వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో జరగాల్సిన కల్యాణ వేదిక ఏర్పాటులో విషాదం చోటు చేసుకుంది.
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో జరగాల్సిన కల్యాణ వేదిక ఏర్పాటులో విషాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణం జరగాల్సి ఉంది. ఇందుకోసం పెట్రోల్ బంక్ సమీపంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం ఉదయం వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో నిర్మాణ పనుల్లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.