Ontimitta
-
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సిరిసిల్ల: భద్రాచలంలో సీతారాముల కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్లకు వేదపండితులు లఘు కల్యాణం నిర్వహించి లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకువచ్చారు. కల్యాణ మండపంలో శ్రీరాముడిని సింహాసనంలో, ఆయనకు ఎదురుగా గజాసనంపై సీతమ్మవారిని కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం సీతమ్మ వారికి మాంగల్యధారణ చేసి వెండి పాత్రల్లో ఉంచిన ముత్యాల తలంబ్రాలను సీతారాములపై పోశారు. ఆ తర్వాత తలంబ్రాలతో వేడుక నిర్వహించారు. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను, త్రిదండి చినజీయర్ స్వామి మఠం, శృంగేరి పీఠం, శ్రీరంగం, టీటీడీ తరఫున ప్రతినిధులు వ్రస్తాలను సమర్పించారు. ఈ వేడుకకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేశ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హæరినాథ్, జస్టిస్ రవినాథ్ తిల్హారి హాజరయ్యారు. గురువారం మిథిలా స్టేడియంలో పట్టాభిõÙక మహోత్సవం జరగనుంది. కల్యాణోత్సవానికి తాను నేసిన బంగారు, వెండి జరీ పోగుల చీరను సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ కానుకగా అందించారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం శాస్త్రోక్తం గా ధ్వజారోహణం 22న కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు ఒంటిమిట్ట: వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఉత్సవాల్లో ప్రధానంగా ఈ నెల 20న హనుమంత వాహనం, 22న కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 25న చక్రస్నానం నిర్వహించనున్నారు. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. ఈ వేడుక చూసేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారామ లక్ష్మణులు ఒంటిమిట్ట పురవీధుల్లో శేషవాహనంపై విహరించారు. -
ఒంటిమిట్టకు పూర్వ వైభవం!
ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది. ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం
ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిని అటకెక్కించింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇది అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై విరాజిల్లుతోంది. – సాక్షి, రాయచోటి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు 2019 తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీపంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాలయం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. పచ్చదనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేకమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కోదండ రాముని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యాణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యాణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి కల్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తులకు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివారం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు. టీడీపీ హయాంలో అంతంత మాత్రమే 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. తర్వాత కాలంలోనూ అభివృద్ధి పనులు అంత వేగంగా జరగలేదు. పైగా 2018లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వామి కల్యాణం రోజున ప్రకృతి విపత్తుతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి. కల్యాణం రోజు ఇంతటి అపశృతి చరిత్రలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2014 నుంచి స్వామికి కల్యాణం రోజున పట్టు వ్రస్తాలు సమర్పించేందుకు స్వయంగా సీఎం హోదాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా అభివృద్ధి దిశగా అంత ఆలోచనచేయలేదని విమర్శిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా టీటీడీ అధికారుల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులూ కల్పించింది. అభివృద్ధితో కళకళ చిన్నతనం నుంచి చూస్తున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం గత నాలుగేళ్లలో నమ్మలేనంతగా మారిపోయింది. ఆలయాన్ని చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది. గుడి కళకళలాడుతోంది. భక్తులకు సకల వసతులూ సమకూరాయి. – శ్రీనివాసులు, ఒంటిమిట్ట రామయ్యకు రాజయోగం నేను కొన్నేళ్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చైర్మన్‌గా పనిచేశాను. ఇతిహాసాల్లోనూ ఒంటిమిట్ట రామయ్యకు చరిత్ర ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో రామయ్యకు రాజయోగం పట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. – ముమ్మడి నారాయణరెడ్డి, పెన్నపేరూరు, ఒంటిమిట్ట మండలం అద్భుత క్షేత్రమైంది ఈ రామాలయం టీటీడీ ఆధ్వర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడిది గృహం సమకూరింది. స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాటపట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట -
ఇక జాంబవ క్షేత్రంగా ఒంటిమిట్టకు ఖ్యాతి
కడప కల్చరల్ : ఒంటిమిట్ట దివ్య క్షేత్రానికి కొత్త హంగు కలగనుంది. జాంబవ ప్రతిష్టగా పేరున్న ఈ క్షేత్రంలో జాంబవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని చాలా కాలంగా భక్తులు కోరుతున్నారు. వారి వినతులకు స్పందించిన టీటీడీ అదికారులు ఇటీవలి పర్యటన సందర్భంగా ఈ మేరకు విగ్రహ ప్రతిష్ట చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రానికి తలమానికంగా, జిల్లాకు గర్వ కారణంగా నిలిచిన శ్రీమద్ ఒంటిమిట్టకు జాంబవ క్షేత్రంగా పేరుంది. ఈ ఆలయానికి అధికార హోదా దక్కేందుకు స్థానిక పరిశోధకులు ఆలయ ప్రాచీనత గురించి చెబుతూ క్షేత్ర పాలకుడిగా రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించినది జాంబవంతుడేనని స్పష్టం చేశారు. ఇందుకు పురాణ గాథలను ఉదాహరణగా చూపారు. తిరుమల క్షేత్రానికి వరాహ స్వామి, దేవునికడపకు హనుమంతుడు క్షేత్ర పాలకులు. అలాగే ఒంటిమిట్ట ఆలయానికి జాంబవంతుడు క్షేత్ర పాలకుడని స్థానిక చరిత్రకారుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట జాంబవ క్షేత్రమని పేర్కొనేందుకు జిల్లాలో పలు ఆధారాలు లభించాయి. సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో రోడ్డు వారగా జాంబవంతుని శిలాచిత్రం గల శాసనం లభించింది. పలు తరాలుగా తాము జాంబవంతుడిని పూజిస్తున్నామని, ఒంటిమిట్ట తిరునాలకు గ్రామ వాసులంతా తప్పక వెళతామని తెలిపారు. అంబవరంలో.. కడప నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో అంబవరం గ్రామం ఉంది. గ్రామం మధ్యలో గల చిన్న దిమ్మెపై రెండు అడుగుల జాంబవంతుని విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు ఈ స్థలంలో చిన్న రాయి ఉండేదని, దాన్నే జాంబవంతునిగా పూజించేవారమని, పెద్దల కాలం నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తరతరాలుగా తమ గ్రామంలో జాంబవంతుని పూజలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లుగా వర్షాలు రాకపోతే నెల రోజుల పాటు ఇంటికొక బిందె చొప్పున నీళ్లు తెచ్చి జాంబవంతుని విగ్రహాన్ని అభిషేకిస్తామని, తప్పక మంచి ఫలితం ఉంటోందని వారు వివరించారు. తాడిగొట్లలో.. కడప నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడిగొట్ల గ్రామం ఉంది. ఊరి మధ్య విశాలమైన అరుగుపై ఆ గ్రామ ప్రజలు జాంబవంతుని విగ్రహం ఉంది. గ్రామంలో ఏ ఇంటిలోనైనా శుభ కార్యాలు జరిగితే తొలిపూజ జాంబవంతునికే నిర్వహిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితి ఏర్పడితే స్వామికి అభిషేకాలు చేస్తామని, తప్పక వర్షాలు కురుస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఈ గ్రామాలే గాక చిట్వేలితోపాటు కడప నగరానికి సమీపంలోని మరికొన్ని గ్రామాలలో కూడా జాంబవంతుని విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒంటిమిట్ట క్షేత్ర పాలకుడు జాంబవంతుడు గనుక జిల్లాలోని ఆ క్షేత్రానికి సమీపంలో గల చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న గ్రామాలలో నేటికీ పూజిస్తూ ఉండడంతో.. ఒంటిమిట్ట క్షేత్రానికి జాంబవంతుని గల అనుబంధాన్ని భావితరాలకు శాశ్వతంగా తెలిపేందుకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు చిరకాలంగా కోరుతున్నారు. ఇటీవల ఆలయాన్ని పరిశీలించిన టీటీడీ అధికారులకు కూడా విన్నవించడంతో.. వావిలకొలను సుబ్బారావు తపం చేసిన శృంగిశైలంపై జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కొండపైనే తొలుత జాంబవంతుడు నివసించినట్లు కైఫీయత్తుల పరిష్కర్త, చరిత్ర పరిశోధకులు దివంగత విద్వాన్ కట్టా నరసింహులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గిరి ప్రదర్శన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, సింహాచలంతోపాటు మరికొన్ని దివ్య క్షేత్రాలలో ఆయా దేవతామూర్తుల పూజలో భాగంగా అక్కడ గిరి ప్రదర్శన నిర్వహిస్తుండడం తెలిసిందే. అదే పద్ధతిలో ఒంటిమిట్టలోని శృంగిశైలానికి కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదిజాంబవ మఠాల పెద్దలు పలు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొండపై జాంబవంతుని ప్రతిష్ట జరిగితే ఇక్కడ కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని వారు మరోమారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, ఒంటిమిట్ట తిరునాల సందర్బంగా తాము తమ శిష్య గణాలతో కలిసి శృంగిశైలం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని గుర్తు చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నట్లు హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులను అభినందించారు. ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం -
9 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట మండలం నర్వకాటపల్లి గ్రామ సమీపంలోని యల్లాపుల్లల బావికొండ వద్ద తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. వారి నుంచి 49 ఎర్రచందనం దుంగలను (టన్ను బరువు), రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరెస్టు అయినవారిలో మహమ్మద్ బాషా (నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్‌పేట), మేడితరాజు మల్లేశ్వరరాజు(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, మాధవరంపోడు), గెనే నాగభూషణం(తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, అరిగిలవారిపల్లి), ఎలప్పు బాలచంద్రయ్య(నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం), గుండం మునికుమార్, నాగూర్ మునివేలు, పరుకూరు లోకేష్ (తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం, బంగారమ్మ కండ్రిగ), వీసం రాజారెడ్డి(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, ఎస్.ఉప్పరపల్లె), ఆవులూరి సుబ్రహ్మణ్యం(రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట) ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. -
కైఫియత్తులే ఇంటిపేరుగా...
బలమైన చారిత్రక ఆధారాలైన కైఫియత్తులను ఇంటి పేరుగా మార్చు కొన్న గొప్ప భాషావేత్త, పరిశోధకులు... విద్వాన్ కట్టా నరసింహులు. వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట సమీపంలోని కొత్తపల్లి వాసి. తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించారు. బ్రౌన్ గ్రంథాలయ ఆవిర్భావం తర్వాత దాని వ్యవస్థాపక సెక్రెటరీ డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రితో పరిచయం... కట్టా పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ గ్రంథాలయానికి చేర్చింది. బ్రౌన్ గ్రంథాలయ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని పటిష్టం చేసేందుకు కట్టా పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన వ్యక్తిత్వం, శక్తియుక్తిలకు తృప్తిచెందిన జానమద్ది ఆయనకు మెకంజీ రాసిన ‘కడప కైఫియత్తు’ల పరిష్కార బాధ్యతను అప్పగించారు. ఫలితంగా 3,000 పైచిలుకు పేజీలతో, 8 సంపుటాల కడప కైఫియత్తులు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి. ఆయన కేవలం కడప కైఫియత్తుల ఆధా రంగా ఇంతవరకు వెలుగు చూడని చారిత్రకాంశాలతో ‘కైఫియత్ కతలు’ పేరిట పుస్తకం వెలువరించారు. రాయలసీమలో శ్రీకృష్ణ దేవరాయల పాలన వలె ఆయన బంధువులైన ‘మట్లి’ రాజుల పాలన సాగిందని కట్టా నిరూపించారు. తన జన్మస్థలి ఒంటిమిట్ట గురించి పూర్తి చారిత్రక ఆధారాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు వెలువరించి, అక్కడ ఉన్న రామాలయ చరిత్రను లోకానికి తెలిపారు. (చదవండి: నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి) ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి ప్రభుత్వ లాంఛనాల హోదా కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ కృషి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ‘పోతన భాగవతం’ ప్రాజెక్టులో సేవలందించే అవకాశాన్ని కల్పించింది. అక్కడ పని చేస్తూనే ఆయన 2021 మే 15న కరోనాతో కన్నుమూశారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా కడపలోని బ్రౌన్ కేంద్రంలో సదస్సు జరగనుంది. – పవన్‌కుమార్ పంతుల, జర్నలిస్ట్ (మే 15న విద్వాన్ కట్టా నరసింహులు తొలి వర్ధంతి) -
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం (ఫొటోలు)
-
ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం
అప్డేట్స్ ► ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం ► వెన్నెల వెలుగుల్లో.. కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం.. భక్తుల పారవశ్యం ► కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణ మహోత్సవం 8.10PM ► కోదండ రాముని కల్యాణోత్సవానికి హాజరైన సీఎం జగన్ ► ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న సీఎం జగన్. 7.44PM ► స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్ 7.42PM ► సంప్రదాయ రీతిలో రామయ్య దర్శనానికి వెళ్లిన సీఎం జగన్. 7.37PM ► ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ఆహ్వానం పలికిన మంత్రి ఆర్కే రోజా, అధికారులు. 6.46PM ► ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం జగన్. మరికొద్దిసేపట్లో ఒంటిమిట్ట ఆలయానికి. ► కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.. అక్కడ నుంచి నేరుగా స్వామి వారి కల్యాణ వేదికకు చేరుకోనున్న సీఎం జగన్. 5.50PM ► కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకోనున్నారు. ► ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. ► కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ► ఈ కల్యాణమహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ► కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ► ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐరన్‌లెగ్ అన్నారు.. ఇప్పుడు మంత్రిని అయ్యా: ఆర్కే రోజా
సాక్షి, వైఎస్సార్ కడప: మహానేతతో కలిసి పని చేసే అదృష్టం దక్కకపోయినా.. వైఎస్ జగన్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం.. ఆమె మీడియాతో మాట్లాడారు. కడప నేను పుట్టిన ఊరు. టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్సార్ నన్ను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేయాలని కలగన్నా. ఆయన అకాలమరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డా. ఆ టైంలో ఐరన్ లెగ్ అంటూ నన్ను టీడీపీ వాళ్లు అవహేళన చేశారు. వైఎస్సార్ నాకు దేవుడు. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. ఆ దివంగత మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయనూ సందర్శించా. ఎమ్మెల్యే కావాలన్నది తన కల అని, ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఇప్పుడు సీఎం జగన్ ఆశీర్వాదరంతో మంత్రిని కూడా అయ్యానంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా.. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు. గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు.. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని భగవంతుడ్ని వేడుకున్నానని, ఆ కోరిక నెరవేర్చినందుకు కళ్యాణోత్సవానికి హజరయ్యానని ఆమె చెప్పారు. ఇకపై జబర్దస్త్ చేయరా అని చాలా మంది అడుతున్నారని, కానీ.. పది మందికి ఉపయోగ పడటం కోసం ఒకటి వదులుకోక తప్పదని ఆమె చెప్పారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్న మంత్రి రోజా.. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు. -
రామ నామము తలచి...గోటితో వలిచి..
భద్రాచలం: సీతమ్మవారి మెడలో జగదభిరాముడు మంగళసూత్రాలు కట్టే క్షణం కోసం భక్తులు ఎదురు చూస్తారు. ఈ సందర్భంగా ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా..’ అంటూ శ్రీ సీతారాముల కల్యాణాన్ని వర్ణించే క్రమంలో తలంబ్రాలకు గల ప్రత్యేకతను వివరిస్తారు. అలాంటి తలంబ్రాలను భక్తితో, అకుంఠిత దీక్షతో, వడ్లను గోటితో ఒలిచి రామయ్య కల్యాణానికి తీసుకొస్తున్న కోరుకొండ భక్త సైన్యంపై ప్రత్యేక కథనం.. 2012లో శ్రీకారం.. శ్రీ సీతారాముల కల్యాణానికి నాడు శచీదేవి, అహల్యతో పాటు శబరి కూడా శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని ప్రతీతి. అప్పట్లో రామయ్యకు ముత్యాల తలంబ్రాలతో పాటు గోటి తలంబ్రాలు కూడా అందేవని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసులు తరతరాలుగా గోటి తలంబ్రాలు అందించేవారని, కొంత కాలం తర్వాత అది నిలిచిపోయిం దని తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన కల్యాణం అప్పారావు ఓ బృహత్కార్యానికి 2012లో శ్రీకారం చుట్టారు. తానొక్కడే కాకుండా రామ భక్తులందరినీ ఏకం చేసి ‘శ్రీకృష్ణ చైతన్య సంఘం’ ఏర్పాటు చేసి గోటి తలంబ్రాల యజ్ఞాన్ని ప్రారంభించారు. ‘శ్రీరామ క్షేత్రం’లో గోటి తలంబ్రాల పంట.. తలంబ్రాలకు వినియోగించే వరి నారు వేసేటప్పటి నుంచి పంట కోత కోసే వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంగానే భక్తులు భావిస్తుంటారు. నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి గోకవరం మండలం అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో.. భక్తులు ఆంజనేయస్వామి, వానరుల వేషధారణలో పొలం దున్ని, నాటు వేస్తారు. పొట్ట దశకు వచ్చాక భక్తిశ్రద్ధలతో సీమంతం చేస్తారు. వరి కోసేటప్పుడు కూడా రాముడి వేషధారణలో ఉన్న భక్తుడికి మొదట అందజేస్తారు. శ్రీరామనవమికి 2 నెలల ముందు నుంచే గోటితో వడ్లను ఒలుస్తారు. పరిసర గ్రామాల మహిళలు, భక్తులు శ్రీరామ చిత్ర పటం ముందు రామ నామస్మరణ చేస్తూ ‘వడ్లు వలుపు–శ్రీరాముని పిలుపు’ పేరిట గోటితో ఒలుస్తారు. ఆ బియ్యాన్ని కలశాలలో పెట్టి రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ‘రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు’ కార్యక్రమం నిర్వహించి భద్రాచ లం తీసుకొస్తారు. తలంబ్రాలతో భద్రగిరి ప్రదక్షిణ చేసి రామాలయంలో అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు విస్తరణ.. గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలోని పలు జిల్లాల భక్తులు కూడా గోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు. కర్ణాటకకు చెం దిన భక్తులు సైతం ఈ ఏడాది ఈ యజ్ఞంలో పాల్గొంటుండడం విశేషం. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో మహిళా ఖైదీల్లో మార్పు రావడం కోసం గోటి తలంబ్రాలను ఒలిపించారు. ఒంటిమిట్ట రామాలయానికి.. భద్రాచలం కల్యాణానికి అందిస్తున్న ఈ గోటి తలంబ్రాలను రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రామాలయంలో జరిగే కల్యాణానికి సైతం పంపిస్తున్నారు. -
పగలు భక్తులు... రాత్రికి దొంగలు!
సాక్షి, కడప : ఒంటిమిట్ట మండలం కొత్తమాదరవరం గ్రామానికి చెందిన కొందరు బంధువులు ఓ ముఠాగా ఏర్పడి గుడి దొంగలుగా మారారు. ప్రధాన నిందితుడు నగులూరి ఆదినారాయణ నేతృత్వంలో అతని సోదరుడు ఈశ్వరయ్య గుళ్లు, ఇళ్లల్లో చోరీలు చేస్తూ 2017లో కడప పోలీసులకు చిక్కారు. గతేడాది ఫిబ్రవరిలో ఈశ్వరయ్య, మేలో ఆదినారాయణ కడప సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. కటకటాల్లోకి వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోని వారు విలాసవంతమైన జీవితం కోసం తమ గ్రామానికే చెందిన బంధువులతోనే ముఠా కట్టారు. ఇలా గురునాథం ఆంజనేయులు, నగులూరి ఏసయ్య, ఏసురత్నం,అంజయ్యలతో కలిసి రంగంలోకి దిగారు. తొలుత వీరంతా టార్గెట్ చేసుకున్న ప్రాంతాలకు కుటుంబంతో సహా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు వేసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం పూట పురుషులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ, మహిళలు స్టీలు వస్తువుల మార్పిడి, సవరాలకు అవసరమైన వెంట్రుకలు ఖరీదు చేస్తామంటూ వీధుల్లోకి వెళ్తారు. ఇలా వారున్న ప్రాంతంలోని దేవాలయాలు, వాటిలో ఉన్న భద్రతా ఏర్పాట్లు, ఆ పరిసరాలను రెక్కీ చేస్తారు. ఆపై ఎంపిక చేసుకున్న గుడిలోకి వెళ్లి ఓ సారి అంతా తమదైన శైలిలో నిర్థారణ చేసుకున్నాక.. కొన్ని రోజుల తర్వాత ఆ ముఠా మొత్తం రాత్రి సమయంలో ఆ గుడి వద్దకు వెళ్తుంది. తలుపులు పగులగొట్టి హుండీ ఎత్తుకుపోవడమో, దాన్ని బద్దలుగొట్టి అందులో ఉన్న డబ్బు పట్టుకుపోవడమో చేస్తుంది. దీంతో పాటు ఆ గుడిలో లభించిన ఇతర వెండి, బంగారు వస్తువులు, ఆభరణాలను కూడా చోరీ చేస్తారు. షాద్‌నగర్ దొంగతనంతో... ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు తెలంగాణలోని సైబరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లో కడప, చిత్తూరు, కర్ణాటకలోని చిక్కబల్లాపూర్, కోలార్‌ల్లో మొత్తం 50 చోరీలు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్‌లోని షాద్‌నగర్‌లో ఒకే రోజు నాలుగు హుండీలను ఎత్తుకెళ్లింది. దీంతో శంషాబాద్ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయా దేవాలయాలతో పాటు చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించారు. ఓ చోట అనుమానితుల ద్విచక్ర వాహనం నంబర్ చిక్కింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు దాదాపు మూడు రాష్ట్రాల్లోనూ గాలించారు. ఎట్టకేలకు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.రెండు లక్షల విలువ చేసే ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.25 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీడియా పట్ల కలెక్టర్ దురుసు ప్రవర్తన
వైఎస్సార్ జిల్లా: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం కోసం మంజూరు చేసిన పాసుల విషయంలో గందరగోళం నెలకొంది. మంజూరైన పాసుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. విలేకర్ల పాసుల విషయంలో మీడియా ప్రతినిధులు కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. మీరు పాసులు అమ్ముకుంటారు.. మీరు కుటుంబాలతో వస్తే బయటకు తోసేస్తాం అంటూ కలెక్టర్ హరికిరణ్ దురుసుగా మాట్లాడారు. కలెక్టర్ వ్యాఖ్యల పట్ల విలేకరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట కల్యాణోత్సవాన్ని బహిష్కరించాలని స్థానిక విలేకరులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రేపు ప్రత్యక్ష ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు. -
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి వైభవంగా ఏర్పాట్లు
-
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణ
కడప(ఒంటిమిట్ట): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే సీతారాముల కల్యాణోత్సవాన్ని బుధవారం ఉదయం 9.18 నిముషాలకు ధ్వజారోహణ చేశారు. ఇందులో భాగంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షించింది. ఈ నెల 10న స్వామి కల్యాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కల్యాణోత్సవానికి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 110 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. -
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణ.
-
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
రామ‘చంద్రుడితడు’... రఘువీరుడు
4 నుంచి14 వరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంతో విశిష్టత ఉంది. అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా పేరున్న ఈ ఆలయానికి 2015లో ప్రభుత్వ లాంఛనాల హోదా లభించింది. 2016లో తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు. నాటి నుంచి అభివృద్ధి వేగం పుంజుకుంది. ఈనెల 4న కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 14 తేదీన ముగియనున్నాయి. ఈ ఉత్సవాలలో ఈనెల 10న నిర్వహించనున్న కల్యాణోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశమంతటా శ్రీ సీతారామ కల్యాణాన్ని పగలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట క్షేత్రంలో రాత్రిపూట నిర్వహించడం సంప్రదాయం. ఇందుకు చారిత్రక, సామాజిక కారణాలున్నట్లు ఒంటమిట్ట కైఫీయత్తులు, స్థానిక కథనాలు చెబుతున్నాయి. శ్రీరాముని జన్మఘట్టాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేక పోయానని, కనీసం మంగళకరమైన కల్యాణమైనా చూసే అదృçష్టం కల్పించమని చంద్రుడు బ్రహ్మదేవుడిని కోరాడు. ఆయన సమ్మతించి చంద్రుని కోసమే స్వామి కళ్యాణాన్ని ఏదో ఒకచోట రాత్రిపూట జరిగేలా చూస్తానని మాట ఇచ్చాడు. ఈ రాత్రి కల్యాణానికి మరో పురాణగాథ కూడా ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగినట్లు బాలకాండలో ఉంది. ఈ నక్షత్రం చైత్ర మాసం శుద్ధ చతుర్దశి ఘడియల్లో వస్తుంది. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు తన పాలనలో తొలిసారిగా ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశాడు. నాడు ఆ లగ్నం రాత్రి పూట వచ్చింది. తొలిసారి బ్రహ్మోత్సవాలలో రాత్రిపూట కల్యాణం చేయడంతో అది సంప్రదాయంగా మారింది. మరో విశేషం కూడా ఉంది. బుక్కరాయలు చంద్రవంశీయుడు. తన వంశ మూలపురుషుడైన చంద్రునికి ప్రీతి కలిగించినట్లు కూడా ఉంటుందని రాత్రి లగ్నంలోనే స్వామి కళ్యాణం జరిపించేవాడు. ఆలయ చరిత్ర.... కడపజిల్లా గెజిట్, కైఫీయత్తుల ప్రకారం క్రీ.శ. 1336 ప్రాంతంలో ఉదయగిరి విజయనగర సామ్రాజ్యంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కరాయలు, బుక్కరాయలు సోదరుడు కంపరాయలు దాని పాలకుడు. ఒంటడు, మిట్టడు అనే బోయవీరులు ఆ ప్రాంత రక్షకులుగా ఉండేవారు. ఓసారిఅక్కడకు రాజు, ఆయన పరివారం విచ్చేశారు. అప్పటికే చాలా దూరం నుంచి వచ్చిన వీరికి దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఎక్కడైనా గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండుననిపించింది. సరిగ్గా అదే సమయంలో వీరికి ఒంటడు అక్కడి ఓ నీటి బుగ్గను చూపి, వారి దాహార్తిని తీర్చాడు. వారి పేరుతోనే ఆ ప్రాంతానికి ఒంటిమిట్ట అన్న పేరు వచ్చింది. దీనితోబాటు మరో కథ కూడా ఉంది. శ్రీ సీతారాములు ఈ ప్రాంతంలో పర్యటించినపుడు సీతమ్మకు దాహం వేయగా, రాముడు బాణాన్ని భూమిలోకి సంధించాడని, ఆ ప్రాంతంలో నీటి ఊట ఏర్పడి చిన్న కొలనుగా మారిందని స్థలపురాణం. ఆ కొలనునే రామతీర్థం అంటారు. దగ్గరలో ఉన్న గుట్టపై జాంబవంతుడు ప్రతిష్ఠించినట్లుగా భావిస్తున్న ఓ శిథిలమైన గుడి ఉంది. దాన్ని పునరుద్ధరించమని వారు కంపరాయలను కోరగా, కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చాడు కంపరాయలు. ఆలయంతోపాటు గ్రామాభివృద్ధి కోసం పడమటి వైపున చెరువు నిర్మాణ ం చేపట్టాలని కూడా ఆయన సంకల్పించాడు. ఆ బాధ్యతను బోయ పాలకులైన ఒంటడు, మిట్టడుకే అప్పగించి అవసరమైన వనరులు ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1355–56 ప్రాంతంలో విజయనగర పాలకుడైన బుక్కరాయలు కాశీ యాత్ర చేశారు. తిరుగు ప్రయాణంలో గోదావరి నది ఒడ్డున ఇసుకపల్లె ప్రాంతం నుంచి నాలుగు విగ్రహాలను తీసుకొచ్చాడు. ఓ విగ్రహాన్ని గండికోట, మరో విగ్రహాన్ని గుత్తి, ఇంకో విగ్రహాన్ని పామిడిలో ప్రతిష్ఠించాడు. ప్రత్యేకంగా తెచ్చిన ఏకశిలపై రూపొందించిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను ఒంటిమిట్టలో ప్రతిష్ఠించాడు. ఆ స్వామికి రఘునాయకులని పేరు పెట్టుకుని ఆరాధించారు. కాగా, కోదండ రామాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఏకశిలపై ఉండడంతో ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అనే పేరు కూడ వచ్చింది. ఎన్నో విశిష్ఠతలు.... భక్తపోతన పెద్దలు తెలంగాణప్రాంతం నుంచి ఆయన బాల్యంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన మహా భాగవతం రాసింది ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధిలోనే అని తెలుస్తోంది. ఈ ఆలయం అపురూప శిల్పకళా సంపదకు నిలయం. రంగ మండపంలో 32 స్తంభాలు, 16 యాళి స్తంభాలు అద్భుతంగా ఉండి కనువిందు చేస్తున్నాయి. పురాణాలు, ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలు... కళ్లకు కట్టినట్లు శిల్పాల రూపంలో ఈ మండపంలో కనిపిస్తాయి. నాటి శిల్పుల నైపుణ్యానికి ఈ శిల్ప సంపద సజీవ సాక్ష్యం. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండడు. ఎందుకంటే, సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చే నాటికి వారికి హనుమంతుడు తారసపడలేదని, అందుకే స్వామి సన్నిధిలో ఆంజనేయుడు లేడని చెబుతారు. రాజగోపురం ఎదురుగా సంజీవరాయుడి పేరిట హనుమంతుని ఆలయాన్ని బుక్కరాయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. భక్త వాసుదాసు భద్రాచలానికి రామదాసు ఎంతో ఒంటిమిట్టకు వాసుదాసు అంతటి వాడు. ఆయన అసలు పేరు వావిలికొలను సుబ్బారావు. 1863లో జమ్మలమడుగులో జన్మించిన ఆయన ఈ జిల్లాలోనే రెవెన్యూశాఖ లోనూ, మద్రాసు ప్రెసిడెన్సీ హైస్కూలులో ఉద్యోగం చేశారు. ఆయన ఎన్నో భక్తికావ్యాలు రచించారు. 1900 ప్రాంతంలో వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనుసరించి సృజనాత్మక రచన చేశారు. దాంతో ఆయనకు ధర్మవరం కృష్ణమాచార్యులు... ‘ఆంధ్రవాల్మీకి’ అనే బిరుదును ప్రదానం చేశారు. వావిలికొలను వారికి ఓ రోజున çకలలో ఓ వ్యక్తి కనిపించి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తోచింది. నాటినుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడే ఆయనకు ఆరాధ్యదైవమయ్యాడు. తన ఆస్తిపాస్తులన్నీ ఆ రాముడికే సమర్పించారు. అంతేగాక కౌపీనం (గోచి) పెట్టుకుని టెంకాయ చిప్ప చేతబట్టి ఊరూరా తిరిపమెత్తి ఆ మొత్తాన్ని సైతం రాముడికే సమర్పించాడు. రామాలయానికి మడి మాన్యాలను ఏర్పాటు చేశారు. విలువైన ఆభరణాలను సమర్పించుకున్నాడు. జీవితాంతం ఒంటిమిట్ట రామయ్య సేవలోనే తరించాడు. ఇలా చేరుకోవచ్చు ఒంటిమిట్ట... కడప పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాల్లో వచ్చే భక్తులు రేణిగుంట విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గాన రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా 110 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఒంటిమిట్ట చేరుకోవచ్చు. రైలులో వచ్చే భక్తులు కడప లేదా రాజంపేటలో బస చేసేలా ప్రణాళిక చేసుకోవడం శ్రేయస్కరం. కడప, రాజంపేటలకు హైదరాబాద్, చెన్నై నుంచి రైలు సౌకర్యం ఉంది. సీతమ్మవాగు... సీతారామలక్ష్మణులు మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి సుందరవనాలను చూసి అమ్మవారు సంతోషపడి లక్ష్ష్మణుడితో ‘అంతా బాగుంది కానీ నీరు లేదు, అలాగే పూజ చేసుకునేందుకు పసుపు, కుంకుమ కావాలి’ అందిట. అప్పుడు లక్ష్మణుడు ఒక కొండపైన 70 అడుగుల నల్లటి బండను చూసి, బాణం సంధిస్తే అది పగిలి పసుపు కుంకుమ రాళ్లు కలిసిన నీళ్లు ధారగా వచ్చాయట. అదే సీతమ్మవాగుగా ప్రసిద్ధి చెందింది. పర్ణశాల... భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. వనవాస సమయంలో సీతారాములు ఇక్కడే పర్ణశాల ఏర్పాటుచేసుకొని ఉన్నారట. అప్పుడు జరిగిన సంఘటనలను శిల్పాలుగా చెక్కి... సన్నివేశాలు కళ్ల ముందు మెదిలేటట్లు చేశారు. ఇలా చేరుకోవచ్చు! భద్రాచలానికి హైదరాబాద్ నుంచి వచ్చేవారు సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం మీదుగా చేరుకోవచ్చు ∙ఖమ్మం నుంచి భద్రాచలం 120 కి.మీ. ∙కొత్తగూడెం నుంచి 40 కి.మీ. కొత్తగూడెంలో రైల్వేస్టేషన్ ఉంది ∙రాజమండ్రి నుంచి వచ్చేవారు జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, కుకునూరు నుంచి భద్రాచలం చేరుకోవచ్చు ∙రాజమండ్రి నుంచి 180 కిలోమీటర్లు ∙ భద్రాచలంలో వసతి సదుపాయాలు ఉన్నాయి. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, కడప -
వైభవంగా కోదండరాముడి కల్యాణం
ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట) : రెండవ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో రంగమండపంలో దాశరథి కల్యాణం కమనీయంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేశారు. టీటీడీవారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ సంప్రదాయ విధానంలో సీతరాముల కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 4 నుంచి రాములోరి బ్రహ్మోత్సవాలు
వైఎస్సార్ జిల్లా: రెండో అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్ధానం షెడ్యూల్‌ను రూపకల్పన చేసింది. ఏప్రిల్ 4 అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 5 న ధ్వజరోహణ, 8న హనుమంత సేవ, 9న గరుడ వాహనం ఊరేగింపు, 10న సీతారామ కళ్యాణం, 11న రధోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25, 26 బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పనులు పూర్తి అయ్యేలా ఈఓ, జేఈఓలు దృష్టి సారించనున్నారు. టీటీడీ పరంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించనున్నారు. -
‘రామయ్య’ బ్రహ్మోత్సవాలకు కసరత్తు
ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 5నుంచి 14వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆలయంలోని రంగమండపంలో అధికారులతో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ సమీక్షించారు. సీఈ చంద్రశేఖరరెడ్డి, డీఎఫ్ఓ శివరాంప్రసాద్, ఎస్ఈ రాములు, వెంకటేశ్వర్లు, విజలెన్స్ అధికారి సుకుమార్, ఏపీఎస్పీడీసీఎల్ డీఈ చంద్రశేఖర్, స్ధానిక తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ నాగరాజు, ఆలయ ప్రధానఅర్చకులు వీణారాఘవచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవీ నిర్ణయాలు.. ఒంటిమిట్ట రామయ్య బ్రçహ్మోత్సవాలకు రూ.3,86 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాశరధి కల్యాణాన్ని 70వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. రామాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించే అంశాలను ప్రస్తావించారు. కల్యాణవేదిక వద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణవేదిక నుంచి రామాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల విద్యుత్ పనులకు సంబంధించి రూ 1,01,75,000,00 ఖర్చు చేయనున్నారు. వివిధ సౌకర్యాలకు సంబంధించి ఏర్పాట్లు నిమిత్తం రూ.259లక్షలను వ్యయం చేస్తున్నారు. ఈ పనుల చేపట్టేం తేదిలను టీటీడీ ఖరారు చేస్తుంది. అలాగే రూ.977లక్షల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సమన్వయంతో పనిచేయాలి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఆదేశించారు. రంగమండపంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అధికారికంగా రామాలయంలో జరిగే నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకముందుగా స్వామివారిని జేఈఓ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. -
వృద్ధురాలికి 'ఆన్లైన్' బురిడీ!
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట మండలంలోని చెంచుగారిపల్లె దళితవాడకు చెందిన యాగల లక్ష్మీనరసమ్మ కూలి పని చేసుకొని జీవిస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం మరణించారు. వితంతు పింఛన్ తీసుకుంటోంది. తనకు ఎవరూ లేకపోవడంతో పెన్షన్, కూలి పని చేసుకుని సంపాదించుకున్న మొత్తాన్ని ఒంటిమిట్ట స్టేట్‌బ్యాంకులో నంబర్: (11524745925)తో 2007లో ఖాతా ఓపెన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఖాతాలో కొంత నగదుతోపాటు, భర్త ద్వారా సంక్రమించిన భూమిని విక్రయించగా వచ్చిన రూ.50 వేల నగదును అకౌంట్లో వేసుకుంది. 2015 నాటికి రూ.99,928 నిల్వకు చేరుకుంది. 2016లో బ్యాంక్‌కు వెళ్లి రూ.20 వేలు డ్రా చేసుకుంది. తర్వాత అకౌంట్ పుస్తకంలో కంప్యూటర్ ద్వారా నగదు వివరాలను ఎక్కించుకుంది. రూ.19,909 మాత్రమే నిల్వ ఉన్నట్లు చూపడంతో వృద్ధురాలిలో ఆందోళన మొదలైంది. మిగతా డబ్బు గురించి బ్యాంక్ అధికారులను అడగ్గా తమకు తెలియదని చెప్పడంతో ఏమీ చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆన్లైన్లో ఎవరో ట్రాన్స్క్షన్ చేసుకొని ఉంటారని బ్యాంకు అధికారులు ఉచిత సలహా ఇచ్చేశారు. ఏడు దఫాలుగా డ్రా.. తన అకౌంట్ నుంచి ఏడు దఫాలుగా రూ.63 వేలను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా వివరాలు తెలుసుకోగలిగింది. కాగా వృద్ధురాలికి గ్యాస్ కనెక్షన్ ఉంది. గ్యాస్ సిలిండర్ కోసం డబ్బు చెల్లించిన తర్వాత సబ్సిడీ కోసం ఆధార్‌కార్డును చిన్నకొత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఇప్పించుకుని, వేలిముద్ర వేయించుకునే వాడు. అతనిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో కూడా ఇదే విధంగా వేరే వారికి చేస్తే.. వారు నిలదీస్తే డబ్బులు తిరిగి ఇచ్చేశాడనే ఆరోపణలు ఉన్నాయని ఆమె చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని విలేకర్ల వద్ద వాపోయింది. దళిత వృద్ధురాలికి కనీసం దళితనాయకులు అండగా నిలిచి.. ఆమెను ఆన్లైన్ ద్వారా మోసం చేసి నగదు తస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నారంటే.. లక్ష్మీనరసమ్మ అకౌంట్లో నగదు గల్లంతు విషయంతో తనకు సంబంధం లేదని ఒంటిమిట్ట ఎస్బీఐ మేనేజర్ వెంకట్రావు తెలిపారు. ఆన్లైన్లో నగదు ట్రాన్స్క్షన్ జరిగి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
కడప అర్బన్ : తమిళనాడు సేలంకు చెందిన ఓ వ్యక్తి కడప–రేణిగుంట రైలుమార్గంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ప్రయాణిస్తూ ఒంటిమిట్ట మండలం మాధవరం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు రాగానే మలుపు వద్ద కాలు జారడంతో రైలు కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించేలోపు మృతి చెందాడు. కడపలోని ఓ హోటల్లో పనిచేస్తూ తమిళనాడు రాష్ట్రం సేలంకు బయలుదేరి వెళ్లాడని, అతని వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా తెలిసిందని రైల్వే ఎస్ఐ శ్యాం సుందర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. -
పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేతల దౌర్జన్యం
-
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు, వివిధరకాల పుష్పాలతో స్వాములవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ మధ్యమండపంలో సీతారాముల విగ్రహాలను సుందరంగా అలంకరించిన కల్యాణవేదికపై కొలువుదీర్చారు. వైభవంగా కల్యాణం నిర్వహించారు. సుండుపల్లి నుంచి పాదయాత్రగా వచ్చిన భక్తులు చేపట్టిన భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోదండరామాలయంలో పోతన సాహితీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పద్యరచన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలనుంచి దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. -
రామా.. కనవేమీ!
♦ ఒంటిమిట్టలో రామ భక్తులకు సౌకర్యాలు కరువు ♦ అంతంత మాత్రంగా స్నానపుగదులు, మరుగుదొడ్ల వసతులు ♦ చాలా రోజులుగా వెలగని ఫ్లడ్‌లైట్లు పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా రెండవమారు కూడా అధికారిక లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించినా భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీరాముడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు అరకొర వసతులతో అల్లాడిపోతున్నారు. సాక్షి, కడప : ఒంటిమిట్టలోని కోదండరాముడి సన్నిధిలో ఆహ్లాదకర వాతావరణంలో గడపాలనుకుంటున్న భక్తులకు నీడ కరువవుతోంది. కనీస సౌకర్యాలు కల్పించే విషయాన్ని టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేస్తానని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పెద్దగా సౌకర్యాలేమీ ఒనగూరలేదు. అభివృద్ధి కూడా నత్తనడకనే సాగుతోంది. ఆలయం ముందువైపు రోడ్డుపైనే భక్తుల పడక ఒంటిమిట్టలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటల్, గదులు ఉన్నా సామాన్యులు అందులో బస చేయడం కష్టతరమే. లాడ్జీల సంగతి దేవుడెరుగు..చివరికి సత్రాలు కూడా లేవు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు మాడవీధులుగా పిలువబడుతున్న సిమెంటు రోడ్లపైనే రాత్రి సమయంలో పడుకోవాల్సి వస్తోంది. అలాగే ఇక్కడి మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగించుకోవడానికి అనువుగా లేవని భక్తులు వాపోతున్నారు. కరెంటు పోతే ఆలయ పరిసరాల్లో చీకటి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి ప్రత్యేకంగా జనరేటర్ సౌకర్యం లేదు. రాత్రి పూట కరెంటు లేకుంటే ఆలయం చుట్టూ పడుకున్న భక్తులకు నరకం కనిపిస్తోంది. పైగా ఆలయ ంవెనుకవైపున మెయిన్‌రోడ్డు పక్కనున్న ఫ్లడ్‌లైట్లు కొద్దిరోజులుగా వెలగడం లేదు. దీంతో అంతా చీకటి వాతావరణం కనిపిస్తోంది. పార్కును తవ్వేస్తున్నారు అభివృద్ధి పేరుతో అధికారులు ఆలయం వెనుకవైపు...రోడ్డు పక్కనున్న పార్కును కూడా తవ్వేశారు. మాడ వీధుల్లో భాగంగా పార్కును తవ్వి సిమెంటు రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం వందల సంఖ్యలో జనం వచ్చి పార్కులో సేద తీరుతూ కాలక్షేపం చేసేవారు. -
నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం
♦ చలువ పందిళ్లతో కళకళలాడుతున్న ఉత్సవ ప్రాంగణం ♦ ఏర్పాట్లు కట్టుదిట్టం.. భారీగా పోలీసుల మోహరింపు ఒంటిమిట్ట: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం రాత్రి 8-10 గంటల మధ్య కల్యాణం నిర్వహించడానికి వేదికను సుందరంగా ముస్తాబు చేశారు. 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, కార్పెట్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవాన్ని భక్తులందరూ తిలకించేందుకు వీలుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహారం, మజ్జిగ, మంచి నీరు అందించేందుకు 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ హాజరవుతుండటంతో 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆలయంలో పూజా విధానాలను పరిశీలించారు. స్వామివారి కల్యాణం నిర్వహించే విధానం, ఏర్పాట్ల గురించి అర్చకులతో చర్చించారు. మోహిని అలంకారంలో రామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఒంటిమిట్ట కోదండరాముడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని మోహిని అలంకారంలో సుందరంగా అలంకరించిన అర్చకులు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారు రాత్రి గరుడ వాహనంపై ఊరేగారు. -
ఉత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు
♦ నేటి నుంచి కోదండరామునికి బ్రహ్మోత్సవాలు ♦ ధ్వజారోహణం, పోతన జయంతి, కవి సమ్మేళనం ♦ 20న సీతారాముల కల్యాణోత్సవం ఒంటిమిట్ట: వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణ గావించారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం చేయనున్నారు. స్వామివారికి జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 20న సీతారాముల కల్యాణోత్సవ నిర్వహణకు 70 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల మేర చలువ పందిళ్లు వేయనున్నారు. ఏటా శ్రీరామనవమి రోజునే పోతనామాత్యుని జయంతిని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులతో శుక్రవారం సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహిస్తారు. రాత్రికి స్వామి వారు శేషవాహనంపై ఊరేగుతారు. రాముడు ఆదర్శం కావాలి: సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రజలకుముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా రెండోసారి నవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సీఎం తెలి పారు. ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడే ఆదర్శం కావాలన్నారు. -
రామయ్య పెళ్లికి..మండపేట బోండాలు
శ్రీరామ నవమినాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలో వినియోగించే కొబ్బరి బొండాలు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తరలనున్నాయి. రంగులను అద్ది, రంగురంగుల రాళ్లు, పూసలు, రిబ్బన్లతో అలంకరించిన ఈ బొండాలు వివాహ వేడుకలో సీతారాముల పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుతరామారెడ్డి 16 ఏళ్ల నుంచి ఏటా క్రమం తప్పకుండా కొబ్బరి బొండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు. రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వతహాగా వివాహాది శుభకార్యాల్లో వినియోగించే కొబ్బరి బొండాలను అందంగా అలంకరిస్తుంటారు. అలా అలంకరించిన బొండాలను సీతారాముల కల్యాణ వేడుకకు కానుకగా అందజేయాలన్న రామారెడ్డి ఆకాంక్షే 2001 నుంచి భద్రాద్రికి బొండాలను తీసుకువెళ్లడాన్ని ఆనవాయితీగా చేసింది. శ్రేష్టమైన బొండాలను సేకరించి, వాటికి ఎనామిల్, వాటర్ పెయింట్లు వేసి, పూసలు, రాళ్లు, రిబ్బన్లవంటివాటితో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అలంకరణ పూర్తయ్యేందుకు దాదాపు 15 రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు. ఎప్పటిలాగానే.. శంఖుచక్రాలు, తిరు నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా కొబ్బరి బొండాలను ముస్తాబు చేశామని, తాము తయారుచేసిన బొండాలను సీతారాముల పాదాల చెంత గొప్ప అనుభూతి కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో భద్రాద్రికి మాత్రమే బొండాలు పంపగా, ఇప్పుడు జిల్లాలో ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ, సత్యవాడ తదితర పది ఆలయాలకు కానుకగా అందజేస్తున్నామన్నారు. గత ఏడాది నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకకు కూడా పంపుతున్నామని, ఈ ఏడాది విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగే కల్యాణోత్సవానికీ పంపామని తెలిపారు. కాగా రామారెడ్డి దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన బొండాలతో గురువారం సాయంత్రం భద్రాద్రి బయలుదేరి వెళ్లారు. -
ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సందర్శంచారు. మంగళవారం ఉదయం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం వచ్చే నెల 12 వ తేదీ నుంచి జర గబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చదలవాడ పరిశీలించారు. -
కూలిన కల్యాణ వేదిక.. ఇద్దరికి తీవ్ర గాయాలు
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో జరగాల్సిన కల్యాణ వేదిక ఏర్పాటులో విషాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణం జరగాల్సి ఉంది. ఇందుకోసం పెట్రోల్ బంక్ సమీపంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం ఉదయం వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో నిర్మాణ పనుల్లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. -
తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు?
