dgp ramudu
-
కన్పించని ముద్ర
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా జేవీ రాముడు శనివారం పదవీ విరమణ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండేళ్లకు పైగా పనిచేశారు. ఈయన స్వస్థలం జిల్లాలోని తాడిమర్రి మండలం నార్సింపల్లి కావడం గమనార్హం. డీజీపీగా రాముడు పనిచేసిన కాలంలో జిల్లాపై ఆయన ముద్ర ఏమాత్రమూ కనిపించలేదు. స్వగ్రామమైన నార్సింపల్లిని మాత్రం దత్తతకు తీసుకొని కొంతమేర అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని మినహాయిస్తే.. ‘అనంత’పై ఆయన తనదైన ముద్ర వేయలేకపోయారు. శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీజీపీగా జేవీ రాముడు జిల్లా పర్యటనలో ఉన్న సందర్భాల్లోనూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరులపై దాడులు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిలిపించుకొని కిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్ విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత, రాప్తాడు మండల కన్వీనర్ ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డిని హతమార్చారు. ఈ రెండు ఘటనలు డీజీపీ జిల్లా పర్యటనకు వస్తున్న సమయంలో అటూ ఇటుగా జరగడం గమనార్హం. వీరితో పాటు జిల్లాలో దాదాపు తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులను హతమార్చారు. అధికారపార్టీ దౌర్జాన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దాడుల్లో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా అధికార పార్టీ నేతలు వదల్లేదు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడి జరిగితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు జిల్లాలో మకాం వేసిన ఘటన కూడా ఆయన హయాంలోనే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని ఓ లాడ్జీలో వారం రోజుల పాటు మకాంవేసి.. మారణాయుధాలు కొనుగోలు చేయడానికి వ్యూహం రచించారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయటపడే వరకూ జిల్లా పోలీసులు కనుగొనలేకపోయారు. -
కొత్త పోలీస్ బాస్‌గా సాంబశివరావు బాధ్యతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్‌గా సాంబశివరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఇవాళ పదవీ విరమణ చేసిన రాముడు... సాంబశివరావుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సాంబశివరావును ప్రభుత్వం ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సాంబశివరావుకు అభినందనలు తెలిపారు. పోలీసుల్ని వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవ చేసేలా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తానన్నారు. గోదావరి పుష్కరాల్లో లోపాల్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా పుష్కరాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని డీజీపీ సాంబశివరావు హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుడు సంతృప్తికరంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూస్తామని సాంబశివరావు తెలిపారు. -
ఏపీ ఇంఛార్జ్ డీజీపీగా నండూరి సాంబశివరావు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా నండూరి సాంబశివరావు నియమతులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సాంబశివరావును ఇంఛార్జ్ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. నండూరి సాంబశివరావు 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. -
డీజీపీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
ఒంగోలు క్రైం: రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ఉదయం 9.15 గంటలకు గుడ్లూరు మండలం చేవూరులోని రామదూత ఆశ్రమంలోని హెలిపాడ్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రామాయపట్నం చేరుకుంటారు. అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. సిబ్బందితో మాట్లాడతారు. అక్కడ నుంచి చేవూరు ఆశ్రమంలోని హెలిపాyŠ కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో 10.30కు బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలుకు చేరుకుంటారు. ఒంగోలు నుంచి రోడ్డు మార్గం ద్వారా కొత్తపట్నం 11.15కు చేరుకుంటారు. అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. తీరాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 11.40కు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. -
పోలీసు విభజన సా..గుతోంది
- ఏపీ పోలీస్ అకాడమీ ఇంకా తెలంగాణలోనే ఉంది - వార్షిక క్రైం నివేదిక వివరాలు వెల్లడించిన డీజీపీ జె.వి.రాముడు సాక్షి, విజయవాడ: రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా శాఖలపరంగా రెండు రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో విభజన జరగలేదని రాష్ట్ర డీజీపీ జె.వి. రాముడు అన్నారు. 40ఏళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన పోలీస్ అకాడమి, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తదితరాలన్నీ ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని.. వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వార్షిక క్రైం నివేదికను వెల్లడిస్తూ శాఖాపరంగా భవిష్యత్ సవాళ్లు.. వివిధ కేసుల్లో సాధించిన పురోగతి.. ఇతరత్రా అంశాలపై ఆయన మాట్లాడారు. శాఖాపరంగా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పంచాయితీలు పరిష్కారం కాగానే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ పోలీస్ కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీఎస్పీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇతర టెక్నికల్ వింగ్‌లలో సంఖ్యాపరంగా సిబ్బంది విభజన జరగాల్సి ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను తాత్కాలికంగా అనంతపురంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఏడాది నిర్వహించే కృష్ణా పుష్కరాలకు 33 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీజీపీ రాముడు చెప్పారు. తుని విధ్వంసం ఘటనలో కచ్చితంగా అరెస్టులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేశారని వివరించారు. సోమవారం ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, ఇప్పటి వరకు 26 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. -
ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్: డీజీపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని.. ఇంకా తగ్గాలని ఏపీ డీజీపీ రాముడు చెప్పారు. గత ఏడాది నుంచి ఏప్రిల్ వరకు ఒక్క ఫ్యాక్షన్ కేసు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. సోమవారం విజయవాడలో డీజీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం రవాణాలో 34మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో తుని ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు డీజీపీ రాముడు తెలిపారు. -
టెక్నాలజీ సేవలు మరింత విస్తృతం
డీజీపీ రాముడు పలమనేరు : పోలీస్ శాఖలో నూత న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలను మరింత విస్తృతం చేస్తామని డీజీపీ రాముడు చెప్పారు. పలమనేరులోని సీఐ కార్యాలయంలో డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ శ్రీనివాస్, స్థానిక డీఎస్పీ శంకర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీని వాడుకోవడంతో సిబ్బంది కొరతను కూడా తగ్గించుకోవ చ్చన్నారు. త్వరలో రాష్ర్ట వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసేలా చొరవ చూపుతామన్నారు. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలైతే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాల సేకరణ చాలా సులభతరమవుతుందన్నారు. ట్రాఫిక్‌కు సంబంధించి తిరుపతి నగరంలో అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారని, ఇవి సత్పలితాలు ఇస్తాయని చెప్పారు. రాబోవు రోజుల్లో టెక్నాలజీ మరింత పెరుగుతుందని, నేరాలను అదుపు చేయడం కాస్త సులభతరమవుతుందని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ సిస్టం చాలా బాగుందని మెచ్చుకున్నారు. పొలీసులు ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపుచేయడానికి ఆస్కా రం ఉంటుందన్నారు. ప్రజలు పోలీసులకు మరింత సహకరిస్తే వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ లోకేష్ పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?
♦ వార్త మూలాలు చెప్పాలని విలేకరులను ప్రశ్నిస్తామంటారా? ♦ డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యలపై ఐజేయూ అభ్యంతరం ♦ ప్రెస్ కౌన్సిల్ నోటీసులను పట్టించుకోరా! ♦ జోక్యం చేసుకోవాలని గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని దురాక్రమణ’ పేరుతో ప్రచురించిన వార్తల మూలాలు(సోర్స్) చెప్పాలంటూ ‘సాక్షి’ దినపత్రిక విలేకరులను ప్రశ్నిస్తామని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించడంపై ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత జర్నలిస్టులకు పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆక్షేపిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే పత్రికా స్వేచ్ఛను హరించేలా డీజీపీ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాజధాని అమరావతిలో భూకుంభకోణంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తల మూలాలు చెప్పాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఆరుగురు జర్నలిస్టులను సోమవారం పోలీసు స్టేషన్‌కు పిలిపించడాన్ని ప్రెస్ కౌన్సిల్ సుమోటోగా తీసుకుని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు బుధవారం నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. నోటీసులు జారీ చేయడం విలేకరులకు రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ సీకే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి చైర్మన్‌గా ఉండే ప్రెస్ కౌన్సిల్ పోలీసుల తీరును ఆక్షేపించిన మరుసటి రోజు(గురువారం) డీజీపీ జేవీ రాముడు కడపలో మాట్లాడుతూ వార్తల మూలాలు చెప్పాలంటూ జర్నలిస్టులను విచారిస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వార్తల విషయంలో వీవీఐపీలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప, జర్నలిస్టులను పోలీసులు ప్రశ్నించడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని పేర్కొన్నారు. బలవంతుల, ధనవంతుల ప్రయోజనాలు కాపాడటం కాకుండా పేదల హక్కుల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని డీజీపీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గవర్నర్, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోన్న పోలీసుల చర్యలను కట్టడి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ప్రెస్ కౌన్సిల్‌ను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
పనిలేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూములపై వార్తలు రాసిన జర్నలిస్టులపై తప్పు లేకుండా కేసులు ఎందుకు పెడతామని డీజీపీ జేవీ రాముడు ప్రశ్నించారు. గురువారం ఆయన వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 'మాకేమన్నా కేసులు లేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?. సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులపై నిరాధారమైన వార్తలు రాయకూడదు. వార్తలు రాసిన వారే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. జర్నలిస్టులది తప్పుందా? లేదా అనేది విచారణ జరుపుతున్నామని' అన్నారు. కాగా ‘సాక్షి’ దినపత్రిక జర్నలిస్టులను విచారణ పేరిట పోలీసుస్టేషన్‌కు పిలిచి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలకు మూలాలు(సోర్స్) ఏమిటో చెప్పాలని పోలీసు అధికారులు ప్రశ్నించడాన్ని భారత ప్రెస్ కౌన్సిల్(పీసీఐ) తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. -
ప్రతి పోలీసు స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్లు
అమలాపురం టౌన్ : పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ప్రతి పోలీసు స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ రాముడు తెలిపారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన పోలీసు రిసెప్షన్ కౌంటర్ భవనాన్ని హోం మంత్రి చినరాజప్పతో కలిసి డీజీపీ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. సభకు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షత వహించారు. డీజీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు పోలీసు స్టేషన్‌కు వస్తే.. రిసెప్షన్ కౌంటర్ భవనంలో ప్రశాంతంగా ఫిర్యాదు చేసుకునేలా పోలీసు సిబ్బంది సేవలందిస్తారని వివరించారు. ఇప్పుడు పెద్ద పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ కౌంటర్లను అన్ని పోలీసు స్టేషన్లకూ విస్తరిస్తామని తెలిపారు. హోంమంత్రి, డీజీపీకి అమలాపురం డీఎస్పీ లంకా అంకయ్య, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీఐజీ హరికుమార్, విశాఖపట్నం ఎస్ఈజెడ్ డీఐజీ కుమార విశ్వజిత్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీలు రవిప్రకాష్, ఓఎస్డీ శరత్‌భూషణ్, రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణ, ఏఎస్పీ దామోదర్, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి, అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని కోరుతూ డీజీపీకి ఎలక్ట్రానిక్ మీడియా వినతి -
'దాడులు చేస్తున్నా.. సంయమనం పాటిస్తున్నారు'
తుని: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని డీజీపీ రాముడు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేస్తున్నా.. పోలీసులు సంయమనం పాటిస్తున్నారని ఆయన అన్నారు. తునిలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నామని డీజీపీ రాముడు వెల్లడించారు. -
15 శాతం వృద్ధే లక్ష్యం
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ టక్కర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రకాశ్ టక్కర్ చెప్పారు. శనివారం సచివాలయంలో ఐ.వై.ఆర్. కృష్ణారావు నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రెండంకెల వృద్ధి సాధించడానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. 15 శాతం వృద్ధి సాధించడం తేలికైన విషయం కాదని, అయినా అన్ని రంగాలు కష్టపడి పనిచేసేలాగ చర్యలు తీసుకోవడం ద్వారా అది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టక్కర్ బాధ్యతలు స్వీకరణ అనంతరం పదవీ విరమణ చేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావు కోసం సచివాలయ సాధారణ పరిపాలన శాఖ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో టక్కర్‌తో పాటు డీజీపీ రాముడు, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.గిరిధర్, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ పాల్గొన్నారు. కృష్ణారావు సమర్థంగా పనిచేశారు ఈ సందర్భంగా సీఎస్‌గా కృష్ణారావు చేసిన సేవలను ప్రశంసించారు. రాష్ట్ర విభజన లాంటి క్లిష్ట సమయంలో తొలి సీఎస్‌గా ఐ.వై.ఆర్. బాధ్యతలు చేపట్టి చాలా సమస్యలను అలవోకగా ఎదుర్కొన్నారని, విభజన అంశాల్లో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారని కొనియాడారు. ఫైళ్ల క్లియరెన్స్ చాలా వేగంగా చేయడంలో, అనవసర చర్చలతో సమయాన్ని వృథా చేయకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణారావు సాటిలేరన్నారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరం : ఐ.వై.ఆర్ తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ముగిసిందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. సీఎస్‌గా పదవీవిరమణ సందర్భంగా ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కమలనాథన్ కమిటీ నేతృత్వం లో ఉద్యోగుల పంపిణీ సజావుగానే సాగిందన్నారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేని అంశాల్లో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని, ఈ విషయంలో కేంద్రం విఫలమైందన్నారు. కాలయాపనకే ఉప కమిటీ రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతం గా ఉన్న సమస్యలపై తాజాగా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఉప కమిటీని ఏర్పాటు చేయడం పట్ల ఐ.వై.ఆర్. కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు ఘాటైన లేఖ రాశారు. పదవీ విరమణ చేయడానికి రెండు రోజుల ముందు అంటే జనవరి 27న కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ లేఖ రాశారు. కాలయాపనకే ఈ కమిటీ వేశారన్నారు. -
ఆర్థిక అసమానతలు తొలగితేనే అభివృద్ధి
♦ దేశంలో ఏపీలోనే తొలుత నదుల అనుసంధానం ♦ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం ముందడుగు ♦ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విజయవాడ: ఆర్థిక, సాంఘిక అసమానతలను తొలగించడం ద్వారానే సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించి ఆరోగ్య, ఆనంద, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దగలమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన చెప్పారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులనూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.. ► ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ 4.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ► వ్యవసాయానికి ఉచితంగా ఏడు గంటలు విద్యుత్ అందించడంతో పాటు చిన్న, సన్న కారు రైతుల ఆదాయాలను పెంచేందుకు రూ.500 కోట్ల ప్రపంచ బ్యాంకు సహాయంతో గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టింది.. ► ఎన్టీఆర్ వైద్య పరీక్ష ద్వారా పేదలకు టెలీరేడియాలజీ సర్వీసులతోపాటు 60 పరీక్షలను ఉచి తంగా అందజేస్తోంది. గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణకు 102 అమలు చేస్తోంది. ► కాపులను అభివృద్ధి పరచడానికి రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్, వారిని బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి రిటైర్డ్ న్యాయమూర్తి మంజునాథన్ కమీషన్‌ను ఏర్పాటు చేసింది. ► ఈ ఏడాదికి ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.5877.96 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.1955.93 కోట్లు, బీసీ సబ్ ప్లాన్‌కు రూ.6640 కోట్లు కేటాయించింది. ► సింగిల్ డెస్క్ పాలసీ, సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం పెట్టుబడుల ఆకర్షణలో ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లో దేశంలో ఏపీ రెండో స్థానంలో నిలించింది. ► ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
'లాకప్ డెత్ విషయమా.. నాకు తెలీదే'
అనంతపురం: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో బత్తెన శ్రీరాములు (54) పోలీసుల అదుపులో శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. మండలంలోని ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన శ్రీరాములును గుప్త నిధుల తవ్వకాల కేసు విచారణలో భాగంగా పోలీసులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అయితే చెన్నేకొత్తపల్లి లాకప్ డెత్ విషయం తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శనివారం అన్నారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి డీజీపీ రాముడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్కే విద్యార్థులు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని.. ఓసీలకు వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు. -
'త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభం'
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదిత భూములను మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర డీజీపీ వెంకటరాముడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్లానెటేరియానికి చెందిన 193 ఎకరాలను ఎయిమ్స్ ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, నియామకాల ద్వారా సిబ్బంది కొరతను అధిగమిస్తామని డీజీపీ రాముడు చెప్పారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల కట్టడి
డీజీపీ జేవీ రాముడు నెల్లూరు(క్రైమ్) : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూర్తిస్థాయిలో నేరాలను కట్టడి చేస్తామని రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకటరాముడు అన్నారు. ఆదివారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫెరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసుశాఖలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐక్లిక్, అభయం మొబైల్ యాప్, ట్రావల్ ట్రాకర్ తదితర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వీటి ద్వారా ప్రజలు పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా ఆన్లైన్లో 24గంటలు ఫిర్యాదు చేయచవ్చన్నారు. ప్రత్యేకించి మహిళలు, విద్యార్థినులకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. వీటి ద్వారా ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ను కట్టడిచేయవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో మూడుప్రాంతాల్లో ఐక్లిక్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాల నియంత్రణకు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. వీటిని నియంత్రించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరని, జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతోన్న స్మగ్లర్లు, కూలీలను అరెస్ట్‌చేసి జైలుకు పంపామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. మెరుగైన శాంతిభద్రతలు అందించండి.. జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలని డీజీపీ జేవీ రాముడు పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆయన పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు మెరుగుగా ఉన్నపుడే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐక్లిక్, అభయం యాప్‌లపై విసృ్తత అవగాహన కల్పించాలన్నారు. ప్రధాన కూడళ్లు, షాపింగ్‌మాల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాలను కట్టడిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్, ఏఎస్పీలు రెడ్డిగంగాధర్, సూరిబాబు పాల్గొన్నారు. రూ.11.50 కోట్లతో భూమిపూజ నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల సమీపంలో పాత ఏఆర్ క్వార్టర్స్ స్థలంలో రూ.11.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులకు డీజీపీ జేవీ రాముడు భూమి పూజ చేశారు. తొలుత వర్షం కారణంగా భూమి పూజ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పినప్పటికీ జోరువానలోనే భూమి పూజ చేశారు. తొలుత ఆయన తన సతీమణి జాస్తి అనంత సాయి పద్మజతో కలిసి మూలాపేట పోలీసుక్వార్టర్స్ సమీపంలో బొల్లినేని శీనయ్య అండ్ సన్స్ కంపెనీ సౌజన్యంతో నిర్మించిన పోలీసు కన్జ్యూమర్ స్టోర్స్ అదనపు గదుల ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను స్టోర్స్‌లో ఉంచాలని సిబ్బందికి సూచిం చారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్ఎండ్లూరి, ఏపీ పో లీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రసాదరావు, డి. జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో ‘పోలీసు’ నోటిఫికేషన్!
-
నవంబర్‌లో ‘పోలీసు’ నోటిఫికేషన్!
5 కి.మీ. పరుగుకు స్వస్తి.. ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు: డీజీపీ చిత్తూరు అర్బన్/ తిరుపతి క్రైం/ సాక్షి,తిరుమల : పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని డీజీపీ జేవీ.రాముడు తెలిపారు. శనివారం ఆయన చిత్తూరు, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పోలీసుశాఖలో 5 కి.మీ. పరుగును రద్దు చేసి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థుల శారీరక సామర్థ్యంతో పనిలేకుండా వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు నిర్వహిస్తామన్నారు. హోంగార్డులకు జీతాలు పెంచుతామని, మెడికల్ అలవెన్స్ మొదలగు వాటి గురించి ప్రతిపాదనలు పెట్టామన్నారు. నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ప్రిన్సిపల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయలేదని చిత్తూరులో విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. ‘ఎవరో ఏదో మాట్లాడితే అరెస్టు చేయలేం. రిషితేశ్వరి మృతిలో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందని ఎవరివద్దయినా ఆధారాలున్నాయా..? ’ అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎంతటివారైనా నేరం రుజువైతే శిక్ష తప్పదన్నారు. కాగా శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. -
ఏడాది చివర్లో పోలీసు నోటిఫికేషన్
చిత్తూరు (అర్బన్): నూతన రాష్ట్రంలో పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ ఏడాది చివరలోపు నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ జె.వెంకటరాముడు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. అన్నీ కుదిరితే నవంబరు నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం చిత్తూరు నగరంలో అధునాతన నూతన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుశాఖలో అనాధిగా వస్తున్న 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని రద్దు చేసి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. పోలీసులుగా ఎంపికవడానికి అభ్యర్థుల శారీరక సామర్థ్యంతో పనికిలేకుండా వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు నిర్వహిస్తామన్నారు. కాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ప్రిన్స్‌పాల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. తొలుత ఇది తన స్థాయికి సంబంధించిన ప్రశ్న కాదన్నారు. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మళ్ళీ ప్రశ్నించగా.. 'ఎవరో ఏదో మాట్లాడితే అరెస్టు చేయలేం. వ్యక్తి అరెస్టు అనేది చాలా ప్రధానమైనది. ఎవరిని పడితే వారిని అరెస్టు చేయలేం. రిషితేశ్వరి మృతిలో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందని ఎవరివద్దయినా ఆధారాలున్నాయా..? ' అన్నారు. డీజీపీ వెంట రాయలసీమ ఐజీ వేణుగోపాలక్రిష్ణ, అనంతపురం డీఐజీ కే.సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ ఐజీ కేవీ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్పీలు శ్రీనివాస్, గోపినాథ్ తదితరులు ఉన్నారు. -
స్పీకర్ కోడెలతో ఏపీ డీజీపీ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుతో ఏపీ డీజీపీ రాముడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ నెల 30న అసెంబ్లీ భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ స్పీకర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు ఉదయం 8.30 గంటలకు ఏపీ బీఏసీ భేటీ కానుంది. ఈ నెల 31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, అసెంబ్లీ సమస్యల ఏజెండాపై బీఏసీలో చర్చించనున్నారు. -
తీరం.. త్రివర్ణ శోభితం
విశాఖ తీరం మురిసింది. మువ్వన్నెల్లో మెరిసింది. రాష్ర్ట విభజన అనంతరం నవ్యాంధ్రలో తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదిక కావడంతో రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించింది. వివిధ బలగాల మార్చపాస్ట్, ప్రభుత్వ శాఖల శకటాలు కనులపండువ చేశాయి.. విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి... సాక్షి, విశాఖపట్నం : ఎగసిపడే అలలహోరు.. వానలో తడిసినతీరం..ఎటుచూసినా ఆహ్లాదకరమైన వాతావరణంలో అబ్బురపరిచే విన్యాసాలతో స్వాతంత్య్ర వేడుకలు నగరవాసుల్లో దేశభక్తిని రగిలించాయి. రాష్ర్టస్థాయి స్వాతంత్య్ర వేడుకలు శనివారం తీరంలో కన్నులపండుగగా జరిగాయి. కవాతు..నయనాందకరమైన శకటాలు.. విద్యార్థుల విన్యాసాలు.. సాంస్కృతిక ప్రదర్శనల సంబరాలు అంబరాన్ని తాకాయి. యుద్ధనౌకలు.. నేవీహెలికాప్టర్ల విన్యాసాలు సందర్శకులకు వింత అనుభూతినిచ్చాయి. చినుకులు పడుతున్నా నగర వాసులు తీరానికి పోటెత్తారు. వేడుకలకు గంట ముందు కురిసిన వర్షం ఇబ్బందికి గురి చేసింది. జెండావందనానికి కొద్దిక్షణాల ముందు వరుణుడు శాంతించడంతో వాతావరణం సాధారణ స్థితికి వచ్చేసింది. తీరంలో మొదలైన సందడి ఉదయం నుంచే సందడి మొదలైంది. ఏడున్నరగంటల నుంచి జనంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీల రాక మొదలైంది. తొలుత వేదిక వద్దకు డీజీపీ జే.వీ.రాముడు,తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేరుకున్నారు. 9గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జెండా వందనం చేశారు. వందేమాతర గీతం ఆలపిస్తుండగా మొదటి బెటాలియన్ కంటిం జెంట్ కమాండెంట్ జే.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్మడ్ దళం గార్డ్ ఆఫ్ హానర్ఇచ్చారు. స్ఫూర్తిని నింపిన కవాతు.. ఎఎస్పీ సిద్ధార్థ కౌషల్ నేతృత్వంలో కవాతు ఆకట్టుకుంది. పోలీస్బ్యాండ్తో పాటు తొలిసారిగా నేవీబ్యాండ్ కవాతులో పాల్గొంది. తొమ్మిది ఆర్మడ్, మరో తొమ్మిది అన్ఆర్మడ్ కంటింజెంట్స్ కవాతులో పాల్గొనగా,సిటీఆర్మడ్ రిజర్వుదళంతొలిసారి కదం తొక్కింది. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన సందర్శకులను కట్టిపడేశాయి. 21 శకటాలను ప్రదర్శించారు. అనంతరం పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖల్లో సేవలందించిన 65 మందికి వివిధరకాల మెడల్స్‌ను సీఎం బహూకరించారు. విశాఖకు చెందిన ప్రముఖస్వాతంత్ర సమరయోదుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్‌ను సీఎం సత్కరించారు. ► సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాటవాన్ని ముఖ్య అతిథులు చదువుతుంటారు. కానీ సీఎం ప్రసంగపాటవానికి సంబంధం లేకుండా తనదైన శైలిలో చెప్పిందే చెబుతూ గంటా ఐదు నిముషాల పాటు ఏకబికిన ప్రసంగించారు. ► ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పిరమిడ్ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాయి. విశాఖకు చెందిన స్నేహశీల నాట్యవిన్యాసాలు చేస్తూనే తన పాదముద్రికలతో భారత్మ్యాప్తో పాటు అంతర్బా గంగా చరఖాను చిత్రీకరించడం సందర్శకులను అబ్బురపరిచింది. ► థింసానృత్యం, సవేరా నృత్యాలతో గిరిజనులు ఆకట్టుకున్నారు. అంబిక ప్రదర్శించిన రింగ్డాన్స్ కనురెప్పలను వాల్చనీయలేదు. -పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన తాడాట విన్యాసాలు అలరించాయి. -గిరిగోరుముద్దలు, ఈ ఆరోగ్యం, మాతా శిశు ట్రాకింగ్ సిస్టమ్ స్కీమ్స్‌కు శ్రీకారం చుట్టారు. -కార్యక్రమాలనంతరం సీఎం విశ్వప్రియ ఫంక్షన్‌హాలులో హై-టీ అనంతరం ప్రత్యేక విమానంలో పట్టిసీమ బయల్దేరి వెళ్లారు. -
ఆంధ్రా డిజిపి ఎరియల్ వ్యూ!
-
400మంది ఏపీ పోలీసుల రీకాల్
-
400మంది ఏపీ పోలీసులను రీకాల్ చేసిన డీజీపీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల మోహరింపుపై డీజీపీ రాముడు వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 400మంది పోలీసులను డీజీపీ బుధవారం ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల క్రితం ఏపీ జిల్లాల నుంచి 400మంది పోలీసులను హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు ఉదంతం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రుల నివాసాల వద్ద భద్రత ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల మోహరింపు రాజ్యాంగ విరుద్ధమంటూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ నిన్న గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాముడు కూడా మంగళవారం గవర్నర్ ను కలిశారు. అనంతరం డీజీపీ పోలీసులను రీకాల్ చేశారు. వారిని తిరిగి వెనక్కి పంపించనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీఐపీల రక్షణ బాధ్యత తెలంగాణ పోలీసులదేనని, ఇందులో మరో మాటకు ఆస్కారం లేదని అనురాగ్ శర్మ నిన్న స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏపీ సీఎం, మంత్రులకు ఇప్పటివరకూ కొనసాగుతున్న విధంగానే రక్షణ ఏర్పాట్లు ఉంటాయన్నారు. -
ప్రిపెయిడ్ ఆటో బూత్‌లతో ప్రయాణం సురక్షితం
విజయవాడ :నగరంలోని రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రిపెయిడ్ ఆటో బూత్‌లను రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ నుంచి ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరడానికి ఈ ఆధునిక ప్రిపెయిడ్ ఆటో బూత్‌లు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆటో బూత్‌ల పనితీరును డీజీపీకి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు వివరించారు. అనంతరం రాముడు మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్, బస్టేషన్లు అతి పెద్దవి కావడంతో పొరుగు ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. అన్ని వేళల్లో ఆటోడ్రైవర్ల వేధింపులకు గురికాకుండా సురక్షితంగా ఇంటికి చేర్చడమే ప్రిపెయిడ్ ఆటోస్టాండ్ల ఏర్పాటు ఉద్దేశమన్నారు. ఈ ఆటోస్టాండ్లలో సేవలన్నింటినీ కంప్యూటరీకరించామని, ప్రయాణికులు వెళ్లాల్సిన ప్రాంతానికి చెల్లించాల్సిన చార్జిని పేర్కొంటూ కంప్యూటర్ స్లిప్ ఇస్తారన్నారు. మార్గ మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగితే కంప్యూటర్ స్లిప్‌లోని మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకుంటే సంబంధిత నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చినట్టయితే కంప్యూటర్లో రికార్డు అవుతుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు. ఆటో బూత్‌లు పనిచేసేది ఇలా.. పిపెయిడ్ ఆటో స్టాండ్లను కంప్యూటరీకరించి ప్రిపెయిడ్ బూత్‌లుగా మార్చారు. ఆటోలు, డ్రైవర్ల వివరాలను నమోదు చేశారు. వెబ్ కెమెరాలో డ్రైవర్ల ఫొటో తీసి కంప్యూటర్లలో నిక్షిప్తంచేశారు. అన్ని నిబంధనలు ఉన్న ఆటోలు, డ్రైవింగ్‌లెసైన్స్ ఉన్న డ్రైవర్లనే అనుమతిస్తారు. ఆటోలో ఐదుగురు ప్రయాణికులను మాత్రమే ఎక్కించేందుకు అనుమతిస్తారు. ప్రయాణికులు ఆటోను బుక్‌చేసుకోగానే ప్రింట్ రశీదు ఇస్తారు. దానిని గేట్ వద్ద ఉన్న పోలీసులకు చూపిన తరువాతే ఆటో ముందుకు వెళ్తుంది. మార్గమధ్యంలో ఇతర ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన తరువాత రశీదుపై ఉన్న 92489 77888 సెల్ నంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే 100కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బస్టాండ్ బూత్‌లో 260 ఆటోలను బుక్‌చేశారు. 360 మంది డ్రైవర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్టీవో, పోలీసులు సంయుక్తంగా ప్రయాణదూరాన్ని బట్టి చార్జీలు నిర్ణయించారు. ఉదయం 5 నుంచి రాత్రి 11 సమయం వరకు సాధారణ రేటు, రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మరో రేటు నిర్ణయించారు. ఉదయం సమయంలో బస్‌స్టాండ్ నుంచి వినాయకుని గుడి వరకు రూ.20, రథం సెంటర్‌కు రూ.25గా చార్జీ నిర్ణయించారు. అదే రాత్రి సమయంలో రూ.30, రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. -
'ఆంధ్రలోకి రావడానికి సాహసించడం లేదు'
కాకినాడ: మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడానికి సాహసించడం లేదని డీజీపీ జేవీ రాముడు అన్నారు. మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనులను హతమారుస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారని డీజేపీ చెప్పారు. హైదరాబాద్‌లో చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ యాంగ్ పింగ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. -
చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ జేవీ రాముడు మంగళవారం భేటీ అయ్యారు. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై ఆయన వివరణ ఇచ్చారు. కాగా ఈరోజు తెల్లవారుజామున కూంబింగ్ జరుపుతున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 20మంది స్మగ్లర్లు హతమయ్యారు. అలాగే గాయపడిన ఎనిమిదిమంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
‘రాజధాని’ రైతులను మోసగిస్తోంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంపై మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్, మంగళగిరి: రాజధాని ప్రాంత రైతుల స్థలాలు, భూములను మోసపూరితంగా కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సహాయ, పునరావాస చట్టం - 2013 ప్రకారం ప్యాకేజీ పొందే హక్కు, అర్హత లేదని రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణారెడ్డి శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్న కొద్ది మంది రైతులకు కూడా ఎలాంటి అవగాహన కలిగించకుండా పొలాలు సేకరిస్తున్నారని విమర్శించారు. రాజధానికి భూములు కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని, రైతులకు కోర్టులకు వెళ్లే హక్కు కూడా లేదనే ప్రచారాన్ని ఖండించారు. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు రైతులకుందని, త్వరలోనే తాము కోర్టుకు వెళ్లేందుకు సిద్దపడుతున్నా మన్నారు. మీకు చిన్న విషయమే కావచ్చు.. రాజధాని గ్రామాల్లో పొలాలు దగ్ధమైన ఘటన చాలా చిన్నదని డీజీపీ రాముడు వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. -
తుళ్ళూరు కేసును త్వరలోనే ఛేదిస్తాం!
-
'రాజధాని భూముల్లో అగ్నిప్రమాదం పెద్దదేమీ కాదు'
కడప: తుళ్లూరు రాజధాని పంట పొలాల్లో జరిగిన అగ్నిప్రమాదం పెద్దదేమీ కాదని ఏపీ పోలీసు డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు వ్యాఖ్యానించారు. శుక్రవారం కడప పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మరో రెండు రోజుల్లో అగ్నిప్రమాదం కేసులో పురోగతి సాధిస్తామన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై డీఐజీ ఆధ్వర్యంలో టాస్కఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మావోయిస్టుల్లో అగ్రనేతలంతా ఎక్కువశాతం తెలుగువారున్నారని తెలిపారు. రాష్ర్టంలోకి మావోయిస్టులు ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నమన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీఐడీకి అప్పగించినట్టు రాముడు తెలిపారు.నెల్లూరు జిల్లాలో సిమి ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. -
'ఎన్టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా జాస్తి వెంకట రాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందని, అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దించివేయడంలో సహకరించినందుకే రాముడిని ...చంద్రబాబు డీజీపీగా చేశారని కొడాలి నాని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఎన్టీ రామారావును గద్దె దించేందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచారు. ఆ హోటల్ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఉందని, దానికి డిప్యూటీ కమిషనర్ గా రాముడు వ్యవహిరించారని, తనకు అప్పుడు సహకరించినందుకే చంద్రబాబు...ఇప్పుడు రాముడిని డీజీపీని చేశారని కొడాలి నాని తన పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా రాముడు నిష్పాక్షికంగా పోలీసు బలగాలను నడిపిస్తారనే విశ్వాసం ప్రజలకు కలగడం లేదని, అంతేకాకుండా 1993లో రాముడు పుట్టిన తేదిని సవరించడం జరిగిందని, దానివల్లే ఆయనకు మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగే అవకాశం వచ్చిందన్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డీజీపీగా రాముడు నియామకాన్ని రద్దు చేయాలని, కేసు తేలేంతవరకు డీజీపీ బాధ్యతలను మరో సీనియర్ అధికారికి అప్పిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. -
ఏపీలో మెరైన్ పోలీసు అకాడమీ!
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో మెరైన్ పోలీసు అకాడమీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. విశాఖలో గ్రేహౌండ్స్ కార్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన అన్నారు. విశాఖలో పర్యటిస్తున్న డీజీపీ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. కోస్టల్ ఏరియాలో గుంటూరు, విశాఖ సహా తిరుపతిలోనూ అప్పా లాంటి అకాడమీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశామని ఆయన వెల్లడించారు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్లో మావోయిస్టులు జనజీవన స్రవంతికి దూరం అయ్యారని డీజీపీ అన్నారు. మావోయిస్టలుపై గిరిజనుల తిరుగుబాటే ఇందుకు నిదర్శనమన్నారు. 27 పోలీస్ స్టేషన్లకు 2వేలమంది కానిస్టేబుల్ నియామకాలకు ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ పేర్కొన్నారు. -
‘ముప్పాళ్ల’ బాధ్యులపై చర్యలు తీసుకోండి
డీజీపీ రాముడుకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు హైదరాబాద్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలపై దాడి, ఎంపీటీసీల కిడ్నాప్ ఉదంతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ైవె సీపీ నేతలు శుక్రవారం ఏపీ డీజీపీ రాముడుకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎండీ ముస్తాఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో పాటు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో కూడిన బృందం డీజీపీని కలిసింది. గుంటూరు నుంచి ఎంపీటీసీలను తీసుకొస్తున్న అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాలపై దాడి చేసిన టీడీపీ గూండాలు దౌర్జన్యంగా నలుగురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ఉన్న శాసనసభాపతి నియోజకవర్గంలోనే ఈ దుశ్చర్య జరగడం దురదృష్టకరమ న్నారు. రాజకీయ పార్టీకి చెందిన వారే దోపిడీ దొంగల్లా మారి నడిరోడ్డుపై రాజకీయాన్నే దోచుకుపోతున్నారని అంబటి దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఒకపక్క తరచుగా రామరాజ్యం, రాముడి గురించి మాట్లాడుతూ.. రాక్షసపాలన కొనసాగిస్తున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. -
డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులను నివారించాలంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. కడప, చీరాల, కనిగిరి ఘటనలపై విచారించాలని డీజీపీని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.