ఐదు రోజుల క్రితమే గల్ఫ్‌ నుంచి ఇంటికి.. భర్తను దూరం పెట్టడంతో.. | Drunk man stabs wife to death after argument | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల క్రితమే గల్ఫ్‌ నుంచి ఇంటికి.. భర్తను దూరం పెట్టడంతో..

Published Fri, Nov 4 2022 12:33 PM | Last Updated on Fri, Nov 4 2022 12:33 PM

Drunk man stabs wife to death after argument - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, అన్నమయ్య(రాయచోటి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త క్షణికావేశంలో కత్తితో దాడిచేసిన ఘటన రాయచోటిలో సంచలనం రేకెత్తిస్తోంది. గురువారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయచోటి అర్బన్‌ సీఐ సుధాకర్‌ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రజినాల వెంకట రామ్మోహన్‌ భార్య రజినాల రాజేశ్వరి (37) 5 రోజుల కిందట గల్ఫ్‌ దేశం నుంచి వచ్చింది.

ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి అనారోగ్య రీత్యా భర్తను దగ్గరకు రానివ్వలేదు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న రామ్మోహన్‌ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డివారిపల్లెలో నివాసం ఉంటున్న వెంకట రామ్మోహన్‌ గురువారం తెల్లవారుజామున పదునైన కత్తితో భార్య రాజేశ్వరిని పొడిచి హత్య చేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. భార్యను హత్యచేసిన అనంతరం రామ్మోహన్‌ పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని సిఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.  

చదవండి: (చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం.. ఆ సైట్లకు బానిసై అఘాయిత్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement