టీటీడీ పరిధిలోకి ఒంటిమిట్ట | vontimitta temple merge in TTD | Sakshi
Sakshi News home page

టీటీడీ పరిధిలోకి ఒంటిమిట్ట

Published Wed, Sep 9 2015 8:54 AM | Last Updated on Mon, May 28 2018 1:08 PM

vontimitta temple merge in TTD

ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని టీటీడీలో విలీనం చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రామాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఆగమన శాస్త్ర నియామాల ప్రకారం విలీన కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రంలో డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement