Gopala krishna
-
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: చెల్లుబోయిన వేణు ఫైర్
-
ఇది మహేష్ బాబు సినిమా నా ? పరుచూరి సంచలన కామెంట్స్
-
Paytm పతనానికి కారణాలు..! యూజర్లపై ఎఫెక్ట్స్..?
-
షర్మిల వ్యాఖ్యలపై చెల్లుబోయిన సెటైర్లు
-
AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’
సాక్షి, అమరావతి: రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం సమీక్ష నిన్న, నేడు నిర్వహించారని.. ఈ మేరకు వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్‌శాఖలకు పలు సూచలను, ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఫీల్డ్‌కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదని అన్నారు వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదని.. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలు సేకరిస్తామని చెప్పారు. ఒక్క రైతు కూడా ఇబ్బంది ఉండదు ‘సోషల్ ఆడిట్ కోసం లిస్ట్‌ను ఆర్బీకేల్లో డిస్ప్లే చేస్తాం. వాతావరణశాఖ సమాచారం మేరకు 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నష్టం అంచనాలు రూపొందిస్తాం. రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకే కేంద్రాల్లో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎవరైనా సిబ్బంది స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ -155251 ఫిర్యాదు చేయొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ పూర్తిగా అండగా ఉంటుంది’ అని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం: హరికిరణ్ మార్చి నెలలో కూడా ఇదే మాదిరి అకాల వర్షాలకు పంట నష్టం ఏర్పడిందని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వ్యవసాయ పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయని, ఉద్యానపంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. మార్చి నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 34కోట్ల 22లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఏ సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్నామన్నారు. నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తాం ప్రస్తుత వర్షాలకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, వర్షాలు తగ్గిన తర్వాత నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తామని చెప్పారు. 2023 ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మార్చి నెల , ప్రస్తుత వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం రూ.7208 కోట్లను రైతుల ఖాతాల్లో జమ: అరుణ్‌కుమార్ మార్చి 31తో ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ముగిసిందని, 6లక్షల 45వేల మంది రైతుల నుంచి 35లక్షల 41వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రూ.7208 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేశామని, ఎన్.పీసీతో ఉన్న సమస్య కారణంగా 25 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రబీ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ 55576 మంది రైతుల నుంచి 5లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 43427 రైతుల ఖాతాల్లో 803కోట్ల నిధులను జమచేశామని చెప్పారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం. ఏ ఒక్క రైతూ మద్దతు ధర కోల్పోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పడింది. గత సీజన్లో బాయిల్డ్ వెరైటీకి (జయ) రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాగు చేశారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి జయ వెరైటీని కొనుగోలు చేసేందుకు లక్ష్యం సిద్ధం చేసుకున్నాం. అవసరం మేరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశాం. రైతులు అపోహలను నమ్మొద్దు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరుతున్నాం. మిల్లర్లపై కూడా కొన్ని చోట్ల మాకు ఫిర్యాదులొచ్చాయి. మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు రైతులు అపోహలను నమ్మొద్దు: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్ రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్‌కు 472 ఫిర్యాదులొచ్చాయి. 472 ఫిర్యాదులను పరిష్కరించాం. 20 లక్షల గన్నీ బ్యాగ్ లను సేకరించి గోదావరి జిల్లాలకు పంపించాం. ఈ సీజన్ లో 39 మిల్లులు , 25 మంది అధికారుల పై చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ సీజన్ లో మాదిరిగానే రబీ సీజన్ లోనూ ధాన్యం సేకరిస్తాం. -
ప్రపంచ సాహిత్యంలో అరుదైన ప్రక్రియ తెలుగు పద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలోనూ లేని అరుదైన ప్రక్రియ పద్యమని.. తెలుగు వారి సొత్తైన ఈ ప్రక్రియ కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుంక్తాధ్వర్యంలో సిటీ కళాశాలలో జరిగిన మహోన్నతం మన పద్యం విద్యార్థి పద్యగాన సభలో అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రాచీన పద్యాలలో ఉన్న మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటిని నేటితరం విద్యార్థులకు అందించడం, అలాగే పద్య పఠనం ద్వారా వారిలో ఏకాగ్రత, ధారణశక్తి, జ్ఞాపకశక్తి వంటిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పౌరాణిక నాటక పద్యాలలో గొప్ప జీవన విలువలున్నాయి. పౌరాణిక నాటకాల ప్రదర్శనతో తెలుగు పద్యానికి విస్తృతి పెరిగిందని రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ పాండవీయం తదితర పద్య నాటకాలు తెలుగు ప్రజానీకానికి గొప్ప సంస్కృతి సంతృప్తిని కలిగించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాల భాస్కర్ మాట్లాడుతూ... సిటీ కళాశాల విద్యార్థులలో చైతన్యం కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఘట్టి బాల చైతన్యం, పద్య పరిమళం వంటి సంస్థలలో శిక్షణ పొందిన 25 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల చిన్నారులు ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు, శతకాలలోని పద్యాలను రాగయుక్తంగా, భావ గర్భితంగా ఆలపించి ఆధ్యాపకులను, సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. (క్లిక్ చేయండి: తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు) -
మరచిపోలేని మహనీయుడు
మద్రాసులో బడిలో చదువు కొంటున్న రోజులలో ఘంటసాల గారి ఇంటిముందునుంచి వెడుతూ – ఆ వాకిలి ముందు ఆగి అక్కడ ఉన్న ఆయన పేరు చదివి సంతోషిస్తూ ఉండేవాడిని. యాభై అయిదేళ్ల కిందట ఒక వేసవి మధ్యాహ్నం ఆయనను ఎట్లాగైనా చూసి మాట్లాడాలని ఆయన ఇంటికి వెళ్ళాను. ఎండవేళ వచ్చినందుకు బాధ పడి మజ్జిగ తెచ్చి ఇచ్చి నన్ను తాగమన్నారు. నా గురించీ, నా చదువు సంధ్యల గురించి అడిగారు. ఆయన అంటే నాకు చాలా అభిమానమనీ, ఆయన జీవిత చరిత్ర రాయాలని ఉందనీ చెబితే నవ్వి– ‘ముందు బాగా చదువుకో నాయనా! తర్వాత చూద్దాం’ అన్నారు. 1969 నుంచి ఆయనను నేను తరుచుగా కలుసు కొంటూ ఉండేవాడిని. ఎంత పనితొందరలో ఉన్నా కాసేపయినా నాతో మాట్లాడేవారు. ఆ అభిమానంతో – ఆయన విదేశీ యాత్రల వేళ– విదేశాలలో పాడడానికి ఎన్నుకొన్న పాటలను నాకు వినిపించేవారు. ఆ సందర్భాలలో – నేను ఒక్కడినే శ్రోత కావడం నా భాగ్యం. ఆయన విదేశీ యాత్రలకు బయలుదేరేముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో – నేను ఆయన గురించి తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో నా చిన్న తనపు మిడిమిడి జ్ఞానంతో రాసిన కవితలు వినిపించాను. ఆయన వాటి ప్రతులు తీయించి పత్రికల వారికి పంపడం ఒక గొప్ప అనుభవం. విదేశీయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆ విశేషాలు పత్రికల వారితో ముచ్చ టించడానికి ఒక సాయంకాలం విందు ఏర్పాటు చేశారు. దానికి నన్నూ రమ్మన్నారు. ఆ గోష్ఠిలో ఇమడలేనేమో అని నేను ఆ విందుకు వెళ్లలేదు. ఆ కార్యక్రమం అయిన కొన్నాళ్ల తర్వాత ఒక సాయంకాలం నేను ఆయనను చూడడానికి వెళ్లాను. రికార్డింగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఘంటసాల నన్ను చూసి ‘ఏం బాబూ! ఆరోజు పార్టీకి రాలేదు?’ అన్నారు. నేను సమాధానం చెప్పడానికి తట పటాయిస్తుంటే ‘నీకు ఇప్పుడే ఇక్కడే పార్టీ ఇస్తున్నాను నా పక్కన కూర్చో... రా...’’ అన్నారు. భార్య సావిత్రమ్మ గారికి ఆ సంగతి చెప్పారు. వేడి వేడి ఇడ్లీలు, లడ్లు, కాఫీలతో సాగిన ఆ ప్రత్యేకమైన విందు నేను ఏనాటికీ మరచిపోలేనిది. అది ఆయన నా మీద చూపిన వాత్సల్యానికి గుర్తు. ఆయన నాతో చాలా విషయాలు మాట్లాడేవారు. ఒకసారి చదువు గురించిన ప్రస్తావన వస్తే – చదువు కొంటున్న రోజులలో చదువు మీద దృష్టి ఉంచాలనీ, వయసు చిన్నదిగా ఉన్నపుడే చదవగలిగినంత చదువులు చదవాలనీ చెప్పారు. ఆయన పాటలు వినిపించడానికి తమ దగ్గరికి వచ్చే యువతీయువకులకు – సంగీతంతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేవారు. ఆయన వాక్శుద్ధి అద్వితీయం. ఒక వర్ధమాన సినిమా రచయిత, పెద్ద దర్శకులు కాగలరని ఘంటసాల గారు చెప్పారు. ఆ తరువాత దర్శకులు కూడా అయిన ఆ రచయితే దాసరి నారాయణ రావుగారు! చిత్తూరులో ఒక బాలుణ్ణి చూసి – ‘బాగా చదువుకో బాబూ! పెద్ద పెరిగాక ఏం కావాలనుకుంటున్నావు?’ అని అడిగితే ఆ బాలుడు తనకు గాయకుడు కావాలని ఉందన్నాడు. ‘కాదు బాబూ! నీవు బాగా చదువుకొని కలెక్టర్ కావాలి’ అన్నారు ఘంటసాల గారు. ఆ బాలుడు ఉత్తరోత్తర కలెక్టర్ అయ్యారు. కలెక్టర్ అయిన ఆ బాలుడి పేరు – కె. చంద్రమౌళి. నాకు మంచి ఉద్యోగం దొరికి నేను పెద్ద అధికారి కాగలననీ ఆయన దీవించారు. ఆ దీవెన ఫలించింది. నేపథ్య గాయకులలో ‘మీ తర్వాత ఎవరు?’ అని అడిగితే ‘ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం’ అన్నారు ఆ ఘంట సాల. ఆ మాటా నిజం అయింది. ఆయన జీవిత చరిత్ర రాయడానికి నాకు అనుమతి ఇవ్వడం, నన్ను ఆశీర్వదించడం నాకు దొరికిన గొప్ప అదృష్టం. భాగ్యం. అర్ధంతరంగా అస్తమించిన ఆ అమృత మూర్తి అంతిమ యాత్రవేళ ఆయన భౌతిక కాయాన్ని నేను కూడా మోశాను. ఆ బాధ మాటలలో చెప్పలేనిది. తమ సంగీతం ద్వారా ఇంకా జీవించి ఉన్న ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. వ్యాసకర్త ఆకాశవాణి పూర్వసంచాలకులు,ఘంటసాల జీవిత చరిత్ర ‘మన ఘంటసాల’ రచయిత డాక్టర్ పి. ఎస్. గోపాలకృష్ణ -
Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే బిక్కిన మృతి
సాక్షి, రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిక్కిన గోపాలకృష్ణారావు (83) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం తాటిపాకలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజోలు నుంచి అప్పటి దేవదాయ శాఖ మంత్రి రామలింగరాజుపై పోటీ చేసి గోపాలకృష్ణారావు గెలుపొందారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదివిన ఆయన తాటిపాక గ్రామంలోనే ఉంటూ వ్యవసాయంపై ఆసక్తి చూపుతూ పలు పంటలు పండించేవారు. 1950వ దశకంలో తాటిపాక సర్పంచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గోపాలకృష్ణారావు మృతి పట్ల రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, మానేపల్లి అయ్యాజీ వేమా, పాముల రాజేశ్వరీదేవి సంతాపం వ్యక్తం చేశారు. -
సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?
