కడప: వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శనివారం ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఐచర్ వాహనంలో 3.1టన్నుల బరువైన 126 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. 126 దుంగలతో పాటు ఇద్దరు వ్యక్తులను, ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన ఇద్దరిలో ప్రధాన స్మగ్లర్ దొడ్డ వెంకటరమణ సోదరుడు పెద్ద వెంకటరమణ కూడా ఉన్నట్టు సమాచారం. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.