Tuni incident
-
ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: కన్నబాబు
-
రైల్వే కోర్టుకు ముద్రగడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు దహనం ఘటన కేసుకు సంబంధించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 41 మందికి కోర్టు సమన్లు జారీ చేయగా వారిలో ముగ్గురు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. ముద్రగడతోపాటు మరో 37 మంది రైల్వే కోర్టు న్యాయమూర్తి సురేష్ బాబు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 16కు విచారణ వాయిదా పడింది. -
తుని రైలు ఘటన: మరో 17 కేసులు ఉపసంహరణ
సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైలు ఘటనలో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు తెలిపారు. మొత్తం నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. -
‘తుని విధ్వంసానికి చంద్రబాబే కారణం’
విశాఖ : కేసుల పేరుతో ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎన్నికుట్రలు చేసినా తన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుని విధ్వంసానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. దమ్ముంటే వాయిదాలు లేకుండా తుని విధ్వంసం కేసును విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాను కేసులకు భయపడేది లేదని, తమ జాతి కోసం పోరాడుతానని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల కోసం అవసరం అయితే ప్రాణాలు అర్పిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ డిమాండ్‌లో న్యాయం ఉందని, నెరవేర్చతగ్గదే అని అన్నారు. తన నేర చరిత్ర ఏంటో చంద్రబాబు నిరూపించాలని ముద్రగడ సవాల్ విసిరారు. శాంతియుతంగా పోరాడుతున్న తమపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్ర తలపెట్టారు. అయితే యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది. పాదయాత్రకు అనుమితి ఇచ్చినా లేకున్నా, తమ యాత్ర కొనసాగుతుందని ముద్రగడ వెల్లడించారు. కాగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన విధ్వంసానికి దారితీసింది. సభకు వచ్చిన వేలాది మంది తునిలో రైల్‌రోకో, రాస్తారొకోలు నిర్వహించారు. పరిస్థితి అదుపుతప్పి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు, పోలీస్ వాహనాలు దగ్ధం వంటి తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. -
'కాపుల్లో చిచ్చుపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది'
హైదరాబాద్ : కాపుల్లో చిచ్చుపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓ ప్రైవేట్ చానల్ ఎండీ సాయిసుధాకర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...తుని ఘటనపై విచారణ పేరుతో కావాలనే కొందర్ని వేధిస్తున్నారన్నారు. సీఐడీ విచారణలో తాను చెప్పిన దానికి, పత్రికల్లో వచ్చిన దానికి తేడా ఉందన్నారు. విచారణ వివరాలు ఒక పత్రికకు మాత్రమే ఎలా వచ్చాయో పోలీసులు చెప్పాలన్నారు. ఆ పత్రికలో వచ్చిన వార్తలపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. విచారణ ఫుటేజీని బయటపెట్టాలని సాయిసుధాకర్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సోమవారం సీఐడీ విచారణకు ఆయన హాజరైన విషయం తెలిసిందే. -
టీవీ ఛానెల్ ఎండీని విచారిస్తున్న సీఐడీ
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై రాజమండ్రి సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఎండీ సాయిసుధాకర్ను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. సోమవారం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తునిలో ఆందోళనకారులు రైలును దహనం చేయడం, పోలీస్ స్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఘటనపై సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో తునిలో కాపుగర్జన సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
'ముందు కేసులు.. లొంగకపోతే కాసులు'
-
‘అమాయకులపై కేసులను ఉపసంహరించుకోవాలి’
గుంటూరు: తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మంజునాథ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన సూచించారు. కాపు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ విషయంలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు పల్లంరాజు చెప్పారు. -
భూమనను ఇరికించేందుకు కుట్ర : అంబటి
హైదరాబాద్: తుని ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అరెస్టులు, బెదిరింపులతో కాపు ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కాపులను ఆరు నెలల్లో బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు రెండున్నర ఏళ్లు అయినా... కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. తుని ఘటనలో భూమనకు సంబంధమేమిటన్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంను భూమన కలిసి ఉద్యమానికి మద్దతు తెలిపినంత మాత్రాన కేసులు పెడతారా.. ? అని అంబటి ప్రశ్నించారు. ఈ కేసులో ఇరికించాలనే ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారన్నారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని చెప్పారు. ముందుగా నేతలపై కేసులు పెడతారని...కేసులకు లొంగకపోతే చంద్రబాబు కాసులు ఇస్తారన్నారు. అందితే జట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం బాబు నైజమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనకు ప్రభుత్వ వైఫల్యామే ప్రధాన కారణమని అంబటి చెప్పారు. -
రైలు కాలుతుండగానే ఎలా తెలుసు?
-
రైలు కాలుతుండగానే ఎలా తెలుసు?
తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహిస్తుండగా విధ్వంసకాండ జరిగినప్పుడు ఒకవైపు రైలు తగలబడుతుండగానే అదే సమయంలో ఆ ఘటన వెనక ఎవరున్నారో ఏపీ సీఎం చంద్రబాబుకు ఎలా తెలుసని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అప్పుడు రైలు కాలుతుండగానే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆ ఘటన వెనుక కాపులు లేరని.. కడప నుంచి వచ్చిన గూండాలు ఉన్నారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఎవరికీ అంత వెంటనే తెలియదని, విచారణ తర్వాత చెప్పాల్సి ఉందని.. కానీ రాజకీయ కక్షతో మొదటి రోజు నుంచి తమ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకే టీడీపీ సర్కారు ప్రయత్నించిందని మండిపడ్డారు. తుని ఘటనకు, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని అందరికీ తెలుసని.. కానీ మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి, వైసీపీ నేతృత్వంలో జరిగిందని అపవాదు తెచ్చి రాజకీయ కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. భూమన కాల్‌డేటాలో ముద్రగడ నెంబరు ఉందన్న విషయమై అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇందులో రహస్యం ఏమీ లేదని, భూమన స్వయంగా ముద్రగడను కలిసి.. ఆయన చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఉంటుందని చెప్పారని అన్నారు. ఆయనతో పాటు తాను కూడా అదే విషయం చెప్పానని, ముద్రగడ ఆశయాలను బలపరిచేవాళ్లు చాలామందే ఉన్నారని రాంబాబు తెలిపారు. సాక్షాత్తు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డే కాపులను బీసీలలో చేర్చాలన్న ఉద్యమానికి తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. తునిలో జరిగిన విధ్వంసం జరగకూడని విషయమేనని, దానిపై వెంటనే న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రాంబాబు అన్నారు. ఇక గుంటూరు సీఐడీ కార్యాలయం బయట రోడ్డుమీద ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోవాలో అర్థం కాలేదన్నారు. వాస్తవానికి భూమన కరుణాకరరెడ్డి విచారణ మధ్యాహ్నం 3 గంటలకే అయిపోయినట్లు తమకు తెలిసిందని, కేవలం మానసిక ఒత్తిడి పెంచడానికే ఇలా ఎక్కువసేపు కూర్చోబెడుతున్నారని సమాచారం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు పాలన మొత్తం పోలీసు రాజ్యంగానే సాగుతోందని.. కరుణాకరరెడ్డి మీద ఎలాంటి చర్య తీసుకున్నా మేం చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందరూ ఇలా కక్షసాధింపు ధోరణితో కొనసాగితే ఇక తమిళనాడుకు, మనకు తేడా ఏముంటుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
'అసెంబ్లీలో బాబును నిలదీస్తాం'
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తుని ఘటనతో భూమన కరుణాకర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భూమనకు 30 ఏళ్ల నుంచి పరిచయముందన్నారు. విచారణ పేరుతో ఆయన్ను పోలీసులు వేధిస్తున్నారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనతో భూమనకు సంబంధం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని...అసెంబ్లీలో కచ్చితంగా బాబును నిలదీస్తామని చెవిరెడ్డి చెప్పారు. -
‘తుని ఘటనతో నాకెలాంటి సంబంధంలేదు’
-
‘తుని ఘటనతో నాకెలాంటి సంబంధంలేదు’
గుంటూరు: దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణ నిమిత్తం ఇవాళ గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చినట్లు భూమన తెలిపారు. కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాపుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని ఆయన అన్నారు. కాగా ఈ ఏడాది జనవరి 31న కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి భూమనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. -
ప్రత్యేక హోదాను దారి మళ్లించేందుకు సర్కారు అస్త్రం
-
భూమనకు సీఐడీ నోటీసులు
హైదరాబాద్: తుని ఘటన కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తుని ఘటన కేసులో తనకు నోటీసులివ్వడం దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కారు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
'చంద్రబాబు నాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు'
కాకినాడ : దీక్ష సమయంలో తనను దారుణంగా హింసించారని కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్ చూపించిందని తెలిపారు. దీక్ష సమయంలో తన భార్య, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని విమర్శించారు. తన చిన్న కుమారుడుని కొట్టుకుంటూ లాక్కెళ్లారని చెప్పారు. పెద్ద కుమారుడుకి ఇటీవలే వెన్నుముక ఆపరేషన్ జరిగిందని... అతడిని కూడా లాక్కెళ్లాలని చూస్తే... ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడని ముద్రగడ తెలిపారు. తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబు సర్కారే కారణమన్నారు. కాపులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర చేసి కేసుల్లో ఇరికించారని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు చేయమంటున్నామని ముద్రగడ స్పష్టం చేశారు. తుని ఘటనపై లోతుగా పరిశీలిస్తామని చెప్పి... మాట తప్పారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. తుని ఘటనపై సీబీఐ విచారణకు పట్టుబట్టొద్దని ప్రభుత్వ పెద్దలే తనని కోరారని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తు చేశారు. తుని ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా... తనతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. తమ ఉద్యమానికి బీసీలు, దళితుల మద్దతు కూడా ఉందని ముద్రగడ తెలిపారు. బీసీలకు నష్టం జరగకుండానే రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తాను మంజునాథ కమిషన్‌పై ఆశావాహ దృక్పథంతోనే ఉన్నానని చెప్పారు. జులై చివరికల్లా సర్వే పూర్తి చేస్తారని భావిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణను జేఏసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తమ జాతికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. -
విరమణపై ఉత్కంఠ
తుని ఘటనలో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు పత్రాల రాక ఆలస్యంతోనేడు విడుదలయ్యే అవకాశం 12వ రోజూ కొనసాగినముద్రగడ దీక్ష డిమాండ్ నెరవేరడంతోనేడు విరమించే అవకాశం జిల్లాలో కొనసాగిన ఆందోళనలు, ధర్నాలు ఆమరణ దీక్ష చేస్తున్న ఉద్యమసారథి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆ కలవరపాటుకు తెరపడి, ఆయన దీక్ష విరమించడానికి మార్గం సుగమమయ్యే పరిణామం సోమవారం జరిగింది. తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనల కేసులో అరెస్టయిన 13 మందిలో పదిమంది ఇప్పటికే విడుదల కాగా.. మిగిలిన ముగ్గురికీ బెయిల్ మంజూరైంది. దీంతో ముద్రగడ దీక్ష విరమిస్తారని అంతా ఆశించినా.. పూచీకత్తుల సమర్పణలో జరిగిన జాప్యం వల్ల ఆ ముగ్గురూ మంగళవారం విడుదల కానున్నారు. అది జరిగిన అనంతరం ముద్రగడ దీక్ష విరమించే అవకాశం ఉంది. సాక్షి, రాజమహేంద్రవరం : తుని ఘటన సందర్భంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం 12వ రోజూ కొనసాగింది. సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన 13 మందిలో 10 మందికి శనివారమే బెయిల్ రాగా ఎనిమిది మంది అదేరోజు విడుదలయ్యారు. బెయిల్ పత్రాల్లో సాంకేతిక కారణాలతో ఒకరు, సీఐడీ కస్టడీకి తీసుకోవడంతో మరొకరి విడుదల ఆలస్యమైంది. వీరిద్దరూ సోమవారం రాత్రి విడుదలయ్యారు. కాగా ముఖ్యనేతలైన ఆకుల రామకృష్ణ, వి.వై దాసు, నల్లా విష్ణుమూర్తిలకు సోమవారం సాయంత్రం కాకినాడ నాల్గవ అదనపు జిల్లా జడ్జి, పిఠాపురం ఇన్చార్జి అదనపు జిల్లా జడ్జి బి.గాయత్రి బెరుుల్ మంజూరు చేశారు. దీంతో ముద్రగడ దీక్ష విరమిస్తారని అంతా ఎదురుచూశారు. అరుుతే బెరుుల్ మంజూరుకు సంబంధించిన పత్రాలు రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి సకాలంలో రాకపోవడంతో ఆకుల, దాసు, నల్లా మంగళవారం విడుదల కానున్నారు. దీంతో ముద్రగడ మంగళవారమే దీక్ష విరమించే అవకాశముంది. కీ టోన్స్ బాడీస్‌లో హెచ్చుతగ్గులు కాగా, ముద్రగ డ ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఉదయం విషమంగానే ఉందన్న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ టి .రమేష్‌కిషోర్ రాత్రి వైద్యానికి సహకరించడంతో ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. సోమవారం ఉదయం వైద్య పరీక్షలు చేశామని చెప్పారు. ఆయన కీటోన్స్ బాడీస్‌లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని, అవి ఆదివారం 1+గా ఉండగా, సోమవారం 2+కు పెరిగాయని, ముద్రగడ భార్యకు కూడా కీటోన్స్ బాడీస్ 3+గా ఉన్నాయని చెప్పారు. ముద్రగడకు గుండె సంబంధిత పరీక్షలు చేశామని, అంతా బాగుందని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌లకు తెలియజేస్తున్నామని, అవసరమైతే వేరే ఆస్పత్రికి తరలించేoదుకు అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. వైద్యానికి సహకరిస్తుండడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గుండెకు సంబంధించిన వైద్యం కోసం ఇక్కడ నుంచి తరలించేందుకు ముద్రగడ సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పారు. ఇంకా ఎక్కువ రోజులు దీక్ష కొనసాగించడం మంచిది కాదని బంధువులు, కుటుంబసభ్యులకు తెలిపామన్నారు. ఏరువాకను అడ్డుకున్న కాపునేతలు ముద్రగడకు మద్దతుగా జిల్లాలో సోమవారం కూడా కాపులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏలేశ్వరంలో వందలాది మంది ధర్నా నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బంద్ నిర్వహించి, అర్ధనగ్నప్రదర్శన చేశారు. కాపుల విషయంలో సీఎం చంద్రబాబు నిరంకుశ వైఖరిని విడనాడాలని కోరుతూ పసుపల్లిలో ఏరువాక కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అంబాజీపేట మండల టీబీకే జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల సెంటర్లో ఖాళీ కంచాలతో నిరసన వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్ష విరమింపజేయాలని ధవళేశ్వరంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. విడుదలైన లగుడు, కూరాకుల రాజమహేంద్రవరం క్రైం : తుని ఘటనలో అరెస్టయి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న లగుడు శ్రీనివాస్, కూరాకుల పుల్లయ్య సోమవారం రాత్రి విడుదలయ్యూరు. వాస్తవానికి వీరికి శనివారమే బెయిల్ మంజూరు కాగా శ్రీనివాస్‌ను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ పత్రాల్లో సాంకేతికపరమైన లోపాల కారణంగా పుల్లయ్య విడుదల కాలేదు. వీరి విడుదలతో అరెస్టయిన 13 మందిలో పదిమంది విడుదలైనట్టయింది. పూచీకత్తుల్లో జాప్యంతో నిలిచిన విడుదల కాకినాడ లీగల్ : తుని కేసులో విడుదల కావలసిన ఆకుల రామకృష్ణ, వి.వై దాసు, నల్లా విష్ణుమూర్తిలకు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరయినప్పటికీ, ష్యూరిటీలు (పూచీకత్తులు) సమర్పించే సమయం మించిపోవడంతో విడుదల మంగళవారానికి వాయిదా పడింది. ఈ ముగ్గురికీ జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు కాగా కాకినాడ ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ష్యూరిటీలు సమర్పించేందుకు వ్యవధి చాలలేదు. మంగళవారం ఆ ప్రక్రియ పూర్తరుున అనంతరం వారు విడుదలవుతారు. -
తుని ఘటనలో మరో ముగ్గురికి బెయిల్
కాకినాడ : తుని ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాన అనుచరులకు బెయిల్ మంజూరు అయింది. జిల్లా కోర్టు సోమవారం ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణులకు బెయిల్ ఇచ్చింది. తుని ఘటనలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ, అరెస్ట్ చేసిన వారిని వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా తుని ఘటన కేసులో మొత్తం 13మందికి బెయిల్ మంజూరు కావటంతో ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 31న కాపు ఐక్య గర్జన ఉద్యమంలో భాగంగా తుని సంఘటనకు సంబంధించి 13మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో లగుడు శ్రీనివాస్, కూరాకుల పుల్లయ్య, గణేషుల రాంబాబు, గణేషుల లక్ష్మణరావు, చక్కపల్లి సత్తిబాబు, పల్లా శ్రీహరిబాబు, దూడల మునీంద్ర, లక్కింశెట్టి గోపీ మహేష్, ముదిగొండ పవన్‌కుమార్, నక్కా సాయి ఇప్పటికే బెయిల్‌పై విడుదల అయ్యారు. -
సెంట్రల్ జైల్ నుంచి 8 మంది విడుదల
రాజమహేంద్రవరం : కాపు ఐక్య గర్జన ఉద్యమంలో భాగంగా తుని సంఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 10 మందిలో 8 మంది శనివారం రాత్రి 7.15 గంటలకు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరి 31న కాపు ఐక్య గర్జన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు బాధ్యులను చేస్తూ 13 మందిని పోలీసులు అరెస్టు చేయగా వారిలో పది మందిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. వారిలో లగుడు శ్రీనివాస్‌ను సీబీ సీఐడీ రిమాండ్‌కు తీసుకువెళ్ళగా, కూరాకుల పుల్లయ్యకు సంబంధించిన బెయిల్ పేపర్లలో తేడాలు రావడంతో విడుదల చేయలేదు. మిగిలిన 8 మంది గణేషుల రాంబాబు, గణేషుల లక్ష్మణరావు, చక్కపల్లి సత్తిబాబు, పల్లా శ్రీహరిబాబు, దూడల మునీంద్ర, లక్కింశెట్టి గోపీ మహేష్, ముదిగొండ పవన్‌కుమార్, నక్కా సాయిలను విడుదల చేశారు. వారు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. -
చంద్రబాబుపై చిరంజీవి ఫైర్
