మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదిత భూములను మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర డీజీపీ వెంకటరాముడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్లానెటేరియానికి చెందిన 193 ఎకరాలను ఎయిమ్స్ ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, నియామకాల ద్వారా సిబ్బంది కొరతను అధిగమిస్తామని డీజీపీ రాముడు చెప్పారు.