తిరుమలకు ఇప్పటికే ఉన్న రెండు ఘాట్ రోడ్లకు తోడు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ తలపెట్టింది. దీనిపై సాధ్యాసాథ్యాలను నిర్ణయించాల్సిందిగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో వైద్య సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. పాలక మండలి సమావేశంలో అనేక అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని రూ100 కోట్లతో అభివృద్ధి చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తొలి విడతగా..రూ.20కోట్లు మంజూరు చేయనున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీమ్ లో శ్రీవారి నగలు ఉంచాలని నిర్ణయించారు. వడ్డీ ఎక్కువగా వచ్చే పక్షంలో ఈ పథకం ఉపయోగించుకోవాలని పాలక మండలి భావిస్తోంది. కోటీ ఆరు లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారి పట్టువస్త్రాలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏకాదశి గందరగోళం.. కాగా.. వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి పాలకమండలి సమావేశంలో పాలక మండలి, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకాదశి పాసుల వ్యవహారం ఇరు వర్గాల మధ్య బేదాభిప్రాయాలకు కారణమని తెలుస్తోంది. ఏకాదశికి కోరినన్ని పాసులు ఇవ్వాలని పాలక మండలి సభ్యులు డిమాండ్ చేశారు. కాగా.. దీనిపై అధికారాలు స్పందించలేదు. దీంతో పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. -
టీటీడీ పరిధిలోకి ఒంటిమిట్ట
ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని టీటీడీలో విలీనం చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రామాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఆగమన శాస్త్ర నియామాల ప్రకారం విలీన కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రంలో డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు పాల్గొన్నారు. -
రాములోరి కోటి తలంబ్రాలకు వరినాట్లు
రాజానగరం: వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందజేయాలని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం సంకల్పించింది. అందుకోసం రాజానగరం మండలంలోని వెలుగుబందలో ఆదివారం హనుమంతుని వేషధారణలో ఉన్న ఓ భక్తునితో సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు నాట్లు వేయించారు. అంతకుముందు నారుమడికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. -
టీడీపీ మరో దాష్టీకం.. ఉపాధ్యాయుడిపై దాడి
వైఎస్సార్ జిల్లా: రోజురోజుకీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవలే మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారనే ఘటన మరువక ముందే వైఎస్ఆర్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ప్రాజెక్టులో నీళ్లు రాలేదని నిలదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యే సాక్షిగా టీడీపీ మండల అధ్యక్షుడు దాడిచేశాడు. వివరాలు.. మండలంలోని సోమశిల ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున్ రెడ్డికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఒంటిమిట్ట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమణ.. ప్రాజెక్ట్ నీళ్లు సరిగా విడుదల చేయడం లేదని నిలదీయడంతో.. ఎమ్మెల్యే మేడా కోపోద్రిక్తుడయ్యాడు. అక్కడే ఉన్న ఒంటిమిట్ట మండల టీడీపీ అధ్యక్షుడు ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా.. ఈ సంఘటనను చూసీ చూడనట్లు వదిలేయడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
వైఎస్సార్ జిల్లా(కడప): కడప పట్టణం సమీపంలో గురువారం ఉదయం 11గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని సబ్‌జైల్ ప్రాంతానికి చెందిన హరి(35) ఐషర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన వాహనంలో వెళ్తుండగా ఒంటిమిట్ట ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో హరి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒంటిమిట్ట ఏఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్
రాయచోటి : ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ జిల్లాలోని రెండు పోలీస్స్టేషన్ల సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ఎస్పీ నవీన్ గులాటి శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సంబేపల్లి హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరు ఎర్రచందనం అక్రమ రవాణాపై స్మగ్లర్లతో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు రావటంతో శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్ర చందనం దుంగలు మాయం కావటంపై స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై ఓబయ్య, కానిస్టేబుల్ భాస్కర్లను ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఒ౦టిమిట్ట రథోత్సవ౦లో వైఎస్ జగన్
-
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
-
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్‌తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. -
నవమి వేడుకలకు చంద్రబాబు దూరం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఆయన కుమారుడు లోకేష్‌కు కుమారుడు పుట్టినందున మైల సందర్భంగా ఒంటిమిట్టలో నిర్వహించే నవమి ఉత్సవాలకు హాజరు కావటం లేదని సమాచారం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వేరే వ్యక్తుల ద్వారా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఒంటిమిట్ట రాముడికి ఏపీ సర్కారు తలంబ్రాలు
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆరోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పుష్కరాలకు వెళితే పదవులు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని వివరించారు. ఈసారి గోదావరి పుష్కరాలకు భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తిరుమలలో రూ.300 దర్శనం టిక్కెట్లు, వసతి సదుపాయాన్నికూడా ఆన్లైన్ ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌కు దేవాదాయశాఖ భూములు ఇంకా ఇవ్వలేదన్నారు. త్వరలోనే రైతులకు ఇచ్చినట్లుగానే పరిహారం తీసుకుని ప్రభుత్వానికి భూములు అప్పగిస్తామని వివరించారు. -
ఈశ్వరయ్యా... ఇదేందయ్యా..!
ఒంటిమిట్ట: ఆయన పేరు ఈశ్వరయ్య. ఉద్యోగం.. మండల తహశీల్దార్. ఆయనకు అధికార పార్టీపై ఎందుకో అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది. సదా మీ సేవలో అంటూ వారి ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడమే విధిగా పెట్టుకున్నట్లున్నారు. అందుకే.. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే తడవు. మండలంలోని పలువురు చౌక దుకాణ డీలర్లను కార్యాలయానికి పిలిపించి ‘మీ పైన ఫిర్యాదులు వస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోండి.. మీకే మంచిది.. లేదంటే డీలర్షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదేంటి ఇన్నేళ్లుగా లేని సమస్య ఇప్పుడేం వచ్చిందబ్బా అంటూ డీలర్లు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కొత్తమాధవరం గ్రామ డీలర్ నాగమురళిని పిలిపించి రాజీనామా చెయ్.. నీకే మంచిదంటూ బెదిరింపు ధోరణిలో సూచించారు. ‘అధికార పార్టీ నాయకుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ డీలర్‌షిప్పులను కొనసాగిస్తే నాకు తలనొప్పులు తప్పవు. ఎందుకొచ్చిన సమస్య.. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైదొలగండి అని సదరు తహశీల్దార్ డీలర్లకు ఉచిత సలహా ఇస్తున్నారు. స్టాకు కోసం డీడీ తీసి ఉంటే డీడీలను వెనక్కు తీసుకోండ ని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తాము ఓట్లు వేశామనే అక్కసుతోనే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తహశీల్దార్ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాసేలా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నా : తహశీల్దార్ ఈ విషయంపై తహశీల్దార్ ఈశ్వరయ్యను వివరణ కోరగా తనకు కొంత మంది డీలర్లపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందువల్ల వారిని పిలిపించి డీలర్‌షిప్‌లు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు చూపించండని కోరగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు.