తిరుపతి : శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే. వారిలో నలుగురు వేలూరు, 8మంది విల్లుపురం, మరో 8మంది తిరువణ్ణామలైకి చెందినవారు. మృతులకు బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించనున్నారు.
మరోవైపు ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ప్రభావం తిరుపతిలో భక్తులు,ప్రయాణికులపై పడింది. ఎన్కౌంటర్కు నిరసనగా తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో తిరుపతి నుంచి తమిళనాడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దాంతో భక్తులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో అవస్థలు పడుతున్నారు.
ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
Published Wed, Apr 8 2015 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement