ఈ ఏడాది రహదారులు రక్తసిక్తమయ్యాయి.. వందలాదిని బలిగొన్నాయి. దొంగలు దోపిడీలతో హడలెత్తించారు. రాత్రి,పగలూ అనే తేడా లేకుండా చోరీలతో రెచ్చిపోయారు. ఓవైపు హత్యలతో మరోవైపు నేరాలతో జిల్లా అట్టుడికిపోయింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అంతే లేకుండా పోయింది. ఇక భూ దందాలు.. రియల్ మోసాలు సరేసరి. మొత్తంపైన 2013వ సంవత్సరం నేరమయంగా మారింది. ఈ ఏడాదిలో జరిగిన క్రైంపై రౌండప్.. - న్యూస్‌లైన్, కడప అర్బన్
ఈ ఏడాది జిల్లాలో నేరాలు, ప్రమాదాల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడు హత్యలు తగ్గాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా సాగిం ది. 2013లో జిల్లాలో ఇద్దరు ఎస్పీలు పని చేశారు. వీరిలో మనీష్‌కుమార్‌సిన్హా కేంద్ర పరిశోధనా సంస్థ సీబీఐకి అక్టోబరు 24న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జీవీ. అశోక్‌కుమార్ ఎస్పీగా నియమించారు.
ఈ ఏడు జరిగిన
నేరాలు.. ప్రమాదాలు
కడప అర్బన్ సర్కిల్‌లో చెన్నూరు ప్రాంతం లో నివసిస్తూ తన దగ్గరికి వచ్చేవారికి మాయమాటలు చెప్పి బంగారం కాజేసిన అసదుల్లా ఖాద్రీ వ్యవహారం సంచలనం సృష్టించింది. విచారించిన పోలీసులు ఖాద్రీ తో పాటు ఫరూక్, గౌస్‌అహ్మద్ అనే మరో ఇద్దరిని అప్పటి జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అతని నుంచి రూ.2కోట్లు విలువైన బంగారు ఆభరణాలు,రూ.10.37లక్షల నగదు, పలు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు.
ప్రొద్దుటూరులో కిడ్నాప్‌లకు పాల్పడుతూ పోలీసులతో, లాయర్లతో సంబంధాలు కలి గిఉన్న సునీల్ గ్యాంగ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అతనితో ప్రత్యక్ష సంబంధాలున్న ఇద్దరు సీఐలు, ఒక ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ వేటువేశారు.
నవంబర్ 4న కడపలోని శ్రీనివాసులు అనే అమృతమిల్క్ మాజీ మేనేజర్‌ను కిడ్నా ప్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా చిన్నచౌ కు పోలీసులు ప్రస్తుత ఎస్పీ చొరవతో ఖాజీపేటకు చెందిన ఓబుల్‌రెడ్డి, లావణ్య తదితర ముఠా సభ్యులను పట్టుకోగలిగారు.
ఓబులవారిపల్లె మండలం జీవీపురానికి చెందిన తోట సుబ్రమణ్యంను సీరియల్ కిల ్లర్ తోట వెంకటరమణ నవంబర్ 24న దారుణంగా తుపాకీతో హత్యచేశాడు. అంతకు ముందు మూడు హత్యాయత్నాలతో సంబంధమున్న తోట వెంకటరమణను జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఛాలెంజ్‌గా తీసుకొని అతన్ని ఈ నెల14న అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మరో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
రైల్వేకోడూరు మండలం కె.బుడుగుం టపల్లెలో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాతపడ్డారు. బావి గోడలు కూలడంతో ఈ సంఘటన జరిగింది.
జనవరి 17న ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ బిగ్‌బాస్‌గా పిలువబడే భూమిరెడ్డి రాంప్రసాద్‌రెడ్డిని అప్పటి డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి రూ.6లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 31న కడప నగరంలోని మారుతీ నగర్‌లో జూద గృహంపై దాడిచేసి 23మంది జూదరులను అరెస్టు చేయడంతోపాటు రూ.10.46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 28న డీసీసీబీ ఎన్నికల అధికారి డీసీఓ చంద్రశేఖర్‌ను కిడ్నాప్ చేసి డీసీసీబీ ఎన్నికలు వాయిదా పడేలా అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారు. 24గంటలు తర్వాత చిత్తూరు జిల్లాలో ఆయన పోలీసులను ఆశ్రయించి కడపకు వచ్చారు.
చోరీలు- దోపిడీలు
ఫిబ్రవరి 10న కడప నగరంలోని కుమ్మరకుంట కొట్టాలు ప్రాంతంలో ఒకేరోజు మూడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 29 తులాల బంగారు ఆభరణా లు, రూ.43వేలు నగదు పోయాయి.
మే 10న చిన్నచౌక్ పరిధిలోని పాతబైపాస్ వద్ద బైక్‌తో ఢీకొట్టి ఓబులవారిపల్లె ఉపాధిహామీ కో ఆర్డినేటర్ రవిపై దాడిచేసి దాదాపు రూ.15.96లక్షలు దోపిడీ చేశారు. ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
హత్యలు..
చెన్నూరు సమీపంలో పెన్నానదిలో మానస అనే బాలికను వెంకటశివ అనే బాలుడు మార్చి 13న దారుణంగా హత్య చేశాడు.
కడప టూటౌన్ పరిధిలోని న్యూ యానాదికాలనీలో నివసిస్తున్న బయన్న తన అంగవైకల్య కుమారుడు రామాం జ నేయులు(12)ను మద్యం మత్తులో కాళ్లు, చేతులు కట్టి గొంతు నులిమి హత్య చేశాడు.
ఫిబ్రవరి 27న లింగాల మండలం బోనాలలో గంగన్న అనే వ్యక్తి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఇతను 1984లో దాసరి వెంగప్పను హత్యచేసిన కేసులో నిందితుడు.
ఏప్రిల్ 7న వడ్డీ వ్యాపారి రమణారెడ్డిని సుబ్బరాయుడు, మరో ఇద్దరు కలి సి పోట్లదుర్తి వద్ద కొడవలితో నరికి హత్యచేసిన సంఘటన సంచలనమైంది.
రాయచోటి పట్టణం వై.కుంటరాసపల్లెలో ఫిబ్రవరి 22న నాగమ్మ అనే మహిళ హత్యకు గురైంది.
రాయచోటి- రాజంపేట రహదారిలోని యూసఫ్ అనే వ్యక్తిని మే 18న గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్యచేశారు.
అట్లూరు మండలం వలసపాలెంలో మే 20న మూఢనమ్మకాలతో నరసిం హులు అనే యువకుడిని నరబలి చేసి పోతురాజు విగ్రహానికి రక్తాభిషేకం చేశా రు. ఆ సంఘటన ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.
స్నేహితులు ఎగతాళి చేయడంతో ప్రేమ వివాహం చేసుకున్న తన అక్క రాబియా(20) అనే గర్భిణీని తమ్ముడే హత్య చేశాడు. జులై 11న జరిగిన ఈ సంఘటన కలసపాడులో చోటు చేసుకుంది.
మే 28న కడప నకాష్‌కు చెందిన షేక్ ఆజామ్ అలియాస్ బిల్లీ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. అతన్ని స్నేహితులు గౌస్ పఠాన్ అబ్దుల్‌ఖాన్ అలియాస్ అతుల్, ఇర్ఫాన్ అలియాస్ బిల్లాబేడీలు టూటౌన్ పరిధిలోని హిందూ శ్మశానవాటిక వద్ద దారుణంగా హత్య చేశారు.
మే 28న కడప నకాష్‌కు చెందిన షేక్ ఆజామ్ అలియాస్ బిల్లీ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. అతన్ని స్నేహితులు గౌస్ పఠాన్ అబ్దుల్‌ఖాన్ అలియాస్ అతుల్, ఇర్ఫాన్ అలియాస్ బిల్లాబేడీలు టూటౌన్ పరిధిలోని హిందూ శ్మశానవాటిక వద్ద దారుణంగా హత్య చేశారు.
ఆత్మహత్యలు..
మార్చి 10న ప్రొద్దుటూరు సంజీవనగర్‌లో నివసిస్తున్న పామిడి శ్యామల(19) లక్ష్మిరంగయ్యలు ప్రేమ వివాహం చేసుకు న్న ఏడాదికే ఉరి వేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవరూ కార ణం కాదని సుసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
మే 21న కర్నూలు జిల్లా లద్దెగిరి గ్రామం రామాపురానికి చెందిన రవితేజ అనే ఇంజనీరింగ్ విద్యార్థి కడప చిన్నచౌకు పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మే 29న ఎర్రగుంట్లలో నివాసముం టున్న వసంత తన కుమార్తె రిషిత(4), కుమారుడు ప్రణీత్(6)లతోపాటు మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లి, కుమార్తె మతిచెందారు. కుమారుడు ఒంటరయ్యాడు.
నేరమయం
Published Mon, Dec 30 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement