వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. లారీతోపాటు ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం లారీని పోలీసు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. లారీలో 101 ఎర్రచందనం దుంగలు ఉన్నాయిని పోలీసులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు చెప్పారు.