నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. జిల్లాలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 14 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.