చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బంగారుపాళ్యం మండలం తంబిగానిపల్లికి చెందిన దేవళ్ల రాజేష్, పుల్లూరు మురళి, తిరుపతిలోని గిరిపురానికి చెందిన చింతమాకుల ప్రవీణ్‌లను ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఏప్రిల్ 30న ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు అనుమతి ఇస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం కింద వీరిని ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు.
మరో ముగ్గురు ‘ఎర్ర’దొంగలపై పీడీ చట్టం
Published Thu, May 5 2016 7:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement