చెంతనే ఉన్న కృష్ణమ్మ మురిసేలా.. మంగళాద్రి లక్ష్మీనరసింహుడే ఆనంద గర్జన చేసేలా.. శాసన రాజధాని నడిబొడ్డున ప్రగతిపతాక సగర్వంగా రెపరెపలాడుతోంది. సంక్షేమ సర్కారుకు మంగళహారతి పడుతోంది. మంగళగిరి–తాడేపల్లి జంట నగరం అభివృద్ధి పథాన పరవళ్లు తొక్కుతూ జయజయధ్వానాలు చేస్తోంది. మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్న గత పాలకులకు ఖబడ్దార్ అంటూ సవాల్ విసురుతోంది.
మంగళగిరి: వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలులో గణనీయ మార్పు కనిపిస్తోంది. రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019కు ముందు టీడీపీ హయాంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన లోకేష్, ఇదే నియోజకవర్గంలో నివాసం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సేవా కార్యక్రమాలతో జన హృదయాలు గెలిచారు. ఫలితంగా గత ఎన్నికల్లో తనపై లోకేష్ పోటీ చేసినా అలవోకగా జయకేతనం ఎగురవేశారు. రాష్ట్రంలోనూ వైఎస్సార్ సీపీ జయభేరి మోగించడంతో నియోజకవర్గంపై వరాల జల్లు కురిసింది. ఫలితంగా రూ.వందల కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు శరవేగంగా అమలయ్యాయి. ఇప్పటికే చాలా పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 25,254 మంది పేదలకు ఇళ్లస్థల పట్టాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు.
గౌతమ బుద్ధా రోడ్డు విస్తరణ
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆర్కే చొరవతో రూ.24 కోట్లతో మంగళగిరిలో గౌతమ బుద్ధా రోడ్డును విస్తరించారు. అభివృద్ధికి బాటలు వేశారు.
క్రీడలకు ప్రాధాన్యం
నగరంలోని క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా వసతు ల కల్పనకు ఎమ్మెల్యే ఆర్కే చర్యలు తీసుకున్నారు. తాగునీటి పథకం ఆవరణలో రూ.7 కోట్లతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, పవర్ లిఫ్టింగ్ కోచింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. ఇవి తుదిదశకు చేరాయి. కొత్తగా షటిల్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఎన్నియాత్రలు చేసినా లోకేష్ ఎమ్మెల్యే కాలేరు
గతంలో మూడు శాఖల మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్, ఇదే నియోజకవర్గంలో నివాసంలో ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. ఎన్ని యాత్రలు చేసినా లోకేష్ ఎమ్మెల్యే కాలేరు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో సంతృప్తస్థాయిలో అభివృద్ధి జరిగింది. దీనిపై చర్చకు నేను సిద్ధం. చేనేతల కోసం మగ్గం షెడ్లు, చేనేత భవనం నిర్మించాం. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాం.
– ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి
ప్రాంతాల వారీగా
సంక్షేమ పథకాల లబ్ధి ఇలా..
మండలం లబ్ధి చేకూరిన
మొత్తం (రూ.కోట్లలో)
మంగళగిరి అర్బన్ 673.27
మంగళగిరి రూరల్ 23.81
తాడేపల్లి అర్బన్ 125.73
తాడేపల్లి రూరల్ 112.23
దుగ్గిరాల 147.68
Comments
Please login to add a commentAdd a comment