red sandalwood smugglers
-
బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు
కేవీపల్లె/పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టాస్‌్కఫోర్స్ పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వివరాలు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి కేవీపల్లె, సుండుపల్లె మండలాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్ఎస్ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కేవీ పల్లె మండల సరిహద్దు వద్ద గస్తీ కాస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున కేఏ 02 ఎంజీ 2847 నంబర్ కలిగిన స్విఫ్ట్ కారు అటుగా దూసుకువచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారు వేగంగా వచ్చి కానిస్టేబుల్ బి.గణేశ్(40)ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే గణేశ్ మృతి చెందాడు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కారును చుట్టుముట్టేసరికి ముగ్గురు స్మగ్లర్లు పారిపోగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఏడు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గణేశ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం విధి నిర్వహణలో గణేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ మానవత్వంతో స్పందించారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.30 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని అనంతపురం డీఐజీ వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రి వద్ద గణేశ్ మృతదేహానికి డీఐజీ, ఎస్పీ, టాస్‌్కఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నివాళులర్పించారు. గణేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. గణేశ్‌కు నివాళులర్పించిన వారిలో డీఎస్పీ మహబూబ్‌బాషా, డీఎఫ్‌వో వివేక్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, ఎఫ్ఆర్వో రామ్లానాయక్, సీఐలు మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లెకు చెందిన గణేశ్.. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తిరుపతి టాస్‌్కఫోర్స్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. గణేశ్‌కు భార్య అనూషతో పాటు కుమారులు రాజకిశోర్(6), వేదాన్‡్ష(3) ఉన్నారు. పీలేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గణేశ్ కుటుంబసభ్యులు.. అతని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
9 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట మండలం నర్వకాటపల్లి గ్రామ సమీపంలోని యల్లాపుల్లల బావికొండ వద్ద తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. వారి నుంచి 49 ఎర్రచందనం దుంగలను (టన్ను బరువు), రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరెస్టు అయినవారిలో మహమ్మద్ బాషా (నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్‌పేట), మేడితరాజు మల్లేశ్వరరాజు(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, మాధవరంపోడు), గెనే నాగభూషణం(తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, అరిగిలవారిపల్లి), ఎలప్పు బాలచంద్రయ్య(నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం), గుండం మునికుమార్, నాగూర్ మునివేలు, పరుకూరు లోకేష్ (తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం, బంగారమ్మ కండ్రిగ), వీసం రాజారెడ్డి(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, ఎస్.ఉప్పరపల్లె), ఆవులూరి సుబ్రహ్మణ్యం(రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట) ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. -
‘పుష్ప’ను మించిపోతున్న ఎర్ర స్మగ్లర్లు!
చిత్తూరు అర్బన్: ఎర్ర స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ఎర్రచందనం దుంగలను అనుకున్న చోటుకి చేరవేస్తున్నారు. అయితే పోలీసులు కూడా డేగ కళ్లతో అలాంటి వారి ఆటలను కట్టిపెడుతున్నారు. తాజాగా అంబులెన్స్‌లో రోగిని ఎక్కించుకుని వెళుతున్నట్టు నటిస్తూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా, నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటో ముసుగులో ఎర్ర దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో గురువారం ఎస్పీ రిషాంత్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు మీడియాకు వివరాలు వెల్లడించారు. చిత్తూరు మీదుగా తమిళనాడులోని వేలూరుకు పలు అంబులెన్స్‌లు రోజూ పదుల సంఖ్యలో వెళుతుంటాయి. వాటిలో రోగులను తీసుకెళుతున్నట్టుగా డ్రామాలాడుతూ రోగి సహాయకుల వేషంలో స్మగ్లర్లు రోజూ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తీసుకెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. చిత్తూరు తూర్పు సీఐ బాలయ్య, ఎస్ఐ రామకృష్ణలు సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం చిత్తూరు–వేలూరు రోడ్డులోని మాపాక్షి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ అటుగా వస్తున్న అంబులెన్స్‌నూ తనిఖీ చేసేందుకు నిలిపారు. అందులో 15 మంది ఉండగా.. తనిఖీచేస్తుండగా నలుగురు పారిపోయారు. మిగిలిన వాళ్లను కిందకి దింపి వాహనాన్ని తనిఖీ చేయగా.. 36 ఎర్రచందనం దుంగలు, చెట్లను నరికే గొడ్డళ్లు, కత్తులు దొరికాయి. తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన శివాజీ, కాశి, దేవరాజ్, రాధాకృష్ణ, సెల్వం, కుప్పుస్వామి, ప్రశాంత్, జయపాల్, ఉదయ్‌కుమార్, సత్యరాజ్, భాగ్యరాజ్‌లను అరెస్ట్ చేశారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులున్నట్టు ఎస్పీ తెలిపారు. అంబులెన్సులో దాచిన ఎర్రచందనం దుంగలు నీళ్ల క్యాన్ల కింద ఎర్ర చందనం చిత్తూరు నగరం చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై పశ్చిమ సీఐ శ్రీనివాసులురెడ్డి, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్‌లు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటోను తనిఖీ చేయగా 35 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో తమిళనాడు చెన్నైకు చెందిన లక్ష్మీపతి, సామువేలు, ప్రవీణ్‌కుమార్, ముత్తురాజ్‌లను అరెస్ట్ చేశారు. ఈ రెండు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు, ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. ఈ కేసుల్లో మరికొందర్ని అరెస్ట్చేయాల్సి ఉందన్నారు. -
పుష్ప సినిమా సీన్.. రియల్‌గా ఎక్కడంటే?
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో ఓ సీన్ ఇది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ఓ ప్రదేశంలో దాచి ఉంచుతారు. ఆ ప్రదేశం గురించి పోలీసులు తెలుసుకుంటారు. వారు అక్కడికి వెళ్తున్న సమాచారం స్మగ్లర్లకు చేరడంతో ఆ సినిమా హీరో, మరికొందరు వెంటనే దుంగలను పక్కనే ఉన్న నీటి ప్రవాహంలోకి నెట్టేస్తారు. హీరో తన అనుచరుడి ద్వారా జలాశయ అధికారికి ముడుపులిచ్చి గేట్లు మూయించేస్తాడు. ఈ సీన్ మొత్తం రక్తి కట్టిస్తుంది. ఇలాంటి సీన్ జిల్లాలోని సోమశిల జలాశయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు విలువైన దుంగలను నరికించి ఎవరికీ అనుమానం రాకుండా జలాశయంలో దాచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నెల్లూరు: జిల్లా జలనిధిగా ఉన్న సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం ఎక్కవ భాగం వైఎస్సార్ జిల్లాలో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 48 చదరపు కి.మీ విస్తరించి ఉంది. ఆ ఫారెస్ట్‌లో ఎర్రచందనం వృక్షాలున్నాయి. నాణ్యత కలిగిన దుంగలు ఇక్కడ లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. దీనికితోడు జలాశయ లోతట్టు ప్రాంతం కావడంతో రవాణా మార్గానికి అనువుగా ఉండదు. దీంతో అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఆ వైపు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతుంటారు. తమ పరిధి కాదంటూ.. గతంలో సోమశిల జలాశయంలో ఓ ఇంజినీర్ లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి గేటు తాళం తనవద్దే ఉంచుకుని అక్రమ చేపల వేటకు, ఎర్ర స్మగ్లర్లకు రాత్రి వేళల్లో సహకరించి అధికారులకు దొరికిన సందర్భం ఉంది. కానీ ఆ అధికారి రాజకీయ పరపతితో కేసు లేకుండా తప్పించుకోగలిగాడు. మూడు రోజుల క్రితం 11 దుంగలు జలాశయంలో బయటపడ్డాయి. వాస్తవానికి దీని గురించి ముందే తెలిసినా అటవీశాఖ, పోలీస్ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో కాదంటూ పట్టించుకోలేదు. తాజాగా దుంగల ఫొటోలతో సహా సోషల్ మీడియాలో రావడంతో హడావుడిగా స్వాధీనం చేసుకున్నట్లుగా అటవీ శాఖ ప్రకటించింది. ఇలా చేస్తున్నారు.. జలాశయం లోతట్టు ప్రాంతంలో ఇరువైపులా చేపలు పట్టే జాలర్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా ఎర్ర స్మగ్లర్లకు సహకరించే వ్యక్తుల ద్వారా కొందరు జాలర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా పడవలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అలాగే తమిళ కూలీలను కూడా ఇదే పద్ధతిలో చేర్చి ఎర్ర వృక్షాలను నరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దుంగలను జలాశయం లోతట్టు కోనల్లోని నీటిలో నిల్వ ఉంచుతారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసినా కనిపించని విధంగా నీటిలో డంపింగ్ చేస్తారు. వారికి అనువైన సమయంలో ఆ డంప్‌ను రవాణా చేసుకుంటారు. ఇలా విలువైన సంపద తరలిపోతున్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలున్నాయి. పక్కా సమాచారం ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎర్ర అక్రమార్కుల సహకారంతోనే దుంగలు తరలుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎవరు దొంగలో కూడా స్థానిక అటవీ, పోలీస్ శాఖకు పక్కా సమాచారం ఉంది. అయితే అక్రమార్కులతో ఉన్న లోపాయికారి ఒప్పందంతో వారు పట్టుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఏదైనా ఒత్తిడి వచ్చినా, సమాచారం బహిరంగమైతే అప్పటికప్పుడు అధికారులు నాణ్యత లేని దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన దుంగల విషయంలో కూడా అధికారులు పట్టించుకోకపోగా సమాచారం ఇచ్చిన మీడియాపై రుసరుసలాడడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు చెబితే సస్పెండ్ చేయాలా? సోమశిల జలాశయంలో ఎర్రచందనం దుంగల డంప్‌పై మీడియా సమాచారం ఇస్తే వెంటనే మేము స్థానిక అధికారులను సస్పెండ్ చేయాలా?. మూడు రోజల క్రితం జరిగింది అని చెబుతున్నారు. అవన్ని మేము పరిశీలిస్తాం. విచారణ జరిపిస్తాం. – షణ్ముగకుమార్, డీఎఫ్ఓ, నెల్లూరు -
పేట్రేగిన ‘ఎర్ర’ దొంగలు
భాకరాపేట: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల తమిళ దండు దందా పేట్రేగిపోతున్నది. భాకరాపేట ఫారెస్టు రేంజర్ పట్టాభి కథనం మేరకు.. మూడు రోజుల క్రితం పీలేరు రూరల్ సీఐ, ఎర్రావారిపాళెం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 12 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. పారిపోయిన మరికొంతమంది కోసం తలకోన అటవీ ప్రాంతాన్ని రెండు రోజులుగా జల్లెడ పడుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున తలకోన సెంట్రల్ బీట్ పరిధిలో గాలిస్తుండగా..దొర్రికనుమ ప్రాంతంలో దుంగలు తీసుకొస్తూ కొంతమంది తారసపడ్డారు. వీరిని చుట్టుముట్టే క్రమంలో.. ఆ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వారిని ఎదురుగానే ఎదుర్కోవాల్సి వచ్చింది. దొంగలు దుంగలు పడేసి రాళ్లు రువ్వుతూ పరుగులు దీశారు. వారిని వెంబడించగా కాటర్బాల్ సహాయంతో రాళ్లు రువ్వుతూ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు.1,103 కిలోల బరువు గల 36 దుంగలను స్వాధీనం చేసుకుని భాకరాపేట ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చినట్లు రేంజర్ తెలిపారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో ఎఫ్ఎస్వో రవిరావు, ఎఫ్‌బీవో వందనకుమార్, వినోద్‌కుమార్, శంకర్, బేస్‌క్యాంపు సిబ్బంది, తలకోన సీబీఈటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్లువీళ్లు ఒక్కటేనా? 2 రోజుల క్రితం జరిపిన దాడుల్లో పట్టుబడ్డ తమిళ స్మగ్లర్లు, మంగళవారం తప్పించుకున్న స్మగ్లర్లు ఒక బృందంలోని వారేనా అనే కోణంలో అటవీ అధికారులు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. -
ఎర్రచందనం స్వాధీనం: ఒక స్మగ్లర్ల అరెస్టు
-
దర్జాగా స్మగ్లింగ్.!
ఖాజీపేట : ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో అటు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పూర్తిగా విఫలమవుతూనే ఉన్నారు. నామమాత్రం గా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో స్మగ్లర్లు తమదైన సమాచారంతో ఎప్పటికప్పడు రవాణా మార్గాలు మార్చుకుంటూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఖాజీపేట మండలం, మైదుకూరులోని కొండకు ఆనుకుని ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి అడ్డగా మారాయి. ఈ విషయం ఇటు ఫారెస్ట్ అధికారులకు స్థానిక పోలీసులకు బాగా తెలుసు. ఎందుకంటే కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారుల పైకి దుంగలను తీసుకు పోయేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అతి తక్కువ సమయంలో అంటే కేవలం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే సురక్షితంగా తీసుకెళ్లవచ్చు. అందుకే స్మగ్లర్లు ఇదే రాచ మార్గంగా ఎంచుకుని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఎన్ని సార్లు దుంగలు పట్టుకున్నా రహదారులు మార్చుతున్నారు తప్ప అక్రమ రవాణా మాత్రం ఆగక పోవడం విశేషం. రూటు మార్చిన తమిళ కూలీలు స్థానిక, బడా స్మగ్లర్లు తమిళ కూలీలను అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నారన్నది అధికారులందరికి తెలిసిన విషయమే. గతంలో కన్నెల వాగు చెరువు నుంచి వచ్చిన ఎర్రచందనం దుంగలను పంట పొలాల గుండా తీసుకు వచ్చి పొలాల్లో లేక హైవే కల్వర్టుల వద్ద ఉంచి క్షణాల్లో వాహనాల్లోకి ఎక్కించి రవాణా చేసేవారు. అలాగే తమిళ కూలీలు కొత్తనెల్లూరు, చెన్నూరు బ్రిడ్జి వద్ద నుంచి చక్కెర ఫ్యాక్టరీ మీదుగా, కొత్తపేట వద్ద హైవే పై నుంచి అడవుల్లోకి వెళ్లేవారు. తాజాగా వారు రహదారులు పూర్తిగా మార్చేశారు. నాగసానిపల్లె నుంచి అలాగే భూమాయపల్లె సమీపంలోని రహదారులు, కేసీ కాలువ, తెలుగుగంగ రహదారుల గుండా అడవుల్లోకి వెళుతున్నారు.. అలాగే అడవులనుంచి తీసుకు వచ్చిన దుంగలను నాగసానిపల్లె చిలకకనం వద్ద నుంచి చెన్నముక్క పల్లె వరకు ఉన్న తెలుగు గంగ కాలువలో, దాని పై భాగాన ఉన్న అడవి మార్గంలో దాచుతున్నారు. అలా దాచిన దుంగలను వాహనం వచ్చిన వెంటనే వాహనంలోకి లోడ్ చేసి ప్రధాన రహదారి గుండా రాజమార్గంలో రవాణా చేస్తున్నారు. పోలీసులకు దొరికి భారీ డంప్ తెలుగు గంగ కాలువలో గత బుధవారం ఖాజీపేట పోలీసులు జరిపిన కూంబింగ్ లో భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 71 దుంగలు తెలుగు గంగ కాలువలో లభ్యమయ్యాయి. అందులో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు స్థానిక స్మగ్లర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే దొరికిన తమిళ కూలీల్లో ఒకరిని ఎలాంటి విచారణ జరపకుండా 26వ తేదీనే కేసు నమోదు చేసి జైలుకు పంపడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పోలీసులకు దుంగలు దొరకడం ఇదే ప్రథమం. అలాంటిది తెరవెనుక పాత్రధారుల పై విచారణ ఎందుకు జరపలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. పండుగలే టార్గెట్ స్మగ్లర్లు పండుగలను టార్గెట్ చేసుకుని రవాణా భారీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వినాయక చవితి అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసుల నిఘా పూర్తిగా తగ్గింది. అలాగే కూంబింగ్ కూడా సక్రమంగా లేదు. ఈ సమయాల్లో నే అత్యధికంగా రవాణాకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్ల పాత్రపై దర్యాప్తు ఏదీ.. ఇటీవల నమోదైన కేసులను పరిశీలిస్తే కేవలం తమిళ కూలీలను మాత్రమే అరెస్టు చూపుతున్నారు. దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెబు తున్నారు తప్ప తెర వెనుక ఉన్న స్మగ్లర్లను బయటకు తీయడంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విఫలమవుతున్నారు. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన తమిళకూలీలు ఇక్కడ నుంచి ఇంత దర్జాగా రవాణా చేస్తున్నారంటే తెరవెనుక స్థానికులతోపాటు బడా స్మగ్లర్ల హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. అయితే తమిళ కూలీలకు చేయూతనందిస్తున్న స్థానికులు ఎవరు.. వారికి బడా స్మగ్లర్లతో ఉన్న లింకు ఏమిటి.. ఈ అక్రమ రవాణాలో ఎవ్వరి పాత్ర ఎంత అన్న దాని పై నిఘా పూర్తిగా తగ్గింది. దీంతో దొరికితే జైలుకు వెళ్లేది తమిళ కూలీలే కదా అంటూ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిఘా పెంచి స్మగ్లర్ల ఆటకట్టించి ఎంతో విలువైన ఎర్రచందనాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిఘా ఏమైంది.. అడవుల్లోని ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా అటవీ శాఖ అధికారులపై ఉంది. అయితే గత ఏడాది గా నిఘా పూర్తిగా విఫలమైందని స్థానికులు అంటున్నారు. 2017 మార్చి నుంచి మే వరకు జరిగిన దాడుల్లో ఫారెస్ట్ అధికారులు సుమారు 300 మంది తమిళకూలీలను అరెస్టు చేయడంతో పాటు 400 దుంగలను స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించారు. అలాగే పోలీసులు కూడా సుమారు 100 మందికి పైగానే అరెస్ట్ చేశారు. అయితే గత ఏడాది గా పరిశీలిస్తే ఎలాంటి దాడులు లేవు. నామమాత్రంగా దాడులు చేసి తరువాత చేతులు ఎత్తేస్తున్నట్లు సమాచారం. దీంతో తమిళ కూలీలు వందల సంఖ్యలో బ్యాచ్‌లుగా విడిపోయి వివిధ మార్గాల ద్వారా అడవుల్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. -
ఎర్రచందనం దుంగలు.. ‘హెరిటేజ్’ దొంగలు
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి - గాల్లోకి కాల్పులు.. స్మగ్లర్లు పరార్..71 దుంగలు స్వాధీనం - ఇది టీడీపీ నేతల పనేనని అనుమానాలు - స్మగ్లర్ల జాబితాలో పలువురు అధికార పక్ష నేతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: హెరిటేజ్ పాల వ్యాన్‌లో తరలివెళ్తున్న ఎర్రచందనం దుంగలు మంగళవారం చిత్తూరు జిల్లాలో పోలీసులకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ వాహనంలో ఎర్రచందనం కనిపించగానే పోలీసులు విస్మయానికి గురయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ఆయన కంపెనీకి చెందిన వాహనంలో దుంగలను తరలిస్తున్నారంటే స్మగ్లర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు ఎంతగా బరితెగించారో ఇట్టే అర్థమైపోతోంది. పోలీసులపై రాళ్లు రువ్వి.. దాడులకు తెగబడ్డారంటే అషామాషీ వ్యవహారం కాదని, అధికారం అండ చూసుకునే ఇంతగా చెలరేగిపోయారని స్పష్టమవుతోంది. గతంలోనూ ఇదే రీతిలో పలు ఘటనలు చోటుచేసుకున్నా, పాలకులకు జడిసి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే టీడీపీ నేతలు పేట్రేగిపోయారని బట్టబయలైంది. ముఖ్యనేత అండ ఉంటే తప్ప ఈ రీతిలో స్మగ్గింగ్కు సాహసించరని అటవీ, పోలీసు శాఖలకు చెందిన పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లె వద్ద భారీ ఎర్రచందనం డంప్ బయట పడటం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలు ప్రత్యక్షంగా పట్టుపడటం.. తదితర ఘటనలు వరుసగా చోటుచేసుకున్నా కంటితుడుపు చర్యలు మినహా అసలు నిందితులను ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఏమార్చి ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటించడానికి సులువైన మార్గంగా హెరిటేజ్ వాహనాలను ఉపయోగించుకుంటున్నారని తేటతెల్లమైంది. ఇది ఎర్ర స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ టాస్క్ఫోర్సు ఐజీ కాంతారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరిస్తూ ఇది కొత్త ఎత్తుగడగా పేర్కొన్నారు. ‘మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విజయ నరసింహ బృందం కూంబింగ్ ముగించుకుని తిరుగు ముఖం పట్టింది. అదే సమయంలో వీరికి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కచ్చితమైన సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు అటుగా అడుగులు వేశారు. తిరుపతి బీడీకాలనీ మీదుగా మొండోడికోన అడవుల్లోకి ప్రవేశించగానే సుమారు వంద మందికి పైగా ఎర్ర చందనం దొంగలు భుజాలపై దుంగలతో ఎదురు పడ్డారు. అకస్మాత్తుగా పోలీసులు ఎదురు పడటంతో ఏం చేయాలో తోచని స్మగ్లర్లు కొండరాళ్లతో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భీతిల్లిపోయిన స్మగ్లర్లు దుంగలను కింద పడేసి అడవిలోకి పరారయ్యారు. అరగంట తర్వాత సంఘటనా స్థలిలో పోలీసులు 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఓ నాటు తుపాకీ కూడా లభ్యమైంది. అక్కడికి కొద్ది దూరంలో ఆగి ఉన్న హెరిటేజ్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌లో ఉన్న మరో 8 దుంగలను, వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. సుమారు రెండున్నర టన్నుల బరువున్న ఎర్రచందనం విలువ రూ.80 లక్షలకు పైనే ఉంటుంద’ని ఆయన వివరించారు. పట్టుబడిన వాహనంపై టీఎన్ 18ఎం8996 నంబరు ఉంది. దానిపై పెయింట్ వేసి, స్మగ్లర్లు.. ఏపీ 26 టీసీ4187 నంబరు రాశారు. ఈ వాహనం నెల్లూరుకు చెందిన ఒర్సాల ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు ఆర్టీఓ వెబ్సైట్ తెలియజేస్తోంది. దీనిని అతను ఏడు నెలల క్రితం కలికిరికి చెందిన మహేశ్ అనే వ్యక్తికి అమ్మాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ► సీఎం సొంత జిల్లాలో ఆయన అండ లేకుండా ఆయన కంపెనీ వాహనాన్ని ఎవరు ఉపయోగిస్తారు? ► హెరిటేజ్ వాహనంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? ► వంద మంది దాడికొస్తే పోలీసులు ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారా? ► గతంలో నారావారి పల్లె వద్ద డంప్ దొరికింది నిజం కాదా? అందులో టీడీపీ నేతల ప్రమేయం లేదా? ► గతంలోనూ దుంగలను తరలిస్తూ హెరిటేజ్ వాహనం పట్టుపడలేదా? ► ఎర్రచందనం స్మగ్లర్లతో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం నిజం కాదా? ► ఎర్ర స్మగ్లర్లకు సీఎంతో సంబంధాలున్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా? ► పట్టుబడిన టీడీపీ నేతలపై ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? -
పోలీస్ డైరీ నిప్పులాంటి నిజాలు
-
చంద్రబాబు స్మగ్లర్ల ముఖ్యమంత్రి
-
చంద్రబాబు స్మగ్లర్ల ముఖ్యమంత్రి
► ‘ఎర్ర’దొంగలకు ‘పచ్చ’ నేతలు బాసటగా నిలుస్తున్నారు ► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లు, దానికి కాపు కాస్తున్న పెదకాపు ప్రభుత్వం.. అంతా ఒక్కటై శేషాచల కొండల్లోని అపారమైన ప్రకృతి సంపదను కొల్లగొడు తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. వేలూరు, జావాది హిల్స్‌లో తిరువన్నావలైకి సంబంధించిన వాళ్లతో పచ్చ నేతలే ‘ఎర్ర’ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కోటానుకోట్ల ప్రకృతి సంపద తరలిపోతున్నా పట్టించుకోని స్మగ్లర్ల సీఎం చంద్రబాబు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ దోపిడీని ఎండగట్టారు. తాను అధికారంలో కొచ్చాక ఎర్రచందనం దొంగల్ని ఏరేస్తా.. ‘ఎర్ర’సంపదను కాపాడతానని బీరాలు పలికిన చంద్రబాబు.. దాన్ని దోచేస్తున్నారన్నారు. టీడీపీవాళ్లు కోట్లకు కోట్లు సంపాదించాలని అడవితల్లిని వనరుగా మార్చారని మండిపడ్డారు. కేంద్రంతో మాట్లాడి పోర్టులన్నింటి వద్దా దొంగలను ఏర్పాటుచేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారన్నారు. ఇప్పటికీ రోజూ ఐదువేలమంది ‘ఎర్ర’కూలీలు శేషాచల అడవుల్లో పనిచేస్తూ.. రోజుకు రూ.100 కోట్ల సంపదను కొల్లకొడు తున్నారని చెప్పారు. అదే సమయంలో ఏమీ ఎరగనట్టుగా.. నారావారిపల్లెలోనే ఎర్రచందనం అక్రమ నిల్వలున్నాయి, నాకు చెడ్డపేరు తెస్తారా? అని చంద్ర బాబు సుద్దులు చెబుతున్నారని భూమన మండిపడ్డారు. రాందేవ్‌బాబా సీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను టన్ను 28.40 లక్షలకు కొన్నారని, అదే రూ.కోటి పలికే ఏ గ్రేడ్ ఎర్రచందనం 1,100 టన్నులు విక్రయిస్తే 92 వేలకే కోట్ చేయడం వెనుక రహస్యమేంటని నిలదీశారు. స్మగ్లర్లను అణచడం కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి వెంటనే చట్టాన్ని సవరించాలని కోరారు. ప్రత్యేక కలప అన్న మాట చేరిస్తే ఒక్క దుంగా బయటకు తరలిపోదన్నారు. -
మరో ముగ్గురు ‘ఎర్ర’దొంగలపై పీడీ చట్టం
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బంగారుపాళ్యం మండలం తంబిగానిపల్లికి చెందిన దేవళ్ల రాజేష్, పుల్లూరు మురళి, తిరుపతిలోని గిరిపురానికి చెందిన చింతమాకుల ప్రవీణ్‌లను ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఏప్రిల్ 30న ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు అనుమతి ఇస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం కింద వీరిని ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు. -
27మంది ‘ఎర్ర’ కూలీలు అరెస్ట్
రాయచోటి (వైఎస్సార్ జిల్లా): అక్రమంగా ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలపై పోలీసులు దాడి చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటి చిన్నమండెం ఫారెస్ట్ జోన్లో గురువారం సాయంత్రం జరిగింది. తమిళనాడుకు చెందిన ‘ఎర్ర’ కూలీలు దుంగలను నరుకుతుండగా.. గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఎర్ర కూలీలు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు 27 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారయ్యారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఈ నెల 25న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పట్టుబడిన నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై కడపకు తీసుకొచ్చారు. వీరిలో ముగ్గురు చైనాకు చెందిన ఈ మింగ్ హుయి, జాంగ్ హుయిలీ, చన్ ఫెంగ్ తోపాటు హర్యానా రాష్ట్రానికి చెందిన అనూజ్ దహియా ఉన్నారని ఓఎస్డీ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 1.4 టన్నుల ఎర్ర చందనం, వోక్స్ వ్యాగన్ కారు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. -
20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
దువ్వూరు (వైఎస్సార్ జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 20 మంది స్మగ్లర్లు దువ్వూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పట్టుబడినవారంతా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి ఓ ఆటోను, రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
వేటాడి.. వెంటాడి..
♦ భారీగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ♦ రూ.1.36 కోట్ల విలువైన దుంగలు, మూడు వాహనాలు పట్టివేత ♦ 13 మంది చెన్నై, కర్ణాటక, కేరళకు చెందిన స్మగ్లర్లు, కూలీలు అరెస్ట్ బద్వేలు అర్బన్: భారీగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు వేటాడి..వెంటాడి పట్టుకున్నారు. బద్వేలు సర్కిల్ పరిధిలోని బద్వేలు, నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో గోపవరం ప్రాజెక్టు కాలనీ వద్ద ఆదివారం మూడు వాహనాలతోపాటు కోటి 36 లక్షల 80 వేల విలువైన 33 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న చెన్నై, కర్ణాటక , కేరళలకు చెందిన 13 మంది స్మగ్లర్లు , కూలీలను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ ఎం.వి.రామక్రిష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అర్బన్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక విభాగం టాస్క్‌పోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ కేఎం.మహేశ్వరరాజు, బద్వేలు సీఐ వెంకటప్ప, తిరుపతి, కడప టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, బద్వేలు సర్కిల్ పోలీసులు గోపవరం ప్రాజెక్టు కాలనీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారని తెలిపారు. పీపీకుంట వైపు నుంచి వచ్చిన ఒక ఐచర్(మినిలారీ) వాహనం, సుమో, మారుతి కార్లను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వాహనంలోని వారు ఏమాత్రం లెక్కచేయకుండా పోలీసులను వాహనాలతో తొక్కించే ప్రయత్నం చేశారని తెలిపారు. వారు ఆపకుండా పారిపోతుండగా పోలీసులు తమ వాహనాలతో వెంటపడ్డారని చెప్పారు. ద్వారకా కన్ స్ట్రక్షన్ సమీపంలోని గరుడయ్య సత్రం వద్ద మూడు వాహనాలను ఆపి, అందులోని 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. వాహనాలను తనిఖీ చేయగా అందులో సుమారు 684 కిలోల 33 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. వాటితోపాటు మూడు వాహనాలు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెంగళూరుకు తరలిస్తుండగా.. వారిని విచారణ చేపట్టగా ఎర్రచందనం దుంగలను బద్వేలు సమీపంలోని ఎర్రశెల అటవీ ప్రాంతంలో నుంచి బెంగళూరుకు చెందిన అప్సర్‌ఖాన్, అంజాద్ఖాన్లకు చేరవేసేందుకు తీసుకుపోతున్నట్లు తేలిందన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కర్ణాటక రాష్ట్రంలోని పోలార్ జిల్లాకు చెందిన నారాయణ నగేష్, సయ్యద్ ఖబీర్, సయ్యద్ ఫిరోజ్, వెంకటేషప్ప మంజునాథ, చిక్బల్లాపూర్కు చెందిన సయ్యద్ అజ్ఘర్లతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన శివాజీ తిరుపతి, మంత్రాజం జయకుమార్, రామస్వామి రామక్రిష్ణ, గాండీవన్ తమిళ అరుసు, కేరళ రాష్ట్రంలోని పాలకాడ్ జిల్లాకు చెందిన మహ్మద్ అరీష్ , మహ్మద్ బషీర్‌లతో పాటు చిత్తూరు జిల్లా బంగారు పాళెంకు చెందిన గుండాల సంతోష్‌కుమార్, బద్వేలు యార్లబోయిన చంద్రశేఖర్ ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం దుంగలతో పాటు మూడు వాహనాలు, 14 సెల్ఫోన్ల విలువ సుమారు కోటి 57 లక్షల 70 వేలు ఉంటుందని తెలిపారు. ఈ దాడులలో పులివెందుల అర్బన్ సీఐ ఎ.ప్రసాద్, కొండాపురం సీఐ వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ హాజీవల్లి, బద్వేలు అర్బన్, రూరల్ ఎస్ఐలు నాగమురళి, నరసింహారెడ్డి, తిరుపతి, కడప టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు బద్వేలు సర్కిల్ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. పేరుమోసిన స్మగ్లర్లను, కూలీలను అరెస్టు చేసిన అధికారులను తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, కడప జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీలు అభినందించినట్లు ఆయన వివరించారు. -
వేట ఆగదు
సాక్షి, కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ పేర్కొన్నారు. ప్రత్యేకంగా శేషాచలం అడవుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు వారంలో ఐదు రోజులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఢిల్లీ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం శోధిస్తున్నాయని చెప్పారు. స్మగర్లైనా, కూలీలైనా ఎర్రచందనం జోలికి వస్తే వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. శనివారం కడపలోని పోలీసు పరేడ్ మైదానంలో ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, రాజంపేట డీఎస్పీ అరవిందబాబుల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రత్యేక బృందం స్మగర్ల కోసం వెతుకుతోందని, కర్ణాటకలో కూడా ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా స్మగ్లర్లను పట్టుకునేందుకు పథక రచన చేస్తున్నామని ఆయన తెలిపారు. చైనా నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు కొంత మంది స్మగ్లర్లకు సహకారం అందిస్తున్నారన్నారు. వారి సంబంధాలపై కూడా కూపీ లాగుతున్నామని చెప్పారు. ఇటీవల దొరికిన జంగాల శివశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామని చెప్పారు. బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగిపై కూడా అనుమానం ఉందని, త్వరలోనే నిగ్గు తేలుస్తామన్నారు. అడవి లోపల, బయట అన్నిచోట్ల ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. బడా స్మగ్లర్లతో రమణకు సంబంధాలు ఒంటిమిట్టకు చెందిన బొడ్డె వెంకట రమణ సోదరుడైన పెద్ద వెంకట రమణ ముఠాలో ప్రధాన నిందితుడని, కర్ణాటకలోని కటిగానహళ్లికి చెందిన మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్, రియాజ్, తిరుపతికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ ప్రవీణ్‌లకు ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలియజేశారు. వీరితోపాటు ఢిల్లీకి చెందిన కొంతమంది బడా స్మగ్లర్లతో పెద్ద వెంకట రమణకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వెంకట రమణపై నాలుగు కేసులు ఉన్నట్లు తెలిపారు. గతనెలలో అరెస్టు అయిన బొడ్డె వెంకట రమణను విచారించగా, ఇతని గురించి తెలిసిందన్నారు. పెద్ద వెంకట రమణకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఒంటిమిట్టకు చెందిన పెద్ద వెంకట రమణతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన తమ్మినేని బాబులను అరెస్టు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాఠీ తెలిపారు. తిరుపతి నుంచి శేషాచలం ఫారెస్టులోకి వెళ్లిన వీరు ఓబులవారిపల్లె మండలంలోని అటవీ ప్రాంతం నుంచి ఐచర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగుళూరు వైపు తరలిస్తుండగా శివాజీనగర్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు ఐచర్ వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు రైల్వేకోడూరు పోలీ సులు పకడ్బందీగా పట్టుకున్నారన్నారు. వీరిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృంద సభ్యులు ఎస్బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, రైల్వేకోడూరు సీఐ కె.పుల్లయ్య, ఎస్ఐలు రోషన్, శివశంకర్, పెద్ద ఓబన్న, నాగరాజు, రాజరాజేశ్వర్‌రెడ్డి, నాగరాజులకు రివార్డులను ప్రకటించారు. -
72 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
వైఎస్సార్ జిల్లా (చిన్నమండెం) : అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 72 మంది స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటి 20 లక్షల విలువ చేసే 73 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందినవారిగా గుర్తించారు. ఏదో విహార యాత్రకు బయలుదేరినట్లుగా బయలుదేరి, లారీలో ఎర్రచందనం దుంగలపై బియ్యం బస్తాలు ఉంచి కనపడకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పక్కా సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించి నిందితుల్ని పట్టుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి విలేకరులకు తెలియజేశారు. -
‘ఇంటి’ దొంగల మాటేంటి..?
ప్రభుత్వ నిర్వాకంతో ‘ఆపరేషన్ రెడ్’ నీరుగారిపోతోన్న వైనం స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తోన్న అధికారులపై చర్యలకు వెనుకంజ..! అక్రమాధికారులను కీలకస్థానాల్లో నియమించడంలో ఆంతర్యమేంటో? హైదరాబాద్: ప్రభుత్వం ‘ఇంటి’దొంగల ఆట కట్టించాల్సింది పోయి.. అందలమెక్కిస్తుండటంతో ‘ఆపరేషన్ రెడ్’ నీరుగారిపోతోంది. తమిళ కూలీలు 20 మందిని ఎన్కౌంటర్ చేసినా.. 1100 మందికిపైగా అరెస్టు చేసినా.. 40 మంది స్మగర్లను పీడీ చట్టం కింద అరెస్టు చేసినట్టు ప్రకటించినా.. స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న అటు పోలీసు.. ఇటు అటవీ శాఖల్లోని ఇంటిదొంగలను ప్రభుత్వం విస్మరిస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్యరాజన్ పోలీసు విచారణలో ఇంటిదొంగల విషయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. నల్లమల అటవీ ప్రాంతంలో చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, పాలకొండ అడవుల్లో 5.50 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1995లో ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం విధించడంతో.. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అటవీ, పోలీసు శాఖల్లోని కొందరు అక్రమాధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపారు. ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. గత రెండు దశాబ్దాల్లో 40 వేల టన్నులకుపైగా సరిహద్దులు దాటినట్లు ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కరిపై వేటుతో సరి.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ రెడ్’ను చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి, విచారించారు. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ‘ఎర్ర’ స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తోన్న ఎనిమిది మంది డీఎస్పీలు, 17 మంది సీఐలు, 24 మంది ఎసై్సలపై కఠినచర్యలు తీసుకోవాలని జూలై, 2014లో అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆరుగురు డీఎఫ్‌వోలు సహా 54 మంది అటవీ శాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. పోలీసు, అటవీ శాఖ అధికారులకు స్మగ్లర్లు కట్టించిన భవనాలు, ఇచ్చిన నజరానాల వివరాలనూ ఆ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌పై వేటు వేసి చేతులు దులుపుకుంది. స్మగ్లర్లకు సహకరిస్తోన్న అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కీలక స్థానాల్లో అక్రమార్కులు.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎర్రఇం‘ధనం’ సమకూర్చడం.. నెలసరి మామూళ్లు ముట్టజెపుతుండటం వల్లే అధికార పార్టీ నేతలు స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు. స్మగ్లర్లకు సహకరిస్తోన్న పోలీసు, అటవీ శాఖ అధికారులను కీలక స్థానాల్లో నియమించేలా టీడీపీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగడానికి దారితీస్తోంది. ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించిన ప్రాంతాల్లో స్మగ్లర్లకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న అధికారులను నియమించేలా అటవీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే మార్గాల్లోనూ స్మగర్లకు సహకరించే పోలీసు అధికారులను నియమింపజేసుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారు. అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్యరాజన్ విచారణలో ఇదే అంశాన్ని అంగీకరించినట్లు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ కీలకాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. తాము ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వాహనాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఓ డీఎస్పీ పైలట్‌గా తన వాహనాన్ని పంపేవారని సౌందర్యరాజన్ విచారణలో అంగీకరించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. -
ఎన్కౌంటర్ ముమ్మాటికి బూటకం
-
ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
తిరుపతి : శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే. వారిలో నలుగురు వేలూరు, 8మంది విల్లుపురం, మరో 8మంది తిరువణ్ణామలైకి చెందినవారు. మృతులకు బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ప్రభావం తిరుపతిలో భక్తులు,ప్రయాణికులపై పడింది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో తిరుపతి నుంచి తమిళనాడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దాంతో భక్తులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో అవస్థలు పడుతున్నారు. -
'ఆంధ్రా ఆస్తులు, బ్యాంకులపై దాడి చేస్తాం'
చెన్నై : చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్కౌంటర్ చేయడంపై తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. తమిళనాడులో ఉన్న ఆంధ్రా హోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులు చేస్తామని నామ్ తమిళర్ కచ్చి హెచ్చరించింది. దీంతో చెన్నైలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారి ఆస్తులు, సంస్థలకు తమిళనాడు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్‌ను మూసివేశారు. కూలీల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు. -
గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్లో వివరణ
హైదరాబాద్: తిరుపతి ఎన్కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. మృతుల ఫోటోలు విడుదల చేసి బంధువులకు సమాచారం అందించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అలాగే ఎర్ర చందనం స్మగ్లర్ల ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు తిరుపతి ఎన్కౌంటర్ సంఘటనపై గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో వివరించారు. అంతకు ముందు డీజీపీ జేవీ రాముడు ...చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. -
ఎన్‌కౌంటర్‌పై భగ్గుమన్న తమిళ పార్టీలు
చెన్నై : ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌ను తమిళనాడులోని రాజకీయ పార్టీలు తప్పబట్టాయి. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తుకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోతో పాటు తమిళ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలీసులే ఏకపక్షంగా కాల్పులు జరిపారని వైగో ఆరోపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం చిత్తూరు ఎన్‌కౌంటర్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం కూలీల వివరాల కోసం తమిళనాడు పోలీసులు ..తిరుపతి రానున్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు. మరోవైపు పరారీలో ఉన్న మిగతా స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచినట్లు అయింది. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పేదలకు సరైన పునరావాసం, ఉపాధి కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆంధ్రాహోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులపై చేస్తామన్నారు. -
చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
-
ఎన్‌కౌంటర్‌పై మంత్రులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పల్లె అచ్చెన్నాయుడు, దేవీనేని ఉమ, నారాయణ హాజరయ్యారు. అంతకుముందు చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ అయ్యి ఎన్కౌంటర్ వివరాలు తెలిపారు. జిల్లాలోని చంద్రగిరి మండలంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకొని మొత్తం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున ఐదుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
పోలీసులు కూడా గాయపడ్డారు: చినరాజప్ప
హైదరాబాద్ : తిరుపతి శేషాచలం అడవుల్లో రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కార్యాచరణలో పాల్గొన్నారని, ఎదురు కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో 20మంది చనిపోయారని, వీరింతా తమిళనాడు చెందిన కూలీలని చినరాజప్ప పేర్కొన్నారు. -
చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
-
'ఆత్మరక్షణ కోసమే కాల్పులు'
తిరుపతి : ఆత్మరక్షణ కోసమే ఎర్ర చందనం స్మగ్లర్లపై కాల్పులు జరిపినట్లు టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందటంతో సోమవారం రాత్రి 7 గంటల నుంచి కూంబింబ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు దాడికి యత్నించి కాల్పులకు పాల్పడినట్లు డీఐజీ తెలిపారు. దాంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. కాగా మంగళవారం తెల్లవారుజామున తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని డీఐజీ ధ్రువీకరించారు. -
చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ జేవీ రాముడు మంగళవారం భేటీ అయ్యారు. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై ఆయన వివరణ ఇచ్చారు. కాగా ఈరోజు తెల్లవారుజామున కూంబింగ్ జరుపుతున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 20మంది స్మగ్లర్లు హతమయ్యారు. అలాగే గాయపడిన ఎనిమిదిమంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిన్నటి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు మొదట రాళ్లతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా 20మంది స్మగ్లర్లు మృతి చెందారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్లు, శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఈతగుంట, ఈత పాకుల కోన పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం శ్రీవారి మెట్టులో 11మంది, మంగాపురంలో 9మంది స్మగ్లరు హతమైనట్లు తెలుస్తోంది. అలాగే ఎదురు కాల్పుల్లో 8మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. మరోవైపు పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా మృతులు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఫోటోలు; సాక్షి టీవీ రిపోర్టర్ -
33 మంది ఎర్ర కూలీల అరెస్ట్
తిరుపతి క్రైం: వేర్వేరు చోట్ల ఎస్పీఎఫ్ బల గాలు సాగించిన దాడుల్లో ఎర్రచందనం దుంగలు నరకడానికి వచ్చిన 33 మంది ఎర్ర కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ వివరాలను అర్బన్ జిల్లా క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి సోమవారం వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ బలగాలు సాగించిన దాడుల్లో 33 మంది ఎర్రకూలీలను అదుపులోకి తీసుకుని, 33 దుంగలు, నాలుగు ద్విచక్రవాహనాలు, మూడు కార్లు, లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బలగాలు, ఎమ్మార్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 పెద్దవి, 6 చిన్నవి (దుంగలు) , 17 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట సమీపంలో ఎర్రచందనం తరలి స్తుండగా పోలీసులు మెరుపుదాడులు నిర్వహిం చారు. ఈ దాడుల్లో 12 చిన్న ఎర్రచందనం దుంగలు , 16 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారని తెలిపారు. ఇందులో ఆంధ్రాలో ఎంఎస్సీ చదువుతున్న ఆనందరెడ్డి, తమిళనాడులో ఇంజినీరింగ్ చేస్తున్న సురేష్ కూడా ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డవారిలో 8 మంది ఆంధ్రా కూలీలు, మిగతా 25 మంది తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు వివరించారు. టాస్క్ఫోర్స డీఎస్పీ రవికుమార్, ఏఆర్ డీఎస్పీ ఇలియాస్ బాషా పాల్గొన్నారు. -
ఆపరేషన్ ‘రెడ్’లో పెద్ద చేపలు!
చిత్తూరు (అర్బన్): టాస్క్‌ఫోర్స్ పోలీ సులు నిర్వహించిన ఆపరేషన్‌రెడ్‌లో ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఏటా రూ.కోటికిపైగా సంపాదించే జిల్లాకు చెందిన నిమ్మ మహేష్ (39), శ్రీ పొటిశ్రీరాములు నెల్లూరుకు చెందిన ఉదయ భాస్కర్ అనే రవికుమార్ (50)లు ఉన్నారు. వీరితోపాటు టీ.వెం కటరెడ్డి (26), సూరిబాబు (36), రమేష్‌రెడ్డి (26), నరసింహారెడ్డి (25), విష్ణువర్దర్‌రెడ్డి (35), రామకృష్ణారెడ్డి (44), శ్రీధర్‌రెడ్డి (40), దామోదర్ నా యుడు (35)ను అరెస్టు చేశారు. వీరిలో ఓ టీవీ చానల్ అసిస్టెంట్ డెరైక్టర్, మరో ఎడిటర్ కూడా ఉండటం గమనా ర్హం. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీని వాస్, చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు ఈ వివరాలను వెల్లడించారు. నిందితు లనుంచి అంబాసిడర్ కారు, మినీ లారీ, టాటా-407, ఓ ల్యాప్‌టాప్, రూ.12,373, 23 ఎర్ర చందనం దుంగలను పుంగనూరు, పూతలపట్టు ప్రాం తాల్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50లక్షల వరకు ఉంటుం దని ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ రెడ్‌లో పాల్గొన్న బృందానికి రివార్డులు సైతం ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వివరాలు పరిశీలిస్తే... వెంకటరెడ్డి: ఇతను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. హైదరాబాదులోని అమీర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న ఇతను ప్రముఖ టీవీ చానల్లో ప్రసారమయ్యే ఓ సీరియల్‌కు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. విష్ణువర్దన్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారంలోకి వచ్చాడు. ఇప్పటివరకు ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. రమేష్‌రెడ్డి : వైఎస్సార్ జిల్లా లింగాలదిన్నెకు చెందిన ఇతను ఐదో తరగతి చదువుకున్నాడు. వృత్తిరీత్యా రైతు. తొందరగా డబ్బు సంపాదించాలని గతేడాదిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతనిపై జిల్లాలో ఐదు కేసులు ఉన్నాయి. నరసింహారెడ్డి: ఇతనిది వైఎస్సార్ జిల్లా లింగాలదిన్నె. ఏడో తరగతి వరకు చదువుకుని పొలం పనులు చూసుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ద్వారా స్మగ్లింగ్‌లోకి వచ్చాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఇతని తమ్ముడు బంగారురెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ కావడం గమనార్హం. సూరిబాబు: మచిలీపట్నానికి చెందిన ఇతడు హై దరాబాదులో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి తరువాత ఐటీఐ చేసిన ఇతను ఓ తెలుగు టీవీ ఛానల్ లో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారంలోకి వచ్చాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. విష్ణువర్థన్‌రెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరుకు చెందిన ఇతను హైదరాబాద్‌లోని చైతన్యనగర్‌లో కాపురం ఉంటున్నాడు. డిగ్రీ చదివి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తొమ్మిది నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరు స్వగ్రామం. ఇంటర్ వరకు చదువుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా లాభాలు రాలేదు. 2008 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఏటా రూ.50 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతడిపై ఐదు కేసులు ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరుకు చెందిన ఇతను పదో తరగతి వరకు చదివి ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఐదు నెలలుగా ఎర్రచందనం తరలింపులో మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. బయటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయడం కూడా వృత్తిగా కొనసాగించేవాడని పోలీసుల విచారణలో తేలింది. సంవత్సరాదాయం రూ.50 లక్షలు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. దామోదర్‌నాయుడు: తిరుపతి న్యూ ఇందిరానగర్‌లో కాపురం ఉంటున్న ఇతను ఇంటర్ చదువుకున్నాడు. వెడ్డింగ్ ప్లానర్‌గా పనిచేసేవాడు. ఏడాదిన్నర గా ఎర్రచందనం అక్రమ రవాణాలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. నిమ్మ మహేష్: జిల్లాలోని పెద్దమండ్యం పాపయ్యపల్లెకు చెందిన వ్యక్తి. ఎలాంటి చదువు లేకపోయినప్పటికీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే 2007 నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. ఆర్నెల్ల క్రితం కూడా హార్సిలీహిల్స్‌లో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 300 టన్నుల ఎర్రచందనం దుంగల్ని అక్రమ రవాణా చేశాడు. ఒక ఏడాదికి రూ.కోటి వరకు సంపాదించేవాడు. మహేష్‌పై జిల్లాలో 22 కేసులు ఉన్నాయి. ఉదయ భాస్కర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా హరినాథ్పురానికి చెందిన ఇతను ఇటీవల విజయవాడలో పట్టుపడ్డ ఎర్రచందనం డంప్‌నకు యజమాని. డిగ్రీ చదువుకున్న ఉదయ భాస్కర్ తన పేరును రవికుమార్‌గా కూడా చెప్పుకునేవాడు. 2006లో ప్రకాశం జిల్లా నుంచి ఎర్రచందనం స్మగ్లర్ భాషాతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనికి ఏటా రూ.కోటి ఆదాయం వచ్చేది. ఇతనిపై 6 కేసులు ఉన్నాయి. -
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
-
ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఆయన గురువారమిక్కడ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి చంద్రబాబే కారణమని చెవిరెడ్డి విమర్శించారు. ఫ్యాక్షనిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చింది ఆయననేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులు అయిన పోతుల సురేష్, చమన్, కందికుంట ప్రసాద్‌లకు పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్ర చందనం స్మగర్లు అని, స్మగ్లర్లకు, ఫ్యాక్షనిస్టులకు టికెట్లు ఇచ్చిన బాబు ఇప్పుడు నీతులు చెప్పటం సిగ్గుచేటు అని ఆయన ఎద్దేవా చేశారు. -
రెచ్చిపోయిన స్మగ్లర్లు ఆపై రాళ్ల దాడి
-
ఓపెన్ కోర్టు ముందుకు 346మంది స్మగ్లర్లు
తిరుపతి : ఎర్ర చందనం స్మగ్లర్లను తిరుపతి పోలీసులు మంగళవారం ఓపెన్ కోర్టులో హాజరు పరిచారు. తిరుపతి తారకరామా స్టేడియంలో విచారణ నిమిత్తం 346 మందిని భారీ బందోబస్తు మధ్య బహిరంగ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. 2013 డిసెంబర్ 15న శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీ శాఖ అధికారులను హతమార్చిన కేసులో వీరు నిందితులు. నిందితులు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన స్మగ్లర్లు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖర బాబు మాట్లాడుతూ అటవీ అధికారుల హత్య కేసులో 27రోజుల్లోనే ఛార్జ్‌షీటు దాఖలు చేసామని, అందువల్ల నిందితులకు ఇప్పటివరకూ బెయిల్ లభించలేదన్నారు. ఈ కేసులో నిందితులు ఇప్పటివరకూ జైల్లోనే ఉన్నారని ఆయన చెప్పారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు లేకుండా చేయటమే తమ లక్ష్యమన్నారు. -
పోలీసులు కాల్పులు: ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ
వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామ సమీపంలో లోతువంక అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది గత అర్థరాత్రి నుంచి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన స్మగ్లర్లు కూబింగ్ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు స్మగ్లర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైయ్యారు. ఘటనాస్థలంలో స్మగ్లర్ల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 20 బస్తాలకుపైగా ధాన్యం బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నాఉ. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువు రూ. కోటిపైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. -
వైకుంఠాన్ని ఇక్కడే చూడొచ్చు: బాబు
తిరుమల: ఆధ్మాత్మిక నగరం తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన గురువారం ఉదయం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం క్యూ లైన్లను పరిశీలించి, భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని, జిల్లాను దేవాలయాల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైకుంఠం అంటే చూడలేదని...కథల్లోను, పురాణాల్లో మాత్రమే విన్నామని... అలాంటిది తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వైకుంఠం ఎలా ఉంటుందో అలాంటి ప్రశాంత, పవిత్ర వాతావరణం తిరుమలలో ఉంటుందని చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులతో భక్తుల నమ్మకాన్ని పెంచేలా పని చేస్తామని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకలిస్తామన్నారు. స్మగ్లర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారారని, ఒక్క స్మగ్లర్‌ను కూడా లేకుండా చేస్తామన్నారు. స్మగ్లర్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
స్మగ్లర్ల రాళ్లదాడి, పోలీసుల కాల్పులు
-
స్మగ్లర్ల రాళ్లదాడి, పోలీసుల కాల్పులు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన చంద్రగిరి మండలం నడింపల్లిలో చోటుచేసుకుంది. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఎర్ర చందనం తరలిస్తున్న కంటెయినర్‌ను అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడి చేయటంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా 15మంది స్మగర్లను అరెస్ట్ చేసి, 150 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. లారీతోపాటు ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం లారీని పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. లారీలో 101 ఎర్రచందనం దుంగలు ఉన్నాయిని పోలీసులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు చెప్పారు. -
అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడి
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు గత అర్థరాత్రి నుంచి తనిఖీలు నిర్వహించారు. అయితే ఎర్ర చందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల రాకను గమనించారు. దాంతో స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న రాళ్లును సదరు అధికారులపై రువ్వారు. అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడికి దిగారు. దీంతో లారీలలో తరలించేందుకు సిద్దంగా ఉంచిన ఎర్రచందనాన్ని వదిలి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అటవీశాఖ అధికారులు తరలించేందుకు సిద్దంగా ఉంచిన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు రూ. కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. లారీ రిజిస్ట్రేషన్ నెంబర్లు అధారంగా నిందితులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మృతి
చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. భాకరాపేట పులిబోను గుట్ట అటవీ ప్రాంతంలో భారీగా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారన్న సమాచారాన్ని పోలీసు బుధవారం అందుకున్నారు. దాంతో పోలీసులు హుటాహుటిన భాకరాపేట పులిబోను గుట్ట చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయాన్ని స్మగ్లర్లు పసిగట్టి పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడికి తెగబడ్డారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైయ్యారు. స్మగ్లర్లపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ముగ్గురు స్మగ్లర్లు మరణించారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసి చంపారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. -
సీఎం సోదరుడి అనుచరుడు అరెస్ట్
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ప్రధాన అనుచరుడు ద్వారకానాధ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మాఫియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లర్ల వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం అందని, ఆయన సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. చిన్నగొట్టిగల్లు మండలం చెరుకువారిపల్లి వద్ద భాకరాపేట పోలీసుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఓ మినీలారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
ఎర్రచందనం స్వాధీనం: అయిదురురు స్మగ్లర్ల అరెస్ట్
కడప: రైల్వేకోడూరు మండలం ఊల్లగట్టుపోడు వద్ద అయిదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 20 లక్షల రూపాయల విలువ గల ఎర్ర చందనం, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల చిత్తూరు, కడప జిల్లాలలో ఎర్రచందనం అక్రమ రవాణా అధికమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం స్మగ్లర్ల అఘాయిత్యాలు కూడా ఎక్కువైపోయాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఈ నెల15 ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురైన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నవారి అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో పోలీసులకు గాయాలు
-
ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో పోలీసులకు గాయాలు
చిత్తూరు: జిల్లాలోని భాకర్‌రావు పేట వద్ద ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు శనివారం రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై ప్రతిదాడికి దిగారు. స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్మగ్లర్లు దాడికి దిగారు. గాయపడిన పోలీసులను తిరుమలలోని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, గత కొంత కాలంగా అటవీ శాఖ అధికారులపై స్మగ్లర్ల దాడులు అధికమయ్యాయి. పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టడంతో స్మగ్లర్లు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. స్మగ్లర్ల దాడులను ఆరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వారి ఆగడాలు ఇంకా మితిమీరుతున్నాయి. -
మూడు నెలల్లో ఆయుధాలు
=అటవీ సిబ్బంది కోసం కొనుగోలుకు సిద్ధం =క్షేత్ర స్థాయి సిబ్బందికి 12 రకం బోర్ తుపాకులు =రేంజ్ స్థాయి అధికారులకు రివాల్వర్లు =ఆత్మరక్షణే లక్ష్యం కొయ్యూరు, న్యూస్‌లైన్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులపై ఘాతుకమైన దాడి చేయడంతో కదిలిన అటవీ శాఖ ఇప్పుడు ఆయుధాల సమీకరణ ధ్యేయంగా అడుగులు వేస్తోంది. అడవుల్లో విలువైన కలపను రక్షించడానికి క్షేత్ర స్థాయిలో గస్తీ తిరిగే అటవీ సిబ్బందికి రక్షణ కల్పించడానికి ఆయుధాలు సమకూర్చడమే మార్గమని నిర్ణయానికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నర్సీపట్నం అటవీ డివిజన్‌కు సంబంధించి ఏడు రేంజ్‌లలో నాలుగు రేంజ్‌లు సమస్యాత్మకమైనవి. ఈ ప్రాంతంలో కలప చోరులు తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందిపై దాడులు చేసే అవకాశం ఉంది. అలాగే తూర్పు కనుమల్లో రంగురాళ్లు కూడా విరివిగా ఉన్నాయి. క్వారీల వద్ద నిత్యం వందలాది మంది తవ్వకాలు జరుపుతారు.అలాంటి చోట్లకు ఆయుధాలు లేకుండా వెళ్తే దాడులు జరిగే అవకాశం ఉంది. దీంతో సాధ్యమైనంత వేగమే ఆయుధాలు అందించే ఏర్పాట్లలో ఉన్నతాధికారులు ఉన్నారు. దట్టమైన అడవులకు పేరుపడ్డ మధ్యప్రదేశ్‌లో కొన్ని చోట్ల అటవీ సిబ్బంది ఆయుధాలతో పని చేస్తున్నారు. అక్కడ సిబ్బంది అమెరికాలో తయారైన ఆయుధాలను వాడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం అనుసరించే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి 12 రకం బోర్ తుపాకులు, అధికారులకు రివాల్వర్లు అందజేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. అయితే ఎవరు ఆయుదాలను కొనుగోలు చేయాలన్న దానిపై కొంత సందిగ్దత ఉందన్నారు. మరో మూడు నుంచి నాలుగు నె లలలోపు అటవీ సిబ్బందికి ఆయుధాలు సరఫరా జరిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి తెలిపారు. ఆత్మ రక్షణ ముఖ్యం : అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నది దాడుల కోసం కాదని,ఆపదలో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం వాటిని వాడాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఏడు రేంజ్లో ఏడు బేస్ క్యాంప్‌లు, ఏడు స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఉన్నాయి. 2010 నుంచి అమలులోకి వచ్చిన కంపా పథకం ద్వారా వాటి నిర్వాహణకు నిధులు వస్తున్నాయి. ఈ డివిజన్లో దట్టమైన అడవి ప్రాంతంగా ఉన్న మర్రిపాకలు, సీలేరు రేంజ్‌లలో ఉన్న విలువైన కలపను రక్షించాల్సిన బాధ్యత ఉంది.మరోవైపు రంగురాళ్ల తవ్వకాల నిరోధానికి ప్రతిపాదించిన రెండు పోలీసు బృందాలను కూడా ప్రభుత్వం పంపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.