
భారీగా ఎర్రచందనం స్వాధీనం: స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో కలసపాడు మండలం గంగాయ్యపల్లిలో శనివారం 150 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎర్రచందనం దుంగలు, లారీని సీజ్ చేశారు. పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న మీని లారీని అపి... డ్రైవర్ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. దీంతో అనుమానించిన పోలీసులు లారీలో లోడ్ను తనిఖీ చేయగా భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. దీంతో వారిని అరెస్ట్ చేశారు.