విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి టీడీపీ మూకలు | Pulivendula Vontimitta ZPTC bypolls August 11th News Updates | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి టీడీపీ మూకలు

Aug 11 2025 10:45 AM | Updated on Aug 11 2025 9:55 PM

Pulivendula Vontimitta ZPTC bypolls August 11th News Updates

పులివెందుల రూరల్‌, ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు(ఆగస్టు 12న) ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే అధికార పార్టీ టీడీపీ అరాచకాలు, వైఎస్సార్‌సీపీ ప్రతిఘటనలతో పులివెందుల ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది.

 

వైఎస్సార్ జిల్లా

  • విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి దూరుతున్న టీడీపీ మూకలు
  • కొత్తపల్లిలో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది మోహరింపు
  • టీడీపీ జమ్మలమడుగు ఇంఛార్జి భూపేష్ రెడ్డి ఆద్వర్యంలో మరో వంద మంది నల్లపురెడ్డిపల్లిలోకి చొరబాటు
  • తుమ్మలపల్లిలో ముసలిరెడ్డిపల్లి రఘు ఆధ్వర్యంలో మరో వందమంది
  • రేపు దొంగ ఓట్లు, కొట్లాటలకు వీరిని వినియోగించనున్న టీడీపీ
  • అయినా ఏమాత్రం స్పందించని పోలీసులు
     

ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి జోగిరమేష్

  • చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడు

  • దీన్ని ఎన్నిక అంటారా? చంద్రబాబు

  • చంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందా

  • ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు

  • గతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించాడు

  • పులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదు

  • ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది

  • పులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నాడు

  • ప్రతీ పోలింగ్ కేంద్రం... లోపలా... బయట... సీసీ కెమెరాలు పెట్టాలని కోరాం

  • పులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించాడు

  • ఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైసీపీనే

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది వైసీపీ జెండానే

చంద్రబాబూ.. ఇంత దిగజారాలా?: పేర్ని నాని

  • ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి పేర్ని నాని

  • పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది

  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

  • కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు

  • ఓటుకి పదివేలు ఆశచూపిస్తున్నారు

  • ఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు

  • గన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కే రక్షణ లేదు

  • అవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారు

  • దాడులు చేస్తాం.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు

  • పోలీసులు.. షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారు

  • రికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరు

  • చంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టీడీపీ వాళ్లే 5 వేలు నొక్కేస్తున్నారు

  • రేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలి

  • కాల్ సెంటర్ పెట్టాలి.. స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలి

  • ఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి

పులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు

  • రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు,దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి నేతలు

  • ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్న టీడీపీ నేతలు

  • ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులిస్తున్న టీడీపీ నేతలు

  • ఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్న టీడీపీ నేతలు

  • టీడీపీ ప్రలోభాల పై ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్,జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్,, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు

పులివెందులలోనే కూటమి నేతల తిష్ట

  • పులివెందుల మండలంలోనే కూటమి నేతలు

  • ఎన్నికల ప్రచార గడువు ముగిసినా పల్లెల్లో తిష్ట వేసిన టీడీపీ నేతలు

  • ఎర్రబెల్లి, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి,  పుత్తా చైతన్య రెడ్డి

  • అయినా పట్టించుకొని పోలీసులు

ఎస్‌ఈసీ వద్దకు వైసీపీ నేతలు

  • మరికొద్ది సేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న వైసీపీ నేతలు

  • పులివెందుల జడ్పీటిసి ఎన్నికల్లో టిడిపి ప్రలోభాలు, దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు 

  • వైసీపీ నేతల రాక నేపధ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు బందోబస్తు

టీడీపీ నేతల కుట్రలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్

  • ఓటరు స్లిప్పులను టీడీపీ నేతలు తీసుకోవటంఫై వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ ఆగ్రహం

  • కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు

  • ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు

  • మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే  తీసుకెళ్లాం

  • అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు

  • టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు

  • డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు

  • దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు

  • తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది

  • ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోంది

  • ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి

  • ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్‌లను అందించాలి

  • ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి

  • ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు

  • ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు

  • మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు

  • నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు

  • ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు

  • రిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు

  • నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు

  • దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలి

పోలింగ్‌ బూత్‌ల మార్పు.. హైకోర్టులో విచారణ

  • ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ లంచ్ మోషన్ పిటిషన్

  • పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా  పోలింగ్ బూతులు మార్పులు సవాలు చేస్తూ పిటిషన్

  • మధ్యాహ్నం విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

  • ఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్‌ల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషన్

పులివెందులలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కారుమూరి

  • తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

  • స్వతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు.

  • ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది.

  • తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణకు  72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే.

  • ఎలక్షన్ జరిగిన తర్వాత  ఈవీఎం ట్యాపరింగ్లు జరిగిందని చెప్పిన  మొదటి వ్యక్తి నేనే.

  • ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు .

  • కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు.

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.

పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు

  • పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి సందర్భంలో నిర్వహించిన ర్యాలీపై పోలీసుల కేసు

  • వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టిన పోలీసులు

  • హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ

  • ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను సోమవారం ఆదేశించిన హైకోర్టు

పులివెందుల ఆగని పోలీసుల దాష్టీకం

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల దాష్టీకం

  • వైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధం

  • ఆరుగురిని ఆదివారం ఉదయం నుంచి పీఎస్‌లోనే ఉంచిన ఖాకీలు

  • పులివెందుల అప్‌గ్రేస్‌ పీఎస్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులు

  • పోలీసుల అదుపులో అర్జున్ (మొట్నుతలపల్లి), మస్తాన్ వలి (చంద్రగిరి), హరి (మల్లికార్జునపురం), మైసూరారెడ్డి (లక్షుంవారిపల్లి), రవి ప్రకాష్ రెడ్డి, నాయక్ (కనంపల్లి)

  • ఎన్నికల నేపధ్యంలో కీలకంగా ఉన్న నాయకులను వేధిస్తున్నారంటున్న వైఎస్సార్సీపీ

  • పోలింగ్ టీడీపీకి అనుకూలంగా మార్చడానికే అక్రమ నిర్బంధం అంటున్న వైఎస్సార్సీపీ

ఒంటిమిట్టలో..

  • ఒంటిమిట్టలో పోలింగ్‌ ఏర్పాట్లపై అధికారుల స్పందన

  • మీడియాతో మాట్లాడిన రిటైనింగ్ అధికారి రామలింగయ్య 

  • రేపు 7 గంటల నుండి 5గంటల వరకు పోలింగ్

  • ప్రతి పోలింగ్ స్టేషన్‌కి నలుగురు అధికారులు

  • బ్యాలెట్ బాక్స్ లు, ఎలక్షన్ మెటీరియల్ అందిస్తున్నాం..

  • సెక్యూరిటీతో పాటు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తున్నాం..

  • రేపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం మౌలానా అబ్దుల కలాం  ఆజాద్ యూనివర్సిటీ లో భద్రపరుస్తాం

  • 14వ తేదీ కౌంటింగ్ ఉంటుంది

పులివెందుల మండలంలో నేడు..

  • స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్స్ ల పంపిణి ప్రారంభం

  • జెడ్పీటీసీ ఉపఎన్నిక కు కావాల్సిన బ్యాలెట్ బాక్స్ ల పంపిణి చేస్తున్న ఎన్నికల అధికారులు

  • పోలింగ్ సిబ్బంది కి బూత్‌లవారీగా ఎలక్షన్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణి

  • పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 15 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు

  • పోలింగ్ బూత్‌ల సిబ్బందికి ఎలక్షన్ సామగ్రి పంపిణి

రోజుకో కుట్ర.. కూటమి కుయుక్తి

  • జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ప్రభుత్వ అడ్డదారులు

  • వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు

  • అదే సమయంలో ఓటర్లకూ వేధింపులు

  • పోలింగ్ బూత్‌ల మార్పు తో ఓటర్లకు ఇబ్బంది

  • ఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రం

  • పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, ఓటర్లు నిలువరించే ప్రయత్నాలు చేస్తారని వైఎస్సార్సీపీ పిర్యాదు

  • ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ, గవర్నర్‌లకు వినతి

టార్గెట్‌ వైసీపీ కేడర్‌

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా టీడీపీ అరాచకాలు 

  • ఇప్పటికే దాడులు, హత్యయత్నాలతో అట్టుడుకుతున్న పులివెందుల

  • గ్రామాల్లో కీలక వైఎస్సార్సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో అరెస్ట్

  • వందల మందిపై బైండోవర్ కేసులు

  • పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలు

  • కూటమి కుట్రలతో రణరంగంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక

  • పులివెందుల, ఒంటిమిట్ట మొత్తం 750 మందిపై బైండోవర్‌ కేసు

  • ఒక్క పులివెందుల మండలంలోనే 500 మందిపై బైండోవర్ కేసులు

  • 52 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు, 9 మంది వైఎస్సార్సీపీ నాయకులను రిమాండ్ కు పంపిన పోలీసులు

కోడ్‌ ఉల్లంఘించి మరీ.. 

  • ప్రచార సమయం ముగిసిన కొనసాగుతున్న టీడీపీ పాలిటిక్స్ 

  • ఒంటిమిట్టలో ఏదేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కూటమి కీలక నేతలు

  • ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన ప్రచారం

  • ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతర్ చేసిన కూటమి ప్రభుత్వ నేతలు 

  • ఆరు గంటల టైంలోనూ హరిత హోటల్ లో మకాం వేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ...

  • ముఖ్య నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు

పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు.. రేపే పోలింగ్‌

  • పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం

  • రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్

  • పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు

  • పులివెందులలో 10,601 ఓట్లు, ఒంటిమిట్టలో 24,600 ఓట్లు

  • పులివెందులలో భారీ బందోబస్తు

  • సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న పోలీసులు

  • పులివెందులలో ఐదు, ఒంటిమిట్టలో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు

  • ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘా

  • రెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు

  • పోలింగ్‌ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement