
‘రాజధాని’ రైతులను మోసగిస్తోంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంపై మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్, మంగళగిరి: రాజధాని ప్రాంత రైతుల స్థలాలు, భూములను మోసపూరితంగా కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సహాయ, పునరావాస చట్టం - 2013 ప్రకారం ప్యాకేజీ పొందే హక్కు, అర్హత లేదని రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామకృష్ణారెడ్డి శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్న కొద్ది మంది రైతులకు కూడా ఎలాంటి అవగాహన కలిగించకుండా పొలాలు సేకరిస్తున్నారని విమర్శించారు. రాజధానికి భూములు కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని, రైతులకు కోర్టులకు వెళ్లే హక్కు కూడా లేదనే ప్రచారాన్ని ఖండించారు. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు రైతులకుందని, త్వరలోనే తాము కోర్టుకు వెళ్లేందుకు సిద్దపడుతున్నా మన్నారు.
మీకు చిన్న విషయమే కావచ్చు..
రాజధాని గ్రామాల్లో పొలాలు దగ్ధమైన ఘటన చాలా చిన్నదని డీజీపీ రాముడు వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు.