జిల్లాలోని భాకర్రావు పేట వద్ద ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు శనివారం కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై ప్రతిదాడికి దిగారు.
చిత్తూరు: జిల్లాలోని భాకర్రావు పేట వద్ద ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు శనివారం రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై ప్రతిదాడికి దిగారు. స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్మగ్లర్లు దాడికి దిగారు. గాయపడిన పోలీసులను తిరుమలలోని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
కాగా, గత కొంత కాలంగా అటవీ శాఖ అధికారులపై స్మగ్లర్ల దాడులు అధికమయ్యాయి. పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టడంతో స్మగ్లర్లు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. స్మగ్లర్ల దాడులను ఆరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వారి ఆగడాలు ఇంకా మితిమీరుతున్నాయి.