కాకినాడ సిటీ/నవాబుపేట (పెనుగంచిప్రోలు): సర్పవరం ఎస్సై ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య సంఘటన జిల్లాలో శుక్రవారం తీవ్ర సంచలనం కలిగించింది. మృదుస్వభావిగా పోలీసు శాఖలో ముద్ర వేసుకున్న ఆయన తన సర్వీసు పిస్టల్‌తో కాల్చుకుని విషాదకర రీతిలో జీవితానికి ముగింపు పలకడం దారుణమని సహచర ఉద్యోగులు దిగ్భ్రమ చెందారు. గోపాలకృష్ణ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. ఎంసీఏ చదివి, కొన్నాళ్లు వీఆర్వోగా పని చేసి, తరువాత ఎస్సైగా ఎంపికైన ఈయన సున్నిత మనస్కుడని అన్నారు. తన స్వభావానికి పోలీస్ ఉద్యోగం సరికాదని, ఇది మానేసి వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉండేవారని తెలిపారు. ఆ డిప్రెషన్లోనే ఉన్న ఎస్సైకి కొందరు అధికారులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేదంటూ ముభావంగానే ఉండేవారని భార్య కూడా చెప్పారని ఎస్పీ వివరించారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విలపించిన బంధువులు ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, భారతమ్మతో పాటు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తరలివచ్చారు. మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. గోపాలకృష్ణ 36 ఏళ్లకే తనువు చాలించడం దారుణమంటూ రోదించారు. ఆసుపత్రి వద్ద గోపాలకృష్ణ మృతదేహాన్ని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ వి.భీమారావు తదితరులు పరిశీలించి, దగ్గరుండి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. చదవండి: పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం కుమారుడి మృతితో రోదిస్తున్న తండ్రి శ్రీనివాసరావు నవాబుపేటలో విషాదం గోపాలకృష్ణ స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు, సరోజని దంపతుల రెండో కుమారుడు గోపాలకృష్ణ, మొదటి కుమారుడు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణకు భార్య పావని, నాలుగేళ్ల కుమార్తె భవిష్య, రెండేళ్ల కుమారుడు శర్వాన్ ఉన్నారు. ఈయన 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ మొదటి నుంచీ చదువులో ముందుండేవారు. అందరితో ఎంతో సౌమ్యంగా ఉండేవారని గ్రామస్తులు చెప్పారు. ఎస్సైగా ఉంటూనే ఉన్నత పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలకృష్ణ అంత్యక్రియలు శనివారం చేయనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
-
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మైనింగ్ ఎక్కడా జరగడం లేదు : గోపాలకృష్ణ ద్వివేది
-
వెలగపూడి గోపాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా మరో నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఈ మేరకు ఏపీ బీజేపీ ఆదివారం ఓ లేఖను విడుదల చేసింది. వెలగపూడి గోపాలకృష్ణ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సదరు లేఖలో పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. (డాక్టర్ ఓవీ రమణపై బీజేపీ సస్పెన్షన్ వేటు) -
తెలుగువారి ‘బంగారు కొండలరావు’
నివాళి నటులుగా, నాటక ప్రయో క్తగా, రచయితగా ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు వారిని రంజింప చేసిన ఆత్మీయులు రావి కొండల రావుగారు ప్రపంచ రంగ స్థలం మీదినుంచి నిష్క్ర మించారన్న వార్త ఎంతో బాధను కలిస్తున్నది. కొండలరావుగారితో యాభై ఏళ్లు పైబడిన సాన్నిహిత్యం నాది. హితులుగా వయసుతో నిమిత్తం లేకుండా స్నేహితులుగా ఆయన చెలిమి కలిమి నా అదృష్టం. నేను విద్యార్థిగా ఉంటున్న రోజుల నుంచీ ఆయ నకు నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయనను అడపా దడపా మద్రాసు వడపళనిలోని చంద మామ కార్యాలయంలో కలుసుకొంటూ ఉండే వాణ్ణి. అప్పుడు ఆయన ‘విజయచిత్ర సంపాదక వర్గం’లో పనిచేస్తూ ఉండేవారు. 1975లో ‘వనిత’ పత్రిక ప్రారంభించినపుడు ఆ సంపాదక వర్గంలో పనిచేయడానికి నన్ను ఎన్ను కొన్నారు. దాంతో కొండలరావుగారితో మిత్రులు బి.కె. ఈశ్వర్గారితోనూ కలిసి ‘వనిత’ ‘విజయ చిత్ర’ పత్రికల పనిలో నేను భాగస్వామినయ్యాను. అటు సినిమాలో నటిస్తూ ఇటు పత్రికల్లో పనిచేస్తూ ఆ రెండు పాత్రలనూ విజయవంతంగా నిర్వహిం చేవారు. ‘వనిత’ కోసం ‘బామ్మగారి పేజీ’ ఆయనే రాసేవారు. ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన రక రకాల రచనా విన్యాసాలు చేశారు. సంపాదకీ యాలు, పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు, ప్రము ఖులతో సంభాషణలు, సంగీతానికి సంబంధించిన ‘స్వరధుని’ వ్యాసాలు ఇవన్నీ ఒక పార్శ్వమయితే, నాగయ్యగారి జీవిత చరిత్ర. పాత తెలుగు చిత్రా లను వాటిని చూస్తున్న అనుభూతి కలిగించేటట్టు సాగిన సమగ్ర చిత్ర రచనలు మరొక పార్శ్వం. ‘విజయచిత్ర’లో ప్రాచుర్యం గడించిన ‘విచి’ (విజయచిత్రకు కురచ రూపం) కొండల రావుగారే! నేను ‘చందమామ’ నుంచి ‘ఆకాశవాణి’ ఉద్యోగంలో చేరినా కొండలరావుగారి కుటుంబంతో సాన్నిహిత్యం కొనసాగింది. నేను మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు నాటకాల విభా గాన్ని నిర్వహిస్తున్నప్పుడు కొండలరావుగారు, రాధాకుమారిగారు ఎన్నో నాటకాలలో పాల్గొ న్నారు. రేడియోకోసం ఎన్నో నాటకాలు రాయిం చడం కూడా మరచిపోలేని మధురానుభూతి. అట్లా ఆయన రాసి రేడియోకోసం నేను రూపొందించిన ‘ఉద్యోగమే మహాభాగ్యం’ నాటకం కథతో ఆ తర్వాత ‘పెళ్లిపుస్తకం’ చిత్రం రూపొందింది. మహానటి సూర్యకాంతంగారు నటించిన చివరి రేడియోనాటకం ‘వంటమనిషి కావలెను’ కొండలరావుగారి రచన. మహాభారత కథతో రూపొందించిన ఇంకొక రేడియో నాటకంలో ఆయన దుర్యోధనుడి పాత్ర, (ఇంకెవరూ లేక పోవడంతో) నేను శకుని పాత్ర ధరించాము. ‘అర్ధ రాత్రి’ సినిమా తర్వాత మళ్లీ ఈ నాటకంలో ప్రతి నాయకుడి (విలన్) పాత్ర ధరించే అవకాశం వచ్చింది అని చమత్కరించారు కొండలరావుగారు! మద్రాసులోనే కాక హైదరాబాదులోనూ ఆకా శవాణి నిర్వహించిన ఉగాది కార్యక్రమాలు ఎన్నిటి లోనూ పాల్గొని వాటి వన్నెనూ వాసినీ పెంచారు కొండలరావుగారు. ఎప్పుడు రంగస్థలం ఎక్కినా అదే తమ మొదటి ప్రదర్శన అన్నంత శ్రద్ధాభక్తులు చూపడం ఆయన ప్రత్యేకత! కొండలరావుగారి రాసిన ఎన్నెన్నో నాటకాలు ‘బ్లాక్ అండ్ వైట్’ పేరిట వచ్చిన వ్యాసాలు, మాయాబజార్, షావు కారు చిత్రాలకు సంబంధించిన సమగ్ర రచనలు, సినిమాలు ఎట్లా తీయాలో ఎట్లా తీయకూడదో వివరించిన ‘సినీతి చంద్రిక’ ఆయన చేతి వాసికి గొప్ప ఉదాహరణలు. చిన్న వేషాలు వేసినా వాటిని చిరస్మరణీయం చేసిన ఆయన నటనా వైదుష్యానికి ‘కథా నాయకుడు’ ‘గృహలక్ష్మి’ ‘బ్రహ్మచారి’ వంటి చిత్రాల లోని వేషాలు మచ్చుతునకలు. నాటక రచయితగా, పత్రికా రచయితగా నటులుగా, నాటక ప్రయోక్తగా ఏ పని చేసినా రావి కొండల రావుగారు మనసు పెట్టి చేశారు. ఆయన కృషి అజరం. అమరం. వ్యాసకర్త పూర్వ సంచాలకులు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పి.ఎస్. గోపాలకృష్ణ మొబైల్ : 94920 58970 -
పేరు నమోదుకు మూడు రోజులే గడువు
‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే ఆయుధం.. అలాంటి ఓటు జాబితాలో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంటుంది. ఓటరుగా నమోదులో కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత ఎంతో ప్రజలకూ అంతే బాధ్యత ఉంటుంది. ఓటు అనే ఆయుధాన్ని రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారందరూ వినియోగించుకోవాలి. పోలింగ్ రోజు అందరూ ఓటు వేయాలి. వీలైనంత ఎక్కువ శాతం పోలింగ్ అయితేనే ప్రజా తీర్పునకు సార్థకత ఉంటుంది. సాక్షి, అమరావతి :రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటు హక్కు కల్పన, ప్రవర్తనా నియమావళి అమలు, అధికారదుర్వినియోగానికి అడ్డుకట్ట, ధన ప్రభావాన్నినిరోధించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలోఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్నచర్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేదితో‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: ఓటర్లకు మీరు సలహాలు, సూచనలు ఏమిటి? ద్వివేది :ఓటర్‌గా నమోదుకు మరో మూడు రోజులే సమయం ఉంది. ఈ నెల 15వ తేదీలోగా కొత్తగా అర్హులైనవారంతా ఫాం 6తో దరఖాస్తు చేయాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నవారు కూడా జాబితాలో పేరుందో లేదో ఒకసారి చూసుకోవాలి. లేకపోతే వారు సైతం 15వ తేదీలోగా ఫాం 6తో దరఖాస్తు చేయొచ్చు. అలా దరఖాస్తు ఇచ్చినవారందరికీ కచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పోలింగ్ రోజు ఓటు లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాం. జాబితాలో పేరు లేకపోతే నేనే కాదు ఎవరూ ఏమీ చేయలేరు. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదు. ఎన్నికల సంఘం వెలువరించిన జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని ప్రజలు సానూకులంగా తీసుకోవాలి. రాష్ట్రంలో ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని 11 లక్షల మంది 18 ఏళ్లు నిండిన యువతకు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నాం. పోలింగ్ రోజు ఓటు లేదంటే నేనే కాదు ఎవరూ ఏం చేయలేరు. ఇన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాబితాను ఎందుకు చూసుకోలేదని మేం ఎదురు ప్రశ్నించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రానివ్వొద్దు. సాక్షి: ఆన్లైన్ ద్వారా, 1950 నెంబర్ ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోండి. ఆన్లైన్లో ఓటర్‌గా నమోదవండని చెబుతున్నారు. కానీ, వీటి పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి కదా? ద్వివేది :1950 నంబరుకు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 15 వేల కాల్స్ వస్తున్నాయి. అందరూ ఒకేసారి చేయడం వల్ల కొన్ని కాల్స్ వెయింటింగ్‌లో ఉంటాయి. 