
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ఏఎస్పీ తుషార్ డూడి
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట మండలం నర్వకాటపల్లి గ్రామ సమీపంలోని యల్లాపుల్లల బావికొండ వద్ద తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. వారి నుంచి 49 ఎర్రచందనం దుంగలను (టన్ను బరువు), రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరెస్టు అయినవారిలో మహమ్మద్ బాషా (నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్‌పేట), మేడితరాజు మల్లేశ్వరరాజు(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, మాధవరంపోడు), గెనే నాగభూషణం(తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, అరిగిలవారిపల్లి), ఎలప్పు బాలచంద్రయ్య(నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం), గుండం మునికుమార్, నాగూర్ మునివేలు, పరుకూరు లోకేష్ (తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం, బంగారమ్మ కండ్రిగ), వీసం రాజారెడ్డి(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, ఎస్.ఉప్పరపల్లె), ఆవులూరి సుబ్రహ్మణ్యం(రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట) ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment