అక్రమంగా ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలపై పోలీసులు దాడి చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు.
రాయచోటి (వైఎస్సార్ జిల్లా): అక్రమంగా ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలపై పోలీసులు దాడి చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటి చిన్నమండెం ఫారెస్ట్ జోన్‌లో గురువారం సాయంత్రం జరిగింది.
తమిళనాడుకు చెందిన ‘ఎర్ర’ కూలీలు దుంగలను నరుకుతుండగా.. గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఎర్ర కూలీలు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు 27 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారయ్యారు.