హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ జేవీ రాముడు మంగళవారం భేటీ అయ్యారు. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్పై ఆయన వివరణ ఇచ్చారు. కాగా ఈరోజు తెల్లవారుజామున కూంబింగ్ జరుపుతున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 20మంది స్మగ్లర్లు హతమయ్యారు. అలాగే గాయపడిన ఎనిమిదిమంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.