రాయచోటి : ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ జిల్లాలోని రెండు పోలీస్‌స్టేషన్ల సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ఎస్పీ నవీన్ గులాటి శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సంబేపల్లి హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరు ఎర్రచందనం అక్రమ రవాణాపై స్మగ్లర్లతో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు రావటంతో శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్ర చందనం దుంగలు మాయం కావటంపై స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై ఓబయ్య, కానిస్టేబుల్ భాస్కర్‌లను ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.