400మంది ఏపీ పోలీసులను రీకాల్ చేసిన డీజీపీ | andhra pradesh dgp ramudu recalls 400 ap police in hyderabad | Sakshi
Sakshi News home page

400మంది ఏపీ పోలీసులను రీకాల్ చేసిన డీజీపీ

Published Wed, Jun 17 2015 9:13 AM | Last Updated on Mon, Aug 20 2018 1:46 PM

400మంది ఏపీ పోలీసులను రీకాల్ చేసిన డీజీపీ - Sakshi

400మంది ఏపీ పోలీసులను రీకాల్ చేసిన డీజీపీ

హైదరాబాద్ : హైదరాబాద్లో ఏపీ పోలీసుల మోహరింపుపై డీజీపీ రాముడు వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 400మంది పోలీసులను డీజీపీ బుధవారం ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల క్రితం ఏపీ జిల్లాల నుంచి 400మంది పోలీసులను హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు ఉదంతం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రుల నివాసాల వద్ద భద్రత ఏర్పాటుకు నిర్ణయించింది. 

 

దీంతో హైదరాబాద్లో ఏపీ పోలీసుల మోహరింపు రాజ్యాంగ విరుద్ధమంటూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ నిన్న గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాముడు కూడా మంగళవారం గవర్నర్ ను కలిశారు. అనంతరం డీజీపీ పోలీసులను రీకాల్ చేశారు. వారిని తిరిగి వెనక్కి పంపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీఐపీల రక్షణ బాధ్యత తెలంగాణ పోలీసులదేనని, ఇందులో మరో మాటకు ఆస్కారం లేదని అనురాగ్ శర్మ నిన్న స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏపీ సీఎం, మంత్రులకు ఇప్పటివరకూ కొనసాగుతున్న విధంగానే రక్షణ ఏర్పాట్లు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement