సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. జూలై 24కు విచారణను వాయిదా వేసింది.
విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా
Comments
Please login to add a commentAdd a comment