redsander
-
14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. జిల్లాలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 14 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
పోలీసుల కూంబింగ్.. రెచ్చిపోయిన స్మగ్లర్లు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జ్లిలాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని చంద్రగిరి మండలం మొరవపల్లి వద్ద శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు కూంబింగ్‌లో ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు విసిరి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో వారి కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటనా స్థలంలో 20 ఎర్రచందన దుంగలు, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
సాక్షి, నెల్లూరు: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ వేగురి సురేంద్రబాబు పోలీసులకు చిక్కాడు. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం నందిగుంట వద్ద ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.13 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను, ఒక కారు, సెల్‌ఫోన్, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దగదర్తి మండలం ప్యాడ్సన్పేటకు చెందినవాడు. సురేంద్రబాబుపై దోపడి, దౌర్జన్యం, కిడ్నాప్, హత్య సహా 20 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలున్నాయని కలిగిరి సీఐ కరుణాకర్ తెలిపారు. -
భారీగా ఎర్ర చందనం స్వాధీనం
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం చెలికంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ. 5 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హెరిటేజ్ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు
-
25 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
మర్రిపాడు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గురువారం వేకువజామున అడవిలో గాలింపు చేపట్టిన పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో 25 మంది కూలీలను అరెస్ట్ చేసి.. 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కూలీలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ చీకటిలో వంతెన పై నుంచి కిందకు దూకడంతో గాయపడ్డారు. కూలీలందరూ తమిళనాడుకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. వీరు మూడురోజుల క్రితమే అడవిలోకి వచ్చినట్లు సమాచారం. -
ఇద్దరు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్
బద్వేల్: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 ఎర్రచందనం దుంగలతో పాటు 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. -
తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి: తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పెద్ద ఎత్తున దాడులు చేపట్టారు. కరకంబారి సమీపంలో జరిపిన దాడుల్లో 9 మంది ఎర్రకూలీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు జూపార్కు సమీపంలో ఎర్రకూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు తెలిపారు. మరో వైపు కరకం బారి వద్ద ముగ్గురు ప్రధాన స్మగ్లర్లు తప్పించుకున్నట్టు ఆయన వెల్లడించారు. -
శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం
తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ ఎర్రచందనం కూలీలు ఫారెస్ట్ సిబ్బందిపై రాళ్లతో, గొడ్డలితో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అటవీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడంతో దుంగలను వదిలేసి వారు పరారయ్యారు. ఈ ఘటనలో 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకు 16 కిలోమీటర్ల దూరంలోని గెంజిబండ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. 23 దుంగలతోపాటు, ఓ గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్, రైల్వేకోడూరు సర్కిళ్ల పరిధిలో 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నవీన్ గులాటి వివరాలు వెల్లడించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 2.5 కోట్లు విలువ చేస్తుందని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో నలుగురు అటవీ శాఖ సిబ్బంది కూడా పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి ఓ ట్రక్కు, నాలుగు కార్లు, 4 ద్విచక్రవాహనాలు, 4 సెల్ఫోన్లతో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వివరాలు తెలిపారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్సార్ జిల్లా పోలీసులు నలుగురు అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్లను సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు, నెల్లూరు రహదారిలో గోపవరం మండలం పీపీ కుంట చెక్‌పోస్ట్ వద్ద నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ నవీన్‌గులాటి జిల్లా కేంద్రంలో విలేకరులో సమావేశంలో వెల్లడించారు. టి.వెంకటేశ్వర్‌రెడ్డి, షేక్ నవీద్, షేక్ సుజీద్, షేక్ అలీ్‌ఫ్‌ను అరెస్ట్ చేసి 2.2 టన్నుల బరువైన 169 ఎర్రచందనం దుంగలను, అశోల్ లేలాండ్ లారీతోపాటు రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. -
రూ. 3 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
రైల్వే కోడూరు: వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం నాగేటికోట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీ ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్‌లో ఇప్పటి వరకు 182 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
కడపలో ఎర్రచందనం దొంగల అరెస్ట్
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా కడప-రాయచోటి రహదారిపై కాంపల్లి చెక్‌పోస్ట్ వద్ద ముగ్గురు ఎర్ర చందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్‌పేరేడ్ మైదానంలో గురువారం విలేకరుల సమావేశం పెట్టారు. వివరాలను జిల్లా ఎస్పీ నవీన్ గులాటి వెల్లడించారు. పట్టుబడిన ప్రవీణ్‌కుమార్, మహ్మద్ షరీఫ్, చీకటి చంద్రశేఖర్ అంతా అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అనుచరులని తెలిపారు. వీరి నుంచి 2.2 టన్నుల 107 ఎర్రచందనం దుంగలు, 3 కార్లు, 1 ఐచర్ వాహనం, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. కోటి ఉంటుందని అన్నారు. -
21 మంది ఎర్ర కూలీల అరెస్ట్
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి తమిళనాడుకు వెళుతుండగా 21 మంది కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం వారు ఆటోలో జిల్లా సరిహద్దుకు వెళుతుండగా రామచంద్రాపురం పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఎర్రచందనం దుంగలు నరికి వెళుతున్నామని కూలీలు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న కూంబింగ్
అయిరాల: అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం చెడిపోవడంతో వాహనంతో పాటు దుంగలను అందులోనె వదిలేసి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తవేరా వాహనంలో 14 ఎర్ర దుంగలను తరలిస్తుండగా.. గేర్ రాడ్డుకు అడ్డంగా ఓ దుంగ ఇరుక్కోవడంతో వాహనం మొరాయించింది. ఇది గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే బయపడిన దుండగులు దుంగలతో పాటు వాహనాన్ని వదిలి పరారయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా అయిరాల మండలం చెంగన్నపల్లి గ్రామ సమీపంలోని పెద్దకొండ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. దుంగలను పాటూరు నుంచి కానిపాకం తీసుకెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకొని స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్మగర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద గురువారం ఉదయం అటవీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖాల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, విచారణ చేపట్టారు. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోవిందపాలెం వద్ద ఐచర్ వాహనంలో తరలిస్తున్న 125 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుత్తూరు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు ఓ ఐచర్ వాహనాన్నిఆపినా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. పోలీసులు వాహనాన్ని వెంబడించగా గోవిందపాలెం వద్ద వాహనాన్ని ఆపి పరారయ్యాడు. పోలీసులు తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం దుంగలు వెలుగు చూశాయి. వాటితో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. -
రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
రైల్వే కోడూరు: వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని శెట్టికుంట వద్ద తనిఖీలు చేయగా ఎర్రచందనంతో వెళ్తున్న వాహనాలను గుర్తించారు. అక్రమ రవాణా చేస్తున్న దాదాపు రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన 31 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఓ లారీ, కారు ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
రూ. 5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సుండుపల్లి: అర్ధరాత్రి అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న తమిళ కూలీలు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఓ వ్యక్తి చిక్కాడు. మరో ఎనిమిది మంది కూలీలు పరారయ్యారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి పరిధిలోని పుంచ అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అడవిలోని ముత్తుకుంట సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎర్రకూలీల మాటలు వినిపించడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా కూలీలు తమ వద్ద ఉన్న దుంగలను పడేసి పరారయ్యారు. ఈ క్రమంలో మురుగన్ అనే తమిళ కూలీని పోలీసులు అరెస్ట్ చేసి 9 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
-
రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి జూపార్క్ సమీపంలోని ఎమ్ ఆర్ పల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఎర్రచందనం కూలీలు పోలీసులకు తారసపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యే లోపల కూలీలు పరారయ్యారు. ఈ తనిఖీల్లో రూ. 60 లక్షల విలువ చేసే 35 ఎర్రచందనం దుంగలను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది. -
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కుర్రంపల్లి శివారులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, అటవీ అధికారులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఆటోలో తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
రూ.80 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: శేషాచలం అడవుల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన కూంబింగ్‌లో రూ.80 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ భాస్కర్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేషా చలం అడవుల్లోని చీకటీగల కోన సమీపంలోని ఎర్రగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా సుమారు 60 మందికిపై కూలీలు అధికారులపై రాళ్లతో దాడికి పాల్పడడం.. అధికారులు గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన తెలిసిందే. కూలీలు పారిపోయిన అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 1.17 టన్నుల ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా చంద్రగిరి మండలం భీమవరం సమీపంలోని మూలపల్లి వద్ద శుక్రవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు కూలీలు అధికారులు పట్టుబడ్డారు. -
శేషాచల అడవుల్లో కూంబింగ్
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలోని బొమ్మాజి కొండ వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘురామ్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులకు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. అధికారులను చూసిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పరారైన కూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. -
రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప రైల్వే కోడూరు మండలం సూరపురాజు పల్లి క్రాస్ రోడ్డు వద్ద 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అబ్బిరాజుగారిపల్లె గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఇన్నోవా కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఇన్నోవాను సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని బోధనం టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో 75 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో కడప-కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 132 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు మూడు టన్నులు ఉంటుందని సమాచారం. అయితే, దాడుల సమయంలో స్మగ్లర్లు అటవీ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడి పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. -
రూ. లక్ష విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.లక్ష విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని కానిపాకం సర్కిల్ వద్ద చేపట్టిన దాడుల్లో ఓ వాహనంలో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించగా అందులో ఉన్న దుంగలను వదిలి దుండగులు పరారయ్యారు. వాహనంలో ఉన్న 13 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారూ రూ. 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతాం’
రైల్వేకోడూరు: ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఐజీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై మరింత పకడ్బందీగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆయన బాలపల్లె గ్రామం శేషాచలం అడవుల్లో ట్రెంచ్ తవ్వకం పనులను పరిశీలించారు. ఆయనతోపాటు డీఐజీ ఠాకూర్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ నవీన్ గులాటి ఉన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
నెల్లూరు: ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచిన నేరంపై ఓవ్యక్తిని నెల్లూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం అరవపెరిమిడి గ్రామానికి చెందిన పల్లం కృష్ణయ్య ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ.4.50 లక్షల విలువైన 60 ఎర్ర చందనం దుంగలను ఈనెల 14న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కృష్ణయ్యను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ ఎం.రత్తయ్య తెలిపారు.మరో పాత నేరస్తుడు పాడేటి అశోక్‌కుమార్‌రెడ్డి పరారిలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్లకు చెందిన వీరిని అరెస్ట్ చేయడంతో పాటు పది కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు దుబాయ్‌కు చెందిన అలీబాయ్ అనే బడా స్మగ్లర్ అనుచరులని పోలీసులు తెలిపారు. -
80 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం కొండపేట సమీపంలో ఫారెస్టు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 ఎర్రచందనం దుంగలు, ఓ కంటెయినర్ స్వాధీనం చేసుకుని, ఐదుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ అధికారుల రాకతో 40 మంది తమిళ కూలీలు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
8 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
బాలపల్లి: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న 8 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 29 దుంగలను స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం కడప జిల్లా బాలపల్లి చెక్‌పోస్టు వద్ద జరిగింది. చెక్‌పోస్ట్ తనిఖీల్లో భాగంగా బాలపల్లి వద్ద ఓ వాహనంలో 16 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్
రేణుగుంట: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం కూలీలను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని రేణుగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన సుమారు 40 మంది ఎర్రచందనం కూలీలు కంటెయినర్ లారీలో వెళ్తున్నారు. కాగా, రేణిగుంట చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారని గమనించి వెంటనే లారీ లోంచి దూకి పారిపోయారు. కాగా, విషయం తెలిసిన పోలీసులు వారిని వెంబడించి నలుగురు కూలీలను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనం దుంగలు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివీ..చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల గ్రామ సమీపంలో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు కూంబింగ్ ప్రారంభించారు. అయితే అధికారులను పసిగట్టిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. అధికారులు మొత్తం 37 దుంగలను స్వాధీనం చేసుకుని, రంగంపేట కార్యాలయానికి తరలించారు. సుమారు ఒకటిన్నర టన్నుల బరువైన ఆ దుంగల విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
2 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
కడప: మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగరంలోని ఓ ఎర్రచందనం డంప్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఐదుగురు స్మగ్లరు పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూరు మండలం అన్నాసాగరం గ్రామంలో ఓ గోదాములో నిల్వ ఉంచిన 2.2 టన్నుల బరువైన 171 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.67 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, ఎర్రచందనంతో చేసిన పూసలు, మూడు కార్లు, ఆయిల్ ట్యాంకర్, రూ.4.3 లక్షల నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వెంకట్‌రెడ్డి, మహమ్మద్ అలీ, జంగాల వీరభద్రయ్య, రాజమోహన్‌రెడ్డి, సింహసముద్రం చెంగల్రావు లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గురువారం ఫారెస్ట్ అధికారులుల తనిఖీ నిర్వహించారు. మండలంలోని నాగయ్యవారిపల్లె వద్ద తనిఖీలు చేసిన అధికారులు 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు లారీ, వ్యానును సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రూ.2.27 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం రవాణా అవుతోందనే సమాచారంతో అటవీ, పోలీసు అధికారులు సోమవారం ఉదయం మాధవరం గేటు వద్ద తనిఖీలు నిర్వహించారు. మూడు కార్లలో తరలిస్తున్న 102 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. కార్ల డ్రైవర్లు పరారు కాగా దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు విశ్వనాథరెడ్డి, సుదర్శన్, ప్రవీణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.2.27 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దుంగలతో పాటు మూడు కార్లను, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
పెనుగొండ: అనంతపురం జిల్లా పెనుగొండ పోలీసులు శనివారం మధ్యాహ్నం రూ.5 ల క్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు నుంచి బెంగళూరు వైపు వెళ్తోన్న టెంపో వాహనాన్ని మండలంలోని హరిపురం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ఆపి తనిఖీ చేయగా 44 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. తరలిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మైసూరివారిపల్లె వద్ద ఎర్రచందనం తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జయప్రసాద్, ఎఫ్‌డీవోలు రజని, శ్రీనివాసమూర్తి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న దుంగలు బయటపడ్డాయి. అటవీ అధికారులను చూసిన డ్రైవర్ పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ. 10 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పట్టుబడిన ఆటో అబ్బిరాజుగారిపల్లికి చెందినదని అధికారులు చెప్పారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి వద్ద నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇండికా, బొలేరో వాహనాల్లో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పూజితా నీలం మీడియాకు తెలిపారు. వీటి విలువ రూ7 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, 5 గరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసలు తెలపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 69 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి సెక్షన్ జానకిపురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. ముందస్తు సమాచారంతో గ్రామసమీపంలోని అరటితోటకు వెళ్లిన పోలీసులకు రవాణ చేయడానికి సిద్ధంగా ఉంచిన 69 దుంగలు గుర్తించారు. పోలీసులు వస్తున్నారని గమనించిన స్మగ్లర్లు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం సుమారు 2 టన్నుల బరువు ఉంటుందని, వాటి విలువ సుమారు కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు(గూడూరు): నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీలు చేపట్టిన గూడూరు పోలీసులు ఎర్రచందనం అక్రమరవాణాను గుర్తించారు. పట్డుబడిన వారి నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
సోమశిల: అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం గోవిందమ్మపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఇళ్లలో ఎర్రచందనాన్ని దాచి ఉంచారనే సమాచారం అందుకున్న సోమశిల పోలీసులు గోవిందమ్మపల్లిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రూ.6 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: వైఎస్సార్ జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. గురువారం రూ.6 కోట్ల విలువైన మూడు టన్నుల బరువున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓఎస్డీ రాహుల్ దేవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలివీ...విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బి.కోడూరు మండలం తోకరస్తా ప్రాంతంలో గురువారం వేకువజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యానులో తరలిస్తున్న114 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. సుమారు మూడు టన్నుల బరువు ఉన్న ఈ దుంగల విలువ రూ.6 కోట్లు ఉంటుందని సమాచారం. అయితే, దుంగలను తరలిస్తున్న వారు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. -
126 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప: వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శనివారం ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఐచర్ వాహనంలో 3.1టన్నుల బరువైన 126 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. 126 దుంగలతో పాటు ఇద్దరు వ్యక్తులను, ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన ఇద్దరిలో ప్రధాన స్మగ్లర్ దొడ్డ వెంకటరమణ సోదరుడు పెద్ద వెంకటరమణ కూడా ఉన్నట్టు సమాచారం. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ముగ్గురు ఎర్రచందనం కూలీల అరెస్ట్
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని వాగేటికొన సమీపంలో ముగ్గురు ఎర్రచందనం కూలీలను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కూలీలు పరారైనట్టు పోలీసులు తెలిపారు. -
చిన్నమండ్యంలో ఎర్రచందనం స్వాధీనం
చిన్నమండ్యం: వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం అటవీ ప్రాంతంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 11మంది కూలీలను అరెస్ట్ చేశారు. రాయచోటి అటవీ అధికారుల కథనం మేరకు వివరాలు... ముందుగా అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం అటవీ అధికారులు చిన్నమండ్యం సమీపంలో తనిఖీచేయగా తరలించేందుకు సిద్దంగా ఉంచిన 15 ఎర్రచందనం దుంగలు దొరికాయి. అక్కడే ఉన్న 11మంది తమిళనాడుకు చెందిన కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ 2.50 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. తమిళనాడులోని సేలంకు చెందిన కూలీలు రాయచోటి మీదుగా ఇక్కడికి వచ్చి ఎర్రచందనం దుంగలను నరికి అక్రమంగా తరలిస్తున్నారని వారు చెప్పారు. -
ఒంటిమిట్ట ఏఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్
రాయచోటి : ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ జిల్లాలోని రెండు పోలీస్స్టేషన్ల సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ఎస్పీ నవీన్ గులాటి శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సంబేపల్లి హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరు ఎర్రచందనం అక్రమ రవాణాపై స్మగ్లర్లతో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు రావటంతో శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్ర చందనం దుంగలు మాయం కావటంపై స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై ఓబయ్య, కానిస్టేబుల్ భాస్కర్లను ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.