హైదరాబాద్ : కాపు సామాజిక వర్గం పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి మండిపడ్డారు. కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. చిరంజీవి ఈ సందర్భంగా శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. తుని ఘటనలను పురస్కరించుకుని చేస్తున్న అరెస్ట్‌లు ఏకపక్షంగా ఉన్నాయని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. కాగా తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. అయితే తుని ఘటనలో గోదావరి జిల్లాల వాసులు ఎవరూ లేరని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు అక్కడ చేస్తున్న అరెస్ట్‌లను ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదని చిరంజీవి అన్నారు. మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న పంథా...ఘర్షణాత్మకంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న దీక్షకు రాజకీయాల్ని ఆపాదించి సమస్యను పక్కదారి పట్టించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలన్నారు. తుని ఘటన అంశంలో ప్రభుత్వం సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సూచించారు. సిబీఐ విచారణ ద్వారానే తుని ఘటన నిందితుల్ని చట్టానికి పట్టించే కార్యక్రమం జరగాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముద్రగడ వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను నిలిపేయడం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని చిరంజీవి అభివర్ణించారు. -
టైమొస్తే ముద్రగడనూ అరెస్టు చేస్తారు
ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప అమలాపురం: ‘తుని ఘటనపై సీఐడీ ఒక పద్ధతి ప్రకారం విచారణ చేస్తోంది. ముందుగా విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తున్నాం. వారి మీద నేరచరిత్ర కూడా ఉంది. ఏ-1 అయినంత మాత్రాన ముందుగా ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేయాలని లేదు. ఆయనపై నేర చరిత్ర లేదు. విధ్వంసకారులను రెచ్చగొట్ట లేదు. కానీ టైమొస్తే ముద్రగడను కూడా అరెస్టు చేస్తారు’ అని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే ఆనందరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అరెస్టు చేసిన వారిని రిమాండుకు తరలించారని, విషయం కోర్టులో ఉన్నందున వారి మీద కేసులు తొలగించే అవకాశం లేదని రాజప్ప తేల్చిచెప్పారు. -
'తుని ఘటనపై ప్రజలను వేధించొద్దు'
రాజమండ్రి: తుని ఘటనపై ప్రజలను వేధించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ సూచించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ... అధికారం మారితే కేసులు మాఫీ అయిపోతాయన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడ వద్దని టీడీపీ నేతలకు హర్షకుమార్ హితవు పలికారు. మంత్రి నారాయణ జాతిని ఉద్దరించినట్లు మాట్లాడటం సరికాదని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు తగవని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. -
తుని ఘటనలో ఏడుగురికి రిమాండ్
కిర్లంపూడి: తుని ఘటనపై ఏపీ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించిన సీఐడీ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అరెస్టైన వారిపై 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ పోలీసులు మంగళవారం సాయంత్రం కాకినాడ మెజిస్ట్రేట్ ఎదుట వారిని హాజరు పర్చారు. న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అరెస్టైన వారిలో దూడల మహేంద్ర(అమలాపురం), లగుడు శ్రీనివాస్(కిర్లంపూడి), నక్కా సాయి గణేష్(అంబాజీపేట), గుంటూరుకు చెందిన శివగణేష్, పవన్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. తుని ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మాట్లాడుతూ...బాధ్యులపై చర్యలు తీసుకోకూడదా ..? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం లాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తారా అన్నారు. -
ముద్రగడను కూడా అరెస్ట్ చేస్తాం : బోండా ఉమ
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...ముద్రగడపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే ముద్రగడ రాజకీయ ముసుగు తొలగిపోతుందన్నారు. తుని ఘటనలో దర్యాప్తులో అన్ని ఆధారాలు సేకరించాకే అరెస్ట్‌లు చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఇంకా ఎక్కువ అరెస్ట్‌లు ఉంటాయని బోండా చెప్పారు. ఇప్పటికే హోంమంత్రి చినరాజప్ప తుని ఘటనలో అరెస్టైన వారిని రౌడీలని అనడంపై కాపు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజా బోండా వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచే విధంగా మారాయి. -
'కాపులను రౌడీలుగా చిత్రీకరించడం దారుణం'
కిర్లంపూడి: కాపులను రౌడీలుగా చిత్రీకరించడం దారుణమని కాపు నేతలు అన్నారు. తుని ఘటనలో అరెస్టైన వారంతా రౌడీలేనన్న హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యలు సరికాదని నేతలు తీవ్రంగా ఖండించారు. కిర్లంపూడిలో మంగళవారం మధ్యాహ్నం కాపునేతలు మాట్లాడుతూ..తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కోరితే అరెస్ట్‌లు చేస్తారా..?? అని ప్రశ్నించారు. అమాయకులను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని కాపు నేతలు హెచ్చరించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసే వరకు పోలీస్ వ్యాన్ లోనే ఉంటానని బలవంతంగా దించాలని చూస్తే ఇక్కడే దీక్షకు కూర్చుంటానని కాపు నాయకుడు ముద్రగడ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కాకినాడ, అమలాపురం సహా అన్ని పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. -
తుని ఘటనలో ఆరుగురి అరెస్ట్ : చినరాజప్ప
గుంటూరు : తుని ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. వారందరూ రౌడీషీటర్లు అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుని ఘటనపై విచారణ వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు తీవ్ర అనారోగ్యంతో గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిని ఆయన పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను రాజప్ప ఆరా తీశారు. ఇదిలా ఉంటే... తుని ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 6 మందిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి... రహాస్య ప్రాంతానికి తరలించి... విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ... సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అమలాపురంలో భారీగా బలగాలను మోహరించారు. -
ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్: డీజీపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని.. ఇంకా తగ్గాలని ఏపీ డీజీపీ రాముడు చెప్పారు. గత ఏడాది నుంచి ఏప్రిల్ వరకు ఒక్క ఫ్యాక్షన్ కేసు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. సోమవారం విజయవాడలో డీజీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం రవాణాలో 34మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో తుని ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు డీజీపీ రాముడు తెలిపారు. -
‘తుని’ ఘటనపై సీబీసీఐడీ విచారణ
అమలాపురం టౌన్ : తుని విధ్వంసకర ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించేపనిలో భాగంగా సీబీ సీఐడీ అధికారులు అమలాపురంలో గత రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. నాటి తుని ఘటనలో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలల్లో ఉన్న అమలాపురం, కొత్తపేట, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన 43 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తునిలోని సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా కూడా ఆ రోజు అల్లర్లలో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ సీబీ సీఐడీ డీఎస్పీ, ఇద్దరు సీఐలు అమలాపురంలో పట్టణ పోలీసు స్టేషన్లో గుర్తించిన 43 మందిని విచారిస్తున్నారు. ఆ 43 మందిలో అమలాపురానికి చెందిన కొందరు రౌడీషీటర్లు కూడా ఉండటంతో వారిని సీఐడీ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరికొందరు రౌడీషీటర్లను కూడా స్టేషన్‌కు రప్పించి ఆ రోజు అల్లర్లలో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు తుని సభకు ఎలా వెళ్లారు... ఎవరి వాహనంపై వెళ్లారు..? వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. తుని విధ్వంసకర ఘటన సమయంలో వీడియోల్లో లభ్యమైన దృశ్యాలను సీఐడీ నిశితంగా పరిశీలించినప్పుడు ముగ్గురు కాపు నేతల పేర్లతో ఉన్న జెండాలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ ముగ్గురు నేతలను కూడా అధికారులు పిలిచి విచారించారు. ఇప్పటికే అంబాజీపేటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు పోలీసు జీపులు తగలబెడుతున్నప్పుడు ఆ యువకుడి ఉనికి ఎక్కువ కనిపించడంతో అతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నా వారి నుంచి స్పష్టమైన...ఆధారాలతో కూడిన సమాచారం రాకపోవటంతో రౌడీ షీటర్లందరినీ పిలిపించుకుని ఏదో కోణంలో ఏదో సమాచారం వస్తుందన్న దిశగా విచారణ చేస్తున్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల కాన్ఫిరెన్స్ హాలులో డివిజన్లోని వీఆర్వోలకు తుని ఘటన వీడియోలు, ఫొటోలు చూపించినా వారు ఓ ఒక్క నిందితుడినీ గుర్తించకపోవడంతో సీబీ సీఐడీ అధికారులు అమలాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ తరహా దర్యాప్తు, విచారణలు చేస్తున్నారని తెలిసింది. -
తుని ఘటనపై సీఐడీ విచారణ వేగవంతం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా తుని ఘటనపై సీఐడీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం విశాఖపట్నం నుంచి వచ్చిన సీఐడీ ప్రత్యేక బృందం జిల్లాలోని పిఠాపురం పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం సేకరిస్తోంది. తుని ఘటన రోజు కాపు ఐక్య గర్జన సభకు వచ్చిన వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విచారణను మాత్రం పోలీసులు గోప్యంగా నిర్వహిస్తున్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆ సామాజిక వర్గం నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ ఏడాది జనవరి 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని వి.కొత్తూరు వద్ద కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఈ సభ అనంతరం తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో స్థానిక రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అయితే అంతకుముందు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో రైలు ఇంజన్ ధ్వంసమైంది. అలాగే తుని పట్టణంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతుంది. -
తుని ఘటనలో అసలు బాధ్యులనే శిక్షిస్తాం
తుని సంఘటనకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించామని, అసలు బాధ్యులను గుర్తించి శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కృష్ణా జిల్లా బందరు ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తుని సంఘటనలో బయట వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారనటం అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. సీఐడీ విచారణలో అసలు బాధ్యులను గుర్తించి శిక్ష విధిస్తామని తెలిపారు. ఎర్ర చందనం, భూకబ్జాలు, చైన్‌స్నాచింగ్ వంటి ఘటనలపై ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు మండలం పెదపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపు రుణమేళాను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,25,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు పాల్గొన్నారు. -
25 నుంచి కాపు కార్పొరేషన్ రుణాలు
రాజమండ్రి : ఈ నెల 25 నుంచి తొలి విడత కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్ చినరాజప్ప మాట్లాడుతూ... 25 వేల మందికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. జిల్లాలో రబీ పంటకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చినరాజప్ప తెలిపారు. -
'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు'
కాకినాడ : కాపు గర్జన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలకు... తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడలో వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ.... టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తామని తెలిపారు. మీరు సిద్ధమా అంటూ గాలి ముద్దుకృష్ణమనాయుడికి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు సవాల్ విసిరారు. -
'క్షమించమని కోరితే భరోసాగా ఉండేది'
హైదరాబాద్: దళితులపై ఏపీ సీఏం చంద్రబాబు మానసిక దాడి చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోగా, ఎదురుదాడి చేయడం శోచనీయమని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. పొరపాటు దొర్లింది క్షమించమని చంద్రబాబు కోరివుంటే దళితులకు భరోసాగా ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యాతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక పక్క కులాలను రెచ్చగొడుతూ, మరోపక్క ప్రతిపక్ష నాయకుడిపై ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రిమినల్ మైండ్ తో మాట్లాడుతున్నారని, అనవసరంగా ప్రతిపక్షాన్ని ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తుని ఘటనపై ఢిల్లీలో చంద్రబాబుమాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కళ్లముందే తగలబడుతుంటే మంటలను ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తుని ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. -
7 వరకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
8 నుంచి రాకపోకల పునరుద్ధరణ విజయవాడ(రైల్వేస్టేషన్): విజయవాడ-విశాఖ-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(12718-12717)ను ఈ నెల 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జి పీఆర్వో రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి రైలు రాకపోకలు యథావిధిగా ఉంటాయని చెప్పారు. తుని రైల్వేస్టేషన్లో ఆందోళనకారుల చేతిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దహనమైన విషయం విదితమే. -
ఎవరి మాటలు నమ్మాలి?
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. తూర్పుగోదావరి జిల్లాకు బయటి వ్యక్తులు ఎవరూ రావొద్దని ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాచరిక పాలనను తలపిస్తున్నారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని సభకు అనుమతి ఇచ్చామని సీఎం, ఇవ్వలేదని పోలీసులు అంటున్నారని.. ఎవరి మాటలు నమ్మాలని ఆయన నిలదీశారు. తెలంగాణలో 23 కులాలను బీసీ జాబితా నుంచి తొలిగిస్తే ఆర్. కృష్ణయ్య ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే కాపులకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
'గతంలో ఇలాగే చిచ్చు పెట్టారు'
హైదరాబాద్: కాపులకు, బీసీలకు మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆరోపించారు. గతంలో మాల, మాదిగల మధ్య ఇలాగే చిచ్చు పెట్టారని గుర్తు చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదని హెచ్చరించారు. నేడు జరుగుతున్న కలెక్టరేట్ల ముట్టడి వెనుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు. కాపు ఐక్య గర్జనకు హాజరైతేనే కేసు పెడతారా, ఏ ప్రతిపాదికన కేసు పెట్టారని ప్రశ్నించారు. కాపు ఐక్య గర్జనలో ముద్రగడ ఒక్కరే మాట్లారని, మిగతా నేతలెవరూ ప్రసంగించలేదని తెలిపారు. ఇలాంటి కేసులకు భయపడబోమన్నారు. చంద్రబాబు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్లు సరిపోవని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు కూడా రోడెక్కుతారని రామచంద్రయ్య హెచ్చరించారు. -
27మంది కాపు నేతలపై కేసులు
తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభకు హాజరైన 27 మంది నేతలపై పోలీసులు నమోదు చేశారు. సభకు నేతృత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులపై కేసు పెట్టారు. 1.ముద్రగడ పద్మనాభం- ఏ1 2. పళ్లం రాజు (కేంద్ర మాజీ మంత్రి) 3.బొత్స సత్యనారాయణ (మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత) 4. కన్నా లక్ష్మీనారాయణ (మాజీమంత్రి, బీజేపీ నేత) 5. వట్టి వసంత్ కుమార్ (మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత) 6. ఆకుల రామకృష్ణ 7. వాసిరెడ్డి యేసుదాసు 8.జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్ఆర్ సీపీ) 9. కే.వీ.సీహెచ్. మోహన్ రావు (మాజీమంత్రి) 10. వి.హనుమంతరావు (కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం) 11. అంబటి రాంబాబు (మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి) 12. జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే 13.వరుపుల సుబ్బరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే 14. దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే 15. గంగా భవానీ (మాజీ ఎమ్మెల్సీ) 16.జీవీ సుధాకర్, సినీ నటుడు 17. అడపా నాగేంద్ర, బీజేపీ నేత, విజయవాడ 18. నల్లా విష్ణు (అమలాపురం) 19. నల్లా పవన్ (బీజేపీ, అమలాపురం) 20.కె.తాతాజీ (కాంగ్రెస్, అమలాపురం) 21. బండారు శ్రీనివాసరావు (వేదపాలెం, టీడీపీ) 22. ముత్యాల వీరభద్రరావు (వైఎస్ఆర్ సీపీ, కొత్తపేట) 23. ఎంఎస్ఆర్ నాయుడు (నెం.1 చానల్ ఎండీ) 24.దూలిపూడి చక్రం (పసుపులంక, వైఎస్ఆర్ సీపీ) 25. యెల్లా దొరబాబు (బీజేపీ, ఏఎల్డీఏ చైర్మన్) 26. ఆలేటి ప్రకాష్ 27. జామితేనె లంకల (వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలం) -
తుని తగువుతో నగుబాటు
డేట్లైన్ హైదరాబాద్ తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నేత కనిపించాడు, పులివెందుల కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగితే వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గడిచిన గురువారం తెలంగాణ భవన్లో పత్రికల వారితో మాట్లాడారు. ఈ పత్రికా గోష్టి, రెండురోజులకు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగం వరకే ఆయన తన ప్రచారాన్ని పరిమితం చేశారు. ముఖ్యమంత్రి బదులు ఆయన కుమారుడు, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రచార బాధ్యత మొత్తం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మంచిదే. ఆయన నగరంలో తిరిగి ప్రచారం చేస్తే జనానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. భద్రతా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమంత్రి పత్రికాగోష్టిలో పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఏం పని? హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా ఊడ్చాల్సిన నగరాలు బోలెడున్నాయి’ అని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆక్షేపణను చాలామంది తప్పు పట్టారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌కు పరిమితమయిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికయిన ఇద్దరు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుని, అందులో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చిన చంద్రశేఖర్‌రావు తోటి తెలుగు ముఖ్య మంత్రికి ఇక్కడేం పని అనడం బాగా లేదన్నారు కొందరు. హైదరాబాద్‌లోనే ఉంటారా? ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు, జాతీయ అధ్యక్షుడి హోదాలో వస్తేతప్పేంటి అన్నారు మరికొందరు విమర్శకులు. నిజమే, ఎవరయినా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఆ కోణం నుంచేచంద్రబాబు ప్రచారం చేయడాన్ని చూడాలి. అప్పటికే ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌బాబు, ఇతర నాయకులు హైదరాబాద్ ప్రచారంలో ఉన్నారు. లోకేశ్ తన ప్రచారంలో కొన్నిచోట్ల, ‘నేను హైదరాబాద్‌లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, కాబట్టి ఇక్కడి వాడినే!’ అని చెప్పారు. ఎవరికీ అభ్యంతరం ఉండ నక్కరలేదు. నిజానికి ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా హైదరాబాద్ వాసే. 2014 ఎన్నికలలో ఆయన హైదరాబాద్(తెలంగాణ)లో ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అయితే పరిస్థితులు మారిపోయాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ చంద్రబాబు, నేనెక్కడికీ పోలేదు, ఇక్కడే ఉన్నా, ఉంటాను అని కూడా అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటా నంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. భారతదేశంలో ఎక్కడయినా స్వేచ్ఛగా జీవించే హక్కు మన రాజ్యాంగం అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ప్రసాదించింది. మరి, ఆయన ఇక్కడే ఉంటానని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? నేనున్నానని ఆయన ఎవరికి భరోసా కలిగించాలని అనుకుంటున్నారు, హైదరాబాద్‌లో? ఇక్కడ ఆయన లేనప్పుడు ఎవరికయినా ఇబ్బంది కలిగితే, అప్పుడు అలాంటి భరోసా కలిగిస్తే అర్థం ఉంది. అటువంటి వాతావరణం హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించలేదు ఈ 20 మాసాల్లో. ఇక్కడ లేకుండా పోవాల్సిన పరిస్థితులను ఆయనే కల్పించుకున్నారు. సరిగా ఉంటే పదేళ్లపాటు (2019లో ప్రజలు మళ్లీ అధికారం ఇస్తే గిస్తే ) ఆయన ప్రభుత్వాన్ని హాయిగా హైదరాబాద్ నుంచే నడుపుకుని ఉండేవారు. అట్లా కాకుండా అర్ధంతరంగా మూటా ముల్లే సర్దు కుని విజయవాడలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన చెయ్యాల్సి రావ డానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ జూన్ మాసం నాటికి అంతా విజయవాడ వచ్చెయ్యాల్సిందేనని ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదేశాలు జారీ చేసి, ఇంకో పక్క నేనెక్కడికీ పోను ఇక్కడే ఉంటానని చంద్రబాబు చెప్ప డంలో అర్థం ఉందా? మరి ఇలా మాట్లాడతారెందుకు? ఎందుకంటే, నగ రంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతవాసులు ఈ భరోసాతో జీహెచ్ఎంసీ ఎన్నిక లలో టీఆర్ఎస్కు కాకుండా, తమకు ఓట్లేస్తారన్న ఆశ. పోలింగ్ కూడా పూర్త యింది. ఇక్కడి ఆంధ్రుల ఓటు ఎవరిదో రెండురోజుల్లో తెలిసిపోతుంది. ఎప్పుడూ పరనిందే ఇక తెలంగాణ సీఎం పత్రికా గోష్టిలో చేసిన వ్యాఖ్య గురించి- ఆయన చెప్పిన హిందూపురం, ఇచ్ఛాపురాల మధ్యలోనే తుని అనే పట్టణం ఉంది. హిందూ పురానికీ ఇచ్ఛాపురానికీ మధ్య చంద్రబాబునాయుడు ఊడ్చాల్సింది చాలా ఉందన్నమాట అక్షరసత్యమని మొన్ననే తుని చెప్పేసింది. వెనుకబడిన వర్గాల జాబితాలో తమను చేర్చాలని కాపు సామాజికవర్గం కొన్ని దశా బ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విషయం అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహి స్తున్న ముద్రగడ పద్మనాభం పట్టుదల, కార్యాచరణ శైలి కూడా చంద్ర బాబుకు సుపరిచితమే. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉద్యమంలో ముద్రగడ దగ్గరికి వెళ్లి చంద్రబాబు మద్దతు కూడా ప్రకటించారు. ఇది తెగని సమస్యగా ఉందనీ, పూర్తిగా తమ చేతుల్లో ఉండదనీ, కేంద్ర ప్రభుత్వం కూడా కలసి రావాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బీసీల జాబితాలో చేర్చితే ఇంకోచోట గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు తలనొప్పిగా తయారవుతారు కాబట్టి కేంద్రం ఈ అంశంలో కలసిరాదనీ చంద్రబాబుకు తెలియదనుకోవాలా? ఆయనకు అన్నీ తెలుసు. రైతు రుణ మాఫీ తమ వల్ల కాదని తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేననీ తెలుసు. కాపులను బీసీలలో చేర్చలేననీ తెలుసు. అయినా అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కడానికి ఆయన చేసిన ఒకానొక వాగ్దానం ఇవ్వాళ తుని సంఘటన రూపంలో మెడకు చుట్టుకున్నది. తన మెడకు చుట్టుకున్న పామును ప్రతిపక్షాల మెళ్లో, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి మెడలో వెయ్యడానికి ఆయన రెండు రోజులుగా అవస్థపడుతున్నారు. విపక్షనేతపై అసహనం కాపులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చుతామని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1,000 కోట్లు సమకూరుస్తామని ఎన్నికల సమ యంలో వాగ్దానం చేసి, మాట తప్పినందుకు ఆ సామాజికవర్గం ఆందోళనకు దిగబోతున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ చాలా ముందే తెలుసు. తునిలో జరగబోయే కాపు గర్జనను అడ్డుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. అయినా సాధ్యం కాలేదు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్న ఆ సామాజికవర్గం వారు చిన్నా పెద్దా తుని చేరుకున్నారు. ఆందోళన అదుపు తప్పింది. ఒక రైలు మొత్తం దగ్ధం చేశారు. పోలీస్స్టేషన్ల మీద దాడి చేశారు. పోలీసులను కొట్టారు. దీనినం తటినీ అన్ని న్యూస్ చానళ్లూ ప్రసారం చేశాయి. కానీ, ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ మరీ ముఖ్యంగా నిఘా విభాగానికీ సమాచారం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎంత అదుపు తప్పి సాగుతున్నదో అర్థం చేసు కోవచ్చు. ఒక పక్క తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే సీఎం విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు మాత్రం మొత్తం జరిగిందంతా కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కనిపించాడు, పులివెందుల పట్టణం కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘ టన జరిగితే సంయమనం పాటించి, వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ (ద్వేష ప్రసంగం) యథేచ్ఛగా చేసేశారు. ఆందోళన అదుపు తప్పి విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం సేకరించి తనకు అందించలేకపోయిన నిఘా వ్యవస్థను నిలదీయాల్సింది పోయి, ఆరు న్యూస్ చానళ్ల ఓబీ వ్యాన్లు అక్కడికి ఎలా వెళ్లాయి? వాళ్లకు ముందే ఇదంతా జరుగుతుందని తెలుసు అని ఒక సీఎం మాట్లాడటం హాస్యాస్పదం. ప్రచార ప్రసార మాధ్యమాలు ఎట్లా పనిచేస్తాయో ఆయనకూ, ఆయన సమాచార వ్యవస్థను నిర్వహిస్తున్న భజనపరులకూ తెలియని కారణంగానే చంద్రబాబు మీడియాను ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని అని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ఆక్షేపించిన వాళ్లే ఇప్పుడు అవును, అక్కడ తుని తగలబడుతుంటే చంద్రబాబు హైదరాబాద్‌లో ఫిడేల్ వాయించడం ఏమిటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. కాపుల ఉద్యమం ఇక్కడితో ఆగిపోవడం లేదు. శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య ఆమరణ నిరాహార దీక్షకు కూర్చో బోతున్నారు. ముద్రగడ దీక్షలు ఎట్లా ఉంటాయో చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకుడినీ, మీడియానూ తిడుతూ కూర్చో కుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన నిఘా వ్యవస్థను చక్క దిద్దుకుని, కాపుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిది. కేరళలో షూటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్‌ను హుటాహుటిన రప్పించి మీడియా ముందు హాజరుపరిస్తే సమసిపోయే అంత సులువయిన సమస్య కాదిది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కాలిన కట్టెలా ‘రత్నాచల్’
తూర్పు గోదావరి: ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలకు నిలువునా కాలిన కట్టెలా మిగిలింది. ఆదివారం తుని మండలం వెలమ కొత్తూరు సమీపంలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఆందోళనకారులు ఈ రైలును తగులబెట్టిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సంఘటనా స్థలం నుంచి రత్నాచల్‌ను తుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాలిన రైలును చూసేందుకు తుని పరిసర ప్రాంతాల పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కాగా, రత్నాచల్‌ను లూప్‌లోకి తరలించడంతో ఇతర రైళ్లు నడపడానికి వీలు కలిగింది. జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాంకేతిక సిబ్బంది కాలిపోయిన బోగీలను పరిశీలించారు. విజయవాడ-విశాఖల మధ్య రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినా..కొన్ని రైళ్ల రద్దు, మరి కొన్నింటి ఆలస్యంతో సోమవారం తుని స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. -
'తుని ఘటనపై నైతిక బాధ్యత చంద్రబాబుదే'
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే' అని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతరులపై నెపం నెట్టడం చంద్రబాబుకు అలవాటు అని మండిపడ్డారు. సోమవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. కాపులకు వెంటనే రిజర్వేషన్ ప్రకటించి వారి ఆగ్రహం చల్లార్చాలని డిమాండ్ చేశారు. కాపు మంత్రులు సీఎం చంద్రబాబు భజన చేయడం మానేయండంటూ హర్షకుమార్ విమర్శించారు. కాగా, కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే. -
తిరుపతి నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యం
తిరుపతి : తుని సంఘటన నేపథ్యంలో తిరుపతి నుంచి విశాఖపట్టణంవైపు వెళ్లే రైళ్లు సోమవారం ఆలస్యంగా బయలుదేరతాయని తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 10.35 గంటలకు బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్టణం మీదుగా భువనేశ్వర్ వెళ్లే భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లాల్సిన రైలు రాత్రి 7.15 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. -
'కులాల పేరుతో ప్రజలను చీల్చొద్దు'
విజయవాడ: కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన కలిగించాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాపుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమావేశానికి తరలివెళ్లినవారు తిరిగి క్షేమంగా తిరిగివస్తారా లేదా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. తమను నమ్మి వచ్చినవాళ్ల బాగోగులను నాయకులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాపు ఐక్య గర్జనకు కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. తుని ఘటనలకు బాధ్యులైన వారు ఖండించకపోవడం విచారకరమని అన్నారు. నాయకులు హుందాగా వ్యవహరించాలని కులాల పేరుతో ప్రజలను చీల్చొద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి లేకుండా చేస్తూ యువత మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం క్షమరాని నేరమని అన్నారు. -
'బాబు హామీని విస్మరించడం వల్లే తుని ఘటన'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే తుని ఘటన జరిగిందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించడాన్ని ప్రస్తావించారు. సోమవారం కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి అమ్ముడుపోయిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులు వైఎస్ఆర్ సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లను 420లుగా అభివర్ణించిన ఆనం సోదరులు ఇప్పుడు పదవుల కోసం కాళ్లు పట్టుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. -
ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ అల్టిమేటం
తుని: కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన రాస్తారొకో ఆదివారం ముగిసింది. రిజర్వేషన్లపై ప్రకటనకుగాను ఏపీ ప్రభుత్వానికి ఆదివారం రాత్రి ముద్రగడ అల్టిమేటం జారీచేశారు. రేపు సాయంత్రం లోగా ఒక ప్రకటన రావాలని ఆయన డిమాండ్ చేశారు. దీని తర్వాత కీలక కార్యాచరణకు ముద్రగడ సన్నితులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాగా, ఆదివారం మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు.