Red sandal smuggling
-
రూ.12.5 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం
చిత్తూరు అర్బన్/తిరుపతి అర్బన్: చిత్తూరు జిల్లా పోలీసులు భారీ ఎత్తున రూ.12.5 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన ‘ఆపరేషన్ రెడ్’లో భాగంగా రూ.10 కోట్ల విలువైన దుంగలను స్వాధీనం చేసుకోగా, సదాశివకోన ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ బృందం రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహించి రూ.2.5 కోట్లు విలువ చేసే దుంగలను స్వాధీనం చేసుకుంది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను నరికి తమిళనాడుకు.. అటు నుంచి విదేశాలకు తరలించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను గురువారం చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్, టాస్క్‌పోర్స్ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. గుడిపాల వద్ద బుధవారం వాహనాలు తనిఖీచేస్తున్న పోలీసులు.. ఓ వాహనంలో ఆరు ఎర్రచందనం దుంగలను గుర్తించి సీజ్ చేశారు. చిత్తూరుకు చెందిన పి.నాగరాజు, తమిళనాడుకు చెందిన ఎ.రామరాజు, జి.ప్రభు, ఎస్.విజయ్‌కుమార్, ఎ.సంపత్, కె.అప్పాసామి, కె.దొరరాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారంతో తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబత్తూరులో ఆపరేషన్ రెడ్ నిర్వహించారు. వలర్పురం వద్ద ఓ గోదాములో దాచిన రూ.10 కోట్లు విలువ చేసే 353 ఎర్రచందనం దుంగలను, వాహనాలను సీజ్ చేశారు. కేసులో మరికొందర్ని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. ఇదిలా ఉండగా వడమాలపేట, ఏర్పేడు మండలాల్లో విస్తరించి ఉన్న సదాశివకోన ప్రాంతంలో రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహించి 8 చోట్ల రూ.2.5 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. స్మగ్లర్లు, కూలీలు తమిళనాడుకు చెందినవారని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
ఎర్రచందనం స్వాధీనం: ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
సాక్షి, భాకరాపేట(చిత్తూరు) : ఎర్రచందనం స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ కె.మోహన్‌కుమార్ తెలిపారు. భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు..తిరుపతి డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి ఇచ్చిన రహస్య సమాచారం మేరకు తలకోన అటవీ ప్రాంతంలో గాలించారు. ఎర్రావారిపాళెం మండలం తలకోన సెంట్రల్‌బీట్ బొబ్బిలిరాజు మిట్ట ప్రదేశంలోని శ్రీ వేంకటేశ్వర శాంక్షురీ నుంచి ఎర్రచందనం తరలిస్తుండగా తెల్లవారుజామున 2 గంటలు సమయంలో స్మగ్లర్లను చుట్టుముట్టారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఒక ప్రదేశంలో దాచి ఉంచిన 753 కేజీల బరువుగల 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ4.56 లక్షలు. ప్రాథమిక విచారణలో వీరంతా జిల్లా వాసులేనని, వీరిలో ధనంజేయులు(వెదురుకుప్పుం), షేక్.షాకీర్ (నంజంపేట, సోమల), ఊటుకూరు.శ్రీనాథ్, జి.శివశంకర్ (నెరబైలు, యానాదిపాళెం, యర్రావారిపాళెం), ఎం.రెడ్డిప్రసాద్(గొల్లపల్లె, దేవరకొండ, చిన్నగొట్టిగల్లు మండలం) ఉన్నట్లు చెప్పారు. దాడుల్లో పాల్గొన్న ఎఫ్ఎస్ఓ జి.నాగరాజ, జి.వందనకుమార్, ఎం.వినోద్‌కుమార్, పి.చెంగల్రాయులు నాయుడు, ఎఫ్‌బీఓలు, బేస్ క్యాంప్ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లను ప్రత్యేకంగా అభినందించారు. -
ఎర్ర చందనం స్మగ్లింగ్.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
సాక్షి, కడప : రాజంపేట ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని రోల్లమడుగు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మూడు రోజుల పాటు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అధికారులకు తారసడ్డారు. ఫారెస్ట్ పోలీసులను చూసిన స్మగ్లర్లు అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక బీ టెక్ విద్యార్థి ఉండటం గమనార్హం. స్మగ్లింగ్ లాభసాటిగా ఉండటంతో చాలా మంది చదువుకున్న తమిళ యువత అడవుల బాట పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 10 గొడ్డళ్లు, రంపాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
చంద్రబాబు ‘ఎర్ర’ నాయుడు
తిరుపతి సెంట్రల్: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో 10 లక్షల ఎకరాల్లో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి, అక్రమంగా రవాణా చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వాహనాల్లో ఎర్ర చందనాన్ని యథేచ్చగా తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. భూమన శుక్రవారం చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పచ్చచొక్కాలకు ఎర్ర చందనమే ఇంధనంగా మారనుందని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి టీడీపీ సిద్ధమైందని విమర్శించారు. ‘‘ఎర్ర చందనాన్ని విక్రయించి రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఎర్రచందనం ద్వారా వచ్చిన సొమ్ముతో ఒక్క పైసా రుణం కూడా మాఫీ చేయలేదు. ఆఖరికి ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా లేకుండా పచ్చదనాన్ని మాఫీ చేశారు. దేశంలోనే అత్యంతం అవినీతి రాష్ట్రం అనే ముద్ర పడేలా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారు. చంద్రబాబు నాయుడు ఎర్ర నాయుడిగా మారిపోయారు. శేషాచలం కొండలు, వెలిగొండ, పాలకొండ, లంకమల కొండల్లో 1,500 కిలోమీటర్ల పరిధిలో, 35 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఎర్రచందనాన్ని పచ్చదండు కొల్లగొడుతోంది’’ అని భూమన దుయ్యబట్టారు. ఎర్రచందనం వేలంలో అక్రమాలెన్నో.. ‘‘ఎర్ర చందనం విషయంలో కుట్ర దాగి ఉంది. ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో సి–గ్రేడ్ రకం కింద దక్కించుకున్న ఎర్ర చందనాన్ని ఎ–గ్రేడ్ ఎర్రచందనంగా కేంద్రం పరిధిలోని డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సంస్థ గుర్తించింది. ఎ–గ్రేడ్ ఎర్రచందనం టన్ను ధర సగటున రూ.1.90 కోట్లుగా ప్రభుత్వం నిర్వహించిన వేలంలోని గణాంకాలే నిర్ధారిస్తున్నాయి. అంత ఖరీదైన ఎ–గ్రేడ్ ఎర్రచందనాన్ని అక్రమ మార్గంలో సి–గ్రేడ్ కింద పరిగణిస్తూ ఒక్కో టన్ను రూ.15 లక్షలకే పతంజలి సంస్థ దక్కించుకుందన్న కోణంలో డీఆర్ఐ విచారణ సాగింది. ఎర్రచందనం వేలం అక్రమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. నాలుగున్నరేళ్లలో 25 సార్లకుపైగా ప్రభుత్వం వేలం నిర్వహించిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దేశం నుంచి తరలిపోతున్న ఎర్ర చందనంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. మరోవైపు ఎర్ర చందనం బహిరంగ వేలానికి నోచుకోకుండా ఎక్కడి నిల్వలు అక్కడే నిలిచిపోవడం వెనుక కూడా టీడీపీ సర్కారు కుట్ర దాగి ఉంది. వేలంలో ఒక టన్ను ధర రూ.2 కోట్ల దాకా పలుకుతుంటే.. మన రాష్ట్రంలో నిల్వలు ఎందుకు పెరిగిపోతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చైనా లాంటి దేశాలు ఎర్రచందనాన్ని ఎందుకు, ఏ రకంగా వినియోగిస్తున్నాయో కూడా మిస్టరీగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఫర్నీచర్, బొమ్మల తయారీకే పరిమితమైతే ఒక్కొ టన్ను ఎర్రచందనాన్ని రూ.2 కోట్లు ఖర్చు చేసి కొనాల్సిన అవసరం ఉండదు. మన రాష్రంలో రూ.2 కోట్లకు విక్రయిస్తే చైనాకు చేరే సరికి ధర రూ.5 కోట్లకు పెరిగిపోతోంది’’ అని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. చట్టం కోసం ఒత్తిడి చేయరేం? ‘‘ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? ఎర్రచందనం మన ప్రాంతంలోనే ఎక్కువగా పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టడానికి చట్టాలు పదునుగా లేవు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టం ఉంటేనే ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకోవచ్చు. మన ప్రాంతంలోనూ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో చిత్తశుద్ధి లేదు. అటవీ శాఖ అధికారులకు పరిమిత అధికారాలే ఉన్నాయి. తగినంత మంది సిబ్బందిని, వాహనాలను, ఆయుధ సామగ్రిని సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. 1,500 కిలోమీటర్ల పరిధి, 35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో కేవలం 463 మంది సిబ్బందితో కూంబింగ్ చేయడం అసాధ్యం. ఎర్రచందనం కేసులో గంగిరెడ్డిని అరెస్టు చేసేశాం, అంతా అయిపోయిందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ తర్వాత అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయింది. అత్యంత విలువైన ఎర్రచందనం సంపదను భావితరాల కోసం పరిరక్షించాలి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి(హరిబాబు) మంగళవారం టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పలు విషయాలను శ్రీహరి వెల్లడించాడు. తొలుత తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పిన నటుడు ఆపై జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తాల్లో అప్పు చేసి జాబ్ మానేసినట్లు తెలిపాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తీసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వాటిని తీర్చేందుకు చాలా కష్టపడ్డానని శ్రీహరి.. తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. నాలుగేళ్ల కిందట తన తల్లి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని చెప్పాడు. దాంతో డబ్బుల కోసం ఫ్రెండ్ ద్వారా తొలిసారి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బులతో తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించినట్లు అంగీకరించాడు. అయితే గతంలో తొలిసారి కేసు నమోదు చేశాక.. ఇప్పుడు తనకేం సంబంధం లేకపోయినా నాలుగేళ్లకు మరో కేసు నమోదు చేశారని ఆందోళనకు గురయ్యాడు. గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసులురెడ్డి దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోక తనపేరు చెప్పాడన్నాడు. అయితే గతంలో తనపై నమోదైన తొలికేసు సమయంలో తాను స్మగ్లింగ్ చేయడం నిజమే కనుక నిజాయితీగా తాను లొంగిపోయానని.. ఆ కేసులో శిక్ష అనుభవించేందుకు సిద్ధమని తెలిపాడు హరిబాబు. తాను ఎప్పుడో వదిలేసిన ఈ పనికి ప్రస్తుతం తప్పుడు కేసులు బనాయించారని, ఆ కారణంతోనే నాలుగేళ్లు తనపేరు మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అర్బన్ జిల్లాలో ఉన్న ఏ కేసులతోనూ తనకు సంబంధం లేదని, శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్ఐతో కలిసి స్లగ్లింగ్ చేశాడని వివరించాడు. బెంగళూరులో దుంగలు అమ్మి ఎస్ఐ డబ్బులు ఖాతాలో వేసేవాడని, అయితే వాటికి సంబంధించిన రశీదులు శ్రీనివాసులు రెడ్డి వద్ద ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌కు బహిర్గతం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే తనపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించారని తన ఆవేదనను కమెడియన్ వెల్లగక్కాడు. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తిన కమెడియన్.. సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం గాలించారు. ఈ క్రమంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారుల ఎదుట లొంగిపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. టాస్క్‌ఫోర్స్ ఐజీ ఎదుట లొంగిపోయిన టీవీ ఆర్టిస్ట్ కమెడియన్ కోసం పోలీసుల వేట -
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
-
లొంగిపోయిన ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్..!
తిరుపతి సిటీ: ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి మంగళవారం టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడు. తిరుపతికి చెందిన యల్లంపల్లి శ్రీహరి న్యాయవాదితో వచ్చి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో లొంగిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో వచ్చిన ఆదాయంతో సినిమా తీశాడని, టీవీ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీహరి కోసం 5 రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టగా, ఐజీ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు శ్రీహరిని కోర్టులో హాజరుపరిచారు. ఇతనిపై 10కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన ఆర్థిక పరిస్థితి బాగోలేక తాను ఒకే ఒక్క సారి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పాల్గొన్నానని శ్రీహరి మీడియాకు తెలిపారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుండగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కానిస్టేబుల్ తనపై అనేక కేసులు బనాయించి ఇరికించాడని చెప్పారు. -
తిరుపతిలో పేలుడు పరికరాల స్వాధీనం
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులకు సోమవారం రాత్రి పేలుడు పరికరాలు లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అధికారుల కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక బ్యాగును గుర్తించారు. బ్యాగులో పేలుడుకు ఉపయోగించే సర్క్యుట్ బోర్డులు, సెల్‌ఫోను, వాక్‌మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆర్ఎస్సై వాసు ఐజీ కాంతారావుకు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పేలుడుకు ఉపయోగించే పరికరాలుగా నిర్ధారించారు. అనంతరం కాంతారావు బాంబు స్య్వాడ్‌కు సమాచారం అందించారు. వారూ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు మీడియాతో మాట్లాడుతూ, ఇవి పేలుళ్లు సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అడవిలో ఎవరూ లేనిచోటుకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి వాటిని సిద్ధంచేసినట్లు తెలుస్తోందన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులతో పాటు ఇతర వీఐపీలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుంటారని, అయితే.. ఎవరిని టార్గెట్ చేసి వీటిని తయారుచేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలుతుందని కాంతారావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంచీపై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందని.. లభ్యమైన ఆధారాలకు అనుగుణంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను తిరుమల టూటౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తామన్నారు. అనంతరం కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
రెండు చోట్ల 47 ఎర్రచందనం దుంగల పట్టివేత
పట్టుకున్న దుంగల బరువు 340 కేజీలు చెన్నుపల్లెకు చెందిన నలుగురి అరె స్టు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ బేస్తవారిపేట : మండలంలోని పగుళ్లవాగు వద్ద 32, నారువానిపల్లెలో 15 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు శనివారం వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఫారెస్ట్ టాస్క్‌ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు రెండు రోజులుగా గిద్దలూరు సీఐ మహ్మద్ ఫిరోజ్, ఎస్సై బి.రమేష్‌బాబుల ఆధ్వర్యంలో పోలీస్‌లు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు. గలిజేరుగుళ్ల, చెన్నుపల్లె, శింగరపల్లె, శింగసానిపల్లె, కోనపల్లె, నారువానిపల్లె కొండ ప్రాంతాలు, అనుమానితుల గృహాల్లో తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ చెప్పారు. చెన్నుపల్లెకు చెందిన నారు చెంచయ్య, పెదమల్లు వెంకటేశ్వర్లు, వీరపునేని వెంకటేశ్వర్లు, చినకొండ వెంకటేశ్వర్లు, వీరినేని చెంచయ్య, లింగయ్యలు అడవిలోని ఎర్రచందనం చెట్లు నరికి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా వారి కుట్రలను భగ్నం చేసినట్లు వివరించారు. చెంచయ్య, లింగయ్యలు పరారిలో ఉన్నారని, మిగిలిన నలుగురిని అరె స్టు చేసినట్లు పేర్కొన్నారు. 47 ఎర్ర చందనం దుంగలు 340 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. శుక్రవారం రాత్రంతా అడవిలో తిరిగి ఎర్రచందనం పట్టుకున్న ఎస్సై బి.రమేష్‌బాబును డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ మహ్మద్ ఫిరోజ్ పాల్గొన్నారు. -
కలకలం
సాక్షి, కడప : ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పట్టుబడుతున్న నిందితులను పరిశీలిస్తే కలకం రేగుతోంది. కాసులకు కక్కుర్తి పడి ఏకంగా ఎర్రచందనం కూలీలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వాడడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు వ్యవహారం బట్టబయలైంది. తమ నిఘాను దాటి ఎర్రచందనం కూలీలు తమిళనాడు నుంచి ఎలా వస్తున్నారని పోలీసులు నిశితంగా గమనించడంతో ఆర్టీసీ డ్రైవర్ల చేయూత వ్యవహారం వెలుగుచూసింది. నందలూరుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో రిజర్వేషన్ చార్టు, టిమ్స్ (టిక్కెట్లు ఇచ్చే) యంత్రం, డ్యూటీ చార్టు ఆధారంగా పోలీసులు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన సుమారు 41 మంది డ్రైవర్లను ఇప్పటివరకు అరెస్టు చేశారు. డ్రైవర్లు చెన్నై కోయంబేడు బస్టాండు నుంచి రైల్వేకోడూరు అటవీ ప్రాంతానికి కూలీలను తీసుకు వచ్చేవరకు బస్సులో మరెలాంటి కొత్త ప్రయాణికులను ఎక్కించుకునే వారు కాదు. పైగా మధ్యలో ఎక్కడైనా స్టేజీలు ఉన్నా నిలుపకుండా నేరుగా తీసుకెళ్లి కోడూరు అటవీ ప్రాంతంలో దించేవారు. అంతేకాకుండా జిల్లాకు చెందిన వింజమూరు రామనాథరెడ్డి అనే అంతర్జాతీయ స్మగ్లర్‌ను అరెస్టు చేయడం కూడా కలకలం సృష్టించింది. వైఎస్సార్ జిల్లాతోపాటు అటు నెల్లూరు, ఇటు కర్నూలు జిల్లాల్లో కూడా ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహం సంఘటన సంచలనం సృష్టించింది. 30 మంది డ్రైవర్ల అరెస్టు తమిళ కూలీలను అక్రమంగా తీసుకు వస్తున్న కర్నూలు జిల్లాలోని మూడు డిపోలకు చెందిన 30 మంది డ్రైవర్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ సోమవారం వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 11మందిని అరెస్టు చేశామని, మరో 30 మందిని సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. వీరంతా చెన్నైలో తమిళ కూలీలను ఎక్కించుకుని కోడూరు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చేవారని, బస్సు బస్టాండుకు తీసుకెళ్లకుండా బైపాస్ మీదుగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలే వారన్నారు. వీరందరినీ గుంపగుత్తగా తరలించినందుకు ఆర్టీసీ డ్రైవర్‌కు కూలీలు రూ. 2 వేల నుంచిరూ. 3 వేలు అందించేవారన్నారు. నంద్యాల డిపోకు చెందిన కేఎస్ రాముడు, వైవీ రంగయ్య, బీఎన్ రాజు, ఎస్.మహబూబ్, జీఎస్ వాసులు, కె.నాగేంద్ర, ఎస్ఏ సత్తార్, పీజీ కృష్ణ, ఎస్.ఇస్మాయిల్, ఎస్.షబ్బీర్, పీసీ శేఖర్, కె.కలీముల్లా, ఎస్ఆర్ బాషతోపాటు ఆళ్లగడ్డ డిపోకు చెందిన బీఎన్ రాజు,సి.కుళ్లాయప్ప, డి.దానం, ఎస్కే అల్తాఫ్, ఎస్ఏ సలేహా, వీడీ గిరి, ఎ.శివుడు, కేఆర్కే రెడ్డి, ఎంఎన్ రెడ్డి, ఎస్బి రెడ్డి, ఎస్సీ బాష, జి.ప్రసాద్‌లతోపాటు ఆత్మకూరు డిపోకు చెందిన ఎస్.మజీద్, బీఆర్కే సింగ్, ఎంఎస్ హుసేన్, ఎంఎస్ఆర్ రెడ్డి, కేవీ వహాబ్‌లను అరెస్టు చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్టు చాపాడు మండలం చెండ్లూరు గ్రామానికి చెందిన రామనాథరెడ్డి చెన్నైకి చెందిన శాహుల్భాయ్, బెంగుళూరుకు చెందిన రోషన్‌కు ఎర్రచందనం రవాణాచేసేవాడు. ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బులతో వింజమూరులో రూ. 2 కోట్లతో ఇల్లు, 3.65 ఎకరాల పొలం, ఇంటిస్థలాలు కొన్నట్లు ఎస్పీ వివరించారు. ఇతనిపై ఇప్పటివరకు బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో నాలుగు కేసులు, అర్బన్‌లో నాలుగు కేసులు, ఖాజీపేట, బి.మఠంలలో ఒక్కొక్క కేసు, కర్నూలు జిల్లాలోని అనంతసాగరం, డోన్లలో ఒక్కొక్క కేసు, చిత్తూరు జిల్లా చంద్రగిరి, నెల్లూరుజిల్లా సోమశిల, అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు పరిధిలో ఒక్కొక్క కేసు కలుపుకుని మొత్తం ఐదు జిల్లాల్లో 15 ఎర్రచందనం కేసులు నమదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఇది మరో అంతర్జాతీయ స్మగ్లర్ రోషన్ కథ! రామనాథరెడ్డితోపాటు బెంగుళూరుకు చెందిన నజీర్ అహ్మద్ అలియాస్ రోషన్ ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి టీవీ, కార్ల మెకానిక్‌గా పనిచేసేవాడు. ఈ నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లర్ రియాజ్‌తో పరిచయం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఎర్రచందనం కొనడం, ప్రధాన స్మగ్లర్ అయిన అక్రంకు విక్రయిస్తుండేవాడు. వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లతో రోషన్ పరిచయాలు ఏర్పరుచుకుని వారి ద్వారా ఇప్పటివరకు 16సార్లు ఎర్రచందనం కొనుగోలుచేసి అక్రంకు అమ్మినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. రోషన్న్పై బద్వేలు అర్బన్, రూరల్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదయ్యూరుు. వీరిద్దరితోపాటు చుండూరు గ్రామానికి చెందిన జి.పవన్‌కుమార్‌రెడ్డి, బి.మఠంకు చెందిన డేరంగుల సుబ్రమణ్యం, రాయపురెడ్డి, జయరామిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన పులి ఎద్దుల కొండారెడ్డి, నెల్లూరు టౌన్‌కు చెందిన అక్కులరెడ్డి నారాయణరెడ్డి, వింజమూరుకు చెందిన దాదిరెడ్డి మస్తాన్‌రెడ్డి అలియాస్ మస్తాన్, అట్లూరు మండలం సూరాయపల్లెకు చెందిన, ప్రస్తుతం బద్వేలులో నివసిస్తున్న సుంకర ఈశ్వర్, శివానగర్‌లో నివసిస్తున్న అబ్బు భాస్కర్, బెంగుళూరు నగరానికిచెందిన అంజాదుల్లాఖాన్ తదితరులను అరెస్టు చేశామన్నారు. కాగా ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలోకూలీలకు సహకరించిన ఆర్టీసీ డ్రైవర్లతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయస్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నవీన్‌గులాఠీ అభినందించారు. -
38 మంది ఎర్రచందనం కూలీల పరారీ
చిత్తూరు:మరోసారి ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి జిల్లాలో కలకలం సృష్టించింది. గురువారం పలమనేరులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎర్రచందనం కూలీలు వ్యవహారం వెలుగుచూసింది. వీరంతా ఒక లారీలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకునే క్రమంలో వారు విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసి పరారయ్యారు. అనంతరం చిత్తూరు సమీపంలోని లారీని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా ఇద్దరు కూలీలు మాత్రమే చిక్కారు. మిగతా 38 మంది లారీని వదిలేసి పారిపోయారు. ప్రస్తుతం ఆ లారీని సీజ్ చేసిన పోలీసులు ఆ కూలీలను విచారించే పనిలో పడ్డారు. -
అందరూ దొంగలే
-
అందరూ దొంగలే
* అధికారులు, నేతల కనుసన్నల్లో ఎల్లలు దాటుతున్న ఎర్రచందనం * జపాన్, సింగపూర్, మలేసియూలకు అక్రమంగా ఎగుమతి * ఖాళీ అవుతున్న శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాలు * అరుదైన సంపద అంతరించిపోతున్నా పట్టించుకోని పోలీసు, అటవీ అధికారులు * అప్పుడప్పుడు చిన్న స్మగ్లర్లు పట్టుబడినా వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు.. ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి: వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అందరూ దొంగలే! డబ్బు మూటల సాక్షిగా అధికారులు, రాజకీయనేతల ‘అపవిత్ర బంధం’తో అత్యంత కట్టుదిట్టమైన నెట్వర్క్ మధ్య ‘ఎర్రబంగారం’ అనునిత్యం రాయలసీమ జిల్లాల నుంచి దేశం ఎల్లలు దాటిపోతోంది. పోలీసు, అటవీశాఖలకు చెందిన పలువురు అధికారులు ఇంటి దొంగల పాత్ర పోషిస్తుండగా.. కొందరు రాజకీయ నేతలు రాజీలు కుదిర్చే పెద్దన్నల పాత్ర పోషిస్తున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా అందరూ కలిసి ఎర్రచందనాన్ని నిరాటంకంగా సరిహద్దులు దాటిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ఇంటి దొంగలకు తెలియకుండా ఎవరైనా అధికారులు దాడులు చేసి పట్టుకున్నా దొరికేది కూలీలు, డ్రైవర్లే! వారు చెప్పే వివరాల ఆధారంగా చిన్న స్మగ్లర్లను అధికారులు అరెస్టు చేసినా వెంటనే వదిలేయాలంటూ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తాయి. గట్టి అధికారి ఎవరైనా వినకపోతే ఉన్నతాధికారులతో చెప్పించి విడుదల చేయిస్తారు. అంతటితో దాని ‘కథ’ ముగిసిపోతుంది. శేషాచలం టూ సింగపూర్ కోట్లు కుమ్మరిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా ఓ మాఫియాలా మారడంతో.. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అత్యంత అరుదైన, విలువైన ఈ వృక్షజాతి ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. ఈ అయిదు జిల్లాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఈ వృక్ష జాతి లేదు. (అంతరించిపోతున్న వృక్షజాతుల్లో చేర్చారు) ఈ కలప ఎగుమతికి ఎవరికీ అనుమతి లేదు. దీంతో రాష్ట్రంలోని, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని రాయలసీమలోని శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాల నుంచి వేలాది టన్నులు జపాన్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర దేశాలకు చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. పెలైట్ల సాయంతో చెక్‌పోస్టులు దాటి ఒక ప్రాంతం నుంచి వాహనంలో సరుకు తరలించే ముందు స్మగ్లర్లు తమకు అనుకూలమైన పోలీసు, అటవీ సిబ్బంది ద్వారా సదరు మార్గంలో ఎవరైనా అధికారులు ఉన్నారా? అని విషయం తెలుసుకుంటారు. లైన్ క్లియర్‌గా ఉందని సమాచారం వచ్చినా ఒక పట్టాన నమ్మరు. ఆ ప్రాంతంలోని నమ్మకస్తులైన కొందరు యువకులను మాట్లాడుకుని మోటార్ సైకిల్ లేదా కారులో ఆ మార్గంలో పెలైట్‌గా పంపుతారు. అటవీ/పోలీసు సిబ్బంది లేరని నిర్ధారించుకున్న తర్వాత ముందు ఒక ఖాళీ వాహనం వెళుతుంది. దాని వెనుక ఎర్రచందనం దుంగలున్న వాహనం వెళుతుంది. మధ్యలో సెల్ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఏమాత్రం అనుమానం వచ్చినా వాహనాన్ని దారి మళ్లించేస్తారు. అటవీ ప్రాంతం, చెక్‌పోస్టులు దాటుకుని నిర్ధారిత ప్రధాన మార్గానికి చేరుకుంటారు. ఇలా పెలైట్‌గా వెళ్లినవారికి 3 నుంచి 5 కిలోమీటర్లకు రూ.10 వేలు చొప్పున ఇస్తారు. కంటెయినర్లలో ఓడరేవుకు సాధారణంగా చెన్నై పోర్టు ద్వారానే ఎర్రచందనాన్ని విదేశాలకు పంపిస్తారు. అందువల్ల ఆయూ జిల్లాల నుంచి చెన్నై మార్గంలో వెళ్లే వాహనాలనే అధికారులు తనిఖీ చేస్తారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు తాము కలప నిల్వ చేసిన ప్రాంతం నుంచి తొలుత హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తరలిస్తున్నారు. అంబులెన్సులు మొదలు ఆయిల్ ట్యాంకర్ల వరకూ దేనిలో వీలైతే దానిలో తరలిస్తున్నారు. ఆయా నగరాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెళ్లే భారీ కంటెయినర్ల డ్రైవర్లకు దారిమధ్యలో భారీగా డబ్బు ఎరవేసి అందులో ఎర్రచందనం దుంగల్నీ నింపి చెన్నై, కృష్ణపట్నం, ముంబై, కాండ్లా తదితర ఓడరేవులకు చేరవేస్తున్నారు. ఇలా వేరే సరుకుల పేరుతో కంటెయినర్లు విదేశాలకు చేరతాయన్న మాట. కస్టమ్స్ అధికారులు పెద్ద పెద్ద కంపెనీలకు సెల్ఫ్ సీలింగ్ సదుపాయం కల్పించడమూ ఇందుకు అనువుగా మారింది. ‘‘మా పోర్టు నుంచి ప్రతిరోజూ 1500 కంటెయినర్లు వెళుతుంటాయి. అన్నింటినీ తనిఖీ చేయాలంటే రవాణా వ్యవస్థ స్తంభించి షిప్పులన్నీ ఆగిపోతాయి. అందువల్ల ర్యాండమ్ పద్ధతిలో కొన్ని కంటెయినర్లే తనిఖీ చేస్తాం. అలా చేసినప్పుడు గతంలో కొన్నింటిలో ఎర్రచందనం దొరికింది. దానిని సీజ్ చేశాం’’ అని చెన్నైకి చెందిన డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారి తెలిపారు. తమిళ కూలీలకు కాసులే కాసులు అటవీ ప్రాంతంలో చెట్లు నరికి ఎర్రచందనం దుంగలు తరలించే కూలీలకు వేలకు వేల కూలీ లభిస్తోంది. అందువల్లే తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ పనికి 18-25 ఏళ్ల మధ్య వయసుగల కూలీలు అధిక సంఖ్యలో శేషాచలం అడవులకు వస్తున్నారు. అడవిలో చెట్టుకొట్టి తయారు చేసిన దుంగను వీరు 25-30 కిలోమీటర్లు మోసి వాహనాలు వెళ్లే మార్గం దగ్గరకు చేరవేస్తారు. ఇందుకు వారికి కిలోకు రూ.500 నుంచి రూ. 700 వరకూ ఇస్తున్నారు. ఒక్కో కూలీ మూడు రోజుల్లో 30 కిలోల బరువున్న దుంగను ఇలా చేర్చుతారు. వీరికి కిలోకు రూ.500 చొప్పున మూడు రోజుల కూలి కింద రూ.15 వేలు వస్తుంది. అంటే రోజు కూలి అక్షరాలా రూ.5 వేలు. అందువల్లే తమిళనాడులోని జమునా మత్తూర్, మామత్తూర్, ఆంబూర్, కన్నమంగళం, మలయార్ మక్కల్ ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. గత నెలలో శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిని హత్య చేసింది ఈ ప్రాంతాలకు చెందిన కూలీలే. రాష్ట్రానికి చెందిన కూలీలకు రోజుకు రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు. 2011-12లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 1430 మెట్రిక్ టన్నులుండగా.. దీనికి 10 నుంచి 12 రెట్లు విదేశాలకు తరలి ఉంటుందని అంచనా. పట్టుబడుతున్నదీ కూలీలే ఇటీవల రాయలసీమలో ప్రత్యేకించి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేవారిలో 90 శాతం మంది తమిళ కూలీలే. కేసుల భయంవల్ల మన రాష్ట్రంలోని అటవీ పరిసర గ్రామాలవారు ఎర్రచందనం చెట్లు నరికేందుకు ఇష్టపడట్లేదు. స్మగ్లింగ్ నిరోధం పేరిట పోలీసు, అటవీ సిబ్బంది పట్టుకుంటున్నది కేవలం ఈ కూలీలు, వారిని పంపించే చిరుచేపల్నే. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో రూ. వేల కోట్లు ఆర్జిస్తున్న తిమింగలాల్లాంటి అసలు నేరగాళ్లు దొరల్లా దర్జాగా తిరుగుతున్నారు. టాస్క్ఫోర్సు పట్టించిన చిన్న స్మగ్లర్లపై కేసు పెట్టకుండా వదిలేయడం వల్లే సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన సీఐ పార్థసారథితోపాటు ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ కావడం, మరికొందరి పాత్రపై దర్యాప్తు జరుగుతుండ టం స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల పాత్రను స్పష్టం చేస్తోంది. తమిళనాడుకు చెందిన లాయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని అరెస్టరుున కూలీలకు బెయిల్ ఇప్పిస్తున్న స్థానిక న్యాయవాదులూ భారీగా ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. ‘‘అరెస్టయినట్లు తెలియగానే ఇక్కడి అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఒకరికి బెయిలిప్పిస్తే రూ.10 వేలు తీసుకుంటున్నారు.’’ అని కడపకు చెందిన ఓ లాయర్ తెలిపారు. -
సీఎం సోదరుడి అనుచరుడు అరెస్ట్
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ప్రధాన అనుచరుడు ద్వారకానాధ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మాఫియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లర్ల వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం అందని, ఆయన సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నేరమయం
ఈ ఏడాది రహదారులు రక్తసిక్తమయ్యాయి.. వందలాదిని బలిగొన్నాయి. దొంగలు దోపిడీలతో హడలెత్తించారు. రాత్రి,పగలూ అనే తేడా లేకుండా చోరీలతో రెచ్చిపోయారు. ఓవైపు హత్యలతో మరోవైపు నేరాలతో జిల్లా అట్టుడికిపోయింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అంతే లేకుండా పోయింది. ఇక భూ దందాలు.. రియల్ మోసాలు సరేసరి. మొత్తంపైన 2013వ సంవత్సరం నేరమయంగా మారింది. ఈ ఏడాదిలో జరిగిన క్రైంపై రౌండప్.. - న్యూస్‌లైన్, కడప అర్బన్ ఈ ఏడాది జిల్లాలో నేరాలు, ప్రమాదాల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడు హత్యలు తగ్గాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా సాగిం ది. 2013లో జిల్లాలో ఇద్దరు ఎస్పీలు పని చేశారు. వీరిలో మనీష్‌కుమార్‌సిన్హా కేంద్ర పరిశోధనా సంస్థ సీబీఐకి అక్టోబరు 24న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జీవీ. అశోక్‌కుమార్ ఎస్పీగా నియమించారు. ఈ ఏడు జరిగిన నేరాలు.. ప్రమాదాలు కడప అర్బన్ సర్కిల్లో చెన్నూరు ప్రాంతం లో నివసిస్తూ తన దగ్గరికి వచ్చేవారికి మాయమాటలు చెప్పి బంగారం కాజేసిన అసదుల్లా ఖాద్రీ వ్యవహారం సంచలనం సృష్టించింది. విచారించిన పోలీసులు ఖాద్రీ తో పాటు ఫరూక్, గౌస్‌అహ్మద్ అనే మరో ఇద్దరిని అప్పటి జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అతని నుంచి రూ.2కోట్లు విలువైన బంగారు ఆభరణాలు,రూ.10.37లక్షల నగదు, పలు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరులో కిడ్నాప్‌లకు పాల్పడుతూ పోలీసులతో, లాయర్లతో సంబంధాలు కలి గిఉన్న సునీల్ గ్యాంగ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అతనితో ప్రత్యక్ష సంబంధాలున్న ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ వేటువేశారు. నవంబర్ 4న కడపలోని శ్రీనివాసులు అనే అమృతమిల్క్ మాజీ మేనేజర్‌ను కిడ్నా ప్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా చిన్నచౌ కు పోలీసులు ప్రస్తుత ఎస్పీ చొరవతో ఖాజీపేటకు చెందిన ఓబుల్‌రెడ్డి, లావణ్య తదితర ముఠా సభ్యులను పట్టుకోగలిగారు. ఓబులవారిపల్లె మండలం జీవీపురానికి చెందిన తోట సుబ్రమణ్యంను సీరియల్ కిల ్లర్ తోట వెంకటరమణ నవంబర్ 24న దారుణంగా తుపాకీతో హత్యచేశాడు. అంతకు ముందు మూడు హత్యాయత్నాలతో సంబంధమున్న తోట వెంకటరమణను జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఛాలెంజ్‌గా తీసుకొని అతన్ని ఈ నెల14న అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మరో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. రైల్వేకోడూరు మండలం కె.బుడుగుం టపల్లెలో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాతపడ్డారు. బావి గోడలు కూలడంతో ఈ సంఘటన జరిగింది. జనవరి 17న ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ బిగ్‌బాస్‌గా పిలువబడే భూమిరెడ్డి రాంప్రసాద్‌రెడ్డిని అప్పటి డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి రూ.6లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31న కడప నగరంలోని మారుతీ నగర్లో జూద గృహంపై దాడిచేసి 23మంది జూదరులను అరెస్టు చేయడంతోపాటు రూ.10.46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 28న డీసీసీబీ ఎన్నికల అధికారి డీసీఓ చంద్రశేఖర్‌ను కిడ్నాప్ చేసి డీసీసీబీ ఎన్నికలు వాయిదా పడేలా అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారు. 24గంటలు తర్వాత చిత్తూరు జిల్లాలో ఆయన పోలీసులను ఆశ్రయించి కడపకు వచ్చారు. చోరీలు- దోపిడీలు ఫిబ్రవరి 10న కడప నగరంలోని కుమ్మరకుంట కొట్టాలు ప్రాంతంలో ఒకేరోజు మూడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 29 తులాల బంగారు ఆభరణా లు, రూ.43వేలు నగదు పోయాయి. మే 10న చిన్నచౌక్ పరిధిలోని పాతబైపాస్ వద్ద బైక్‌తో ఢీకొట్టి ఓబులవారిపల్లె ఉపాధిహామీ కో ఆర్డినేటర్ రవిపై దాడిచేసి దాదాపు రూ.15.96లక్షలు దోపిడీ చేశారు. ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. హత్యలు.. చెన్నూరు సమీపంలో పెన్నానదిలో మానస అనే బాలికను వెంకటశివ అనే బాలుడు మార్చి 13న దారుణంగా హత్య చేశాడు. కడప టూటౌన్ పరిధిలోని న్యూ యానాదికాలనీలో నివసిస్తున్న బయన్న తన అంగవైకల్య కుమారుడు రామాం జ నేయులు(12)ను మద్యం మత్తులో కాళ్లు, చేతులు కట్టి గొంతు నులిమి హత్య చేశాడు. ఫిబ్రవరి 27న లింగాల మండలం బోనాలలో గంగన్న అనే వ్యక్తి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఇతను 1984లో దాసరి వెంగప్పను హత్యచేసిన కేసులో నిందితుడు. ఏప్రిల్ 7న వడ్డీ వ్యాపారి రమణారెడ్డిని సుబ్బరాయుడు, మరో ఇద్దరు కలి సి పోట్లదుర్తి వద్ద కొడవలితో నరికి హత్యచేసిన సంఘటన సంచలనమైంది. రాయచోటి పట్టణం వై.కుంటరాసపల్లెలో ఫిబ్రవరి 22న నాగమ్మ అనే మహిళ హత్యకు గురైంది. రాయచోటి- రాజంపేట రహదారిలోని యూసఫ్ అనే వ్యక్తిని మే 18న గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్యచేశారు. అట్లూరు మండలం వలసపాలెంలో మే 20న మూఢనమ్మకాలతో నరసిం హులు అనే యువకుడిని నరబలి చేసి పోతురాజు విగ్రహానికి రక్తాభిషేకం చేశా రు. ఆ సంఘటన ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. స్నేహితులు ఎగతాళి చేయడంతో ప్రేమ వివాహం చేసుకున్న తన అక్క రాబియా(20) అనే గర్భిణీని తమ్ముడే హత్య చేశాడు. జులై 11న జరిగిన ఈ సంఘటన కలసపాడులో చోటు చేసుకుంది. మే 28న కడప నకాష్‌కు చెందిన షేక్ ఆజామ్ అలియాస్ బిల్లీ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. అతన్ని స్నేహితులు గౌస్ పఠాన్ అబ్దుల్‌ఖాన్ అలియాస్ అతుల్, ఇర్ఫాన్ అలియాస్ బిల్లాబేడీలు టూటౌన్ పరిధిలోని హిందూ శ్మశానవాటిక వద్ద దారుణంగా హత్య చేశారు. మే 28న కడప నకాష్‌కు చెందిన షేక్ ఆజామ్ అలియాస్ బిల్లీ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. అతన్ని స్నేహితులు గౌస్ పఠాన్ అబ్దుల్‌ఖాన్ అలియాస్ అతుల్, ఇర్ఫాన్ అలియాస్ బిల్లాబేడీలు టూటౌన్ పరిధిలోని హిందూ శ్మశానవాటిక వద్ద దారుణంగా హత్య చేశారు. ఆత్మహత్యలు.. మార్చి 10న ప్రొద్దుటూరు సంజీవనగర్‌లో నివసిస్తున్న పామిడి శ్యామల(19) లక్ష్మిరంగయ్యలు ప్రేమ వివాహం చేసుకు న్న ఏడాదికే ఉరి వేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవరూ కార ణం కాదని సుసైడ్ నోట్లో పేర్కొన్నారు. మే 21న కర్నూలు జిల్లా లద్దెగిరి గ్రామం రామాపురానికి చెందిన రవితేజ అనే ఇంజనీరింగ్ విద్యార్థి కడప చిన్నచౌకు పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మే 29న ఎర్రగుంట్లలో నివాసముం టున్న వసంత తన కుమార్తె రిషిత(4), కుమారుడు ప్రణీత్(6)లతోపాటు మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లి, కుమార్తె మతిచెందారు. కుమారుడు ఒంటరయ్యాడు. -
ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో పోలీసులకు గాయాలు
-
ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో పోలీసులకు గాయాలు
చిత్తూరు: జిల్లాలోని భాకర్‌రావు పేట వద్ద ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు శనివారం రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై ప్రతిదాడికి దిగారు. స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్మగ్లర్లు దాడికి దిగారు. గాయపడిన పోలీసులను తిరుమలలోని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, గత కొంత కాలంగా అటవీ శాఖ అధికారులపై స్మగ్లర్ల దాడులు అధికమయ్యాయి. పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టడంతో స్మగ్లర్లు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. స్మగ్లర్ల దాడులను ఆరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వారి ఆగడాలు ఇంకా మితిమీరుతున్నాయి. -
ఎవరీ బాషా భాయ్?
తిరుపతి, సాక్షి: బాషాభాయ్... ఎర్రచందనం డాన్. చెన్నైలో ఉంటాడు. అతన్ని చూసిన వాళ్లెవరూ లేరు. సినిమాల్లోలాగా అతనికి బోలెడు మంది అనుచరులు. వాళ్లే దందా నడుపుతూ ఉంటారు. చాలా పెద్ద విషయమైతేనే బాషా రంగంలోకి వస్తాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ దీన్ని వ్యవస్థాగతం చేసింది బాషానే. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉందని మొదట పసిగట్టింది అతనే. బాషాకి చట్టబద్దమైన వ్యాపారాలు చాలా ఉన్నాయి. అవి ఉంటేనే షిప్పుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ సాధ్యమయ్యేది. అతని మ నుషులు గ్లోబల్ టెండర్లలో గతంలో ఎర్రచందనాన్ని కొనే వారు. దాన్ని రవాణా చేస్తున్నప్పుడు అసలు సరుకులోకి అక్ర మసరుకుని కలిపేస్తారు. ఎక్కడా ఎవరూ నోరు మెదపకుండా మేనేజ్ చేస్తారు. స్మగ్లింగ్‌లో అసలు సమస్య అడవుల్లోకి వెళ్లి నరకడం, సరుకుని లారీల్లోకి ఎక్కించడం, తర్వాత దాన్ని ఆం ధ్రా సరిహద్దు దాటించడం. ఒకసారి సరిహద్దుదాటిన తర్వా త చైనావరకూ దాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే బంగా రు, వజ్రాలు, డ్రగ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఉన్న శ్రద్ధ కస్టమ్స్ వాళ్లకి ఈ ఎర్రచందనంపై ఉండదు. మొదట్లో స్థానిక కూలీలే అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం వృక్షాలను నరికేవాళ్లు. అయితే వాళ్లు సులభంగా దొరికిపోయేవాళ్లు. కూలీ డబ్బుల ను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ ఉండడంతో ఇరుగుపొరుగు వాళ్లే సమాచారమిచ్చేవాళ్లు. అంతేకాకుండా అక్రమ రవాణా లో పోటీ పెరగడంతో స్థానిక స్మగ్లర్లలో ఉన్న అనైక్యతవల్ల ఒకరిగురించి మరొకరు అధికారులకు సమాచారమిచ్చి పట్టిం చేవాళ్లు. ఈ నేపథ్యంలో తమిళులు ప్రవేశించారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో వీరప్పన్ అనుచరులు న్నారు. వాళ్లు కేరళ, కర్ణాటక, తమిళనాడు అడవుల్లోని శ్రీగంధం వృక్షాలను కొన్నేళ్లపాటు నరికేశారు. ఇప్పుడక్కడ ఏమీ లేకపోవడంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న ఎర్రచందనంపై పడ్డారు. ఇంకో రెండు మూడేళ్లలో ఇక్కడ కూడా ఏమీ మిగలదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రిస్క్కంటే లాభాలే ఎక్కువున్నాయి. అడవిలో నరికి సరుకును గమ్య స్థానానికి చేర్చడం వరకే రిస్క్. ఒకవేళ పట్టుబడితే బెయిల్ లభిస్తుంది. శిక్షపడితే మూడు నెలలకు మించదు. వీళ్లకోసం తమిళనాడు నుంచి లాయర్లు వస్తారు. జరగాల్సింది వాళ్లు చూసుకుంటారు. చివరికి ఈ స్మగ్లింగ్ మనీ సర్క్యులేషన్ స్కీంలా తయారైంది. వేలకు వేలు కూలి డబ్బులు సంపాదించుకుని సొంత వూళ్లకు వెళ్లిన కూలీలను చూసి అనేక గ్రామాలవాళ్లు ప్రభావితమై తమిళనాడు నుంచి ఏకంగా బస్సుల్లో, రైళ్లల్లో వచ్చేస్తున్నారు. కూలీలే కొంతకాలానికి చిన్న స్మగ్లర్లగా మారుతున్నారు. వీళ్లంతా కూడా బడా స్మగ్లర్ బాషా అనుచరులను ఆశ్ర యించాల్సిందే. బాషా అంటే ఒక్కడు కావచ్చు. ఆ పేరుతో అనేకమంది ఉండొచ్చు. శేషాచలం అడవుల్ని ఖాళీ చేయడమే వీళ్ల లక్ష్యం. -
తెగబడ్డారు
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. తమిళనాడు నుంచి తరలి వచ్చిన కూలీలు యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికి అక్రమ రవాణా చేస్తున్నారు. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించే అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. మారణాయుధాలతో సంచరిస్తున్న స్మగ్లర్లు అటవీ ఉద్యోగులను హత మార్చేందుకూ వెనుకాడటం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలో ఉద్యోగులున్నారు. రాజంపేట, న్యూస్‌లైన్: శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికేస్తున్నారు. అడ్డొచ్చిన అటవీ అధికారులను అంతమొందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలు పెరిగిపోతుండటంతో అటవీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కడప -చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉన్న తుంబురతీర్థం సమీపంలో స్మగ్లర్లు తెగబడ్డారు. అధికారులపై దాడి చేసి ఇద్దరిని దారుణంగా చ ంపారు. మరికొందరు సిబ్బంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. ఈ సంఘటన అటవీ ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్న అటవీ అధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిరాయుధులంగా ఉంటూ స్మగ్లర్ల చర్యలను ఎలా తిప్పికొట్టాలని ప్రశ్నిస్తున్నారు. అయితే తుంబరతీర్ధం వద్ద జరిగిన సంఘటనతో తుమ్మలబైలు, బాలపల్లె, మామండూరు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తమిళ స్మగ్లర్లు జిల్లాలోని శేషాచలం అడవుల వైపు వస్తారన్న అనుమానంతో అడవిలో గాలింపు చేస్తున్నారు. వారు వైఎస్సార్ జిల్లాలో రోడ్డు, రైలు మార్గం ద్వారా వారి గమ్యాలకు చేరుకుంటారనే అనుమానాలు అటవీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలు లేకుంటే వెళ్లలేం స్మగ్లర్ల చేతిలో ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురైన నేపథ్యంలో ప్రస్తుతం అటవీ ఉద్యోగులు అడవిలోనికి వెళ్లి విధులు నిర్వహించాలంటేనే వణికిపోతున్నారు. ఆయుధాలు లేకుండా విధులకు వెళ్లమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. పాతకాలం నాటి తుపాకులు ఉన్నాయే తప్ప అధునాతన ఆయుధాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లను కాల్చివేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. కేవలం అడవిలో సాయుధ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కూంబింగ్ చేస్తున్నారు. అయితే అటవీ సిబ్బంది చేతికి మాత్రం ఆయుధాలు ఇవ్వలేదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. తుంబురతీర్థం సంఘటనతో అడవిలోకి అటవీ సిబ్బంది వెళ్లడంలేదు. అప్రమత్తమైన అటవీశాఖ కడప-చిత్తూరు జిల్లా సరిహద్దులో జరిగిన సంఘటనతో అటవీశాఖ అప్రమత్తమైంది. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఇటీవల శేషాచలం అడవిలో తిష్ట వేశారు. వారిని నియంత్రించేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే అడవిలో అనేకమార్లు స్మగ్లర్లు తిరగబడటం, చెక్‌పోస్టులను సైతం లెక్కచేయకుండా స్మగ్లింగ్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో తమిళ తంబిలను అరెస్టు చేశారు. అయినప్పటికీ వారి ఆగడాలు ఆగడం లేదు. శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలకు ఎలా అడ్డుకట్ట వేయాలనే విషయంపై అటవీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పూర్తిస్థాయి రక్షణ లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకోలేమనే అభిప్రాయంలో వారున్నారు.