నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నిర్వర్తించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు గమనించాలని కోరారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్ రద్దు
గుంటూరు వెస్ట్: స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని డీఆర్‌ఎం షేక్.ఖాజావలి ఆదివారం తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
తైక్వాండో పోటీల్లో పది
మందికి బంగారు పతకాలు
తెనాలిఅర్బన్: రాష్ట్రస్థాయి జూనియర్ విభాగ తైక్వాండో పోటీల్లో తెనాలి కేఎస్‌ఆర్ తైక్వాండో అకాడమీకి చెందిన 10 మంది విద్యార్థులకు బంగారు, 12 మందికి వెండి, ఆరుగురికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కె.శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను ఈ నెల 2,3 తేదీల్లో తెనాలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించినట్లు చెప్పారు. మే 30 నుంచి జూన్ 3 వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్న నేషనల్ చాంపియన్ షిప్‌లో పాల్గొనున్నట్టు చెప్పారు. వీరిని ఆదివారం అకాడమీలో అభినందించి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో గణేష్‌యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ప్రథానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శతాధిక వృద్ధురాలి కన్నుమూత
మంగళగిరి: నూతక్కిలో శతాధిక వృద్ధురాలు కన్నుమూశారు. నూతక్కికి చెందిన గోగుల కాశీ అన్నపూర్ణమ్మ(103) శనివారం మరణించారు. ఆమెకు ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. మరణించే వరకు ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అన్ని పనులూ తనే చేసుకునేవారని కుటుంబ సభ్యులు చెప్పారు. రాత్రి భోజనం చేసి పడుకున్నారని, తెల్లవారుజామున కన్నుమూశారని పేర్కొన్నారు.
దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి జ్యోతిసురేఖ
విజయవాడస్పోర్ట్స్: ఆర్చరీ ప్రపంచ కప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖ గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర, దేశ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అమెరికాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ్ కప్ స్టేజ్–1 టోర్నీలో పతకం సాధించిన జ్యోతిసురేఖను మంత్రి ఓ ప్రకటనలో అభినందించారు. ఆదివారం జరిగిన కాంపౌండ్ మిక్సిడ్ విభాగం ఫైనల్స్‌లో గెలిచి బంగారు పతకాన్ని పొందడంగర్వకారణమన్నారు.
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు


