. ఈ నేపథ్యంలో అకాల వర్షాల నష్టాన్ని తప్పించుకునేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అన్ని అంశాలను క్రోడీకరించి.. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వడగళ్ల ప్రాంతాలను మ్యాపింగ్ చేసింది. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం ఒకవైపు.. ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్లు, డ్రోన్ల సాయంతో వర్సిటీ అగ్రో క్లైమెట్ రీసెర్చ్ సెంటర్ ఈ మ్యాపింగ్ చేపట్టింది. గత కొన్నేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకొంది. ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో వడగళ్లకు ఎక్కువ ఆస్కారం ఉందన్నది గుర్తించింది. ఈ మేరకు ‘గ్రౌండ్ ట్రూత్ డేటా’తో నివేదికను రూపొందించింది. ఆయా ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. గతేడాది కంటే అధికంగా వడగళ్ల వానలు 2022లో రెండు నెలల్లో మొత్తంగా 11 రోజులు మాత్రమే వడగళ్ల వానలు కురిశాయి. అదే ఈ ఏడాది మార్చిలో ఐదు రోజులు.. ఏప్రిల్‌లో 15 రోజులు, మేలో ఇప్పటివరకు రెండు రోజులు వడగళ్లు పడ్డాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్‌లో 7) వడగళ్ల వానలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో 9 సార్లు (మార్చిలో 3, ఏప్రిల్‌లో 4, మేలో 2), నల్గొండ జిల్లాలో 5 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్‌లో 1), నిజామాబాద్ జిల్లాలో రెండు (మార్చిలో 1, ఏప్రిల్‌లో 1), మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల జిల్లాల్లో మార్చి నెలలో ఒకసారి.. వరంగల్, జనగామ జిల్లాల్లో ఏప్రిల్ నెలలో ఒకసారి వడగళ్ల వానలు కురిశాయి. ఇక చాలా చోట్ల ఈదురుగాలుల తీవ్రత కనిపించింది. సీజన్ ముందుకు.. వడగళ్లు తట్టుకునే రకాలు.. రాష్ట్రంలో పంటల సీజన్‌ను కాస్త ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా ముందుకు సాగడంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు సూచనలు చేసింది. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారం నాటికే వానాకాలం వరిసాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని.. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ నెల ప్రారంభానికే వానాకాలం పంట చేతికి వస్తుందని పేర్కొంది. దీనితో అక్టోబర్‌లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని సూచించింది. వానాకాలం వరి కోతలు పూర్తికాగానే అక్టోబర్ తొలివారంలోనే యాసంగి వరి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనితో మార్చి నెల మధ్య నుంచి మొదలయ్యే అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునే వీలుంటుందని తెలిపింది. నేరుగా వరి గింజలు వెదజల్లే పద్ధతి పాటించాలని సూచించింది. ఇది సాధ్యంకాకపోతే వడగళ్లను, ఈదురుగాలులను తట్టుకునే వంగడాలను రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటికే వరిలో జేజీఎల్–24423 రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచింది. మరో ఏడు వంగడాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాతున్నాయి. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వడగళ్ల ప్రమాదం? వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు పడే ప్రాంతాలను గుర్తించింది. వీటిని జిల్లాలు, మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. పలు జిల్లాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తయింది. మరికొన్నింటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు మ్యాపింగ్ పూర్తయిన జిల్లాలకు సంబంధించి వడగళ్ల ప్రభావిత ప్రాంతాలివీ.. ► ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, కూసుమంచి, బోనకల్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాలు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం, గుండాల, టేకులపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, పినపాక, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ మండలాలు. ► నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని నవీపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, సిరికొండ, ధర్పల్లి, పిట్లం, బిచ్కుంద, మద్దూర్, దోమకొండ, ఎల్లారెడ్డి మండలాలు. ► ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, బజార్ హత్నూర్, తలమడుగు, జైనథ్ మండలాలు. ► మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం. ► మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు మండలాలు. ► వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, వర్ధన్నపేట, నెక్కొండ మండలాలు. ► జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట్ట, జనగామ, లింగాల ఘన్పూర్ మండలాలు. ► నల్లగొండ జిల్లాలో గుర్రంపోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, శాలిగౌరారం, మునుగోడు, కనగల్, నల్లగొండ, కట్టంగూరు, డిండి, దేవరకొండ, చందపేట, ఉట్కూరు, నకిరేకల్ మండలాలు. ► సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, నంగనూరు, దౌలతాబాద్, రాయపోలు, జగదేవ్‌పూర్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, గజ్వేల్, కొండపాక, నారాయణపేట, మిరుదొడ్డి, కొమురవెల్లి, దుబ్బాక, తొగుట, మద్దూరు, సిద్దిపేట రూరల్, చేర్యాల మండలాలు. ► మహబూబ్‌నగర్ జిల్లాలో గండీడ్, హన్వాడ, బాలానగర్ మండలాలు. ► రంగారెడ్డి జిల్లాలో పరిగి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాలు. ► వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, కోటపల్లి, బషీరాబాద్ మండలాలు. -
బిల్డప్ బాబూ బిల్డప్..! ఆ విషయం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాలా ఆత్రంగా ఉన్నారు. ఎలాగైనా ఆయా వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి నానా పాట్లు పడుతున్నారు. అందులోను రైతులలో ప్రభుత్వంపై అపనమ్మకం కలిగించాలన్నది ఆయన ఉద్దేశం. ఇందుకోసం ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలను ఎందుకు ఎంచుకున్నారో ఊహించడం కష్టం కాదు. భవిష్యత్తులో టీడీపీతో జనసేన కలిస్తే రెండు పార్టీల క్యాడర్ మద్య ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసే లక్ష్యంతో కూడా ఆయన అక్కడే వారం రోజుల మకాం పెట్టినట్లు అనిపిస్తుంది. దుష్ప్రచారం చేయడానికే బాబు టూర్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో కూడా వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగింది. కానీ ఆయన మాత్రం అక్కడే కూర్చుని రైతులను రెచ్చగొట్టడానికి విపరీత యత్నం చేశారు. ఆ క్రమంలో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రైతులంతా తమ ధాన్యాన్ని తాడేపల్లికి తరలించాలట. పోరుబాట పట్టాలట. తానే ముందుంటారట. ఇలా ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టలేదు. నిజంగానే రైతులకు ఏదైనా కష్టం వస్తే ప్రతిపక్ష నేతగా వెళ్లి వారిని పరామర్శించడం తప్పు కాదు. అక్కడ ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేస్తే చేయవచ్చు. కానీ అచ్చంగా దుష్ప్రచారం చేయడానికే ఆయన టూర్ చేస్తున్నారు. రైతులకు అండగా సీఎం జగన్ అకాల వర్షాలవల్ల అక్కడక్కడా రైతులు ఇబ్బందికి గురి అయ్యారు. వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అదికారిని నియమించారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కూడా దీనిపై మీడియా సమావేశం పెట్టి , తుపాను హెచ్చరికలు ఉన్నందున, వర్షాలు మరిన్ని కురిసే అవకాశం ఉన్నందున, తదుపరి తాము ఎన్యుమరేషన్ ప్రారంభించి రైతులకు తగు సాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌తో పోల్చితే రబీలో సాగు తక్కువగా ఉంటుంది. అందులోను మే నెల వచ్చేసరికి చాలా వరకు వ్యవసాయ ఆపరేషన్లు పూర్తి అయిపోతుంటాయి. ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నం అయినా నీటి సదుపాయం ఉన్నచోట ఏదో ఒక పంట వేస్తుంటారు. ఇలాంటి అకాల వర్షాలు పడినప్పుడు రైతులకు నష్టం జరుగుతుంటుంది. వారికి సాయం చేయాలని అడగడం వరకు తప్పు లేదు. ఎప్పుడు ఏ కారణం దొరుకుతుందా.. ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అన్న తాపత్రయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవకాశం వచ్చిందే తడవుగా హడావుడి చేసి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన రహదారుల వెంట వెళుతున్నప్పుడు ఆయా చోట్ల రైతులు పంటలు ఆరబోసి కనిపిస్తారు. కొందరు టార్పాలిన్లు కప్పి పంటలను కాపాడుకుంటున్నారు. అది చంద్రబాబుకు ఇష్టం లేదు. ధాన్యంతో పాటు మొక్కజొన్న పంట కొన్ని చోట్ల వర్షాల వల్ల తడిసింది. వాటిని ఎండబెడుతూ రైతులు కనిపించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో పంట నష్టం తక్కువే అని చెప్పాలి. తెలంగాణలో అనేక చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయిన దృశ్యాలు టీవీలలో కనిపించాయి. ఇక్కడ మిల్లర్లు వాటిని తీసుకోబోమని చెబుతున్నారు. ఏపీలో అలా జరగడం లేదు. మిల్లర్లు తీసుకుంటున్నారు. అది కూడా చంద్రబాబుకు ఇష్టం లేదు. వారు తీసుకుంటున్నారు కనుక ఏదో ఒక ఆరోపణ చేయాలి. అందుకే వెంటనే నూక పేరుతో ధర తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలని విమర్శించారు. అది అసలు కథ.. భరోసా కేంద్రాలవల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. రైతులు తక్షణమే తమ గ్రామంలో ఉన్న భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తమ అవసరాలను వివరించి సాయం పొందుతున్నారు. ఆ వ్యవస్థ వల్ల వైఎస్సార్సీపీ పార్టీకి, సీఎం జగన్‌కు రాజకీయ ప్రయోజనం జరగరాదన్నది ఆయన కోరిక. అందుకే వాటిని సైతం ఆయన వదలిపెట్టడం లేదు. నిజంగానే ఎక్కడైనా రైతు భరోసా కేంద్రంలో ఏదైనా అవకతవక జరుగుతుంటే ప్రభుత్వ దృష్టికి తేవచ్చు. అలాకాకుండా గుంపగుత్తగా మొత్తం వ్యవస్థపైనే ఆరోపణలు చేయడం ద్వారా ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఆ పాయింట్ మాత్రం చెప్పరు తాను అధికారంలోకి వస్తే ఈ రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా? ఆ పాయింట్ మాత్రం చెప్పరు. ఎవరైనా అలాంటి ప్రశ్నలు అడిగితే వారి మీద మండిపడితారు. చివరికి ఆయన రైతుల కులాల గురించి కూడా ప్రశ్నించి మాట్లాడే స్థాయికి వెళ్లారంటే ఇంత సీనియర్ నేత ఇన్నాళ్లుగా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేశారా అన్న భావన కలుగుతుంది. వాస్తవానికి ఎవరూ కూడా ఎదుటివారి కులాన్ని అడగరాదు. అందులోను సీనియర్ రాజకీయవేత్తలు అలాంటివాటికి దూరంగా ఉండాలి. కాని చంద్రబాబే అలా అడుగుతుంటే ఏమి చెబుదాం. యథా ప్రకారం తాను ఉంటే వర్షాలను ముందే పసికట్టి రైతులు నష్టపోకుండా చూసేవారట. బాబు విచిత్ర ప్రకటనలు గతంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే అభాసుపాలయ్యారు. సముద్రంలో తుపానులు కంట్రోల్ చేశానని, అమరావతిలో పది డిగ్రీల ఎండ తగ్గించాలని ఆదేశాలు ఇచ్చానని, సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, హైదరాబాద్ తానే కట్టానని, ఇలాంటి చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారు. ఆ సంగతి ఆయనకు టీడీపీ నేతలు ఎవరూ చెప్పరో ఏమోకాని, మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై జోకులు వస్తున్నాయి. చంద్రబాబు ఉంటే అసలు వర్షాలే పడవు కదా అని ఎద్దేవ చేస్తున్నారు. రైతులంటే చిన్నచూపు అనంతపురం జిల్లాలో కరువు వస్తే రెయిన్ గన్లు అంటూ వందల కోట్లు వ్యయం చేసి తెచ్చి, కరవు తీరిపోయిందని చెప్పేశారు. అసలు వ్యవసాయంపైనే ఆయనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రైతులంటే చిన్నచూపు. వారు ఏమి చెప్పినా వింటారులే అన్న భావన. లేకుంటే 89 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపిస్తానని 2014 ఎన్నికలలో హామీ ఇవ్వగలిగేవారా? పాపం.. అమాయకులైన రైతులు నమ్మి ఆయనకు ఓట్లు వేస్తే , ఆ తర్వాత వారిని దారుణంగా మోసం చేయడమే కాకుండా, వారిని ఆశపోతులని అవమానించారు. చంద్రబాబు బిల్డప్ ఆయన అధికార ఆశ ముందు రైతుల ఆశ ఎంత చిన్నది. పైగా రైతులేమీ ఆయనను రుణాలు మాఫీ చేయాలని అడగలేదు. చంద్రబాబే ఊరువాడ తిరిగి రుణాలను మాఫీ చేస్తానని ప్రచారం చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పుడేమో రైతులంటే చాలా ప్రేమ ఉన్నట్లు వారి తరపున తాను పోరాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఆయన పేలాలు ఏరుకోవడానికి తిరుగుతున్నారని వారు ఆరోపించారు. అవును ఆయన ఓట్ల పేలాలను ఈ వర్షాల నష్టాలలో, కష్టాలలో ఏరుకోవాలని చూశారు. రైతులు ఆ విషయాన్ని గమనించలేనంతటి అమాయకులా!.. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు తన పర్యటనలో భారీగానే నగదు ఉండేలా చూసుకుంటున్నట్లుగా ఉంది. ఒక మహిళ ఏదో సమస్య చెప్పగానే 2.30 లక్షల రూపాయల సాయం చేశారట. మరికొన్నిచోట్ల ఐదువేలు, పదివేలు ఇలా ఇచ్చారని వార్తలు వచ్చాయి. డిజిటల్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన ఇంత మొత్తాలలో నగదు ఇవ్వడం అంటే ఏమి అనుకోవాలి!అది వైట్ మనీ అవుతుందా!బ్లాక్ మనీ అవుతుందా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏ రైతూ మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి అనుమతిచ్చాం. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్‌లను ఆయా జిల్లాలకు తరలించాలి. రైతులు మిల్లులను సందర్శించడం, మిల్లర్లను కలవడం వల్ల రైతులపై అనవసరమైన ఒత్తిళ్లు తీసుకొస్తారు. ఇది ప్రతికూల సందేశానికి దారితీస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎఫ్‌టీవో జనరేట్ అవుతుంది. చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్ దగ్గరకు వెళ్లనవసరం లేదు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి. ఆఫ్‌లైన్ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్లైన్లో మార్చుకోవాలి. విరిగిన నూక శాతాన్ని అంచనా వేసేందుకు మినీ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఆర్బీకేల ద్వారా నూక శాతాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయొచ్చు. అధిక తేమ, విరిగిన, పగుళ్లు, పలువలు మారడం, మొలకెత్తడం వంటి కారణాలతో కొనుగోళ్లను తిరస్కరించడం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి. వరి విస్తీర్ణం ఎక్కువగా ఉండి.. మిల్లింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్న ఎన్టీఆర్, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆధునిక రైసు మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలి. కాగా ఆదివారం నాటికి కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 6.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే కొనుగోలు సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. కానీ, వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆఫ్‌లైన్‌లో కొనుగోలుకు చర్యలు చేపట్టింది. వాటిని సమీపంలోని మిల్లులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రైతులు వాటిని ఆరబెట్టుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవద్దంటూ ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం సేకరణ పద్ధతి ఇలా.. దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సాధారణంగా తొలుత ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు ఆర్బీకేలోని ధాన్యం సేకరణ సిబ్బంది (వీఏఏ)ను సంప్రదిస్తారు. సదరు అధికారి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ధాన్యం శాంపిళ్లను తీసుకుని ఆర్బీకేలోని ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం.. ధాన్యం ఉన్నది, లేనిది నిర్ధారించి.. తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టేందుకు సూచిస్తారు. ధాన్యం శాంపిళ్లు నిబంధనల ప్రకారం ఉంటే.. రైతుకు ధాన్యం ఎప్పుడు తరలించేది షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ మెసేజ్ రూపంలో రైతు మొబైల్‌కు సమాచారం పంపిస్తారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని వాహనంలో లోడింగ్ చేస్తారు. తర్వాత తూకం వేసి ట్రాక్ షీట్ జనరేట్ చేస్తారు. అప్పుడు మాత్రమే సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళ్లేది తెలుస్తుంది. ధాన్యం లోడింగ్‌లో రైతు సొంతంగా హమాలీలను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని తరలిస్తే ప్రభుత్వం ఆర్బీకే, మిల్లు మధ్య దూరాన్ని బట్టి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎక్కువగా మిల్లరు లేదా ఏజెన్సీ ఏర్పాటు చేసిన హమాలీలు, వాహనాల్లోనే సరుకును రవాణా చేస్తున్నారు. ట్రాక్ షీట్ జనరేట్ అయిన తర్వాత మిల్లుకు ధాన్యాన్ని తరలిస్తారు. ఈ క్రమంలోనే ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) వస్తుంది. అందులో రైతు విక్రయించిన ధాన్యం బరువు, దానికి చెల్లించే నగదు, హామీలు, రవాణా తదితర వివరాలు పొందుపరుస్తారు. ఒకసారి ఎఫ్‌టీవో జనరేట్ అయిన తర్వాత ఆర్బీకే సిబ్బందే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తారు. మిల్లు దగ్గర ప్రభుత్వం నియమించిన కస్టోడియన్ అధికారి ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించి.. మిల్లరు లాగిన్‌కు ఫార్వర్డ్ చేస్తారు. మిల్లరు కూడా ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించుకుంటారు. అనంతరం ఎఫ్‌టీవోలో చూపించిన ప్రకారం రైతుకి నిర్ణీత వ్యవధిలో ధాన్యం నగదు జమవుతాయి. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1967 వివరాలను ఎఫ్‌టీవో రసీదుపై ముద్రించారు. ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి అనేక జిల్లాల్లో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపులను ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలోగా చెల్లిస్తోంది. అక్కడక్కడ రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరు అనుసంధానం కాకపోవటంవల్ల నగదు జమకాకుండా పెండింగ్‌లో ఉంది. మరోవైపు.. ఈ ప్రక్రియలో హమాలీలు, రవాణా చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ అధైర్యపడకుండా ఉండాలని.. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని విక్రయించాలని.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తమకెంతో మేలు చేస్తోందని.. సకాలంలో డబ్బులు చెల్లిస్తోందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దళారీలకు అమ్ముకుని ఉంటే బాగా నష్టం జరిగేదని.. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు అమ్ముకోవడం బాగా కలిసొచ్చిందని వారంటున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ►శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 4,460 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జిల్లాలో తెగుళ్లు తగ్గుముఖం పట్టి అధిక దిగుబడులు, అధిక ధరలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ►బాపట్ల జిల్లాలో ఏప్రిల్ 10 నుంచి రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో 2,244 మంది రైతుల నుంచి 13,516 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ►ప్రకాశం జిల్లాలోనూ ఏప్రిల్‌లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొత్తం 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 3 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో తడిసిన ధాన్యం ఎక్కడాలేదు. వర్షం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గోనె సంచులను ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే అవసరమైనన్ని అందుబాటులో ఉంచారు. ►తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నాటికి 24,766 మంది రైతుల నుండి 1,69,370 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణకు కూపన్లు విడుదల చేశారు. సోమవారం ఆన్లైన్లో 2,579.200 మెట్రిక్ టన్నులు, ఆఫ్‌లైన్‌లో 2,620.748 మెట్రిక్ టన్నులు మొత్తంగా చూస్తే 14,733 మంది రైతులు నుండి 1,33,302.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ►పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్లో ఇప్పటివరకు 33,929 మంది రైతుల నుంచి 3.20 లక్షల టన్నులను కొనుగోలు చేశారు. ►ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 12,581 మంది రైతుల నుంచి రూ.297 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ►కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 19,020 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ►అనకాపల్లి జిల్లాలో ధాన్యం సేకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 39 ఆర్బీకేల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు సిద్ధంచేశారు. ఇందుకు ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించింది. రానున్న రోజుల్లో వర్షాలుపడే అవకాశం ఉన్నందున పంట నష్టం కలుగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి జె. నివాస్ ఆదేశించారు. ప్రభుత్వం చొరవతో 40 క్వింటాళ్లు అమ్ముకున్నా ప్రభుత్వం చొరవ తీసుకుని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టడం శుభపరిణామం. నిజానికి.. మొక్కజొన్నకు ధరలు తగ్గిపోయాయి. మద్దతు ధర రూ.1,962 ఉండగా.. దళారీలు క్వింటా కేవలం రూ.1,500–1,600 ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలూ ఏర్పాటుచేయడంతో సోమవారం 40 క్వింటాళ్లు అమ్ముకున్నా. దళారీలకు అమ్ముకుని ఉంటే దాదాపు రూ.15వేల వరకు నష్టం జరిగేది. మద్దతు ధరతో అమ్ముకోవడం బాగా కలిసొచ్చింది. – సంగ నాగశేఖర్, ముతలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయి నేను సుమారు ఐదెకరాలు సాగుచేస్తున్నా. దాళ్వా వరి సాగుకు సంబంధించి ఇప్పటివరకు మాసూళ్లు చేసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సకాలంలోనే డబ్బులు కూడా అందాయి. వాతావరణంలో మార్పులవల్ల కొంత పంట మాసూళ్లు ఆలస్యమైంది. ఇప్పుడు మిగిలిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గిట్టుబాటు ధర ఉండడం సంతోషం. – బొక్కా రాంబాబు, రైతు, కొండేపూడి, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడూ లేని విధంగా బస్తాకు రూ.1,530 ఇచ్చారు ఎన్నడూ, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం ధాన్యం డబ్బు అందించింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 ఇచ్చింది. గతంలో దళారులు కమీషన్ తీసుకునేవారు. డబ్బులకు రెండునెలలు పట్టేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నేరుగా మా ఖాతాలో డబ్బు జమచేసింది. సంచులు కూడా సకాలంలో ఇచ్చింది. ధాన్యం రవాణాకూ లారీని ఏర్పాటుచేస్తున్నారు. – పొన్నాడ రాఘవరావు, రైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా ఆదాయం బాగుంది.. సంతోషంగా ఉంది నేను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడపల్లి గ్రామంలో సొంత పొలంలో వరి సాగుచేశాను. మొత్తం 30 పుట్ల దిగుబడి వచ్చింది. ఈ ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా విక్రయించా. ఆదాయం బాగుంది. సంతోషంగా ఉంది. – కొండారెడ్డి, రైతు, మడపల్లి, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా రైతులకు సహకరించాం మడపల్లిలో సుమారు 560 ఎకరాల్లో వరిని సాగుచేశారు. పంటను కాపాడేందుకు రైతులకు సూచనలు, సలహాలిచ్చాం. ఏ సమయంలో పంటను కోయాలో వివరించాం. చివరలో ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా సేకరిస్తున్నాం. – ఎ. మమత, మడపల్లి, వీఏఏ, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా వారం రోజుల్లో డబ్బులు జమయ్యాయి బాపట్ల జిల్లా చినగంజాం మండలం, చింతగుంపల్లి గ్రామానికి చెందిన నేను 110 క్వింటాళ్ళ ధాన్యాన్ని ఏప్రిల్ 25న మా గ్రామంలోని ఆర్బీకే ద్వారా రైస్‌మిల్లుకు తోలాను. క్వింటాకు రూ.2,060 చొప్పున రూ.2,26,600 నగదు ఈనెల 4న నా అకౌంట్‌కు జమచేశారు. గతంలో దళారులు మా వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి వారి చుట్టూ తిప్పుకునే వాళ్లు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సకాలంలో నగదు జమచేయటం చాలా సంతోషంగా ఉంది. – కరణం శ్రీనివాసరావు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా -
మక్కకు ‘రంగు’దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు రంగు దెబ్బ పడింది. తడిసిపోయి రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయబోమంటూ మార్క్‌ఫెడ్ చేతులెత్తేసింది. దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్న కొంటే తమకు నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవలి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. అదే తరహాలో మొక్కజొన్నను కూడా కొనాలని కోరుతున్నారు. తడిసి రంగుమారిన మక్కలను మార్క్‌ఫెడ్ కొనకపోవడంతో.. వ్యాపారులు అతి తక్కువ ధర ఇస్తున్నారని, తాము నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. తడిసిన 4 లక్షల టన్నులు రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉండటంతో ఈసారి యాసంగిలో సాగు పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో 6.84 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తంగా 17.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గత నెలన్నర రోజుల్లో పలుమార్లు కురిసిన వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేకచోట్ల గింజలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న తడిసి రంగు మారింది. గింజలు ముడుచుకుపోయాయి. మొత్తంగా 4 లక్షల టన్నుల మేర మొక్కజొన్న రంగు కోల్పోవడమో, గింజ పురుగు పట్టడమో, ముడుచుకుపోవడమో జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. మెల్లగా ధర తగ్గించేసి.. మొదట్లో నాణ్యమైన పంటకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువే ధర పలికింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,962 కాగా.. వ్యాపారులు రూ.2,500 వరకు ధర పెట్టారు. కానీ తర్వాత క్రమంగా రూ.1,650కు ధర తగ్గించారు. వర్షాలకు తడిసి, రంగుమారిన మొక్కజొన్నకు కనీసం రూ.1,200 వరకు కూడా ధరపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా 400 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, 8.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొని వారం రోజులు దాటినా ఇప్పటివరకు 77 కేంద్రాలే ప్రారంభించారు. అయితే రంగుమారిన, దెబ్బతిన్న మొక్కజొన్నను ఏమాత్రం కొనుగోలు చేసేది అధికారులు చెప్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరిలా మక్కనూ కొనాలి.. అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో రంగు మారిన వడ్లకు కొనుగోలు సమస్య తలెత్తడం లేదు. కానీ మొక్కజొన్న విషయంలో మార్క్‌ఫెడ్ కొర్రీలు పెడుతోందని.. తమ కష్టం దళారుల పాలవుతోందని రైతులు అంటున్నారు. వ్యాపారులు అడ్డగోలు తక్కువ ధర ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. వరి తరహాలో మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ నిబంధనలివీ.. తేమ 14 శాతం మించకూడదు దెబ్బతిన్న గింజలు 1.5 శాతం మించకూడదు రంగుపోయినవి, దెబ్బతిన్నవి 3 శాతం మించకూడదు పురుగు పట్టిన గింజలు 1 శాతం మించకూడదు ఇతర పంట గింజలు 2 శాతం మించకూడదు ఇతర పదార్థాలు 1 శాతం మించకూడదు రంగు మారితే కొనలేం వర్షాలకు దెబ్బతిన్న, రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం సాధ్యంకాదు. నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉంటేనే కొనుగోలు చేస్తాం. ఆ పరిధిని దాటి కొనుగోలు చేయడం కుదరదు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు నడుచుకుంటాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అవసరమైన చోట్ల ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తుంది. – యాదిరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ వానలు పడుతున్నాయని కొనడం లేదు ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొన్నటివరకు మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. వానలు మొదలవడంతో కొనుగోలు చేయడం లేదని చెప్తున్నారు. – నారెండ్ల రవీందర్‌రెడ్డి, దూలూరు, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. మా ఊరు నుంచి కేంద్రానికి తీసుకువచ్చినా వర్షాల కారణంగా తేమశాతం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యమంటూ, నిబంధనల ప్రకారం లేదంటూ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. – సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నం ఐదెకరాలు కౌలు తీసుకుని మక్క పంట సాగు చేశాను. ప్రభుత్వ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు. అకాల వర్షాలకు మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నాం. – చిద్రపు లక్ష్మన్న, కౌలు రైతు, ఖాజపుర్, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొంటాం..! అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్నను కొనడం సాధ్యం కాదని.. అలా కొనుగోలు చేస్తే తమకు నష్టం వస్తుందని మార్క్‌ఫెడ్ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఆ మొక్కజొన్న దేనికీ పనికి రాదని, ఒకవేళ కొని నిల్వ చేసినా ఫంగస్ వస్తుందని అంటున్నాయి. అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటామని చెప్తున్నాయి. -
అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయాల్లో రైతుల జాబితాలు వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. వేగంగా రబీ ధాన్యం కొనుగోలు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్ రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. -
వెన్ను విరగని వరి!
నీళ్లు అందుబాటులో ఉండటంతో వరి ఏపుగా పెరిగింది.. నిండా గింజలతో కళకళలాడుతోంది.. కానీ ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్లు, భారీ వర్షం.. అయినా వరి పెద్దగా దెబ్బతినలేదు. గింజలు నేల రాలలేదు.. నేలవాలిన మొక్కలు కూడా రెండు, మూడు రోజుల్లోనే తిరిగి నిలబడ్డాయి. మామూలుగా అయితే వరి నేలకొరిగి, ధాన్యం రాలిపోయి రైతు నిండా మునిగిపోయేవాడే. కానీ ఇది దేశీ రకాల వంగడం కావడంతో ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకుని నిలబడింది. అకాల వర్షాలు–పంట నష్టం సమస్యపై చర్చ జరుగుతున్న క్రమంలో.. వ్యవసాయ యూనివర్సిటీ దీనికి పరిష్కారంగా అభివృద్ధి చేసిన వరి వంగడాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులు, వడగళ్ల ధాటికి లక్షల ఎకరాల్లో వరి నేల వాలింది. గింజలు రాలిపోయాయి. దీనిపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్.. వ్యవసాయ సీజన్లను ముందుకు జరిపే అంశాన్ని పరిశీలించాలని, అకాల వర్షాలు మొదలయ్యే లోపే పంట కోతలు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కో జిల్లాలో, ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయని.. సీజన్లను ముందుకు జరపడం కన్నా ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే అకాల వర్షాలను, వడగళ్లను తట్టుకుని నిలిచే వరి వంగడాల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జేజీఎల్–24423 రకంతోపాటు.. త్వరలో అందుబాటులోకి రానున్న మరో ఏడు రకాల వంగడాల వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. తట్టుకుని నిలిచిన.. జేజీఎల్–24423.. వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే వరి వంగడంగా జేజీఎల్–24423 ఇప్పటికే గుర్తింపు పొందింది. వ్యవసాయ వర్సిటీ పరిధిలోని జగిత్యాల పొలాస పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు 2019లో దీనిని విడుదల చేశారు. దీనిని 2022–23 వానాకాలం సీజన్లో 5–7 లక్షల ఎకరాల్లో, యాసంగిలో ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవలి ఈదురుగాలులు, వడగళ్ల వానలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి పడిపోయినా, గింజలు నేలరాలినా.. జీజీఎల్–24423 రకం వరి మాత్రం 90శాతం వరకు తట్టుకుని నిలిచినట్టు వ్యవసాయ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఎత్తు తక్కువ.. చలిని తట్టుకుంటుంది.. జేజీఎల్–24423 వరి వెరైటీ రకాన్ని జగిత్యాల రైస్–1 అని కూడా అంటారు. ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్–34449 రకాలని సంకరం చేసి దీనిని అభివృద్ధి చేశారు. ఇది వానాకాలం, యాసంగి రెండు సీజన్లకూ అనుకూలమైన సల్పకాలిక రకం. వానాకాలంలో దీని పంట కాలం 125 రోజులు, యాసంగిలో 135–140 రోజులు ఉంటుందని వర్సిటీ తెలిపింది. యాసంగిలో మార్చిలోగానే చేతికి వస్తుంది. ఈ వరి ఎత్తు తక్కువగా, కాండం ధృఢంగా ఉండటం వల్ల ఈదురుగాలులు, వడగళ్లకు పంట నేలకొరగదు. గింజ సులువుగా రాలిపోని గుణాన్ని కలిగి, బరువు అధికంగా ఉంటుంది. యాసంగిలో చలిని సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. దోమను కొంతవరకు తట్టుకొంటుంది. దమ్ము చేసిన మడిలో నేరుగా వెదజల్లే పద్ధతికి కూడా అనుకూలం. ఈ ధాన్యానికి మార్కెట్లో గ్రేడ్–ఎ కింద మద్దతు ధర లభిస్తుంది. వానాకాలంలో జూలై చివరివరకు, యాసంగిలో నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం వరకు నారు పోసుకోవచ్చు. దిగుబడీ ఎక్కువే.. జేజీఎల్–24423 వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు బియ్యం రికవరీ 58–61 శాతం మధ్య ఉంటుంది.. సాధారణంగా మిగతా వెరైటీలు 52–54 శాతమే బియ్యం వస్తాయి. కర్ణాటక, ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ రకాన్ని పండిస్తున్నారు. దిగుబడి ఎకరాకు 40–45 బస్తాల (25–28 క్వింటాళ్లు) వస్తుంది. పరిశోధన దశలోని ఏడు వంగడాలివీ.. 1) ఆర్ఎన్ఆర్–31479: ఇది 125 రోజుల్లో కోతకు వచ్చే రకం. బీపీటీ సాంబమసూరితో సమానంగా ఉండే సన్నగింజ రకం. హైదరాబాద్ రాజేంద్రనగర్ వర్సిటీలోనే పరిశోధన పూర్తయింది. రైతుల పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. 2)కేపీఎస్–2874: మిర్యాలగూడ కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో దీనిపై పరిశోధన పూర్తయింది. రైతుల పొలాల్లో పరిశీలన జరుగుతోంది. ఇది 125 రోజుల్లో దిగుబడి వస్తుంది. సన్నగింజ రకం. దోమను, చౌడును తట్టుకుంటుంది. 3) ఆర్ఎన్ఆర్–28361: రాజేంద్రనగర్ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేశారు. ఇది దొడ్డుగింజ రకం. 130 రోజుల్లో చేతికి వస్తుంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో వేయొచ్చు. దోమ, చౌడును తట్టుకుంటుంది. 4) జేజీఎల్–28639: జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేశారు. ఇది దొడ్డుగింజ రకం. 125 రోజుల్లో చేతికి వస్తుంది. రెండు సీజన్లలోనూ వేయొచ్చు. దోమను, వడగళ్లను తట్టుకుంటుంది. – పై నాలుగు రకాల వరి దిగుబడి 42 నుంచి 46 బస్తాల మధ్య ఉంటుంది. క్షేత్రస్థాయిలో పొలాల్లో పరిశీలన పూర్తయి.. వచ్చే ఏడాది రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రకాలకు వానాకాలం సీజన్లో జూన్ చివరి నుంచి జూలై మూడో వారం వరకు నాట్లు వేసుకోవచ్చు. అక్టోబర్‌లో పంట చేతికి వస్తుంది. యాసంగి సీజన్‌కు అయితే నవంబర్ 15 తేదీ నుంచి నాట్లు వేసుకోవచ్చు. డిసెంబర్ 15నాటికి నాట్లు పూర్తిచేసుకోవాలి. మార్చి 15 నాటికి పంట చేతికి వస్తుంది. సీజన్ నెల రోజులు ముందే పూర్తయినట్టు అవుతుంది. ఈ రకాలకు పెట్టుబడి ఎకరానికి సాధారణం కంటే రూ. 2–3 వేలు తక్కువగా ఉంటుంది. 5, 6, 7) కేఎన్ఎం–12368, కేఎన్ఎం–12510, కేఎన్ఎం–7715: ఈ మూడు 130 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చే వరి రకాలు. వానాకాలానికి మాత్రమే అనుకూలమైనవి. జూన్ తొలకరి వర్షాలతోనే వేసుకోవచ్చు. అక్టోబర్ నాటికే కోతకు వస్తాయి. వీటిపై పరిశోధన పూర్తయి 2025లో అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మూడు కూడా వడగళ్లు, ఈదురుగాలులు, భారీ వర్షాలను దీటుగా తట్టుకునే రకాలని వివరించారు. పెట్టుబడి సాధారణం కంటే రూ. 2–3 వేలు తక్కువ అవుతుందని.. నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని పేర్కొన్నారు. -
AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’
సాక్షి, అమరావతి: రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం సమీక్ష నిన్న, నేడు నిర్వహించారని.. ఈ మేరకు వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్‌శాఖలకు పలు సూచలను, ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఫీల్డ్‌కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదని అన్నారు వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదని.. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలు సేకరిస్తామని చెప్పారు. ఒక్క రైతు కూడా ఇబ్బంది ఉండదు ‘సోషల్ ఆడిట్ కోసం లిస్ట్‌ను ఆర్బీకేల్లో డిస్ప్లే చేస్తాం. వాతావరణశాఖ సమాచారం మేరకు 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నష్టం అంచనాలు రూపొందిస్తాం. రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకే కేంద్రాల్లో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎవరైనా సిబ్బంది స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ -155251 ఫిర్యాదు చేయొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ పూర్తిగా అండగా ఉంటుంది’ అని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం: హరికిరణ్ మార్చి నెలలో కూడా ఇదే మాదిరి అకాల వర్షాలకు పంట నష్టం ఏర్పడిందని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వ్యవసాయ పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయని, ఉద్యానపంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. మార్చి నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 34కోట్ల 22లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఏ సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్నామన్నారు. నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తాం ప్రస్తుత వర్షాలకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, వర్షాలు తగ్గిన తర్వాత నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తామని చెప్పారు. 2023 ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మార్చి నెల , ప్రస్తుత వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం రూ.7208 కోట్లను రైతుల ఖాతాల్లో జమ: అరుణ్‌కుమార్ మార్చి 31తో ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ముగిసిందని, 6లక్షల 45వేల మంది రైతుల నుంచి 35లక్షల 41వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రూ.7208 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేశామని, ఎన్.పీసీతో ఉన్న సమస్య కారణంగా 25 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రబీ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ 55576 మంది రైతుల నుంచి 5లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 43427 రైతుల ఖాతాల్లో 803కోట్ల నిధులను జమచేశామని చెప్పారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం. ఏ ఒక్క రైతూ మద్దతు ధర కోల్పోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పడింది. గత సీజన్లో బాయిల్డ్ వెరైటీకి (జయ) రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాగు చేశారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి జయ వెరైటీని కొనుగోలు చేసేందుకు లక్ష్యం సిద్ధం చేసుకున్నాం. అవసరం మేరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశాం. రైతులు అపోహలను నమ్మొద్దు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరుతున్నాం. మిల్లర్లపై కూడా కొన్ని చోట్ల మాకు ఫిర్యాదులొచ్చాయి. మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు రైతులు అపోహలను నమ్మొద్దు: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్ రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్‌కు 472 ఫిర్యాదులొచ్చాయి. 472 ఫిర్యాదులను పరిష్కరించాం. 20 లక్షల గన్నీ బ్యాగ్ లను సేకరించి గోదావరి జిల్లాలకు పంపించాం. ఈ సీజన్ లో 39 మిల్లులు , 25 మంది అధికారుల పై చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ సీజన్ లో మాదిరిగానే రబీ సీజన్ లోనూ ధాన్యం సేకరిస్తాం. -
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలి కాన్ఫరెన్స్
-
సీఎం కేసీఆర్ ప్లాన్.. అలా చేస్తే అకాల వర్షం ముప్పు తప్పుతుందా?
దేశీ రకాలతో ప్రయోజనం ► అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాల వరిని వేయడమే అకాల వర్షాల సమస్యకు పరిష్కారం. భారీ వర్షం, వడగళ్లతో పంట నేలకొరిగినా.. దేశీ వరి మళ్లీ నిలబడుతుంది. మొక్క గట్టిగా ఉంటుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. ఇప్పు డు సాగుచేస్తున్న హైబ్రీడ్ రకాల్లో ఎరువులు ఎక్కువ వాడుతారు. మొక్కలు బలహీనంగా ఉంటాయి. నేలకొరుగుతాయి, గింజలు రాలిపోతాయి. స్థానిక వాతావ రణ పరిస్థితులను తట్టుకునేలా.. జిల్లా, మండలాల వారీగా వరి రకంపై నిర్ణయం జరగాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు సాక్షి, హైదరాబాద్: వరుసగా అకాల వర్షాలు.. వడగళ్ల వానలు.. ఈదురు గాలులు.. కోతకు వచ్చిన వరి రాలిపోయింది, కోసి పెట్టిన ధాన్యం నానిపోయింది. ఈ ఒక్కసారే కాదు.. ఏటా ఇదే పరిస్థితి. ఈ సమస్యను తప్పించుకునేందుకు వ్యవసాయ సీజన్‌నే ముందుకు జరిపే ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. సాధ్యాసాధ్యాల పరిశీలనతోపాటు రైతుల్లో అవగాహన కల్పించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. వానాకాలం పంటను మే చివరివారంలో, యాసంగిని అక్టోబర్ తొలి వారంలో ప్రారంభిస్తే.. అకాల వర్షాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక యాసంగి వరి కోతలను మార్చి నాటికే పూర్తిచేస్తే.. ధాన్యం మిల్లింగ్‌లో నూకలు పెరిగే సమస్య తప్పుతుందని సీఎం కేసీఆర్ సూచించడం గమనార్హం. అయితే సీజన్లను ముందుకు జరిపితే వచ్చే లాభనష్టాలపై వ్యవసాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగును ముందుకు జరపడం ఇబ్బందికరమని కొందరు చెప్తుంటే.. ప్రత్యామ్నాయ వంగడాలను వాడటం వంటివి మేలని మరికొందరు సూచిస్తున్నారు. మే చివరిలోనే సాగు మొదలైతే.. రాష్ట్రంలో నీటి వనరులు, భూగర్భ జలాలు పెరగడం వరి సాగుకు సానుకూలంగా మారిందని.. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారంలో వానాకాలం వరి సాగు మొదలయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల సెప్టెంబర్ చివర, అక్టోబర్ ప్రారంభానికల్లా వరి చేతికి వస్తుందని.. అక్టోబర్‌లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇక వానాకాలం వరి కోతలు పూర్తికాగానే, అక్టోబర్ తొలివారంలోనే యాసంగి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి తొలివారం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చి నెల మధ్య నుంచి అకాల వర్షాల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ మేరకు రైతులను సమాయత్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్లు వేసే విధానానికి బదులు నేరుగా ధాన్యం వెదజల్లే పద్ధతి పాటించడంపై రైతుల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. క్లిష్టమైన వ్యవహారం! వానాకాలం సీజన్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్ 15 నుంచి జూలై 15 వరకు నాట్లు వేస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో ఆగస్టు 15 వరకు కూడా నాట్లు కొనసాగుతాయి. జూన్–జూలైలో వేసిన పంట నవంబర్ చివరి నాటికి చేతికి వస్తుంది. ఆగస్టులో వేసేవి డిసెంబర్ నాటికి చేతికి వస్తాయి. వానాకాలం పంటలు కోసిన తర్వాత 20 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇక యాసంగి సీజన్‌కు సంబంధించి నవంబర్ 15 నుంచి నాట్లు వేయాలి. కానీ వానాకాలం పంట ఆలస్యం వల్ల యాసంగి ఆలస్యం అవుతోంది. డిసెంబర్, జనవరిలో కూడా నాట్లు వేస్తున్నారు. దీనివల్ల ఏప్రిల్, మే వరకు పంటలు చేతికి రావడం లేదు. ► మొత్తంగా నీటి వసతి, కాల్వల నుంచి విడుదల, వరి వంగడాల్లో రకాలు, మార్కెటింగ్ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితులే పంటలు చేతికి వచ్చే కాలాన్ని నిర్దేశిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ► ఉదాహరణకు నల్లగొండ జిల్లా రైతులకు ఆగస్టులో కాల్వల నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అదే నిజామాబాద్ రైతులకు జూన్, జూలై నెలల్లోనే నీళ్లు అందుతాయి. దీనివల్ల రాష్ట్రంలో ఒక్కోచోట ఒక్కో సమయంలో వరి చేతికి వస్తుంది. ► నిజామాబాద్ జిల్లాలో అనేక చోట్ల మేలోనే నారు పోస్తారు. కొన్నిచోట్ల ఆ నెల చివరి నాటికే నాట్లు కూడా వేస్తారు. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో ఉండదు. దేశీ రకాలతో ప్రయోజనం మార్చిలోగా వరి కోతలు పూర్తికావాలంటున్నారు. మార్చిలో కూడా వడగళ్ల వర్షాలు పడుతున్నాయి కదా.. దీనికి వరిలో అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాలను వేయడమే పరిష్కారం. అదికూడా స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే వరి రకాలు వేసుకోవాలి. జిల్లా, మండలాల వారీగా నిర్ణయం జరగాలి. ఆ ప్రకారం రైతులను సన్నద్ధం చేయాలి. దేశీ రకాల్లో మొక్క గట్టిగా ఉంటుంది. భారీ వర్షం, వడగళ్లు పడినప్పుడు పంట నేలకొరిగినా దేశీ రకం మళ్లీ నిలబడుతుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. హైబ్రీడ్ రకంలో మొక్క బలహీనంగా ఉంటుంది. సహజ వ్యవసాయం, దేశీ వరి రకాలు వేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. దేశంలో 300 నుంచి 400 దేశీ వరి రకాలు ఉన్నాయి. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్ల వీటి గురించి తెలియడంలేదు. తమిళనాడులో ఒక రైతు దేశీ రకం వరి వేస్తూ అక్కడి వ్యవసాయ వర్సిటీలో బోధన చేస్తున్నాడు. ఎకరాకు 40–50 క్వింటాళ్ల వరి దిగుబడి సాధిస్తున్నాడు. ఇక వెదజల్లే పద్ధతికి సంబంధించి జర్మినేషన్పై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానిపై రైతులు ఆసక్తి చూపరు. ఒక్కో ప్రాంతంలో పరిస్థితిని బట్టి ఒక్కో రకం వరి వేసుకోవాలి. గంపగుత్తగా ఒకే విధంగా, ఒకే సమయంలో వేసుకోవాలని చెప్పడం సరికాదు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ముందస్తు సీజన్లు సాధ్యంకాదు సంక్రాంతికి అంటే జనవరి 15 సమయంలో యాసంగి పంట వేస్తారు. మార్చి చివరికి అంటే 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నారు పెరగదు. మొక్క పెరగదు. అప్పుడు వరి వేయకూడదని రైతులకు చెప్పాలి. పైగా తెలంగాణ పీఠభూమి. పీఠభూమి మీద క్యుములోనింబస్ మేఘాల కారణంగా వడగళ్ల వర్షాలు పడతాయి. రైతులు జనవరి 15కు ముందు యాసంగి నారు వేయరు. అంతేకాదు ఫిబ్రవరిలోనూ రాళ్ల వర్షం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ వస్తాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేతప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే రైతులు నష్టపోతారు. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకుడు నెలలో రెండు సార్లు దెబ్బ గత నెల రోజుల్లో రెండుసార్లు కురిసిన భారీ వడగళ్ల వానల ధాటికి రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తొలివానలకు 5 లక్షల ఎకరాల్లో, రెండోసారి ఏకంగా 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా వ్యవసాయ శాఖ సర్వే కొనసాగుతోంది. పూర్తి అంచనాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలపై మంగళవారం సమీక్షించిన సీఎం కేసీఆర్.. పంటల సీజన్లను కాస్త ముందుకు జరపాలని, యాసంగి సీజన్ వరి కోతలు మార్చిలోగా పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది. -
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలీ కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: అకాల వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, తదనంతర పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన సీఎంఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా.. వర్షాల బారి నుంచి వాటిని కాపాడ్డానికి చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
అకాల వర్షాల వల్ల పంటనష్టంపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
-
వందకు వంద శాతం నష్టం!
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ప్రకోపానికి గురైన అన్నదాతకు ఈసారి భారీ నష్టం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో గతంలో కూడా అకాల వర్షాలు పడ్డాయని, అలాంటప్పుడు 20 శాతం మేర నష్టం జరిగేదని.. కానీ వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు కొన్నిచోట్ల వందకు వంద శాతం పంట దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. వేగంగా సేకరణ ప్రక్రియ ‘పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు పంట నష్టాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇక ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా, వేగవంతంగా సేకరించే ప్రక్రియ జరుగుతుంది..’అని గంగుల తెలిపారు. తడిసిన ధాన్యం బాయిల్డ్ రైస్ కోసం.. ‘తడిసిన ధాన్యంలో తేమ శాతం 20 వరకు వస్తే దానిని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించాం. నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో తడిసిన ధాన్యాన్ని బాయిలŠడ్ రైస్‌గా మార్చడానికి ఆదేశాలు జారీ చేసి, ఆయా మిల్లులకు కేటాయింపులు జరిపాం. ఇప్పటివరకు మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యానికి అత్యవసర బాయిల్డ్ ఉత్తర్వులు ఇచ్చాం. పరిస్థితికి అనుగుణంగా పరిమాణం పెంచుతాం. రాష్ట్రంలో ఎక్కడ తడిసిన ధాన్యం ఉన్నా బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం..’అని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత కరీంనగర్ మండలం దుర్శేడ్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ తోపులాట చోటుచేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మంత్రి గంగుల మంగళవారం దుర్శేడ్ కొనుగోలు కేంద్రానికి వచ్చారు. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్‌రావు, పద్మాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రిని కలిశారు. కేంద్రాల్లో టార్పాలిన్లు లేవని, ఒక్కో పరదాకు రైతులు రోజుకు రూ.30 కిరాయి చెల్లిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి, కాంగ్రెస్ నేతలకు మధ్య స్వల్ప వాగి్వవాదం జరిగింది. ఇరుపక్షాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. -
తడిసినా కొంటాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా పోకుండా వీలైనంత త్వరగా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. మామూలు ధాన్యం ధరనే తడిసిన ధాన్యానికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, ఆపత్కాలంలో వారి దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునేందుకు మరోసారి సిద్ధమైందని చెప్పారు. రైతుల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అన్నదాతలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు. యాసంగి ధాన్యంతో పాటు అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం సేకరణపై మంగళవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతోందని, అయితే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ధాన్యం సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. మరో మూడు, నాలుగురోజులు వానలు కొనసాగనున్నాయని, అప్పటిదాకా వరి కోతలను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ రైతులకు సూచించారు. పంట కోతలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. ‘రైతుల కోసం చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్నది ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఊహించని అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండడం బాధాకరం. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. కానీ మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది..’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక మార్చిలోనే వరి కోతలు.. గతానికి భిన్నంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చిలోపే జరిపేందుకు ఎలాంటి విధానాలను అవలంభించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏటా మార్చిలోగా వరి కోతలు పూర్తయ్యేలా ముందస్తుగానే పంట నాటుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. మార్చి తర్వాత అకాల వర్షాలకు అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే వచ్చేదాకా పంట నూర్పకుంటే ఎండలు పెరిగి ధాన్యంలో నూక శాతం కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ఎరువుల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులపై ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, వాణిజ్య ప్రకటనలు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహన, చైతన్యం కల్పించాలని సూచించారు. ఏఈఓలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని ఆదేశించారు. రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. -
అకాల వర్షాలు.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల వల్ల రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. నివేదిక ఖరారు చేయాలన్నారు. ఈ నెలలో వైఎస్సార్ రైతు భరోసాతో పాటు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్పుట్ సబ్సిడీ జారీకి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తి చేయాలన్నారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనాలు తయారు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న పంట నష్టం అంచనాలపైనా ఎన్యుమరేషన్ చురుగ్గా కొనసాగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు. చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర? -
AP: కుండపోత.. భారీ వర్షాలు మరో మూడ్రోజులు..
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తీవ్రమైన ఎండలు మండే మే నెలలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రమంతా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీవర్షాల కారణంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ గొర్రెల కాపరి ముచ్చువోలు శ్రీనివాసులు (57)అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఓ ఎద్దు కూడా ఇదే కారణంగా మరణించింది. వేసవిలో రెండు, మూడ్రోజులు అకాల వర్షాలు పడడం సాధారణమే అయినా ఇప్పుడు ఏకంగా రోజుల తరబడి అది కూడా భారీ వర్షాలు కురుస్తుండడం వాతావరణంలో మార్పుల ప్రభావమేనని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలివే.. గత 24 గంటల వ్యవధిలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సగటున 44.98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా సగటున 43.61 మిమీ, పశ్చిమ గోదావరి జిల్లాలో 42.76, నంద్యాల జిల్లాలో 42.50, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 42.22, ఏలూరు జిల్లాలో 41.88.. వైఎస్సార్ జిల్లాలో 36.91, తూర్పు గోదావరి జిల్లాలో 35.47, ప్రకాశం జిల్లాలో 34.44, మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ► నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని ముత్తుకూరు, ఇందుకూరుపేట, కావలి, ఆత్మకూరు, అనంతసాగరం, కలువాయి తదితర మండలాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. ► ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా కూడా సోమవారం వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత కురిసింది. పాడేరు, అరకులోయ ప్రాంతాలలో మ.12 గంటల వరకు వర్షం కురుస్తునే ఉంది. అల్లూరి జిల్లా వ్యాప్తంగా 182.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం వరకు వర్షాలు కురిశాయి. ఎక్కువ వర్షం కురిసిన మండలాలు.. ఆదివారం దర్శి, త్రిపురాంతకం, కర్నూల్ అర్బన్, ప్రొద్దుటూరు, మాచర్ల, విస్సన్నపేట, వీరులపాడు, చెన్నూరు, గాలివీడు, చాగలమర్రి, నంబులిపులికుంట, పొదిలి, శ్రీశైలం, గుడివాడ, కర్నూలు రూరల్, బుట్టాయగూడెం, జుపాడు బంగ్లా, అమలాపురం, నందికొట్కూరు, పెదపారుపూడి, కొయ్యలగూడెం, ఎ.కొండూరు, కొనకనమిట్ల, కృష్ణగిరి, హనుమంతుపాడు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో 24 గంటల్లో 172.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలో ఒక్క పెద్దకడుబూరు మినహా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. దిగుబడులు కాపాడుకునేందుకు పట్టాలు కప్పి రైతులు జాగ్రత్తపడుతున్నారు. వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు ఇక అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరులోని పందుల వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో వీరు ఆటోలో ప్రయాణిస్తుండగా భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న ఈవాగులో ఆటో మొరాయించింది. దీంతో ఆటో కొట్టుకుపోతుండగా ఆ ముగ్గురూ నీటిలోకి దూకారు. వారూ కొట్టుకుపోతుండగా మధ్యలో ఓ కంపచెట్టు అందడంతో దానిని పట్టుకుని నిల్చుండిపోయి స్నేహితులకు సమాచారమిచ్చారు. జేసీబీ సాయంతో పోలీసులు గంటన్నరపాటు శ్రమించి వారిని రక్షించారు. భారీ వర్షాలు మరో మూడ్రోజులు.. తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంవల్లే ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక మంగళవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. -
Telangana: వాన పడి.. కంటతడి
సాక్షి నెట్వర్క్: అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర వేగంతో వీస్తున్న ఈదురుగాలులు దాటికి చాలా చోట్ల వరి నేలకొరిగింది. వరి గింజలు రాలిపోయాయి. మరోవైపు వరి కోతలు పూర్తిచేసి.. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పాట్లు పడుతున్నారు. వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడం, మళ్లీ వానకు తడిసిపోవడం, మళ్లీ ఆరబోయాల్సి రావడంతో అరిగోస పడుతున్నారు. వరుసగా వానలతో తడిసే ఉంటుండటంతో.. చాలాచోట్ల ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. మరోవైపు మామిడి పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర, నువ్వుల పంటలకు నష్టం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులూ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కొనుగోళ్లలో ఆలస్యంతో.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యగా మారిందని.. కొనుగోళ్లు ఊపందుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూడా వర్షాలు తెరిపినివ్వడం లేదని.. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలుచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు మెలిక పెడుతున్నారు. లేకుంటే క్వింటాల్‌కు నాలుగైదు కిలోలకుపైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అకాల వర్షం మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి 19,568 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. అందులో 17 వేల ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. ఇంకా పంట నష్టం సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో 40వేల టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. టార్పాలిన్లు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో భారీగా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. అన్ని పంటలు కలిపి 1,52,577 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వరి చేన్లు నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను కొలుకోలేని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు 91,569 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 13,947 వేల ఎకరాల్లో, సంగారెడ్డిలో 5,682 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతకొచ్చే దశలోని వరి నేలకొరిగింది. మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం గణనీయంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 42వేల మంది రైతులకు చెందిన 60,289 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. అందులో వరి 19,500 ఎకరాలు, నువ్వులు 4,500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 52 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,905 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 8,014 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 40వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితోపాటు మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరితోపాటు మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 15,494 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏన్కూరు, ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వరి నేలవాలింది. జిల్లాలో ఇప్పటివరకు 197 కొనుగోలు కేంద్రాలను తెరవగా.. 102 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురాగా.. వానలకు తడిసిపోతోందని వాపోతున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు 3,299 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వరితోపాటు మామిడికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాను వడగళ్ల వానలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో పంటలు చేలలోనే దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆదివారం రాత్రి కొందుర్గు మండలంలో వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. -
తడిసిన ధాన్యం కొంటాం..
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగా వానకు తడిసిన ధాన్యంతో బాయిల్డ్ రైస్ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యవసరంగా బాయిల్డ్ రైస్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామని, ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచుతామని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన నల్లగొండ జిల్లాలో 22 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో 14,706 మెట్రిక్ టన్నులు, నిజమాబాద్‌లో 14,700, కరీంనగర్లో 7,350, యాదాద్రి, జగిత్యాలలో 5,000 మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ రైస్ కోసం ధాన్యం సేకరణకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి గంగుల వెల్లడించారు. ఇప్పటివరకు గత యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వివరించారు. గతేడాది ఇదే రోజునాటికి 3.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా.. ఈ సారి 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి, రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, వీటి విలువ రూ.1,543 కోట్లని తెలిపారు. నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పంటలు అస్తవ్యస్తం.. ఊహకందని నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు... వడగళ్ల వానలు... ఈదురుగాలులు రాష్ట్ర వ్యవసాయాన్ని అతలాకుతలం చేశాయి. నెలలో రెండోసారి కురిసిన వర్షాలతో అంచనాలకు మించి నష్టం జరిగి ఉండొచ్చని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నాలుగైదు లక్షల ఎకరాలే అనుకోవడానికి వీలులేదని, ఊహకందని నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పంటలు ప్రభావితం కాగా, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పంటలు ఊడ్చుకుపోయాయి. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ ఈసారి మొదట్లోనే పూత సరిగా లేదు. కాత రాలేదు. దానికితోడు గత నెల, ఇప్పుడు కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు 75 శాతం ఉత్పత్తి పడిపోతుందని ఉద్యానశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి అంచనాకుగాను, కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులే (25 శాతమే) వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మామిడి తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు, కాత అంచనా ప్రకారం రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాయలు రాలిపోవడంతో అనేకచోట్ల రైతులు వ్యాపారులకు లీజు డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్లనైతే మామిడి కాయంతా రాలి పాడైపోయింది. కనీసం తక్కువ ధరకు కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో మామిడి కాయలు, పండ్ల ధర భారీగా పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులపైనా ప్రభావం పడనుంది. పొలాల్లోనే నేలపాలు... ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి ఇప్పటివరకు 40 శాతం వరకు కోతలు పూర్తయినట్లు అంచనా. అందులో చాలావరకు ఇంకా మార్కెట్‌కు రాకపోవడంతో తడిసిపోయింది. ఆ రకంగా రైతులకు నష్టం వాటిల్లగా, మరోవైపు ఇప్పటివరకు 60 శాతం వరకు పంట కోత దశలోనే ఉంది. అంటే 33 లక్షల ఎకరాలు ఇంకా కోత దశలోనే ఉందని అంచనా. అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పొలాల్లోనే వరి గింజలు నేల రాలాయి. కొన్నిచోట్ల ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయింది. దీంతో ఊహకందని విధంగా వరికి నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతున్నాయి. అలా నేల రాలిన గింజలు ఏమాత్రం పనికి రావని, దాంతో అనేక జిల్లాల్లో రైతులు వాటిని కోయకుండా వదిలేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా చేతికి వచ్చినా అది రంగు మారి ఉంటుంది. దాన్ని అమ్ముకోవడం కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో పంటలు కేవలం నాలుగైదు లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందన్న అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ వర్గాలు నిష్పక్షపాతంగా అంచనా వేస్తే తప్ప రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మొక్కజొన్న పంటలూ దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలులకు చాలాచోట్ల మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి. -
5 రోజులు.. 4.5 లక్షల ఎకరాల్లో నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో గత ఐదు రోజుల్లోనే ఏకంగా 4.5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంతేకాదు గత నెల రోజుల్లో రెండు సార్లు కురిసిన గాలివానలు, వడగళ్లతో మొత్తంగా 9.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా 3.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని అంచనా. మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న, పొద్దు తిరుగుడు, బొప్పాయి, నిమ్మ, ఇతర పండ్ల తోటలు, కూరగాయల పంటలకూ భారీగానే నష్టం వాటిల్లింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పంట నష్టం వాటిల్లగా.. పలు జిల్లాల్లో ఐదు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురవడం, వడగళ్ల కారణంగా ఎక్కువ నష్టం జరిగింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టం జరిగిందని.. తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని వ్యవసాయశాఖ నిర్ధారించింది. గాలివానలు ఇలా కొనసాగితే ఇంకా నష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. రైతులకు అందని పరిహారం గత నెల 17 నుంచి 22వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2.28 లక్షల ఎకరాలుగా తేలి్చంది. అందులోనూ 1.51 లక్షల ఎకరాలకు నష్టపరిహారంగా రూ.151 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము ఇంకా రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లని ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఇంతగా పంట నష్టం జరిగినా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద విపత్తు సంభవిస్తే అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలి. వారి నేతృత్వంలో బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి జిల్లా స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వాలి. రైతుల వేదనను తెలుసుకోవాలి. కానీ వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతుతోపాటు అడిషనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు ఎవరూ జిల్లాలకు వెళ్ల లేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం రైతులకు తగిన సలహాలు, సూచనలైనా ఇవ్వడం లేదని.. వానల తర్వాత పంటల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించే ప్రయత్నమూ చేయడం లేదని వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. కమిషనరేట్‌లో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎవరూ రైతులకు అందుబాటులో ఉండటం లేదని, మీడియా ద్వారా రైతులకు సమాచారం ఇవ్వడంలోనూ వైఫల్యం కనిపిస్తోందని, కనీసం ఫోన్లలోనూ అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయశాఖకు కమిషనర్, కార్యదర్శి ఒకరే కావడంతో సమస్యలు వస్తున్నాయని.. కమిషనర్ వారానికోసారి వచ్చిపోతుండటంతో రైతులు, రైతు ప్రతినిధులు కలసి విజ్ఞప్తులు చేసే పరిస్థితి లేదని విమర్శలు ఉన్నాయి. -
వణికిస్తున్న అకాల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వదలకుండా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. వ్యవసాయ శాఖ మాత్రం 2.28 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమింకగా అంచనా వేసి, చివరకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి సంబంధించి రైతులకు పరిహారం ప్రకటించింది. ఇలావుండగా మళ్లీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వడగండ్లతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా, ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వరి, మొక్కజొన్న.»ొబ్బర్లు, మినప పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు 95 శాతం వరకు రాలిపోయాయి. కూరగాయల పంటలకూ నష్టం వాటిల్లింది. టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి తోటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అలాగే రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. తాజా వర్షాలతో కోతకు వచ్చిన వరి గింజలోకి నీరు చేరి రంగుమారే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి... ఏటా ఎండాకాలంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. గతేడాది యాసంగి సీజన్లో కురిసిన వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్లకు దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మూడేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యేది. దానినుంచి బయటికొచ్చిన తర్వాత పంట నష్టాలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. గత నెలలో దెబ్బతిన్న పంటలకు మాత్రం ఎకరానికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కొత్త పంటల బీమా విధానాన్ని తీసుకొస్తామని వ్యవసాయ శాఖ చెబుతున్నా అది అమలుకు నోచుకోవడం లేదు. కనీసం కసరత్తు కూడా చేయడం లేదు. దీనివల్ల పంట వేసిన తర్వాత అది చేతికొచ్చే వరకు అకాల వర్షాల వల్ల నష్టం జరిగితే పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. రైతుబంధుతో ఊరట పొందుతున్న రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే మాత్రం పరిహారం అందడంలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పంటల బీమా వల్ల గతంలో రైతులు ఎంతోకొంత లాభపడ్డారని వ్యవసాయ శాఖ వర్గాలు సైతం అంగీకరిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటలకు బీమా చేయించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు, ఆ కంపెనీలను బాగు చేసేవిగా ఉన్నాయన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్ర భుత్వం వాటినుంచి బయటకు వచ్చింది. కానీ మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. -
50 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది. రోడ్డెక్కిన రైతులు వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు. -
రైతులకు సాయంపై తక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ శాంతికుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్‌తో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు.. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు జారీ చేయాలని సూచించారు. త్వరలో పోడు పట్టాల పంపిణీ రాష్ట్రంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధతపై సీఎం సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి, 1.55 లక్షల మంది అర్హులకు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దీంతో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు మంజూరు శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. -
పంటనష్టంపై విస్తృత సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షా లు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు గురువారం విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్కసారికి సాయం అందించేందుకు గ్రామాలవారీగా, సాగుదారులవారీగా పంటనష్టంపై సవివరమైన సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖకు సూచించారు. నష్టాన్ని చవిచూసిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీల మధ్య ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురియడంతో అన్నిరకాల పంటలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారుల బృందం పంటలకు నష్టం జరిగిన వివిధ ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేసిందన్నారు. పంట చేతికొచ్చేదశలో ఉందని, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వందశాతం నష్టం వాటిల్లిందని, దీంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, పంటనష్టాన్ని గ్రామాల్లో అంచనా వేయాలని, లబ్ది దారులను గుర్తించాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)లను ప్రభుత్వం ఆదేశించింది. 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే వాస్తవంగా ఇది ఐదు లక్షల వరకు ఉంటుందని రైతు సంఘాలు, కిందిస్థాయి నుంచి సమాచారం వస్తోంది. కాగా, ప్రభుత్వం వేసిన నష్టం అంచనా ప్రకారం మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. తాజాగా చేయబోయే సర్వేలో ఇంకేమైనా అదనంగా నష్టం వెలుగుచూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. నష్టపరిహారంగా దీన్ని పేర్కొనకూడదని, సహాయ, పునరావాస చర్యలు అని పిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని వారం, పది రోజుల్లో రైతులకు అందజేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. -
Hyderabad: ఎండల్లో వానలు.. ఏందిరా ఈ బాధలు!
సాక్షి, హైదరాబాద్: మార్చి నెలలో అకాల వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. వేసవిలో ఊహించని విధంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపోతున్నాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవున్నారు. శివారు ప్రాంతాల్లో వడగళ్లు పడటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటల అపార నష్టం వాటిల్లుతోంది. అల్పపీడంతో ఏర్పడిన ద్రోణి ఆదివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుండటంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు రోజులు నుంచి వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ద్రోణుల ప్రభావంతో వేసవిలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్చి నెలలో సాధారణ వర్షపాతం కంటే పదింతలు అధికంగా నమోదు కావడం గమనార్హం. -
వదలని వర్షాలు.. బెంబేలెత్తిస్తున్న వడగళ్లు, ఈదురుగాలులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: రాష్ట్రంలో ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో అనేకచోట్ల శనివారం అర్ధరాత్రి, ఆదివారం కూడా వానలు దంచికొట్టాయి. వర్షాలకు తోడు వడగళ్లు, ఈదురుగాలులు, పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావం నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 53 మండలాల్లోని 188 గ్రామాలపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించారు. పల్నాడులో ఇద్దరు, నంద్యాల, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురంలో 81.2 మిల్లీమీటర్లు, సఖినేటిపల్లి మండలంలో 79.4, రాజోలు 64.4, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామిడి, జీడిమామిడితో పాటు ఇతర వాణిజ్య పంటలకు, చెరకు, మొక్కజొన్న పంటలకు ఈ వర్షం మేలు చేసింది. నర్సరీ రైతులకూ ఈ వర్షం ఊరటనిచ్చింది. కోనసీమలో వరి రైతులకు వర్షం చేసిన మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా శివారు పొలాల్లో రబీ నీటి ఎద్దడి సమస్య తీరేలా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఆదివారం ఉదయం 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డతీగల మండలంలో వంతెన కొట్టుకుపోయింది. ► తిరుపతి జిల్లా వ్యాప్తంగా వడగండ్లతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలోని అక్కడక్కడా ఎనిమిది చోట్ల పిడుగులు సైతం పడ్డాయి. ద్రోణి కారణంగా తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 8 మీటర్లు ముందుకు వచ్చింది. గడిచిన 20 రోజులు జిల్లాలో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎర్రగుంట గ్రామంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతినగా, పలు ఇళ్లల్లో టీవీలు కాలిపోయాయి. ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలతోపాటు పెద్దఎత్తున గాలులు వీచాయి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరించారు. ► పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది. నరసరావుపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వడగండ్లు పడడంతో జనం పరుగులు తీశారు. మాచర్ల, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసింది. ► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆదివారం జల్లులు కురిశాయి. శ్రీకాకుళంలోని భద్రమ్మ తల్లి ఆలయంపై పిడుగు పడింది. తూపిలిపాళెం సముద్ర తీరంలో ఒడ్డుకు చేరిన వేట సామగ్రి నేడు కూడా వర్షాలు.. రేపటి నుంచి తగ్గుముఖం ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. ఆందోళన వద్దు.. ఆదుకుంటాం : మంత్రి కాకాణి రాష్ట్రంలో అకాల వర్షాలవల్ల నష్ట్టపోయే ప్రతీ రైతును అన్ని విధాలా ఆదుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వారం రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పంటనష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని, సీజన్ ముగియకుండానే ఈ పరిహారం జమచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆదివారం రాత్రి మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. -
5 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. విరిగిపోయిన మొక్కజొన్న.. నేల రాలిన మామిడి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో యాసంగి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, శనగ పంటలతోపాటు మామిడిపై ప్రభావం ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను సిద్ధం చేస్తున్నామని.. మొత్తం నష్టంపై త్వరలో స్పష్టత వస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ అకాల వర్షాల ప్రభావం ఉందన్నారు. కాగా పంట నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అద్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు హెలికాప్టర్ ద్వారా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడారు. మొక్కజొన్న, మామిడి, వరిలపై ప్రభావం యాసంగి తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాలు, శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా ప్రధానంగా వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న విరిగిపోయింది. వరి నేల వాలింది. వడగళ్లు, ఈదురుగాలుల ప్రభావంతో.. మామిడి పూత, పిందెలు, కాయలు రాలిపోయాయి. మామిడి దిగుబడి తగ్గి నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి 12-13 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశామని.. కానీ ప్రస్తుత నష్టంతో దిగుబడి సగం దాకా పడిపోయే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు వంటి పంటలకూ వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గాలిలో దీపంలా పంటలు! మూడేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యేది. కానీ ఇప్పుడు పంటనష్టాలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. కొత్త పంటల బీమా విధానాన్ని తీసుకొస్తామని వ్యవసాయశాఖ పలు సందర్భాల్లో చెప్పినా ఆచరణలోకి రాలేదు. దీనితో పంటల పరిస్థితి గాలిలో దీపంలా మారిపోయిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. రైతుబంధుతో ఎంతో ప్రయోజనం ఉన్నా పంట నష్టం పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. పిడుగుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లిలో ఉన్న ఓ మదర్సాలో శనివారం రాత్రి పిడుగుపడటంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్యార్థి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు ► ఖమ్మం జిల్లా పరిధిలో 10,418 మంది రైతులకు చెందిన 20,748 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ► సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. 7,097 మంది రైతులు సుమారు 69.77 కోట్ల మేర నష్టపోయారని ప్రాథమికంగా అంచనా వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,282 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నల్లగొండ జిల్లాలో 610 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ► కరీంనగర్ జిల్లాలో 14,300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మొక్కజొన్న, వరి బాగా నష్టపోయినట్టు గుర్తించారు. ► జగిత్యాల జిల్లాలో 4,600 ఎకరాల్లో మామిడి, 600 ఎకరాల్లో నువ్వులు, మొక్కజొన్న, వరికి.. పెద్దపల్లి జిల్లాలో 1,622 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న, మిర్చి, పొగాకుతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి నేలరాలాయి. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ గనుల్లో వాన నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ► ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చికి నష్టం వాటిల్లింది. ఇతర పంటలకూ భారీగానే నష్టం జరిగిందని రైతులు చెప్తున్నారు. ► సంగారెడ్డి జిల్లాలోని 18 మండలాల్లో 4,425 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా జొన్న, శనగ పంటలకు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలి. కోతకు వచ్చిన మొక్కజొన్న, మిర్చి పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు రాలిపోయాయి. వరికి అపార నష్టం వాటిల్లింది. ఉడకబెట్టి, ఆరబెట్టి కల్లాల్లో ఉంచిన పసుపు తడిసిపోయింది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధిత రైతులందరికీ పరిహారం అందేలా చూడాలి. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమల్లోకి తేవాలి. ► తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి -
వడగళ్లు.. ఈదురుగాలులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం సైతం అకాల వర్షాలు కురిశాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం వందనం గ్రామంలో వర్షానికి తెగిపడిన కరెంటు తీగలు తగిలి వృద్ధ దంపతులు మృతిచెందగా పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నేలరాలిన పంటలు.. జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల, జనగామ, భూపాలపల్లి జిల్లా గణపురం, మొగుళ్లపల్లి, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, తొర్రూరు మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి వరి పైరు నేలకొరగగా, మామిడి, ఇతర తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం మంచినీళ్లబావిలో నిమ్మతోటలు వేర్లతో సహా కూలిపోయాయి. సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌లో వరిపైరు నెలకొరిగింది. తిరుమలగిరి మండలంలో కురిసిన వడగళ్లకు పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గద్వాల జిల్లా గట్టు, ధరూర్ మండలంలో వడగండ్ల వానకు వందల ఎకరాల్లో పొగాకు, మామిడి, ఆముదం పంటలు నాశనమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్, కోస్గి మండలంలో మునగ, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు పాన్‌గల్, చిన్నంబావి, ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, రేవల్లి మండలాల్లో కురిసిన గాలివానకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దాదాపు 365 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దంపతుల మృతి ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన దంపతులు బానోతు రాములు (65), రంగమ్మ (62) ప్రతిరోజు మాదిరిగానే మేకలను మేపేందుకు శనివారం ఉదయం పొలాలకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కొదుమూరు గ్రామానికి చెందిన రైతు తాళ్లూరి వెంగళరావు సుబాబుల్ తోటలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాటిపై రాములు, రంగమ్మ కా లుపెట్టడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. 4 మేకలు కూడా మృతిచెందాయి. గ్రేటర్లో దంచికొట్టిన వాన.. భాగ్యనగరంలో శనివారం సాయంత్రం సుమా రు అరగంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫి క్ స్తంభించింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా పంజగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, సైదాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్‌లను భారీ వర్షం ముంచెత్తింది. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కుషాయిగూడ, టోలిచౌకీ, బేగంపేట, సికింద్రాబాద్‌ల పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యధికంగా గాజులరామా రంలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురవగా జీడి మెట్లలో 4.2, రామచంద్రాపురంలో 4.0, చర్లపల్లిలో 3.6 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. నేడు అక్కడక్కడా తేలికపాటి వానలు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదు గా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో శనివారం అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
ఉదయం భగభగలు.. రాత్రి కుండపోత
బుట్టాయగూడెం, ఏలూరు (మెట్రో): పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా.. రాత్రి కుండపోత వానతో సేదదీరారు. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలు ఊరటచెందినా.. మామిడి తదితర పంటలకు భారీ వర్షం నష్టాన్ని మిగిల్చింది. గత నాలుగు రోజులుగా రెండు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోయారు. ఉదయం 11 గంటలకే గ్రామాలు, పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సాయంత్రం 7 గంటల వరకూ కూడా వేడి గాలులు వీయడంతో ఉక్కబోతతో జనం ఇబ్బందులు పడ్డారు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈదురు గాలులు, వర్షంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. కారుమబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు వాన హోరెత్తింది. వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కొద్దిపాటి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. -
తడిసిన ధాన్యం 1.16 లక్షల టన్నులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా 1.16 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. దీనిపై జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా తడిసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియ చేపట్టింది. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తరలింపుపై శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. అలాగే సంబంధిత అధికారులు, రాష్ట్ర రైస్ మిల్లర్లతో పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ సమావేశమయ్యారు. ప్రత్యేక అధికారుల నియామకం.. ప్రాథమిక అంచనా ప్రకారం మంచిర్యాల, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల వద్ద సుమారు 1.16 లక్షల టన్నుల ధాన్యం తడిసిందని.. ఆ ధాన్యాన్ని తక్షణం రైస్ మిల్లులకు తరలించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తరలింపు, గన్నీ బ్యాగులు, రవాణా తదితర అంశాలను పర్యవేక్షించడానికి పాతజిల్లాల ప్రకారం సీనియర్ డీసీఎస్‌వోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సూచనలు చేశారు. వరి, మామిడికి తీవ్ర నష్టం 38,417 ఎకరాల్లో ఇంకా కోత దశలోనే ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ తెలిపారు. 430 ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. ఇక 52,500 ఎకరాల్లో మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యాన శాఖ అంచనా వేసింది. అందులో 42,500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్టు పేర్కొంది. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు రూ.38 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేసినట్టు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధు తెలిపారు. ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ (ప్రొక్యూర్మెంట్) ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం పౌర సరఫరాల శాఖ వాట్సాప్ నంబర్ 7330774444ను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలోనూ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన సమాచారం, కనీస మద్దతు ధర, కొనుగోళ్లు తదితర సమాచారాన్ని రిజిస్టర్లో రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. తక్షణ చర్యలుగా కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని దగ్గరలోని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి, వెంటనే బాయిలర్‌లో డంప్ చేసి మరింత పాడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల పౌర సరఫరాలు, ఎఫ్íసీఐ అధికారులతో పాటు స్థానిక జిల్లా రైస్ మిల్లర్లతో కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం త్వరితగతిన అన్లోడ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
ప్రాణ నష్ట నివారణకు చర్యలు
వడగాడ్పులపై ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పులు, అకాల వర్షాలు, దుర్భిక్షం వంటి అసాధారణ వాతావరణ పరిస్థి తుల కారణంగా ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపా ధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయా అంశా లపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని బుధవారం ఇక్కడ జరిగిన సదస్సులో తెలిపారు. కరవు, వాతావరణ మార్పులు తదితరాలపై దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం చేసిన కారణంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోం దని, నదీజలాలను సమర్థంగా వాడుకుంటూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా వడగాడ్పుల తీవ్రతను తగ్గించగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. హరిత హారం ఉద్దేశం కూడా ఇదేనన్నారు. నగరీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపో వడం వల్ల చిన్నపాటి వర్షానికే నగరం జలమయమవుతోందని, భవిష్యత్తులో మాత్రం అలా జరగబోదన్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) డైరెక్టర్ డాక్టర్ వై.వీ.ఎన్.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. మిషన్ కాకతీయలోనూ ఎన్ఆర్ఎస్సీ కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.వి.ఆర్.శేషసాయి, ఇండియన్ మెట్రలాజికల్ సొసైటీ చైర్మన్ (హైదరాబాద్) కె.హనుమంతరావు, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. -
పప్పు ధరల సెగ
- మేలో రిటైల్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 5.01 శాతానికి అప్ - ఏప్రిల్‌లో ఈ రేటు 4.87 శాతం న్యూఢిల్లీ: పప్పు దినుసుల ధరల భారీ పెరుగుదల ప్రభావం మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై పడింది. రిటైల్ ధరలు వార్షిక ప్రాతిపదికన మేలో 5.01 శాతం పెరిగాయి. అంటే 2014 మేలో ఉన్న మొత్తం రిటైల్ బాస్కెట్ ధర తో పోలిస్తే 2015 మేలో 5.01 శాతం పెరిగిందన్నమాట. ఏప్రిల్‌లో ఈ రేటు 4.87 శాతం. అకాల వర్షాల వంటి అననుకూల వాతావరణం వల్ల 2014-15 పంట కాలంలో (జూలై-జూన్) పప్పు దినుసుల ఉత్పత్తి పడిపోయింది. 2013-14 పంట కాలంలో ఉత్పత్తి 19.78 మిలియన్ టన్నులయితే, తాజాగా ముగుస్తున్న కాలంలో ఈ పరిమాణం దాదాపు 18 టన్నులకే పరిమితమవుతుందని అంచనా. ఈ ప్రభావంతో ఈ కమోడిటీ ధరలు భారీగా పెరిగాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... - ఆహారం, పానీయాలు: ఈ విభాగంలో ధరల పెరుగుదల 5.13 శాతంగా ఉంది. ఈ బాస్కెట్లో ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే- చక్కెర, తీపిపదార్థాల ధరలు మాత్రం వార్షికంగా 7.30 శాతం తగ్గాయి. అలాగే గుడ్ల రేట్లు కూడా 0.78 శాతం తగ్గాయి. ఒక్క పప్పుదినుసుల ధరలు మాత్రం రెండంకెలు పైగా వార్షికంగా 16.62 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం, మాంసం-చేపల ధరలు 5.43 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 7.43 శాతం, చమురు-వెన్న విభాగంలో ధరలు 1.95 శాతం పెరిగాయి. ముఖ్యంగా పండ్ల ధరలు 3.84 శాతం, కూరగాయల ధరలు 4.64 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 8.82 శాతం ఎగశాయి. ఆల్కాహాలేతర పానీయాల ధరలు 4.84 శాతం, హోటల్స్ మీల్స్ ధరలు 7.89 శాతం పెరిగాయి. - పాన్, పొగాకు, మత్తుప్రేరిత పదార్థాలు: ఈ విభాగంలో ధరలు 9.50 శాతం ఎగశాయి. - దుస్తులు, పాదరక్షలు: 6.2 శాతం పెరగుదల -
జోగిపేటలో వర్షం...తడిచిన ధాన్యం
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలో శుక్రవారం వర్షం కురిసింది. దీంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతులు ఆరబెట్టుకున్న 200 క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. మూడు రోజులుగా కేంద్రం నిర్వాహకులను గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, దీంతో అకాలవర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు తెలిపారు. అలాగే రాయికోడ్, అల్లాదుర్గం మండలాల్లో కూడా కొద్దిపాటి వర్షం కురిసింది. -
రైతులను ఆదుకుంటాం : మంత్రి తుమ్మల
పెనుబల్లి (ఖమ్మం): ఖమ్మం జిల్లా పెనుబల్లి, తల్లాడ మండలాలలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పెనుబల్లి, తల్లాడ మండలాలలో అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను, నేల రాలిన మామిడికాయ తోటలను, వడగండ్ల వానకు పంట కోల్పోయిన మొక్కజొన్న తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల.. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతీ రైతు పొలాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి, ప్రభుత్వానికి నష్టపోయిన రైతుల వివరాలతో సమగ్రంగా నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదిక అందగానే ప్రభుత్వం నుంచి కొత్త జీవో ప్రకారం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా సాయం చేస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి సమాచారాన్ని అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
భారీ నష్టం మిగులుస్తున్న అకాల వర్షాలు
నెల్లూరు : అకాల వర్షాలతో అన్నదాతకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవిలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం ఆంధ్రపదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మండల పరధిలోని పలు గ్రామాల్లో ఉన్న నిమ్మ, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని కాకివాయి, వాగిలేరు, మడిచర్ల తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో పాటు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ధర్మవరంలో వడగళ్ల వాన: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం కురిసిన వడగళ్ల వాన అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ వడగళ్ల వానతో మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు, పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మండల పరిధిలోని పోతుకుంట వద్ద ఉన్న 2హెచ్‌టీ విద్యుత్ టవర్ కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
సొంత డబ్బా తప్ప.. ప్లీనరీలో ఏముంది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప రైతుల ఆత్మహత్యలు, అకాల వర్షాల నష్టం గురించి ప్రస్తావించలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమద్రోహులు, ఫిరాయింపుదారులతో టీఆర్ఎస్ నిండిపోయిందన్నారు. ఉద్యమంపై ఉక్కుపాదం మోపి, ఆత్మ బలిదానాలకు కారణమైన దుర్మార్గులతోనే అమరవీరులకు సంతాపతీర్మానం పెడితే వారి ఆత్మలు ఘోషిస్తాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీజేపీ, టీడీపీ ఓట్లతో గెలిచి టీఆర్ఎస్లో చేరడం నీతి బాహ్యమైన చర్య అన్నారు. వారికి చేతనైతే తమ పదవులకు రాజీనామాచేసి ఏ పార్టీలోనైనా చేరాలని బీజేపీ నేతలు సవాల్ చేశారు. సబ్‌ప్లాన్ ప్రస్తావన లేకుండా ప్లీనరీలో సొంతడబ్బా కొట్టుకున్నారని చింతా సాంబమూర్తి విమర్శించారు. ఢిల్లీలో ఎర్రకోటకు దీటుగా గోల్కొండ కోటలో జెండాను ఎగురేయడమే అభివృద్ధా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి మాట్లాడకుండా.. టీఆర్ఎస్ నేతలు అవన్నీ తమ గొప్పలుగా చెప్పుకున్నారని విమర్శించారు. రైతులు కరువుతో, అకాలవర్షాలతో తల్లడిల్లిపోతుంటే ఘనంగా ప్లీనరీ జరుపుకోవడమంటే.. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తిలా కేసీఆర్ తీరుందని విమర్శించారు. -
అకాల వర్షాలతో కుదేలైన రైతులు
- పరిహారం అందివ్వాలని రాస్తారోకో సింధనూరు టౌన్ : గత వారం కురిసిన అకాల వర్షాల నుంచి ఇంకా కోలుకోని రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరిపంట తీవ్రంగా నష్టపోవడంతో రైతులు ఆకస్మిక రాస్తారోకో చేపట్టారు. తాలూకాలోని బసాపుర ఈజే, పగడదిన్ని క్యాంప్, కున్నటగి, దేవరగుడి, గీతాక్యాంప్, తుర్విహాళ, గుంజళ్లి తదితర గ్రామాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఏపుగా పెరిగిన వరి పంట కోతకు వచ్చే దశలో అకాల వర్షాలు ముంచెత్తాయి. దిక్కుతోచని రైతులు నానిపోయిన వరి పణలను ట్రాక్టర్లలో వేసుకొని వచ్చి తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెడ్పీ మాజీ అధ్యక్షుడు బాదర్లి పంపనగౌడ, జెడ్పీ సభ్యుడు చందూసాబ్ ముళ్లూరు తదితరులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడకు చేరుకున్న జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, తహశీల్దార్ గంగప్ప కల్లూరులను రైతులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీనివ్వడంతో రైతులు శాంతించి తమ ఆందోళన విరమించారు. అనంతరం రైతులు, నాయకులతో అధికారులు చర్చించారు. ప్రముఖులు మల్లనగౌడ కన్నారి, శ్రీనివాస్, పంపనగౌడ పూలబావి, ఎస్ఎన్ రాజు, సహాయక వ్యవసాయ అధికారి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల రాస్తారోకోతో సుమారు గంటసేపటికి పైగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదిక అకాల వర్షంతో జరిగిన పంట నష్టంపై రైతులకు తగిన పరిహారం అందించేందుకు మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందింపజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆయన శుక్రవారం తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద నష్టానికి గురైన వరి పంటను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తహశీల్దార్ నేతృత్వంలో తాలూకాలో జరిగిన పంట నష్టంపై సర్వే జరిపించి నివేదిక రూపొందిస్తామన్నారు. గతంలో మాదిరిగా చెక్‌ల రూపంలోనే ఈసారి కూడా పరిహారం అందిస్తామన్నారు. అందువల్ల ప్రతిఒక్క రైతు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. సింధనూరు టౌన్ : తాలూకాలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షాలకు వరి పంటలు నీటి పాలయ్యాయి. గొరెబాళ్, సాసలమరి, సోమలాపుర గ్రామాల్లో కురిసిన వర్షం వల్ల కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. -
తిరుమలలో వడగండ్ల వాన
తిరుమల : తిరుమలలో శనివారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. దీంతో శ్రీవారి భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఆవరణలో నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం టీటీడీ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు పడుతుండటంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికి వచ్చే దశలో అకాల వర్షాలు పడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
అన్నదాతకు కడగండ్లు
► వడగండ్ల వానతో కుదేలైన రైతన్న ► మామిడి, టమాట రైతులకు భారీ నష్టం ► ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వడగండ్ల వాన రైతులకు కన్నీటిని మిగులుస్తోంది. వాయువేగంతో వీచిన పెనుగాలులకు వడగండ్ల వాన తోడవడంతో మామిడి, టమాట పంట రాలిపోతుంది. అరకొరగా పండిన మామిడికాయలు నేలరాలిపోగా, భారీ వృక్షాలు సైతం కూలిపోతున్నాయి. ఇప్పటికి దాదాపు 700 హెక్టార్లకు పైగా మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దీనికితోడు బొప్పాయి, అరటి, టమాట, పొద్దుతిరుగుడు, వరి పంటలకు సైతం కొన్ని మండలాల్లో నష్టం వాటిల్లింది. జిల్లా మొత్తం మీద రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. జిల్లాలో 1లక్ష హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి 75 వేల హెక్టార్లలో మామిడి తోటలు కాపునకు వచ్చాయి. మిగతావి వివిధ దశలో ఉన్నాయి. గత ఏడాది ఎకరాకు సరాసరి దిగుబడి 9 నుంచి 10 టన్నులు రాగా, ఈ ఏడాది కేవలం 8 టన్నులు లోపు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే తవణంపల్లె, బంగారుపాళ్యెం, పాకాల, వీకోట, మదనపల్లి, దామలచెరువు, పూతలపట్టు, కుప్పం ,శాంతిపురం మండలాల్లో 20 వేల ఎకరాల్లో కాపు దశలో ఉన్న మామిడి చెట్లు ఎండుదశకు చేరుకున్నాయి. మిగతా చోట్ల అరకొర కాసిన ఈ మామిడి కాయలు సైతం అకాల వర్షం, వడగండ్ల వానకు నేలపాలవుతున్నాయి. రొంపిచెర్ల, యర్రావారిపాళెం, పుంగనూరు, గంగవరం, పెద్దపంజాణి, వీకోట, ములకలచెరువు, రామసముద్రంలలో గత వారంలో కురిసిన వడగండ్ల వానకు 500 హెక్టార్లకు పైగా మామిడి పంట దెబ్బతింది. ఈనెల 23వ తేదీ కురిసిన వర్షానికి పెనుమూరులో 80 హెక్టార్లు, పుత్తూరు 18 హెక్టార్లు, వడమాలపేటలో 280 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొంత వరకు ఉపయోగమే: ఇటీవల కురిసిన వర్షాలు ఎండిపోయే దశలో ఉన్న 20 వేల ఎకరాల మామిడితోటలకు కొంత మేర ఉపయోగమే. ఇప్పటికి జిల్లాలో పలు మండలాల్లో వడగండ్ల వాన వల్ల మామిడి, టమోటా పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది. మామిడి పిందెల దశలో వర్షం కురియడంతో కాయ బాగా వృద్ధి చెంది అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. - ధర్మజ, ఉద్యానవన ఉపసంచాలకులు, చిత్తూరు. -
అన్నదాత ఆగ్రహం: ఫర్నిచర్ ధ్వంసం
నల్లగొండ: రాత్రనక, పగలనక కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాత ఆగ్రహావేశాలకు గురయ్యాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సుర్యాపేట మార్కెట్ యార్డులో శుక్రవారం చోటుచేసుకుంది. అకాల వర్షాలతో పాడైపోయిన పంటను తక్కువ ధరకు కొంటుండటంతో ఆవేదనకు గురైన రైతులు ఆందోళన బాట పట్టారు. ఒకానొక సమయంలో ఆగ్రహావేశాలకు గురైన అన్నదాతలు అక్కడున్న ఫర్నిచర్, కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రైతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అకాల వర్షం : నీటమునిగిన మిర్చి
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం పరిధిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి పొలంలో ఉన్న మిర్చి నీటిపాలైంది. మిర్చితో పాటు మిగతా పంటలకు నష్టం చేకూరింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెల్సిందే. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడం వల్ల తీవ్రంగా నష్టపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
రెతులను ఆదుకోవాలి: వైఎస్సార్సీపీ
హుజూర్నగర్ : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డిలు కోరారు. గురువారం స్థానికంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వరి సాగు చేసిన రైతులకు తీరా పంట చేతికి అంది వచ్చిన దశలో అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందన్నారు. ఈదురు గాలులు, వడగండ్ల వానతో వరి చేలు నేలకొరిగాయన్నారు. ధాన్యం రాలిపోవడంతో పాటు వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తోటలలో మామిడి కాయలు కూడా రాలిపోవడమేగాక చెట్లు విరిగిపోయాయన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, నాయకులు గుర్రం వెంకటరెడ్డి, పులిచింతల వెంకటరెడ్డి, కాల్వపల్లి బ్రహ్మారెడ్డి, జడరామకృష్ణ, పిల్లి మరియదాసు, మర్రి రవీందర్‌రెడ్డి, దేవరకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం బాధితులకు నెలలోగా పరిహారం
పాపన్నపేట(మెదక్): అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్ట పోయిన రైతులకు నెలలోగా పరిహారం అందజేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. నష్టపోయిన రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యేలా ఎకరా వరికి రూ.5400 చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులంతా ఇప్పటికే పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానవల్ల నష్టపోయిన పంటలను హరీష్‌రావు పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్ తదితరులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గతంలో 50శాతం పంట నష్టం జరిగితేనే ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించే వారన్నారు. కాని, సీఎం కేసీఆర్ 33 శాతం పంటనష్టం జరిగినా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. రైతులకు ఖరీఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. -
అన్నదాతలను ఆదుకోండి!
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు ఏపీ, తెలంగాణ సీఎంలకు వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల పాలిట పిడుగుపాటులా మారిన అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వర్షాలతో నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆపార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, కొండా రాఘవరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాల రైతులూ నష్టపోయారు: వాసిరెడ్డి అకాల వర్షాలతో ఏపీలోని 13 జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాయలసీమలో వరి, మామిడి, సపోటా, తమలపాకు, పత్తి పంటలు ధ్వంసమయ్యాయన్నారు. రుణమాఫీ అమలుకాక ఇప్పటికే లబోదిబోమంటున్న రైతులకు ఈ వర్షాలు అశనిపాతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కర్నూలులోనే వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందన్నారు. వాస్తవానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను మినహాయిస్తే ఏపీ అంతటా గత ఖరీఫ్‌లో 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఫలితంగా 50 శాతం పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. పంటలు పోయి ఆర్థికంగా చితికి పోయిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలబడాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌గారూ.. స్పందించండి: రాఘవరెడ్డి తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ అకాలవర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం అండగా నిలబడాలని మరో అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, పంట నష్టాలను జీర్ణించుకోలేక ఐదుగురు రైతులు హఠాన్మరణం చెందారన్నారు. వీరిలో కొందరు పిడుగుపడి చనిపోతే.. మరికొందరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో క్యారెట్, నల్లగొండ లో వరి పంటలు పూర్తిగా నీటమునిగాయని తెలిపారు. ‘రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని కేసీఆరే చెప్పారు కనుక వారి కంట నీరు తుడవాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ దివంగత వైఎస్ జీవో 421 ఇచ్చారని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచి ఇవ్వాలని అన్నారు. పిడుగుపాటుకు, కరెంటు తీగలు తగిలి మృతి చెందిన వారికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. -
గంపెడాశలు.. గంగపాలు
* తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు * 80 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు * సుమారు రూ. 200 కోట్ల వరకూ నష్టం సాక్షి, హైదరాబాద్: నిండు కరువుతో విలవిల్లాడిన రైతన్న ఆశలన్నీ అకాల వర్షాలతో గల్లంతయ్యాయి.. ఎంతో కొంత చేతికందకపోతుందానన్న గంపెడాశలూ గంగ పాలయ్యాయి. కాలంగాని కాలంలో కురిసిన వాన రాష్ట్రవ్యాప్తంగా అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరి నీటమునిగిపోగా.. కోతదశలో ఉన్న మామిడి నేల రాలిపోయింది. మిగతా పంటలూ భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఏకంగా రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు వాన బీభత్సంపై సీఎం కేసీఆర్ వెంటనే అధికారులతో సమీక్షించారు. వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. అపార నష్టం.. రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఎనిమిది జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో నష్టం సంభవించగా.. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ నష్టం భారీగా ఉంది. మొత్తంగా 40 మండలాల్లోని 328 గ్రామాల్లో 52,352 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు 29 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. కోత దశలో ఉన్న వరి నీటిపాలవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. నువ్వుల పంట 5,934 హెక్టార్లలో దెబ్బతినగా... 2,089 హెక్టార్లలో సజ్జ, 769 హెక్టార్లలో మొక్కజొన్న, 510 హెక్టార్లలో జొన్న పంటలు దెబ్బతిన్నాయి. వీటికితోడు 11 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అన్ని జిల్లాల్లోనూ మామిడి తోటల బాగా నష్టం వాటిల్లింది. దాదాపు 7వేల హెక్టార్లలో మామిడి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 250 హెక్టార్లలో అరటి, 75 హెక్టార్లలో బొప్పాయి పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇక కూరగాయల తోటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. మరోవైపు అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో 150 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. పిడుగుపాటు, వర్షాల తీవ్రతతో గోడలు కూలి, పంట నష్టం తట్టుకోలేక పురుగుల మందు తాగి.. ఇలా వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు రైతులు మృత్యువాత పడ్డారు. కానీ జిల్లాల నుంచి మృతిచెందిన ఘటనలకు సంబంధించిన సమాచారమేదీ రాలేదని ఉన్నతాధికారులు ప్రకటించారు. మిషన్ కాకతీయకు బ్రేక్.. అకాల వర్షాలతో ‘మిషన్ కాకతీయ’ పథకానికి బ్రేక్ పడింది. మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువుల పునరుద్ధరణ పనులన్నీ దాదాపు పూర్తిగా నిలిచిపోగా.. ఆదిలాబాద్, వరంగల్‌లో కొన్ని డివిజన్ల పరిధిలో పనులు ఆగిపోయాయి. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 800 చెరువుల పరిధిలో పనులు పూర్తిగా నిలిచినట్లు తెలుస్తోంది. నేడు కూడా వర్షాలు వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఆదుకుంటాం: సీఎం వర్షాల కారణంగా సంభవించి న నష్టంపై సీఎం కేసీఆర్ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. పిడుగుపాటు, వడగళ్లు, భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వెంటనే జిల్లాల వారీగా మృతుల వివరాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టం, కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లు, మరణించిన పశువుల సంఖ్య తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించాలని ప్రభుత్వ సీఎస్‌కు కేసీఆర్ ఆదేశించారు. నివేదికలు రాగానే ఆర్థిక సాయం అందించాలన్నారు. అంతా అస్తవ్యస్తం సాక్షి, నెట్వర్క్: వర్షాలతో పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో గోడ కూలిపోయి యమున అనే మహిళ మృతి చెందింది. నల్లగొండ తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో ధాన్యం నీటమునిగింది. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. రామన్నపేట మార్కెట్లో సిందం మల్లయ్య అనే రైతుకు చెందిన 30 బస్తాల ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.36.28 కోట్ల నష్టం జరిగింది. నువ్వులు, వరితో పాటు మామిడి, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు, కోళ్ల ఫారాలు దెబ్బతిన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో పసుపు పంటకు నష్టం వాటిల్లింది. బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లి, పడమటి కేశ్వాపూర్, మన్సాన్పల్లిలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, దిలావర్పూర్, ఖానాపూర్, కడెం, మామడ మండలాల్లో సజ్జ, నువ్వు, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. జైపూర్, చెన్నూర్ మండలాల్లో మామిడి దెబ్బతిన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి పంటకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలో 76 ఇళ్లు దెబ్బతిన్నాయి. -
అన్నదాతకు గుండెకోత
అకాల వర్షాలతో ఏపీ రైతు కుదేలు సాక్షి, విజయవాడ బ్యూరో: అకాల వర్షాలు రెండోరోజు సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులను కుంగదీశాయి. రాయలసీమ, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వంగర మండలం జగన్నాధవలసలో ఉపాధి పనులు చేస్తున్న మంతెన రూపవతి (19) మృతి చెందింది. జిల్లాలో వర్షాలకు మామిడి, జీడిమామిడి పూత రాలిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. వరి కోతల సమయంలో వర్షాలు కురవడంతో తూర్పుగోదావరి జిల్లాల్లో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. కోసి ఆరబెట్టిన వరి పనులు తడిసిపోవడంతో దిగుబడి తగ్గుతుందని భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వరి పంట నేలకొరిగింది. పొలాల్లోని ధాన్యం ఓదెలు తడిసిపోయాయి. ఉద్యాన పంటలైన నిమ్మ, జామ, అరటి, చీ నిమ్మ తోటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. సుమారు 10వేల హెక్టార్ల వరిపైరు నేలకూలింది. రాయలసీమకు భారీ నష్టం: రాయలసీమలో రూ. 23 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల 20 మండలాల్లో పండ్లతోటలు, పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో 1350 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాల వల్ల పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, గోడ కూలి ఓ మహిళ మరణించింది. వైఎస్ఆర్ జిల్లాలో వర్షానికి 475 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. -
రైతులను ఆదుకోండి: వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లిన విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రాధామోహన్‌సింగ్‌ల దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు. పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలు, నష్టంపై వారికి వివరించి.. రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. దీంతోపాటు తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ఇక వర్షాల కారణంగా ఏర్పడిన నష్టం వివరాలను పరిశీలించడంతో పాటు రైతు ఉపశమన చర్యల కోసం వెంకయ్యనాయుడు బుధవారం బాధిత జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, మదన్ భాయ్ ఖండారియా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రాణ,ఆస్తుల హాని నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఫోన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులను అకాల వర్షాలపై అడిగి తెలుసుకుని జిల్లా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. దీంతో మంత్రి పత్తిపాటి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వర్షాలకు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందడంతో పాటు, ఒక లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిన ట్లు అంచనా వేశారు. మరణించిన వారి కుటుంబాలకు తక్షణం ఎక్స్‌గ్రేషియాను అందజేయాలని ప్రధాన కార్యదర్శి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
అకాల వర్షాలతో రైతన్న విలవిల
అచ్చంపేట : అకాల వర్షాలతో రైతన్న విలవిల్లాడుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట రూరల్‌లో శుక్రవారం కురిసిన వర్షాలకు మార్కెట్ యార్డులో ఉన్న వేరుశనగ పంట తడిసిపోయింది. దీంతో రైతులు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మార్కెట్ అధికారులతో తడిసిన ధాన్యం కొనుగోలు గురించి చర్చించారు. -
పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీ
బూందీ(రాజస్థాన్): అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు పంటనష్ట పరిహార పరిమితిని పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ విషయమై రాష్ట్రాలతో చర్చిస్తామని చెప్పారు. ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ గ్రామంలో జైట్లీ ఆదివారం పర్యటించి, రైతులతో మాట్లాడారు. కేంద్రం రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకు అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు. -
అకాల వర్షంతో భారీగా పంట నష్టం
నిజామాబాద్ : అకాల వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులతో కూడిన భారి వర్షం కారణంగా ఎర్రజొన్నలు, పసుపు పంట నీట మునిగింది. లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ( సిరికొండ) -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ఆదిలాబాద్ : అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ,దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం కురిసిన భారి వర్షం వల్ల దిలావర్‌ఫూర్‌లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నివేదిక అందజేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అందరికీ పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. ఆయన వెంట మండల ముఖ్యనేత దేవేంధర్‌రెడ్డి, నాయకులు నర్సారెడ్డి, రమణారెడ్డి, ధనెనర్సయ్య, ఆత్మ డెరైక్టర్ గుణవంత్‌రావుపాటిల్,ధనె రవి, కే.గంగారెడ్డి, తదితరులు ఉన్నారు. (దిలావర్పూర్) -
అందిన ద్రాక్ష పుల్లన!
గతంలో జనవరి నెల వచ్చిందంటే మండలంలోని ఏ గ్రామంలో చూసినా వివిధ రకాల ద్రాక్ష తోటలు కనిపించేవి. ఈ నేపథ్యంలో రైతులు క్రమేణా నష్టాలు చవిచూస్తుండటంతో ఈ తోటలు కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయి. ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం లక్ష రూపాయల నుంచి రూ.1.50 లక్షలు దాటుతోంది. దీంతో పాటు పంటను ఆశిస్తున్న తెగుళ్లు ఎక్కువ కావడంతో క్రిమిసంహారక మందుల వాడకం పెరిగింది. ఖర్చులు సైతం పెరిగాయి. రెట్టింపు ఖర్చు అవుతుండటంతో పాటు సంవత్సరానికి ఒక పంట అదీ పంట సమయంలో ఏదో ఒక విపత్తుతో నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు ద్రాక్ష సాగు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా అకాల వర్షాలు, ఈదురుగాలులు, మార్కెటింగ్ ఏజెన్సీలు ఎగుమతులను తగ్గించడం రైతులకు చెల్లించాల్సిన డబ్బుల్లో కోతలు పెట్టడంతో ద్రాక్ష రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు కొన్నేళ్లుగా ద్రాక్ష కిలో రూ.25నుంచి రూ.35 వరకు పలకడంలేదు. ప్రస్తుతం మండలంలోని పోతారంలో 15 (గతంలో 100 ఎకరాలు సాగుకు) ఎకరాలు, మూడుచింతలపల్లిలో 30 (గతంలో 100 ఎకరాలు) జగన్‌గూడలో 15 (గతంలో 50 ఎకరాలు) కొల్తూర్‌లో 50 (గతంలో 250 ఎకరాలు,) తుర్కపల్లిలో 100 ఎకరాల్లో (గతంలో 500 ఎకరాలు) ద్రాక్ష సాగు చేస్తున్నారు. గతంతో పోలిస్తే సుమారు 70 శాతం మంది రైతులు ద్రాక్ష సాగు నుంచి వైదొలిగారు. తీగజాతి కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ద్రాక్ష రైతుల సమస్యలపై దృష్టి సారించి చేయూతనిస్తే తప్ప తిరిగి ఈ పంటకు పూర్వవైభవం వచ్చేలాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ద్రాక్ష తోటల రైతులకు సహాయం అందజేస్తామని చెబుతుండటంతో వారిలో చిరుఆశలు చిగురిస్తున్నాయి. నష్టాల ఊబిలో కొట్టుకుపోతున్న రైతులకు అండగా ఉండి ప్రభుత్వం ద్రాక్ష రైతులకు చేయూతనందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
‘ఉరి’ కౌగిట రైతు ఊపిరి..!
సాక్షి, ముంబై: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాలవర్షాలకు లేదా నీటిఎద్దడితో దెబ్బతింటుండటం రైతుల పాలిట శాపంగా మారాయి. దీంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు ఆత్మహత్యల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఓ వైపు కరువు, మరోవైపు అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. గత రెండు నెలల్లో సుమారు 125 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందన్నది స్పష్టమవుతోంది. ఓ వైపు పంట కోసం తీసుకున్న అప్పులు వడ్డీతో తడిసిమోపెడు కాగా మరోవైపు ఇంట్లో తినేందుకు కూడా తిండి గింజలు లేని పరిస్థితి. దీనికితోడు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించడంలేదు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో రైతులను ఆదుకునే విషయంపై ప్రభుత్వం కీలకనిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అకాల వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది. ఇలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోతే ఆత్మహత్యల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. యావత్మాల్ జిల్లాలో రోజుకో ఆత్మహత్య..! రాష్ట్రంలో అత్యధికంగా యావత్మాల్ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లో ఇక్కడ 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా, ఈ జిల్లాలో గడిచిన 11 నెలల్లో 224 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడినవారందరు దాదాపు ఉరి వేసుకునో లేదా విషం తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అమరావతి జిల్లాలో 45 రోజుల్లో 20 మంది... అమరావతి జిల్లాలో గత 45 రోజుల్లో అప్పులబాధ తాళలేక 20 మంది ఆత్మహత్య పాల్పడ్డారు. అయితే వీరిలో కేవలం ఒక్కరైతును మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేందుకు యోగ్యుడిగా గుర్తించింది. మిగతా వారందరికి నష్టపరిహారం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. అకోలా జిల్లాలో నెలరోజుల్లో 11 ఆత్మహత్యలు అకోలా జిల్లాలో గడిచిన నెల రోజుల్లో 11 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అకోలా, పరతూర్ తాలూకాకి చెందినవారే అధికంగా ఉన్నారు. -
మరో ప్రయత్నం
ఖమ్మం వ్యవసాయం: పత్తి రైతులు మరోసారి జీవన పోరాటానికి సిద్ధమవుతున్నారు. గత మే నెలలో అకాల వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలు వేశారు. అయితే అప్పటినుంచి వరుణుడు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలను బతికించుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. కొందరు ట్యాంకర్లతో నీరు తెచ్చి పత్తి మొక్కలకు పోశారు. వీటిలో నల్లరేగడి నేలలో వేసినవిత్తనాలు కొంతమేర మొలకెత్తినా.. ఎర్ర, దుబ్బ నేలల్లో వేసిన విత్తనాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కా గా, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వేసిన భూములను మళ్లీ దున్ని, కొత్త విత్తనాలు వేస్తున్నారు. రెండుసార్లు విత్తనాలు వేయాల్సి రావడంతో ఖర్చు రెట్టింపయినా వారు వెనుకాడడం లేదు. జిల్లాలో ప్రతి ఏడాది 1.52 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తుంటారు. కాగా ఈ ఏడాది వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం 1.90 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసే అవకాశం ఉందని గుర్తించారు. అయితే జూన్‌లో దాదాపు లక్ష హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు కురవక విత్తనాలు మొలకెత్తకపోవడంతో ప్రస్తుతం 70 వేల హెక్టార్లలో మరోసారి విత్తనాలు వేసి తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. తడిసి మోపెడవుతున్న ఖర్చులు... మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఇప్పుడు రైతులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక్కో హెక్టారుకు దుక్కి దున్నడానికి రూ.4 వేలు, అచ్చు తోలడానికి రూ.500, విత్తనాలకు రూ.2 వేలు, అవి వేసే కూలీలకు రూ.7వేల వరకు ఖర్చు చేశారు. ఆ విత్తనాలు మొలకెత్తకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతుండటంతో మళ్లీ అంత ఖర్చు చేసి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పుడైనా వర్షాలు కురుస్తాయా.. లేక మళ్లీ నష్టం చవిచూడాల్సి వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. దిగుబడి తగ్గే ప్రమాదం... పత్తి సాగు ఆలస్యం కావడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి పత్తి ఏపుగా పెరిగి పిందె స్థాయికి వచ్చేదని, ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఇంకా విత్తనాలు వేసే దశలోనే ఉండడంతో ఆ ప్రభావం దిగుబడిపై ఉంటుందని చెపుతున్నారు. -
వాన బీభత్సం
లింగంపేట, న్యూస్‌లైన్ : మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి, మాల పాటి, లొంకల్‌పల్లి, సజ్జన్పల్లి, ఎక్కపల్లి, ఎక్కపల్లితండా, పర్మల్ల తదితర గ్రామాలలో 20 విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. సుమా రు 150 చెట్లు నేల కూలిపోయా యి. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల బాల్‌రాజ్, మార్గం స్వరూప, మార్గం లచ్చవ్వ, బైండ్ల శివకుమార్, బైండ్ల పోచయ్య తది తరులకు చెందిన రేకుల షెడ్లు సు మారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సుమారు 20 ఇళ్ల కూన పెంకులు గాలికి ఎగిరి పోయాయి. శెట్పల్లి సంగారెడ్డిలో 15 నివాస గుడిసెలు, ఇండ్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. శెట్పల్లి సంగారెడ్డి పంచాయతీ పరిధిలోని మాలపాటి గ్రామంలో రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఈదురు గాలులకు ధ్వంస మయ్యాయి. కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి పోయాయి. రైతులు జనరేటర్‌ను ఉపయోగించి వర్షం నీటిని తొలగించారు. బలమైన ఈదురు గాలుల తాకిడికి రేకుల షెడ్లు కొట్టుకు పోయాయి. అకాల వర్షం వల్ల సుమారు రూ. 70 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జోరు వర్షం కురియడంతో జనజీవనం అతలాకుతలమైంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తిర్మలాపూర్‌లో.. బాన్సువాడరూరల్ : బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్ పంచాయతీ పరిధిలోని మొగులాన్పల్లి, కొత్తాబాది, తిర్మలాపూర్ గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మొగులాన్ పల్లి గ్రామం, తండాల్లో షెడ్లపై నుంచి రేకులు ఎగిరిపోగ, ఇళ్లపై కూనలు పగిలిపోయాయి. కొత్తాబాది బస్టాండ్ సమీపంలో విద్యుత్ స్తంభం విరిగింది. తిర్మలపూర్లో పంట పొలాల్లో ఇనుప విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. తిర్మలాపూర్ గేట్ వద్ద తాగునీటి లైన్ స్తంభం విరిపోయింది. గ్రామం అంధాకారమయమైంది. ఆరుబయట వున్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తూకం వేసిన సంచులు తడిసి పోవడంతో రైతులు ధాన్యాన్ని వేరేసంచుల్లోకి మార్చారు. గ్రామసర్పంచ్ బేగరిసాయిలు, వార్డుసభ్యుడు సద్దాం గ్రామంలో జరిగిన నష్టాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పిట్లంలో.. నిజాంసాగర్ : పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ఇళ్లకు చెందిన రేకులు కొట్టుక పోయాయి. ఇళ్ల రేకులు ఎగిరి పోవడంతో భయాందోళనకు గురైనట్లు గ్రామానికి చెందిన నుప్పల అంజయ్య తెలిపారు. -
నిలువు దోపిడీ
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం కరువైంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దో గోప్పో పంట చేతికందినా గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలోని 23వేల హెక్టార్ల లో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో 18 వేల హెక్టార్లలో కాపు వచ్చే మామిడితోటలు ఉండగా.. ఐదు వేల హెక్టార్లలో ఐదేళ్ల వయసు గల తోటలు ఉన్నాయి. ప్రకృతి అనుకూలిస్తే ఎకరాకు ఏడు టన్నుల చొప్పున మామిడి కాయ దిగుబడి వస్తుంది. కానీ అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఏటా పూత, పిందె రాలిపోయి తోటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో కాయ దిగుబడి హెక్టారుకు సగటున 3 టన్నులకు మించి రావడం లేదు. ఈసారీ మామిడి రైతులను ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీశాయి. మామిడి చెట్లకు పూత విరగబూసి పిందె దశకు చేరే క్రమంలో అకాల వర్షాలతో పిందెలు సగానికి పైగా రాలిపోయింది. కొద్దో గొప్పో మిగిలిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ సౌకర్యం లేక.. మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేదు. మంచిర్యాల కేంద్రంగా మార్కెట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. రెండేళ్ల నుంచి ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రైతులు మామిడి కాయలను మాహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామిడికాయలను తీసుకెళ్లే క్రమంలో ధర ఆకాశంలో ఉన్నట్లు నమ్మబలికి.. తీరా తీసుకెళ్లాక ఒక్కసారిగా ధర దించి రైతులను వంచనకు గురి చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారు. మామిడికాయలు, పండ్లను వేలం పాడి విక్రయించి ఇచ్చినందుకు రూ.లక్షకు రూ.10వేల చొప్పున దళారులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మరోవైపు టన్నుకు 50 కిలోల తరుగు తీస్తున్నారు. రైతులు ఎదురుతిరిగితే కొనుగోలు చేయడం లేదు. తడిసి మోపెడవుతున్న చార్జీలు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేక మామిడి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాయలను చెట్లపై నుంచి తెంపడం నుంచే ఇబ్బందులు మొదలవుతాయి. గతంలో రోజువారీ కూలీకి వచ్చే కూలీలు ప్రస్తుతం టన్ను లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. ఆరు టన్నుల కాయలు కోస్తే రూ.10వేలు కూలిగా ఇవ్వాల్సి వస్తోంది. కాయలు తెంపిన తర్వాత మార్కెట్‌కు తరలించడానికి రవాణా చార్జీ అదనపు భారమవుతోంది. బెల్లంపల్లి ప్రాంతం నుంచి నాగ్‌పూర్‌కు మామిడికాయలు తరలిస్తే డీసీఎం వ్యాన్‌కు రూ.18వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. నెన్నెల, జైపూర్, భీమారం తదితర ప్రాంతాల నుంచి తరలిస్తే రూ.22వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రవాణా భారం రైతులకు తడిసి మోపెడవుతోంది. మద్దతు ధర కరువు.. రోజు రోజుకు మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మామిడి కాయలు పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కరువవుతోంది. ఏయేటికాయేడు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. ఈయేడు తొలుత బంగినపల్లి మామిడి పండ్లకు టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, దశేరికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు మద్దతు ధర చెల్లించి రైతులను వ్యాపారులు ఊరించారు. మద్దతు ధర లభిస్తోందని ఆశపడిన రైతులు ఒక్కసారిగా మామిడికాయలు, పండ్లను మార్కెట్లో ముంచెత్తగా ఆకాశంలో ఉన్న ధరను పాతాళానికి దించారు. ప్రస్తుతం బంగెనపల్లి మామిడికాయలు టన్నుకు రూ.13 వేల నుంచి రూ.16 వేల వరకు, దశేరి టన్నుకు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు ధర పలుకుతోంది. ఇతర రసాల పండ్లను టన్నుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మద్దతు ధర కూలీల ఖర్చు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, రైతుల శ్రమను తీసివేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చేయూత కరువు.. మామిడి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించి కష్టాలు తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్కనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మార్కెట్ సౌకర్యం కోసం చేసిన ప్రతిపాదనలను ఇప్పటికైనా కార్యారూపం దాల్చేలా చర్యలు తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
రైతును ముంచిన అకాల వర్షం
మిరుదొడ్డి, న్యూస్‌లైన్: అకాల వర్షాలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఇదే నెల మొదటి వారంలో రెండుసార్లు కురిసిన వడగళ్ల వానలకు పంటలను కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రైతన్న మరోమారు ఇబ్బందుల పాలయ్యారు. మిరుదొడ్డితోపాటు అల్మాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, రుద్రారం తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు 5 ఎకరాల్లో సాగు చేస్తున్న మునగ తోట నేల పాలైంది. దీంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. తనను ఆదుకోవాలంటూ బాధితుడు కనకయ్య అధికారులను కోరారు. మిరుదొడ్డి, జంగపల్లి, రుద్రారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లోని ధాన్యం కల్లాల వద్ద వర్షపు నీరు నిలిచి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వర్షపు నీటిని మహిళా రైతులు ఎత్తి పోశారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
జిల్లా నిప్పు కణిక
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ : మే.. ప్రతాపం చూపుతోంది. మొన్నటి వరకు వాతావరణం చల్లగా ఉండడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. హమ్మ య్య ఈసారి వేసవి కాలం అంతగా లేదనుకున్నారు. అయితే ఈ నెలలో ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉదయం ఎనిమిది గంటలకే వేడెక్కుతోంది. 9 గం టలకు భానుడు మండిపోతున్నాడు. 10 గం టల సమయంలోనైతే జనం రోడ్లమీదకు రావాలంటే జంకుతున్నారు. ఎండ వేడిమి తో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. వారం క్రితం వరకు ఉష్ణోగ్రతలు అంతగా లేవు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అకాల వర్షాలు కురిశాయి. చల్లగానే ఉందనుకున్న సయమంలో వేసవి తీవ్రత పెరిగింది.వారం క్రితం 36 డిగ్రీలు ఉన్న గరిష్ట ఉష్టోగ్రత 43 డిగ్రీలకు పెరిగింది. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఉదయం పూటనే పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం ఏడు గంటలకు గానీ బయటకు రావ డం లేదు. జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా.. తేది గరిష్ట ఉష్ణోగ్రతలు డిగ్రీల్లో 17న 36.5 18న 36.3 19న 43.0 20న 42.0 21న 42.0 22న 42.0 23న 42.5 24న 43.4 -
సౌకర్యాలు లేకనే..
బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అసలే ధాన్యం కొనుగోళ్లు లేక, కనీస మద్దతు ధర రాక తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులపై ప్రకృతి విరుచుకు పడుతోంది. బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం వల్ల మండలంలోని వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. బాన్సువాడ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలన్నీ వర్షం నీటిలో మునిగి పోయాయి. పొద్దంతా ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి వర్షం కురియడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక పోతున్నారు. రైతులకు తాటిపత్రులు కూడా అందుబాటులో ఉండక పోవడంతో ధాన్యం కుప్పలు తడిసి పోతున్నాయి. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, సోమేశ్వర్, బుడ్మి, తిర్మలాపూర్, చింతల్‌నాగారం, బోర్లం తదితర గ్రామాల్లో పొలాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నది. చింతల్ నాగారంలో రెండు రోజుల క్రితమే సుమారు 400 ఎకరాల్లో రైతులు వరి కోతలు కోసి ధాన్యాని ఆరబెట్టారు. వర్షం దాటికి కుప్పలన్నీ నానిపోయాయి. ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. గన్నీ సంచుల కొరత, రైస్ మిల్లర్ల నిబంధనలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుల తరబడి ధాన్యం కాంటాలు కావడం లేదని, ఫలితంగా ధాన్యం కుప్పలన్నీ వర్షం పాలవుతున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అకాల వర్షాలు, ఈదురు గాలుల బీభత్సంతో పంట నష్టం
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల బీభత్సంతో 2,142 ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి.బి.భాస్కర్ రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు జినుగు మరియన్న ఆదివారం ప్రకటించారు. జిల్లాలో 95 శాతం వరి కోతలు పూర్తయ్యాయని, 5 శాతం వరి పంటలకు మాత్రమే నష్టం వాటిల్లిందని జేడీఏ భాస్కర్ రావు తెలిపారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, పాల్వంచ, పెనుబల్లి, అశ్వాపురం, కామేపల్లి, వైరా, కొత్తగూడెం, పినపాక మండలాల్లోని 36 గ్రామాలకు చెందిన 1,116 మంది రైతుల 1637(655 హెక్టార్లు) ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. ఇవే మండలాలలోని 12 గ్రామాలకు చెందిన 188 రైతుల 245 (98 హెక్టార్లు) ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు రూపొందించామన్నారు. సమగ్ర నివేదికలు రూపొందించేందుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో మండల వ్యవసాయాధికారి, తహశీల్దార్, వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ రెవెన్యూ అధికారులు ఉంటారని చెప్పారు. 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లిన పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వరి పంట నష్టానికి హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్నకు హెక్టారుకు రూ. 6 వేల చొప్పున చెల్లించేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఉద్యానవన శాఖ పంట నష్టాలిలా... జిల్లాలో 150 ఎకరాల్లో మామిడి కాత రాలిందని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మరియన్న తెలిపారు. మిర్చి కల్లాల్లో ఆరబోశారని, వాటిని టార్పాలిన్లతో కప్పి రక్షిస్తున్నారని చెప్పారు. బొప్పాయి 100 ఎకరాల్లో నేల కూలిపోయిందన్నారు. మునగ చెట్లు 10 ఎకరాల్లో నేల కూలాయని తెలిపారు. బొప్పాయి, మునగ తోటలకు హెక్టారుకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాలు రూపొందించామని, 16వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెపుతుండడంతో ఆ తర్వాతే సమగ్ర నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందజేస్తామని వివరించారు. వ్యవసాయ మార్కెట్లలో తడిసిన పంటలను కూడా గుర్తించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించినా.. మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ దిశగా వివరాలను, తడిసిన పంట నష్టాలను గుర్తించటం లేదు. కాగా, కల్లాల్లో తడిసిన మిర్చి నష్ట పరిహారంలోకి రాదని అధికారులు చెబుతుండడం గమనార్హం. భారీ నష్టం వాటిల్లినా.. అంత లేదంటున్న అధికారులు.. జిల్లాలో కోట్ల రూపాయల విలువైన పంటలు అకాల వర్షాలకు, ఈదురు గాలులకు నష్టపోయినా ప్రభుత్వ శాఖలు మాత్రం అంత నష్టం జరగలేదని చెపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం జరిగినా.. కేవలం 10 మండలాల్లోనే నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. భద్రాచ లం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం డివిజన్లలోని అన్ని మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. అశ్వారావుపేట, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, చండ్రుగొండ తదితర మండలాల్లో ఉద్యానవన పంటలైన అరటి, మామిడి, బొప్పాయి, మునగ పంటలకు నష్టం వాటిల్లగా అంతగా నష్టం లేదని, చెట్లు కూలిపోతేనే నష్ట పరిహారం వర్తిస్తుందని అధికారులు చెపుతుండడం గమనార్హం. అయితే ప్రాథమిక అంచనాల కన్నా పంట నష్టం ఇంకా తక్కువగానే ఉంటుందని, అధికార బృందాలు సమగ్రంగా నివే దికలు రూపొందించి రెండు రోజుల్లో సమర్పించనున్నాయని వారు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. -
అకాల వర్షాలకు రైతులు 'మునిగి'పోవాలా..?
-
రోడ్డెక్కిన అన్నదాతలు
వీణవంక/రామడుగు/మానకొండూర్/కోరుట్ల, న్యూస్‌లైన్ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ శనివారం జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వీణవంక మండలం చల్లూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు వీణవంక-కరీంనగర్ రహదారిపై ధర్నా చేశారు. తహశీల్దార్ బావ్‌సింగ్ ఫోన్లో రైతులతో మాట్లాడి కొనుగోళ్లు చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రామడుగు మండలం వెదిరలోని ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కరీంనగర్-జగిత్యాల రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి మల్యాల ప్రతాప్ రైతులకు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనను కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు ఫోన్లో వివరించారు. స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించడంతో రైతులు ఆందోళన విరమించారు. అకాల వర్షాలకు నీటిపాలైన వరితో పాటు తడిసిన విత్తన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని మానకొండూర్ మండలం చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామాల రైతులు గట్టుదుద్దెనపల్లిలోని సీడ్ గోదాం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందించిన సీడ్ అధికారులు రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. అకాల వర్షాలకు తడిచిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరుట్ల మండలం యెఖీన్‌పూర్ రైతులు కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. -
అకాల వర్షాలతో నష్టం రూ 99 లక్షలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: అకాల వర్షాలు అన్నదాతను ఆవేదనకు గురి చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలోని చాలా చోట్ల ఇప్పటికే వరి కోతలు పూర్తి అయ్యాయి. కళ్లాల లో ధాన్యం కుప్పలుగా పోసి ఉంది. కొ నుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి కూడా రక్షణ లేకుండా పోయింది. అకాల వర్షాలతో వేలాది బస్తాల ధాన్యం తడిసి ముద్దగా మారింది. వందలాది ఎకరాలలో పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 289 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతులు కళ్లాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న తరు ణంలోనే వర్షం కురియడం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. జిల్లాలో 60 వేల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీని నష్టం రూ. 80.70 లక్షల వరకు ఉంటుందని అంచనా. వడ్ల గింజలు రాలిపోయి పొ లంలోనే మొలకెత్తుతున్నాయి. ఇప్పటికే 183 హెక్టార్లలో వరి పంట నీటి పాలైంది. దీని నష్టం రూ. 18.30 లక్షలుగా ఉంటుందని వ్యవసాయశాఖ ధికారులు పే ర్కొంటున్నారు. నష్టం విలువ రూ.99 లక్షల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు. నివేదికను అతి త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, మార్కెట్ యార్డులలో అధికారులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతుల కళ్లముందే ధాన్యం నీళ్ల పాలైంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులకు చెందిన ఐదు వేల బస్తాలు, రైతులకు చెందిన 1100 బస్తాలు నీటి పాలయ్యాయి. రంగుమారిన ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారని వారు ఆవేదన చెందుతున్నారు. సిరికొండలో అధిక వర్షపాతం జిల్లాలోని అత్యధికంగా సిరికొండలో వర్షపాతం న మోదైంది. ఇక్కడ 12.8 మి.మీటర్ల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 7.2 మి.మీటర్లు, ఎల్లారెడ్డిలో 6.0 మి. మీ, సదాశివనగర్‌లో 5.0 మి.మీ, ధర్పల్లిలో 4.2 మి. మీ, ఆర్మూర్‌లో 3.0 మి.మీ, కామారెడ్డిలో 4.8 మి. మీ, తాడ్వాయిలో 5.0మి.మీ. వర్షపాతం నమోదైంది. -
అకాలవర్షాలకు 9 మంది మృతి
హైదరాబాద్: అకాల వర్షాలకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రకాశం జిల్లా నలుగురు, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒకరి మృతి చెందారు. 9,988 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 35, 910 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అంచనా. వరంగల్ జిల్లాలో 3, 491 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఖమ్మంలో 36 పశువులు మృతి చెందాయి. వర్షాలకు మహబూబ్‌నగర్‌లో 8 ఇళ్లు నేలకూలాయి. ఖమ్మం జిల్లా కూనవరంలో అత్యధికంగా 208 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అశ్వరావుపేటలో 186 మీ.మీటర్ల వర్షపాతం నమోదయింది. -
అకాల వర్షం
ఒంగోలు, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం పడగా...మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. అద్దంకి సమీపంలోని భవనాశి చెరువులో పడవ బోల్తాపడి రామాంజనేయులు (52) అనే జాలరి మృతి చెందాడు. నాగులుప్పాడు మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పందలపాడులో మరో మహిళ మృతిచెందింది. ఒంగోలు నగరంలో వర్షం జల్లులకు శివారు కాలనీల వాసులు, అధికారులు బెంబేలెత్తారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వర్షానికి చలిగాలులు తోడు కావడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. అద్దంకి ప్రాంతంలో మిర్చి, మొక్కజొన్న పంట కళ్లాల్లోనే ఉంది. తాత్కాలికంగా పట్టలు కప్పి పంటను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లో కూడా వర్షం బాగానే కురిసింది. గాలులు పెద్దగా లేకపోవడంతో మామిడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుత వర్షాలు మామిడి పంటలకు మంచిదేనని రైతులు చెబుతున్నారు. వర్షంతో పాటు గాలులు తోడైతే పూత రాలిపోయే ప్రమాదం ఉందని కొండపి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతనూతలపాడు, చీరాల, పర్చూరు, కనిగిరి నియోజకవర్గాల్లో అడపాదడపా జల్లులు తప్ప పెద్ద వర్షం కురిసింది లేదు. మార్కాపురం, యర్రగొండపాలేల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడ తుప్పర్లు కూడా పడలేదు. దర్శి, గిద్దలూరు ప్రాంతాల్లో జల్లులు పడ్డా యి. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో పాటు బల మైన వేడి గాలులు వీచే అవకాశం ఉం దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. -
వెంటాడిన వాన
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట అమ్ముకునే వేళ అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన అకాల వర్షం రైతులను నష్టాలకు గురిచేశాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి వచ్చిన ధాన్యం తడిసిపోయింది. అలాగే కోతకు వచ్చిన వరి పంట నేలకొరగగా వడ్లు నేలరాలాయి. కోతకోసిన వరి కుప్పలు పంటపొలాల్లోనే తడిచి ముద్దయ్యాయి. ఆర్మూరు ప్రాంతంలో కల్లాలలో ఉడికించి ఆరబెట్టిన పసుపు వర్షంలో తడిసి పోవడంతో రంగు మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సజ్జ పంట కోత అనంతరం నూర్పిడి చేసేందుకు ఆరబెట్టగా వర్షంలో తడిసిపోయింది. చాలా ప్రాంతాల్లో మామిడికాయ లు నేలరాలిపోయాయి. విక్రయానికి తెచ్చి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలలో రైతులు వరిని పండించారు. కోతల అనంతరం ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తరలించారు. మరికొన్ని చోట్ల వరికోతలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అకాల వర్షం అన్నదాతలను కష్టాలకు గురిచేసింది. జిల్లాలో 289 ధాన్యం కేంద్రాలలో కొనుగోళ్లు జరుగుతున్నా యి. ఈ కేంద్రాలలో సుమారు ఎనిమిది వేల బస్తాలు వరకు ధాన్యం నీటిపాలైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల గన్నీ బ్యాగుల కొరత, బీట్లు వేయడంలో ఆలస్యంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ యార్డులలో విక్రయానికి ఉంచిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యింది. మార్కెట్‌యార్డుల్లో తడిసిన ధాన్యం జిల్లాలో అన్ని మార్కెట్యార్డ్ల్లో వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. వారం రోజులుగా రైతులు ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని విక్రయానికి యార్డులకు తెస్తున్నారు. అకాల వర్షానికి ఆ ధాన్యం నీటిపాలైంది. ఒక్క నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే రైతులకు చెంది న 600 బస్తాలు, వ్యాపారులకు సంబంధించి ఆరు వే ల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని దాచేం దుకు సౌకర్యాలు లేకపోవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. కనీసం కప్పేందుకు తాటిపత్రులు లేక రైతుల పడే పాట్లు అంతా ఇంత కాదు. తెలంగాణ లోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఉన్న ఇందూరు లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మోర్తాడ్‌లో అధిక వర్షం కలెక్టరేట్ : జిల్లాలో బుధ, గురు, శుక్రవారాలలో కురిసిన అకాలం వర్షం వేలాది ఎకరాలలో పంటలను నీటి పాలు చేసింది. గురువారం జిల్లాలో 15.02 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మోర్తాడ్ మండలంలో 65.0 మి.మీ, మద్నూరులో 52.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కమ్మర్పల్లి, భీంగల్, మాక్లూర్ నిజామాబాద్‌లో 30 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భిక్కనూరు, దోమకొండ మండలాలలో అసలు వర్షమే కురియలేదు. -
ముంచిన వర్షం
వరంగల్, న్యూస్‌లైన్ : నోటికాడికొచ్చిన ధాన్యం నీటిపాలైంది. చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశారుు. వరుస వానలు వారిని నట్టేట ముంచారుు. అల్పపీడన ద్రోణితో జిల్లాలో శుక్రవారం కురిసిన అకాలవర్షంతో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి తోటలతో పాటు కూరగాయాల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులకు అమ్మకానికి రైతులు తెచ్చిన 25 వేల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కొత్తగూడ మండలంలో ఆకస్మికంగా వచ్చిన సుడిగాలికి రామన్నగూడెం, లడాయిగడ్డ, ముస్మి, ముస్మీతండా గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది. 43 రేకుల ఇళ్లు, పూరిళ్ల కప్పులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 11 వేల హెక్టార్ల పరిధి లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణలో ఉన్నందున పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయలేకపోయారు. చేలల్లోనే నేలరాలిన పంటలు చేతికొచ్చిన పంటలు చేలల్లోనే నాశనమయ్యాయి. 11 వేల హెక్టార్ల పరిధిలో వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్‌పర్తిలో నాలు గు వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతింది. పరకాల సెగ్మంట్లోని పరకాల, గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న గొర్రెకుంట, స్తంభంపల్లి, ధర్మారం, పోతరాజుపల్లి ప్రాంతాల్లో ఆకాల వర్షంతో వెరుు్య ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ములుగు నియోజకవర్గ పరిధిలోని గోవిందరావుపేట, వెంకటాపూర్, మం గపేట, కొత్తగూడ మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నర్సం పేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి మండలాల్లో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యూరుు. సుమారు 4,500 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. జనగామ నియోజకవర్గం లోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట ప్రాం తంలో 2,500 ఎకరాల్లో ధాన్యం కోతకు రాగా... మొదళ్లు తడిసి గింజలు రాలిపోయా యి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో 4,300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి, మరిపెడ, నర్సింహులపేటలో 800 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్‌గఢ్, ధర్మసాగర్, రఘునాథపల్లి, లింగాలఘన్‌పూర్‌లో 500 ఎకరాల విస్తీర్ణంలో పంట లు దెబ్బతిన్నాయి. రెండు వేల హెక్టార్లలో కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. టార్పాలిన్ లేక తల్లడిల్లిన రైతులు తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, చెన్నారావుపేట, దుగ్గొండి, బచ్చన్నపేట, జనగామ, మహబూబాబాద్, కురవి, కేసముద్రం, నెల్లికుదురు, నర్సింహులపేట, నల్లబెల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక 10వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. నర్సంపేట, జనగామ, పరకాల, వరంగల్, కేసముద్రం, మార్కెట్లలో 15వేల బస్తాల ధాన్యం, మిర్చి నీటిపాలైంది. పరకాల మార్కెట్లో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్ కోసం కొనుగోలు చేస్తామని జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ కరుణాకర్‌రావు తెలిపారు. -
వర్షార్పణం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : చెడగొట్టు వానతో చేతికొచ్చిన పంట చేజారింది. అకాల వర్షాలు రైతన్నకు గుండెకోత మిగిల్చాయి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. రైతులకు సుమారు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆకాశంలో ఇప్పటికీ మబ్బులు ఆవరించి ఉండడంతో కర్షకునికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తం గా సుమారు 3 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లోని 5 వేల క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, ధాన్యం రవాణాలో నిర్లక్ష్యం వెరసీ రైతులు శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 14.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జన్నారంలో 70 మి.మీ., ఆసిఫాబాద్‌లో 44 మి. మీ., ఖానాపూర్‌లో 43 మి.మీ., కడెంలో 38 మి.మీ., సిర్పూర్-యులో 46 మి.మీ. వర్షపాతం కురిసింది. నేలకొరిగిన పైరు.. తడిసిన ధాన్యం.. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్, మేదరిపేట్, నాగసముద్రం, చింతపెల్లిలో 19 ఐకేపీ, సహకార కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చారు. తూకం వేసినవి, విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలపై కప్పేందుకు సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో బస్తాలు తడిసిపోయాయి. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం కారణంగా బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచడంతో తడిసి ముద్దయ్యాయి. సుమారు 10 వేల బస్తాలు వర్షం కారణంతో తడిశాయి. 4 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యానికి నష్టం చేకూరింది. జన్నారం మండలం ఇందన్పల్లి, కమన్పల్లి, రేణుగూడ, తపాలాపూర్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ఉంచగా, వర్షం నీరు మడుగులుగా వచ్చి ధాన్యం కిందికి రావడంతో ధాన్యం తడిసింది. కొత్తూర్పల్లి, రేళ్లగూడ, కవ్వాల్, బాదన్పల్లిలో 50 ఎకరాల వరి పంట నేలకొరిగింది. లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్, హన్మంత్‌పల్లి, చందారం, వెంకట్రావ్‌పేటలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు, కుప్పలు వర్షం కారణంగా తడిసిపోయాయి. టార్పాలిన్లు సరిపడా లేకపోవడం, ఇక్కడ కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించలేదు. దీంతో వంద బస్తాల ధాన్యం, పలు ధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోయాయి. మంచిర్యాల మండలం ముల్కల, కర్నమామిడి, పర్దాన్పల్లిలో అకాల వర్షం కారణంగా 2వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చెన్నూర్, కోటపల్లిలో వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చెన్నూర్ మండలంలోని పొక్కూరు, హస్నాద్, కొమ్మెర గ్రామాల్లో కొనుగోల కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో 20 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. చెన్నూర్ మండలం అంగరాజ్పల్లి, కిష్టంపేట, కమ్మర్‌పల్లిలో మామిడి నేల రాలింది. ఖానాపూర్‌లో వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోయింది. నీళ్ల మడుగులు రావడంతో నష్టం చేకూరింది. దహెగాం మండలంలో 300 ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మొక్కజొన్న 30 ఎకరాలు, మిరప 30 ఎకరాల నష్టం చేకూరింది. నిర్మల్, దిలావర్పూర్, మామడ, సారంగాపూర్, కుంటాల మండలాల్లో అకాల వర్షాల కారణంగా పసుపు, వరి, మొక్కజొన్న పంట దెబ్బతిన్నాయి. ఇంద్రవెల్లిలో జొన్న పంట దెబ్బతింది. -
రైతు విలవిల
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అల్పపీడన ప్రభావంతో జిల్లా రైతాంగం విలవిల్లాడుతోంది. పక్షం రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలతో పంటలు నష్టపోగా... తాజా వర్షాలు మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. గురు, శుక్రవారాల్లో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటతో పాటు పెద్దఎత్తున మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వర్షానికి గాలి తోడవడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పూడూరు మండలంలో బైక్‌పై వెళ్తున్న యువకుడిపై విద్యుత్ స్తంభం పడిపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. భారీ వర్షం కురవడంతో శంకర్‌పల్లిలోని మూసీ, షాబాద్‌లోని ఈసీ వాగులు అలుగు దాటి రోడ్డెక్కి ఉధృతంగా ప్రవహించాయి. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా పంట నష్టం.. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత నష్టాలపాలు చేస్తున్నాయి. గత వారం కురిసిన వర్షాలకు జిల్లాలో రెండున్నరవేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అధికంగా 1,777 హెక్టార్లలో వరి పంట పూర్తిగా పాడైంది. తాజా వర్షాలతో ఈ నష్టం మరింత పెరగనుంది. మరో 24 గంటల పాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో జరిగిన నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఉపక్రమించారు. రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు. -
నోటికాడి కూడు.. నీటిపాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/న్యూస్‌లైన్ నెట్వర్క్: మెతుకు సీమ రైతును అకాల వర్షాలు నట్టేట ముంచాయి. కాలం కలిసి రాకున్నా.. కరెంట్ సక్రమంగా లేకున్నా మొక్క ఎదిగే దశ నుంచి చెమటోడ్చి పండించిన పంట చేతికి అందే సమయంలో నీటిపాలైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంటనష్టం వాటిల్లింది. మొత్తం ఐదువేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అంచనా. వరి పంట భారీగా దెబ్బతినగా మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. సుమారు 1,500 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోం ది. దీనికితోడు ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల మామిడి పంట సైతం దెబ్బతింది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా మెదక్‌లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డిలో 3.8 వర్షపాతం నమోదైంది. రామచంద్రాపురం మండలంలో 29 మిల్లీమీటర్లు, జిన్నారం, కౌడిపల్లి మండలాల్లో 21, సదాశివపేటలో 18, పటాన్చెరులో 17, అందోలు, పుల్కల్ మండలాల్లో 16, జహీరాబాద్‌లో 15, కోహీర్, సదాశివపేట, రేగోడ్ మండలాల్లో 13, మనూరులో 11 మి.మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 10 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. అధికారుల సమాచారం ప్రకారం జిన్నారం, సిద్దిపేట, మిరుదొడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్, కొల్చారం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అలాగే సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో 70 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. మిగతా నియోజకవర్గాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, మొక్కజొన్నతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. అలాగే అత్యధిక వర్షపాతం నమోదైన మెదక్‌లో సుమారు 350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా మెదక్ మండలంలో వరిపంట దెబ్బతింది. జహీరాబాద్ నియోజకవర్గంలో 200 ఎకరాల్లో జొన్నపంట దెబ్బతింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అందోలు నియోజకవర్గంలో 300 ఎకరాల్లో వరి, జొన్న పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. గజ్వేల్ నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న పంటలు 500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అలాగే కూరగాయల సాగు ఎక్కువగా చేసే గజ్వేల్, జిన్నారం మండలాల్లో భారీగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. గజ్వేల్ ప్రాంతంలో సుమారు 800 ఎకరాల్లో టమాటా, కీర, సొర, బీరకాయ, మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిన్నారం మండలంతోపాటు ఇతర ప్రాంతాల్లో 700 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.