Agriculture Department Responded to Compensation for Crop Damage Due to Untimely Rains - Sakshi
Sakshi News home page

AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’

Published Thu, May 4 2023 4:55 PM | Last Updated on Thu, May 4 2023 5:30 PM

Agriculture Department Compensation Crop Damage Untimely Rains AP - Sakshi

సాక్షి, అమరావతి: రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం సమీక్ష నిన్న, నేడు నిర్వహించారని.. ఈ మేరకు వ్యవసాయశాఖ, సివిల్‌ సప్లై, మార్కెటింగ్‌శాఖలకు పలు సూచలను, ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఫీల్డ్‌కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదని అన్నారు వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదని.. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలు సేకరిస్తామని చెప్పారు. 

ఒక్క రైతు కూడా ఇబ్బంది ఉండదు
‘సోషల్ ఆడిట్ కోసం లిస్ట్‌ను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేస్తాం. వాతావరణశాఖ సమాచారం మేరకు 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నష్టం అంచనాలు రూపొందిస్తాం. రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకే కేంద్రాల్లో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎవరైనా సిబ్బంది స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ -155251 ఫిర్యాదు చేయొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ పూర్తిగా అండగా ఉంటుంది’ అని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.
చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స

ఏ సీజన్‌లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్‌లోనే పరిహారం: హరికిరణ్‌
మార్చి నెలలో కూడా ఇదే మాదిరి అకాల వర్షాలకు పంట నష్టం ఏర్పడిందని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్‌ తెలిపారు. వ్యవసాయ పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయని, ఉద్యానపంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. మార్చి నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 34కోట్ల 22లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఏ సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్‌లోనే పరిహారం అందిస్తున్నామన్నారు. 

నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తాం
ప్రస్తుత వర్షాలకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, వర్షాలు తగ్గిన తర్వాత నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తామని చెప్పారు. 2023 ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మార్చి నెల , ప్రస్తుత వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. 
చదవండి: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

రూ.7208 కోట్లను రైతుల ఖాతాల్లో జమ: అరుణ్‌కుమార్‌
మార్చి 31తో ఖరీఫ్ ప్రొక్యూర్‌మెంట్‌ ముగిసిందని, 6లక్షల 45వేల మంది రైతుల నుంచి 35లక్షల 41వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రూ.7208 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేశామని, ఎన్.పీసీతో ఉన్న సమస్య కారణంగా 25 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రబీ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ 55576 మంది రైతుల నుంచి 5లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.  43427 రైతుల ఖాతాల్లో 803కోట్ల నిధులను జమచేశామని చెప్పారు.

‘ధాన్యం కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం. ఏ ఒక్క రైతూ మద్దతు ధర కోల్పోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పడింది. గత సీజన్‌లో బాయిల్డ్ వెరైటీకి (జయ) రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాగు చేశారు. 

కేంద్రప్రభుత్వంతో మాట్లాడి జయ వెరైటీని కొనుగోలు చేసేందుకు లక్ష్యం సిద్ధం చేసుకున్నాం. అవసరం మేరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశాం. రైతులు అపోహలను నమ్మొద్దు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరుతున్నాం. మిల్లర్లపై కూడా కొన్ని చోట్ల మాకు ఫిర్యాదులొచ్చాయి. మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు

 రైతులు అపోహలను నమ్మొద్దు: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్
రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్‌కు 472 ఫిర్యాదులొచ్చాయి. 472 ఫిర్యాదులను పరిష్కరించాం. 20 లక్షల గన్నీ బ్యాగ్ లను సేకరించి గోదావరి జిల్లాలకు పంపించాం. 
ఈ సీజన్ లో 39 మిల్లులు , 25 మంది అధికారుల పై చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ సీజన్ లో మాదిరిగానే రబీ సీజన్ లోనూ ధాన్యం సేకరిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement