రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని వాగేటికొన సమీపంలో ముగ్గురు ఎర్రచందనం కూలీలను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కూలీలు పరారైనట్టు పోలీసులు తెలిపారు.