ఏప్రిల్ 4 నుంచి రాములోరి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 4 నుంచి రాములోరి బ్రహ్మోత్సవాలు
Published Sat, Mar 11 2017 9:48 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
వైఎస్సార్ జిల్లా: రెండో అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్ధానం షెడ్యూల్‌ను రూపకల్పన చేసింది. ఏప్రిల్ 4 అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 5 న ధ్వజరోహణ, 8న హనుమంత సేవ, 9న గరుడ వాహనం ఊరేగింపు, 10న సీతారామ కళ్యాణం, 11న రధోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25, 26 బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పనులు పూర్తి అయ్యేలా ఈఓ, జేఈఓలు దృష్టి సారించనున్నారు. టీటీడీ పరంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించనున్నారు.
Advertisement
Advertisement