ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం కొండపేట సమీపంలో ఫారెస్టు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 ఎర్రచందనం దుంగలు, ఓ కంటెయినర్ స్వాధీనం చేసుకుని, ఐదుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ అధికారుల రాకతో 40 మంది తమిళ కూలీలు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.