1950కు వచ్చే కాల్స్ అటెండ్ చేయడానికి జిల్లా స్థాయి నుంచి సిబ్బందిని పెంచాం. వెబ్‌సైట్‌ను ఎక్కువమంది వినియోగించడంతో ఒక్కోసారి ఇబ్బందులు రావొచ్చు. అంతేకాని పూర్తిగా పనిచేయడం లేదనడం సరికాదు. ఏది ఏమైనా వెబ్సైట్, 1950 నంబర్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: అధికారంలో లేని రాజకీయ పార్టీలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? ద్వివేది : అధికారంలో ఉన్న, అధికారంలో లేని రాజకీయ పార్టీలన్నిటికీ ఒకటే చెబుతున్నాం. ఎన్నికలకు ప్రధానమైనది ఓటు. అలాంటి ఓటు నమోదుకు చర్యలు తీసుకోండి. ఎన్నికల సంఘం తరఫునా ప్రచారం చేస్తున్నాం. మరో మూడు రోజులే గడువుంది. ఈ నెల 15వ తేదీలోగా ఓటు లేని వారి చేత ఫాం 6 నింపి ఇప్పించే చర్యలు చేపట్టమని అన్ని రాజకీయ పార్టీలను కోరాం. ఇక ఎన్నికల నియమావళిలో మరో ప్రధాన అంశం ప్రవర్తనా నియమావళి అమలు. దానిని పాటించడం ద్వారా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించమని కోరుతున్నాం. సాక్షి: అధికార పార్టీకి ఇచ్చే సూచన, సలహాలు ఏమైనా ఉన్నాయా? ద్వివేది :అధికార పార్టీనే కాదు... అధికారులకూ నియమావళి ఉంది. ఎవరు దుర్వినియోగానికి పాల్పడినా కఠిన చర్యలుంటాయి. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి. ఈ విషయంలో రాజీనే లేదు. ఎవరైనా పక్షపాతంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ఉన్నా మినహాయింపుల్లేకుండా చాలా తీవ్ర చర్యలుంటాయి. అధికార పార్టీ ఏం చేయకూడదో నియమావళిలో స్పష్టంగా ఉంది. దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాం. సాక్షి: సచివాలయ ప్రధాన ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వరకు ఇంకా సీఎం, మంత్రుల ఫొటోలతో హోర్డింగ్లున్నాయి, ఎందుకు తొలగించలేదు.? ద్వివేది :అలా ఉండదండి. కరకట్ట మీద ఉన్న హోర్డింగ్స్ అన్నీ తీసేస్తున్నారు. (మధ్యలో ఫోన్ అందుకుని సచివాలయం ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందో ఆరా తీశారు. వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి ప్రధాన గేటు వద్ద ఇంకా ప్రభుత్వ హోర్డింగ్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు..? వెంటనే తొలగించండి. లేదంటే మీపై చర్య తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు). సాక్షి: దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ధన ప్రభావం ఎక్కువని ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలేమైనా తీసుకుంటున్నారా? ద్వివేది :బ్యాంకుల్లో భారీగా నగదు జమ, ఉపసంహరణపై ఓ కన్నేశాం. నగదు తరలింపు ఏ మార్గాల్లో చేసినా పట్టుకునేందుకు గట్టి చర్యలు చేపడుతున్నాం. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా నిఘా పెట్టాం. చెక్ పోస్టుల దగ్గర పరిశీలన పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. మద్యం సరఫరాను నియంత్రించేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపడుతున్నాం. ఆన్లైన్ లావాదేవీలపైనా దృష్టిసారించాం. ఇప్పటివరకు రూ.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆరు కిలోల బంగారం పట్టుకున్నాం. ఎన్ఫోర్స్మెంట్ ఆశించిన స్థాయిలో లేదని గుర్తించినందుకే ఆయా శాఖల అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశాం. సాక్షి: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ద్వివేది :ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సిద్ధం చేశాం. మూడు లక్షల మంది సిబ్బంది అవసరమని గుర్తించాం. వారందరికీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని 45,920 పోలింగ్ కేంద్రాల్లో 9345 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. వీటి వద్ద కేంద్ర సాయుధ బలగాలను ఏర్పాటు చేస్తాం. పోలింగ్ కేంద్రాలన్నింటిలో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. మైక్రో పరిశీలకులను నియమిస్తాం. వెబ్ కాస్టింగ్ ద్వారా ఏ పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు నేను కూడా తెలుసుకుంటా. భద్రతకు 350 కేంద్ర సాయుధ కంపెనీల బలగాలు కోరాం. పోలింగ్ నాటికి బలగాలన్నీ వస్తాయి. ప్రస్తుతం 90 కంపెనీల బలగాలు వస్తున్నాయి. సాక్షి: ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5వ తేదీతో చెక్కులను మహిళా సంఘాలకు ఇచ్చింది. అంటే, పోలింగ్‌కు ఆరు రోజుల ముందు ఆ డబ్బు వారి ఖాతాల్లో పడుతుంది. ఇది ఎన్నికల ప్రక్రియను, ఓటర్లను ప్రభావితం చేసినట్లు కాదా? దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? ద్వివేది :దీంతోపాటు రైతుల ఖాతాలకు నగదు బదిలీలపైరాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాం. వారి వివరణనుకేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాం. కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తాం. సాక్షి: ఓటర్ల జాబితా డేటా చోరీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బృందాలను పంపిందన్నారు. చర్యలేమైనా ఉన్నాయా? ద్వివేది :: కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని నివేదిక కోరింది. పంపించాం. అందుకు సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలనేది వారే చూసుకుంటారు. ఇప్పటివరకైతే వారినుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో ప్రతి ఒక్కరు చూసుకోండి. లేకపోతే వెంటనే అంటే మూడు రోజుల్లోగా ఫాం 6 నింపి ఇవ్వండి అని చివరగా మరీమరీ చెబుతున్నా.ఎన్నికల సందర్భంగా దేశంలోధన ప్రభావం తీవ్రంగా ఉండేరాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.దీనిని నిరోధించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం, అయినా అది సరిపోదని భావించి ఎన్ఫోర్స్మెంట్ను ఇంకా పెంచాల్సిందిగా ఆదాయ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులను ఆదేశించాం. ప్రత్యేక నిఘాలో భాగంగా ఆన్లైన్ లావాదేవీలపైనాదృష్టి సారించాం. – గోపాలకృష్ణ ద్వివేది సాక్షి: ఫాం 7పై అధికార, ప్రతిపక్ష పార్టీలఆరోపణలు, ప్రత్యారోపణలపై ఏమంటారు? ద్వివేది :ఏ పార్టీ అయినా లేదా ఏ వ్యక్తులైనాఫాం 7 వాస్తవ సమాచారంతో ఇస్తే తప్పులేదు. అవాస్తవ సమాచారంతో ఇస్తేనే నేరమవుతుంది. ఒక వ్యక్తి జీవించి ఉండగానే అతడు మరణించినట్లు, అతడి ఓటు తొలగించమనిఫాం 7 ఇవ్వడం నేరమే కాదు. అమానుషం. అయినా ఎవరి ఓట్లను అకారణంగా తీసేయలేదు. ఫాం 7 దరఖాస్తులపై క్షేత్ర స్థాయితనిఖీల తర్వాత వాస్తమైతేనే తొలగించాం. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కేవలం ఓటరు నమోదుకు మాత్రమే అది కూడాఈ నెల 15వ తేదీ వరకే అనుమతి ఉంది.కొత్తగా 13 లక్షల ఓట్లు నమోదయ్యాయి. -
ఓట్ల తొలగింపుపై ఈసీ ఆగ్రహం
-
ట్యాబ్‌లతో వస్తున్నారు.. ఓట్లు తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్సార్సీసీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అందుకు పోలీసులు, బూత్‌లెవెల్ అధికారులు సహకరిస్తున్నారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 22,500కుపైగా ఓట్లను తొలగించాలని, 22,000 దొంగ ఓట్లను చేర్పించేలా దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేల పేరుతో టీడీపీ వాళ్లు ట్యాబ్‌లు తీసుకుని పల్లెల్లోకి వస్తున్నారని, ఒక్కొక్కరు రోజుకు 30 మందిని సర్వే చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓటర్ ఐడీ నెంబరు, ఆధార్ నెంబర్ తదితర వివరాలను గుంటూరులోని సెంట్రల్ ఆఫీసుకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత ఆన్‌లైన్‌లోకి వెళ్లి నా ఓటు నేనే తొలగించుకున్నట్టు ప్రజల తరపున సెల్ఫ్ డిక్లరేషన్(అప్లికేషన్) పెట్టి, వారి ఓటు పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యత్వం ఉన్న వారిని బూత్‌లెవెల్ అధికారులుగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేలా ట్యాబ్‌లతో ఇంటింటికీ వస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు 16 మందిని ట్యాబ్‌లతో సహా పోలీసులకు అప్పగించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన వారిని చిత్తూరు ఎస్పీ ఇంటికి పిలిచి మరీ కొడుతున్నారని ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ నాయకుడు ఆ నియోజకవర్గంలోని 325 పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వాయిస్ రికార్డులను, ఆధారాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకుడు ఒకరు మాట్లాడిన మాటలివీ.. టీడీపీ నేత: మీరు గట్టిగా పనిచేసి తలో ఇరవై ఓట్లు తొలగించేలా చూడాలి. అలా ఓ పది వేల ఓట్లు తొలగిస్తారు. మనకు అనుకూలంగా 5 వేల ఓట్లు చేర్పించామనుకో దానికి మించినటువంటి ఫలితం మరొకటి ఉండదు. మన వాళ్లందరికీ ఈ విషయం చెప్పిండి. మీరు మరో రెండు రోజులు బూత్ దగ్గరే ఉండి అనుకూల ఓట్లు చేర్పించాలమ్మా. బూత్ లెవెల్ కార్యకర్త: అన్నా.. మనకు పడే ఓట్లకు సంబంధించి వారి ఆధార్ కార్డులు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ లేకపోతే ఓట్లు ఎలా చేర్పించాలి? టీడీపీ నేత: ఓకేనమ్మా.. నువ్వు వారి వివరాలు తీసుకుని ఒకసారి రా. మనవాళ్లు ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసేస్తారు. వారికి కొత్త ఓట్లు చేర్చేలా అప్లికేషన్ పెట్టొచ్చు. మనకు అనుకూలమైన ఓట్లు అడ్రస్ మార్చి చేర్పించొచ్చు. అదంతా చిటికెలో పని. టెలికాన్ఫరెన్స్ నిర్వాహకుడు: అన్నా.. సీఎంగారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించే టైమ్ అయ్యింది. మీరు కట్ చేస్తే ఆయనకు లైన్ కలపాలి. టీడీపీ నేత: అదేంటి.. సార్ టెలికాన్ఫరెన్స్ ఉందని చెప్పలేదు. సరే అది అయ్యాక మళ్లీ మాట్లాడుతా. టెలికాన్ఫరెన్స్ నిర్వాహకుడు : అన్నా.. ఈ రోజు ఇంక కుదరదు. సీఎంగారి టెలికాన్ఫరెన్స్ ఎంత సమయం పడుతుందో తెలియదు. మీరు రేపే మాట్లాడుకోండి. -
నకిలీ పోలీసు అరెస్టు
ఆదిలాబాద్ రూరల్: పోలీసు అధికారిగా చెబుతూ ఆదిలాబాద్ ప్రాంతంలో చెలామణీ అవుతున్న నకిలీ పోలీసును జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారిగా చెబుతూ మోసానికి పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన రంగస్వామి కన్నన్ గోపాలకృష్ణన్‌ను పట్టణంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన గత పది సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌లో నివాసం ఉండి ఈ మధ్యనే వెళ్లిపోయినట్లు తెలిపారు. గత వారం రోజుల నుంచి పట్టణంలోని ఓ లాడ్జిలో ఉంటూ ఉన్నత పోలీసు అధికారిగా చెలామణీ అవుతూ ఆదిలాబాద్ రైల్వే పోలీసుల వద్ద బెదిరించి రూ.2వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 15 రోజుల కిందట రామగుండం రైల్వే పోలీసు అధికారితో డీఎస్పీగా పరిచయం చేసుకొని అనంతరం రైల్వే పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, రూ.2వేలు అవసరం ఉందని నగదు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైల్వే పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వారి వద్ద నుంచి వాకిటాకీ (మ్యాన్ ప్యాక్) దొంగిలించినట్లు వివరించారు. ఇలా పలు నేరాలు చేస్తూ ఆదిలాబాద్‌లో నకిలీ పోలీసు అధికారిగా చెలామణీ అయిన రంగస్వామిని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ సురేశ్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఆయన నుంచి మ్యాన్‌ప్యాక్, గ్రీన్ పెన్, పోలీసు బెల్ట్, లాఠీ, రెండు సెల్ఫోన్లు, డైరీ, ఆధార్ కార్డు, పోలీసు విజిల్, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నకిలీ పోలీసుగా చెలామణీ అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే 83339 86898 నెంబర్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ సురేశ్, ఎస్సైలు బి.అనిల్, ఎల్వి రమణారావు, ఐడీ పార్టీ పోలీసులు రమణ, రాంరెడ్డి, రాహత్, ఎంఏ కరీం ఉన్నారు. -
కరెంట్ కాటేసింది
నిడదవోలు రూరల్: నిడదవోలు మండలంలోని శెట్టిపేట శివారులో కాకరపర్రు రెగ్యులేటర్ కాంట్రాక్టర్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఖమ్మం గోపాలకృష్ణ (66) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆచంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఏడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం భార్య రాధమ్మతో వచ్చి రెగ్యులేటర్ వద్ద వాచ్‌మెన్‌గా చేరాడు. అప్పటినుంచి రెగ్యులేటర్ నిర్మాణానికి వినియోగించే సామాన్లను భద్రంగా చూడటంతో పాటు కాకరపర్రు లాకుల వద్ద పనిచేసే ఇరిగేషన్ సిబ్బందికి చేదోడువాదోడుగా ఉంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం రెగ్యులేటర్ కార్యాలయం ముందు ఉన్న కొండాలమ్మవారిని దర్శించుకుని లైట్లు ఆపడానికి స్వీచ్ ఆన్‌చేయగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహం వద్ద భార్య రాధమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గోపాలకృష్ణ మంచి వ్యక్తిని, నమ్మకంతో పనిచేసేవాడని ఇరిగేషన్, రెగ్యులేటర్ కాంట్రాక్టర్లు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు. లాక్ సూపరింటెండెంట్లు చిక్కాల బ్రహ్మజీ, రాజు, నీటిసంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు శవపంచానామ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భార్య రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్ చెప్పారు. -
ఖాకీ దుస్తుల్లో దాగిన కరుణ
బెంగళూరు : పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఓ ట్రాఫిక్ ఎస్ఐ తన సమయ స్ఫూర్తితో కాపాడి... ఖాకీ దుస్తుల్లో కూడా కరుణ దాగి ఉంటుందని నిరూపించాడు. బెంగళూరులోని బ్యాటరాయణపుర సర్కిల్ ప్రాంతంలో గురువారం ఉదయం ట్రాఫిక్ ఎస్ఐ గోపాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు... ఆ సమయంలో తమిళనాడుకు చెందిన నిండు గర్భిణి సెల్వి అటుగా వెళుతూ పురుటి నొప్పులతో రహదారిపై కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని గమనించిన గోపాలకృష్ణ వెంటనే 108కి ఫోన్ చేశారు. అయితే ఆ వాహనం రావడం ఆలస్యమైంది. సెల్వికి పురిటి నొప్పులు మరింత ఎక్కువ కావడంతో గోపాలకృష్ణ పరుగుపరుగునా పరిగెత్తి సమీపంలో ఉన్న మహిళా పౌర కార్మికులు స్థానికంగా ఉన్న మహిళలను పిలుకువచ్చారు. అలాగే స్థానికుల నుంచి దుస్తులు సేకరించి... నాలుగు వైపులా కట్టేశారు. అనంతరం స్థానిక మహిళలు సెల్వీకి పురుడు పోశారు. సెల్వీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం అక్కడకు 108 చేరుకుంది. ఆ వాహనంలో వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. వెంటనే స్పందించి... తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన గోపాలకృష్ణను ఉన్నతాధికారులతోపాటు స్థానికులు అభినందించారు. -
‘ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతాం’
రైల్వేకోడూరు: ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఐజీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై మరింత పకడ్బందీగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆయన బాలపల్లె గ్రామం శేషాచలం అడవుల్లో ట్రెంచ్ తవ్వకం పనులను పరిశీలించారు. ఆయనతోపాటు డీఐజీ ఠాకూర్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ నవీన్ గులాటి ఉన్నారు. -
పోలీసుల పేరుతో హల్చల్: నలుగురి అరెస్టు
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): పోలీసులమంటూ రాత్రి వేళల్లో వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతి తెలిపిన వివరాలివీ.. విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షేక్ కరీం(22), మాధవరంనగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ (30), బాగ్అమీర్కు చెందిన ప్రవీణ్‌కుమార్ (24), మాధవరంనగర్కు చెందిన గోపాలకృష్ణ (30) స్నేహితులు. అయితే, రాత్రి సమయాల్లో వీరంతా మద్యం తాగి వాహనదారులను బెదిరింపులకు గురిచేసేవారు. బుధవారం రాత్రి పటేల్‌కుంట పార్కు సమీపంలో ద్విచక్ర వాహనదారులను ఆపి వాహనం పత్రాలు చూపించాలని, లేదంటే పక్కన ఎస్ఐ ఉన్నాడని బెదిరించేవారు. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టకు చెందిన రాజేష్ ఉషాముళ్లపూడి రోడ్డు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే క్రమంలో అతని బైక్ ఆపారు. అయితే, అతని వాహనం పేపర్లు అన్నీ సక్రమంగా ఉండటంతో హెల్మెట్లేదని వెయ్యి రూపాయలు అడిగారు. తన వద్ద డబ్బులు లేవు అనడంతో పర్సు తీయమన్నారు. పర్సులో ఉన్న 4 వేలతో పాటు అతని ఏటీఎం కార్డు లాక్కొని భాగ్యనగర్‌కాలనీలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి పిన్ నంబర్ అడిగారు. అతడు ఎంతకూ పిన్ నెంబర్ చెప్పకపోవడంతో ఏటీఎం సెక్యూరిటీగార్డుతో వాదనకు దిగారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 వేలతో పాటు ఒక సెల్‌ఫోన్, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
యాదవుల సమస్యలు పరిష్కరిస్తా
తిరుపతి కల్చరల్: తెలుగుదేశం పార్టీ గెలుపులో భాగస్వాములైన యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. యాదవ ప్రముఖుడి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయిస్తానన్నారు. అలాగే యాదవుల భవన నిర్మాణానికి ఎకరా భూమిని ఇచ్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలోని ఇందిరామైదానంలో యాదవ ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ బీసీల ఓట్లతోనే రాష్ట్రంలో చంద్రబాబు సహా అందరూ గెలిచారన్నారు. బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని నిరూపించారని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాట్లాడుతూ యాదవుడైన తనకు చంద్రబాబు సీటు కల్పించడంతో బీసీల అండతో విజేతగా నేడు వేదికపై నిలబడ్డానన్నారు. గతంలో తనకు వైఎస్ఆర్ రాజకీయ అవకాశం కల్పించినా కొందరి కుట్ర కారణంగా స్వల్ప తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ సేవలు అందిస్తున్నానన్నారు. తన గెలుపునకు కృషి చేసిన బీసీలందరికీ అండగా ఉండి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు అన్నారామచంద్రయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా యాదవుల నుంచి శంకర్ గెలుపొందడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ యాదవుల సంక్షేమాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ బోర్డులో శాశ్వత సభ్యుడుగా యాదవుల్లో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ పదవి యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ను అతిథులతో పాటు యాదవ సంఘ నాయకులు పూలమాల లు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య, తిరుపతి ఎ మ్మెల్యే వెంకటరమణతో పాటు బీసీ, యాదవ నాయకులు నరసింహయాదవ్, అశోక్‌సామ్రాట్ యాదవ్, కృష్ణయ్య యాదవ్, పుష్పావతి, ఆనంద్ యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.