వైఎస్సార్ జిల్లా కలెక్టర్ హరికిరణ్(పాత చిత్రం)
వైఎస్సార్ జిల్లా: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం కోసం మంజూరు చేసిన పాసుల విషయంలో గందరగోళం నెలకొంది. మంజూరైన పాసుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. విలేకర్ల పాసుల విషయంలో మీడియా ప్రతినిధులు కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. మీరు పాసులు అమ్ముకుంటారు.. మీరు కుటుంబాలతో వస్తే బయటకు తోసేస్తాం అంటూ కలెక్టర్ హరికిరణ్ దురుసుగా మాట్లాడారు.
కలెక్టర్ వ్యాఖ్యల పట్ల విలేకరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట కల్యాణోత్సవాన్ని బహిష్కరించాలని స్థానిక విలేకరులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రేపు ప్రత్యక్ష ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment