ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్: డీజీపీ | E-beat for cops for better patrol to prevent Ragging, says AP DGP ramudu | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్: డీజీపీ

Published Mon, Jun 6 2016 5:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

E-beat for cops for better patrol to prevent Ragging, says AP DGP ramudu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని.. ఇంకా తగ్గాలని ఏపీ డీజీపీ రాముడు చెప్పారు. గత ఏడాది నుంచి ఏప్రిల్ వరకు ఒక్క ఫ్యాక్షన్ కేసు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. సోమవారం విజయవాడలో డీజీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం రవాణాలో 34మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. 
 
భవిష్యత్తులో ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో తుని ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు డీజీపీ రాముడు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement