
చిన్నమండ్యంలో ఎర్రచందనం స్వాధీనం
చిన్నమండ్యం: వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం అటవీ ప్రాంతంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 11మంది కూలీలను అరెస్ట్ చేశారు. రాయచోటి అటవీ అధికారుల కథనం మేరకు వివరాలు... ముందుగా అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం అటవీ అధికారులు చిన్నమండ్యం సమీపంలో తనిఖీచేయగా తరలించేందుకు సిద్దంగా ఉంచిన 15 ఎర్రచందనం దుంగలు దొరికాయి. అక్కడే ఉన్న 11మంది తమిళనాడుకు చెందిన కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ 2.50 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. తమిళనాడులోని సేలంకు చెందిన కూలీలు రాయచోటి మీదుగా ఇక్కడికి వచ్చి ఎర్రచందనం దుంగలను నరికి అక్రమంగా తరలిస్తున్నారని వారు చెప్పారు.