ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు | Chevireddy bhaskar reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు

Published Thu, Aug 21 2014 1:16 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

Chevireddy bhaskar reddy slams chandrababu naidu

తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఆయన గురువారమిక్కడ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి చంద్రబాబే కారణమని చెవిరెడ్డి విమర్శించారు. ఫ్యాక్షనిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్లకు  టికెట్లు ఇచ్చింది ఆయననేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులు అయిన పోతుల సురేష్, చమన్, కందికుంట ప్రసాద్లకు పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్ర చందనం స్మగర్లు అని, స్మగ్లర్లకు, ఫ్యాక్షనిస్టులకు టికెట్లు ఇచ్చిన బాబు ఇప్పుడు నీతులు చెప్పటం సిగ్గుచేటు అని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement