Untimely rains Crop damage
-
AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’
సాక్షి, అమరావతి: రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం సమీక్ష నిన్న, నేడు నిర్వహించారని.. ఈ మేరకు వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్‌శాఖలకు పలు సూచలను, ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఫీల్డ్‌కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదని అన్నారు వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదని.. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలు సేకరిస్తామని చెప్పారు. ఒక్క రైతు కూడా ఇబ్బంది ఉండదు ‘సోషల్ ఆడిట్ కోసం లిస్ట్‌ను ఆర్బీకేల్లో డిస్ప్లే చేస్తాం. వాతావరణశాఖ సమాచారం మేరకు 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నష్టం అంచనాలు రూపొందిస్తాం. రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకే కేంద్రాల్లో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎవరైనా సిబ్బంది స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ -155251 ఫిర్యాదు చేయొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ పూర్తిగా అండగా ఉంటుంది’ అని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం: హరికిరణ్ మార్చి నెలలో కూడా ఇదే మాదిరి అకాల వర్షాలకు పంట నష్టం ఏర్పడిందని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వ్యవసాయ పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయని, ఉద్యానపంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. మార్చి నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 34కోట్ల 22లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఏ సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్నామన్నారు. నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తాం ప్రస్తుత వర్షాలకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, వర్షాలు తగ్గిన తర్వాత నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తామని చెప్పారు. 2023 ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మార్చి నెల , ప్రస్తుత వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం రూ.7208 కోట్లను రైతుల ఖాతాల్లో జమ: అరుణ్‌కుమార్ మార్చి 31తో ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ముగిసిందని, 6లక్షల 45వేల మంది రైతుల నుంచి 35లక్షల 41వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రూ.7208 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేశామని, ఎన్.పీసీతో ఉన్న సమస్య కారణంగా 25 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రబీ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ 55576 మంది రైతుల నుంచి 5లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 43427 రైతుల ఖాతాల్లో 803కోట్ల నిధులను జమచేశామని చెప్పారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం. ఏ ఒక్క రైతూ మద్దతు ధర కోల్పోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పడింది. గత సీజన్లో బాయిల్డ్ వెరైటీకి (జయ) రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాగు చేశారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి జయ వెరైటీని కొనుగోలు చేసేందుకు లక్ష్యం సిద్ధం చేసుకున్నాం. అవసరం మేరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశాం. రైతులు అపోహలను నమ్మొద్దు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరుతున్నాం. మిల్లర్లపై కూడా కొన్ని చోట్ల మాకు ఫిర్యాదులొచ్చాయి. మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు రైతులు అపోహలను నమ్మొద్దు: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్ రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్‌కు 472 ఫిర్యాదులొచ్చాయి. 472 ఫిర్యాదులను పరిష్కరించాం. 20 లక్షల గన్నీ బ్యాగ్ లను సేకరించి గోదావరి జిల్లాలకు పంపించాం. ఈ సీజన్ లో 39 మిల్లులు , 25 మంది అధికారుల పై చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ సీజన్ లో మాదిరిగానే రబీ సీజన్ లోనూ ధాన్యం సేకరిస్తాం. -
పంట నష్టంపై ఉన్నతస్థాయి బృందం
కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కు ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి న్యూఢిల్లీ: అకాల వర్షాలు, వడగండ్లతో తెలంగాణలో అపారపంట నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను ఆదుకోడానికి కేంద్రం సత్వరమే సహా యం చేయాలని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. నష్టం అంచనావేయడానికి ఉన్నతస్థాయి బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు. సోమవారం ఆయన కేంద్రమంత్రిని కలిసి తెలంగాణలోని అకాలవర్షాల పరిస్థితులు, పంటనష్టం వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. తెలంగాణ వ్యవసాయ విభాగం ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రంలో కనీసం 35,175 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 40,131 హెక్టార్ల వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం కలిగిందని మంత్రికి వివరించారు. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 30 వేల హెక్టార్ల పంట దెబ్బతిందన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.100 కోట్లు నష్టం జరిగినట్టు మంత్రికి వివరించారు. అకాల వర్షాల ప్రభావం పౌ ల్ట్రీ రైతులపై కూడా పడిందన్నారు. భారీ వర్షాలకు జగిత్యాలతో 50వేల కోళ్లు మృత్యువాతపడ్డాయన్నారు. రైతులు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ధాన్యం, ఇతర పంటల దిగుబడి లేక ఆహార సంక్షోభంతో రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. -
1.92 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ర్టవ్యాప్తంగా అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం నివేదికను కేంద్రానికి పంపేందుకు కసరత్తు నెల రోజుల్లో పరిహారం చెల్లించే అవకాశం వరికి ఎకరానికి రూ. 5,400, మొక్కజొన్నకు రూ. 4 వేలు అల్పపీడనం ఏర్పడితే మరో వారం రోజులు వర్షాలే నేడు రాష్ర్టవ్యాప్తంగా వడగళ్ల వానలు పడే అవకాశం హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల వానలతో రాష్ర్టంలో పంట నష్టం రోజురోజుకూ పెరుగుతోంది. అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గురువారం నాటికి దాదాపు 1.92 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కగట్టారు. రాష్ర్టవ్యాప్తంగా 116 మండలాల్లోని 889 గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగినట్లు తేల్చారు. 1.07 లక్షల ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, జొన్న పంటలు నాశనమయ్యాయి. అలాగే 84 వేల ఎకరాల్లో మామిడి, బొప్పాయి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ, రెవెన్యూ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. వారం రోజుల్లో నివేదిక రూపొందించి కేంద్ర సాయం కోరతామని ఉన్నతాధికారులు చెప్పారు. వరి, మామిడికే అధిక నష్టం.. వరి పంట, మామిడి తోటలకే తీవ్రంగా నష్టం జరిగింది. 72,873 ఎకరాల్లో వరి, 70,236 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 33 శాతం పంట నష్టపోయినా పూర్తి పరిహారం ఇవ్వాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో రైతులు అందుకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరికి ఎకరానికి రూ. 5,400 నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు దానికి మరికొంత క లిపి రూ. 6 వేల వరకు ఇస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ పరిహారాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, నువ్వులకు కేంద్రం నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున పరిహారం వస్తుంది. రాష్ర్టంలో పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన తర్వాత నెల రోజుల్లో రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బీమా సంస్థల తోనూ వ్యవసాయ శాఖ అధికారులు గురువారం సమావేశమై ఎంతమందికి పంటల బీమా అందుతోందో అంచనా వేశారు. ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు ఇంకా వర్ష భయమే... ఇంకా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం రాష్ట్రంలో అనేకచోట్ల వడగళ్లు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అంతేగాక పశ్చిమతీర ప్రాంతం నుంచి తూర్పుతీర ప్రాంతం వైపునకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఈ నెల 23 వరకు రాష్ట్రంలో సాధారణం నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో వరంగల్ జిల్లా గోవిందరావుపేటలో 6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే మోమిపేటలో 4, కొల్లాపూర్‌లో 3, మెట్పల్లి, ఎదపల్లి, ముథోల్‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.