స్మగ్లర్లు అరెస్ట్ ... ఆత్మహత్యాయత్నం | Red sandalwood smugglers suicide attempt in ysr kadapa district | Sakshi
Sakshi News home page

స్మగ్లర్లు అరెస్ట్ ... ఆత్మహత్యాయత్నం

Published Sun, Dec 21 2014 8:31 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Red sandalwood smugglers suicide attempt in ysr kadapa district

కడప: పోలీసులకు చిక్కిన స్మగ్లర్లలో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. దాంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.  వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని మైదుకూరు మండలం వనిపెంటలోని కార్యాలయానికి తరలించారు. దాంతో కార్యాలయంలోని పినాయిల్ తాగి ఒకరు, ట్యూబ్ లైట్ ముక్కలు మింగి మరోకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు వారు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్మగ్లర్లు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.  


అలాగే ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం నిల్వ ఉంచిన డంప్ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement