విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో మెరైన్ పోలీసు అకాడమీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. విశాఖలో గ్రేహౌండ్స్ కార్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన అన్నారు. విశాఖలో పర్యటిస్తున్న డీజీపీ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. కోస్టల్ ఏరియాలో గుంటూరు, విశాఖ సహా తిరుపతిలోనూ అప్పా లాంటి అకాడమీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశామని ఆయన వెల్లడించారు.
ఆంధ్ర-ఒడిశా బోర్డర్లో మావోయిస్టులు జనజీవన స్రవంతికి దూరం అయ్యారని డీజీపీ అన్నారు. మావోయిస్టలుపై గిరిజనుల తిరుగుబాటే ఇందుకు నిదర్శనమన్నారు. 27 పోలీస్ స్టేషన్లకు 2వేలమంది కానిస్టేబుల్ నియామకాలకు ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ పేర్కొన్నారు.
ఏపీలో మెరైన్ పోలీసు అకాడమీ!
Published Tue, Dec 23 2014 10:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement