కడప అర్బన్ : తమిళనాడు సేలంకు చెందిన ఓ వ్యక్తి కడప–రేణిగుంట రైలుమార్గంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ప్రయాణిస్తూ ఒంటిమిట్ట మండలం మాధవరం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు రాగానే మలుపు వద్ద కాలు జారడంతో రైలు కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించేలోపు మృతి చెందాడు. కడపలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ తమిళనాడు రాష్ట్రం సేలంకు బయలుదేరి వెళ్లాడని, అతని వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా తెలిసిందని రైల్వే ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు.