రైల్వేకోడూరు: ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఐజీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై మరింత పకడ్బందీగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అంతకుముందు ఆయన బాలపల్లె గ్రామం శేషాచలం అడవుల్లో ట్రెంచ్ తవ్వకం పనులను పరిశీలించారు. ఆయనతోపాటు డీఐజీ ఠాకూర్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ నవీన్ గులాటి ఉన్నారు.